
వెస్టిండీస్ పర్యటనలో టీమిండియాకు వింత పరిస్థితులు ఎదురవుతున్నాయి. ముందు లగేజీ సమస్య రాగా.. తాజాగా ఆటగాళ్లకు వీసా సమస్య వచ్చి వచ్చింది. విషయంలోకి వెళితే.. విండీస్‌తో చివరి రెండు టి20లు అమెరికాలోని ఫ్లోరిడాలోని మియామిలో జరగనున్నాయి. కాగా మొదట అమెరికా వెళ్లేందుకు ఇరుజట్లలోని ఆటగాళ్లకు వీసాలు రాకపోవడంతో మ్యాచ్‌ల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది.
దీంతో స్వయంగా రంగంలోకి దిగిన విండీస్ క్రికెట్ బోర్డు వీసా ఎంట్రీకి సంబంధించిన కార్యచరణను పూర్తి చేయాల్సి వచ్చింది. ముందుగా బుధవారం ఇరుజట్ల ఆటగాళ్లు గయానాలోని జార్జిటౌన్‌కు చేరుకోనున్నారు. గయానాలోని అమెరికా ఎంబసీలో ఆటగాళ్లకు వీసా అపాయింట్‌మెంట్స్ బుక్ చేశారు. అన్ని సక్రమంగా జరిగితే గురువారం సాయంత్రం వరకు ఆటగాళ్లు ప్లోరిడాలోని మయామికి చేరుకుంటారు.
క్రికెట్ వెస్టిండీస్ బోర్డు(సీడబ్ల్యూఐ) అధ్యక్షుడు రికీ స్కెరిట్ మాట్లాడుతూ.. ''ఆటగాళ్లకు వీసా సమస్య తీరిపోయినట్లేనని భావిస్తున్నాం. గయానా నుంచి ఆటగాళ్లకు వీసా అపాయింట్‌మెంట్ ఇప్పించాం. ముందుగా గయానాకు వెళ్లనున్న ఆటగాళ్లు అక్కడి నుంచి ఫ్లోరిడాకు చేరుకుంటారు. ఇక ఫ్లోరిడాలో మ్యాచ్‌లు జరుగడం ఇదే చివరిసారి అనుకుంటా. అంతకమించి ఎక్కువ చెప్పలేం.'' అంటూ పేర్కొన్నాడు
కాగా ఇంతకముందు రెండో టి20కి ముందు టీమిండియా ఆటగాళ్లకు లగేజీ సమస్య ఎదురైంది. ట్రినిడాడ్ నుంచి సెయింట్ కింట్స్‌కు లగేజీ రాక ఆలస్యం కావడంతో మ్యాచ్ దాదాపు మూడు గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది. ఆటగాళ్ల లగేజీ సమస్యపై విండీస్ క్రికెట్ బోర్డు క్షమాపణ కూడా చెప్పుకోవాల్సి వచ్చింది. ఇక ఫ్లోరిడాలోని మియామిలో ఆగస్టు 6,7 తేదీల్లో చివరి రెండు టి20లు జరగనున్నాయి. ఇప్పటికైతే ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో టీమిండియా 2-1తో ఆధిక్యంలో ఉంది.
ఇక మూడో టి20 మ్యాచ్‌లో వెన్నునొప్పితో కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరగడంతో మిగతా టి20లు ఆడడం అనుమానంగానే ఉంది. ఒకవేళ రోహిత్ దూరమైతే.. మిగతా రెండు టి20లకు పంత్ టీమిండియా స్టాండింగ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. రానున్న ఆసియా కప్ దృష్టిలో పెట్టుకొని రోహిత్ గాయం నుంచి కోలుకున్నప్పటికి ఆడించడం అనుమానంగానే ఉంది. ఈ విషయంపై బీసీసీఐ ఒక నిర్ణయం తీసుకోనుంది.
చదవండి: Suryakuamar Yadav: దంచికొట్టిన సూర్యకుమార్.. లగ్జరీ కారు ఇంటికొచ్చిన వేళ
IND vs WI: కోహ్లి రికార్డు బద్దలు కొట్టిన రోహిత్ శర్మ.. తొలి భారత కెప్టెన్‌గా!
Comments
Please login to add a commentAdd a comment