ఇంగ్లండ్‌తో తొలి టెస్ట్‌.. విండీస్‌ తుది జట్టు ప్రకటన | West Indies Have Named Their Playing XI For First Test Against England At Lords | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్‌తో తొలి టెస్ట్‌.. విండీస్‌ తుది జట్టు ప్రకటన

Published Tue, Jul 9 2024 6:59 PM | Last Updated on Wed, Jul 10 2024 5:05 PM

West Indies Have Named Their Playing XI For First Test Against England At Lords

ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌ మధ్య మూడు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ జులై 10 నుంచి ప్రారంభం​ కానుంది. తొలి టెస్ట్‌ లార్డ్స్‌ వేదికగా జరుగనుంది. ఈ మ్యాచ్‌ కోసం ఇంగ్లండ్‌, వెస్టిండీస్ తమతమ తుది జట్లను ప్రకటించాయి.

ఈ మ్యాచ్‌ ఇంగ్లండ్‌ వెటరన్‌ పేసర్‌ జిమ్మీ ఆండర్సన్‌కు చివరి అ​ంతర్జాతీయ మ్యాచ్‌. ఈ టెస్ట్‌ అనంతరం ఆండర్సన్‌ ఇంగ్లండ్‌ ఫాస్ట్‌ బౌలింగ్‌ కన్సల్టెంట్‌గా పని చేస్తాడు. ఈ సిరీస్‌లో మిగతా రెండు టెస్ట్‌లు ట్రెంట్‌బ్రిడ్జ్‌ (జులై 18-22), ఎడ్జ్‌బాస్టన్‌ (జులై 26-30) వేదికగా జరుగనున్నాయి.

తొలి టెస్ట్‌కు ఇంగ్లండ్‌ తుది జట్టు: జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్‌), జేమీ స్మిత్ (వికెట్‌కీపర్‌), క్రిస్ వోక్స్, గస్ అట్కిన్సన్, షోయబ్ బషీర్, జేమ్స్ ఆండర్సన్.

వెస్టిండీస్‌ తుది జట్టు: క్రెయిగ్ బ్రాత్‌వైట్ (కెప్టెన్‌), మికిల్ లూయిస్, కిర్క్ మెకెంజీ, అలిక్ అథనాజ్, కవెమ్ హాడ్జ్, జాషువా డ సిల్వా (వికెట్‌కీపర్‌), జేసన్ హోల్డర్, జేడెన్‌ సీల్స్‌, అల్జారీ జోసెఫ్, షమర్ జోసెఫ్, గుడకేష్ మోటీ. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement