Photo Credit: (Twitter)
వెస్టిండీస్ వెటరన్ ఆటగాడు డారెన్ బ్రావో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు తనను ఎంపిక చేయకపోవడం పట్ల నిరాశచెందిన బ్రావో.. వెస్టిండీస్ క్రికెట్‌తో తెగదింపులు చేసుకున్నాడు. తన నిర్ణయాన్ని సోషల్ మీడియా వేదికగా బ్రావో ఆదివారం వెల్లడించాడు. కాగా బ్రావో ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు.
దేశీవాళీ టోర్నీల్లో కూడా మెరుగ్గా రాణిస్తున్నాడు. ఇటీవల జరిగిన విండీస్ సూపర్-50 కప్ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా బ్రావో నిలిచాడు. గత కొన్నేళ్లుగా దేశీవాళీ టోర్నీల్లో అద్భుతంగా రాణిస్తున్నప్పటికి.. సెలక్టర్లు తన పట్టించుకోకపోవడంపై అతడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ క్రమంలోనే విండీస్ క్రికెట్‌కు బ్రావో గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్నాడు. కాగా వెస్టిండీస్ మాజీ ఆల్‌రౌండర్ డ్వైన్ బ్రావో సోదరుడే ఈ డారెన్ బ్రావో.
"క్రికెటర్‌గా నా తదుపరి ప్రయాణం గురించి ఆలోచించడానికి కొంత సమయం తీసుకున్నాను. అన్ని విధాలగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను. విండీస్ క్రికెట్‌తో నా ప్రయాణం అంత ఈజీగా సాగలేదు. అంతర్జాతీయ క్రికెట్‌కు తిరిగి రావడానికి అన్ని విధాల కష్టపడ్డాను. కానీ విండీస్ సెలక్షన్ కమిటీ మాత్రం నాతో ఎటువంటి కమ్యూనికేషన్ లేకుండా పక్కన పెట్టేసింది. ప్రస్తుతం మూడు ఫార్మాట్లలో విండీస్ జట్టుకు ప్రాతినిథ్యం వహించడానికి 40 నుంచి 45 మంది ఆటగాళ్లు అవసరం.
అందులో నేను లేనని నాకు అర్ధమైపోయింది. ప్రాంతీయ టోర్నీల్లో పరుగులు సాధించినా సెలెక్టర్లు నన్ను పక్కన పెట్టేశారు. అయితే నేను పూర్తిగా క్రికెట్ నుంచి తప్పుకోవడం లేదు. కొంతకాలం పాటు దూరండా ఉండటం ఉత్తమమని భావిస్తున్నాను. ప్రతిభావంతులైన యువ క్రికెటర్లకు అవకాశం కల్పించాలి. ప్రతీ ఒక్కరికి ఆల్‌ది బెస్ట్" అని ఇన్స్టాగ్రామ్‌లో బ్రావో రాసుకొచ్చాడు. కాగా ఇంగ్లండ్ జట్టు వన్డే, టీ20ల కోసం డిసెంబర్‌లో వెస్టిండీస్ పర్యటనకు రానుంది. ఈ క్రమంలో విండీస్ సెలక్టర్లు తొలుత వన్డే సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ప్రకటించారు.
విండీస్ వన్డే జట్టు : షై హోప్(కెప్టెన్), అల్జారీ జోసెఫ్(వైస్ కెప్టెన్), అలిక్ అథనజె, యన్నిక్ కరియా, కేసీ కార్టీ, రోస్టన్ ఛేజ్, షేన్ డౌరిచ్, మాథ్యూ ఫోర్డే, షిమ్రన్ హెట్‌మైర్, బ్రాండన్ కింగ్, గుడకేశ్ మోటీ, జొర్న్ ఒట్లే, షెర్ఫనే రూథర్‌ఫర్డ్, రొమరియో షెఫర్డ్, ఒషానే థామస్.
Comments
Please login to add a commentAdd a comment