West Indies vs England
-
విండీస్ ఓపెనర్ల ఊచకోత.. భారీ స్కోరు చేసినా ఇంగ్లండ్‌కు తప్పని ఓటమి
ఇంగ్లండ్‌తో నాలుగో టీ20లో వెస్టిండీస్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఇంగ్లిష్ జట్టు విధించిన భారీ లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది. ఐదు వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించి క్లీన్‌స్వీప్ గండం నుంచి బయటపడింది. కాగా స్వదేశంలో విండీస్.. బట్లర్ బృందంతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడుతోంది.ఇప్పటికే సిరీస్ ఇంగ్లండ్ కైవసంఇందులో భాగంగా తొలి మూడు మ్యాచ్‌లలో గెలిచిన ఇంగ్లండ్ ఇప్పటికే సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య సెయింట్ లూయీస్ వేదికగా ఆదివారం తెల్లవారుజామున నాలుగో టీ20 జరిగింది. డారెన్ సామీ జాతీయ క్రికెట్ స్టేడియంలో టాస్ గెలిచిన వెస్టిండీస్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.బెతెల్ మెరుపు ఇన్నింగ్స్ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు ఓపెనర్లు ఫిల్ సాల్ట్, విల్ జాక్స్ అదిరిపోయే ఆరంభం అందించారు. సాల్ట్ 35 బంతుల్లోనే 55 (5 ఫోర్లు, 4 సిక్స్‌లు), జాక్స్ 12 బంతుల్లోనే 25 (ఒక ఫోర్ 2 సిక్సర్లు) పరుగులు చేశారు. మిగతా వాళ్లలో కెప్టెన్ జోస్ బట్లర్ (23 బంతుల్లో 38) రాణించగా.. జాకోబ్ బెతెల్ మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగాడు.ఇంగ్లండ్ భారీ స్కోరుమొత్తంగా 32 బంతులు ఎదుర్కొన్న బెతెల్ నాలుగు ఫోర్లు, ఐదు సిక్సర్ల సాయంతో 62 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఆఖర్లో సామ్ కర్రాన్ ధనాధన్ ఇన్నింగ్స్(13 బంతుల్లో 24)తో ఆకట్టుకున్నాడు. ఫలితంగా ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. విండీస్ బౌలర్లలో గుడకేశ్ మోటీ రెండు, అల్జారీ జోసెఫ్, రోస్టన్ ఛేజ్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.విండీస్ ఓపెనర్ల ఊచకోత.. విండీస్ ఇక కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ ఆది నుంచే దుమ్ములేపింది. ఓపెనర్లు ఎవిన్ లూయిస్, షాయీ హోప్ సుడిగాలి ఇన్నింగ్స్‌తో పరుగుల విధ్వంసం సృష్టించారు. ఇంగ్లండ్ బౌలింగ్‌ను ఊచకోత కోస్తూ లూయీస్ సిక్సర్ల వర్షం కురిపించగా.. హోప్ బౌండరీలతో పరుగులు రాబట్టాడు.Smashed💥...platform set for the #MenInMaroon#TheRivalry | #WIvENG pic.twitter.com/KHgwBGcYbJ— Windies Cricket (@windiescricket) November 16, 2024 మెరుపు అర్ధ శతకాలులూయీస్ మొత్తంగా 31 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 68 పరుగులు చేయగా... హోప్ 24 బంతుల్లోనే 7 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 54 రన్స్ స్కోరు చేశాడు. వీరిద్దరి మెరుపు అర్ధ శతకాలకు తోడు కెప్టెన్ రోవ్‌మన్ పావెల్(23 బంతుల్లో 38), షెర్ఫానే రూథర్‌ఫర్డ్(17 బంతుల్లో 29 నాటౌట్)కూడా విలువైన ఇన్నింగ్స్ ఆడారు.How good was @shaidhope tonight?🏏🌟#TheRivalry | #WIvENG pic.twitter.com/MkfP5wE7U7— Windies Cricket (@windiescricket) November 16, 2024 19 ఓవర్లలోనేఫలితంగా 19 ఓవర్లలోనే వెస్టిండీస్ టార్గెట్‌ను పూర్తి చేసింది. ఐదు వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసి ఇంగ్లండ్‌పై ఘన విజయం సాధించింది. ఇంగ్లండ్ బౌలర్లలో రెహాన్ అహ్మద్ మూడు, జాన్ టర్నర్ ఒక వికెట్ దక్కించుకున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో ధనాధన్ హాఫ్ సెంచరీతో అలరించిన షాయీ హోప్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. వన్డే సిరీస్ విండీస్దేకాగా తొలుత ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌ను 2-1తో గెలిచిన వెస్టిండీస్.. టీ20 సిరీస్‌ను మాత్రం కోల్పోయింది. అయితే, వైట్‌వాష్ గండం నుంచి తప్పించుకుని పర్యాటక జట్టు ఆధిక్యాన్ని 3-1కు తగ్గించింది. ఇరుజట్ల మధ్య భారత కాలమానం ప్రకారం సోమవారం వేకువజామున(ఉదయం 1.20 నిమిషాలకు) ఐదో టీ20 జరుగనుంది.చదవండి: నాకు కాదు.. వాళ్లకు థాంక్యూ చెప్పు: తిలక్ వర్మతో సూర్య -
WI vs Eng: డూ ఆర్ డై.. సిరీస్ మొత్తానికి విధ్వంసకర వీరుడు దూరం
ఇంగ్లండ్‌తో మిగిలిన మూడు టీ20లకు వెస్టిండీస్ తమ జట్టును ప్రకటించింది. తమ టీమ్‌లో మూడు కీలక మార్పులు చేసినట్లు బుధవారం వెల్లడించింది. యువ పేసర్ షమార్ స్ప్రింగర్ పునరాగమనం చేయనుండగా.. మరో ఫాస్ట్ బౌలర్ అల్జారీ జోసెఫ్ సైతం రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలిపింది.వన్డే సిరీస్ విండీస్దేఅదే విధంగా.. విధ్వంసకర ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్ ఇంగ్లండ్‌తో మిగిలిన టీ20లకు దూరమైనట్లు విండీస్ బోర్డు పేర్కొంది. కాగా మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్ ఆడేందుకు ఇంగ్లండ్ వెస్టిండీస్ పర్యటనకు వచ్చింది. వన్డే సిరీస్‌ను ఆతిథ్య విండీస్ 2-1తో గెలుచుకోగా.. మొదటి రెండు టీ20లలో గెలిచి ఇంగ్లండ్ 2-0తో ఆధిక్యంలో కొనసాగుతోంది.17 బంతుల్లో 30 పరుగులుఈ క్రమంలో ఇరుజట్ల మధ్య గురువారం మూడో టీ20 మొదలుకానుంది. ఈ నేపథ్యంలో విండీస్ బోర్డు మిగిలిన సిరీస్‌కు తమ జట్టును ప్రకటించింది. కాగా బట్లర్ బృందంతో తొలి టీ20లో పాల్గొన్న రసెల్.. 17 బంతుల్లో నాలుగు సిక్సర్ల సాయంతో 30 పరుగులు చేశాడు. అయితే, వికెట్లు మాత్రం తీయలేకపోయాడు.ఈ మ్యాచ్ సందర్భంగా మడమ నొప్పితో బాధపడ్డ ఆండ్రీ రసెల్.. రెండో టీ20కి దూరంగా ఉన్నాడు. అయితే, గాయం తీవ్రత ఇంకా తగ్గకపోవడంతో అతడిని మిగిలిన మూడు టీ20 మ్యాచ్‌లకు ఎంపిక చేయలేదు. మరోవైపు.. గత నెలలో శ్రీలంకతో సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ టీ20లలో అడుగుపెట్టిన షమార్ స్ప్రింగర్ రీఎంట్రీ ఇచ్చాడు.డూ ఆర్ డై మ్యాచ్అదే విధంగా.. మూడో వన్డే సందర్భంగా కెప్టెన్ షాయీ హోప్‌తో అనుచితంగా ప్రవర్తించినందుకు నిషేధం ఎదుర్కొన్న అల్జారీ జోసెఫ్ కూడా జట్టులోకి తిరిగి వచ్చాడు. కాగా రసెల్ దూరం కావడం విండీస్‌కు పెద్ద ఎదురుదెబ్బలాంటిది. ఇక సెయింట్ లూసియా వేదికగా మూడో టీ20లో గెలిస్తేనే వెస్టిండీస్ సిరీస్ ఆశలు సజీవంగా ఉంటాయి.చావోరేవో తేల్చుకోవాల్సిన ఈ మ్యాచ్‌లో విండీస్ ఆటగాళ్లు ఏ మేరకు రాణిస్తారనేది ఆసక్తికరంగా మారింది. కాగా తొలి టీ20లో ఎనిమిది వికెట్లు, రెండో టీ20లో ఏడు వికెట్ల తేడాతో గెలిచి ఇంగ్లండ్ విండీస్‌పై పూర్తి ఆధిపత్యం కనబరిచింది.ఇంగ్లండ్‌తో మిగిలిన మూడు టీ20లకు వెస్టిండీస్ జట్టురోవ్మన్ పావెల్ (కెప్టెన్), రోస్టన్ చేజ్, మాథ్యూ ఫోర్డ్, షిమ్రాన్ హెట్మెయిర్, టెర్రాన్ హిండ్స్, షాయీ హోప్, అకీల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, ఎవిన్ లూయిస్, గుడాకేష్ మోటీ, నికోలస్ పూరన్, షెర్ఫాన్ రూథర్‌ఫర్డ్, రొమారియో షెపర్డ్, షమార్ స్ప్రింగర్.చదవండి: సౌతాఫ్రికాతో మూడో టీ20.. కీలక మార్పు సూచించిన భారత మాజీ స్టార్ -
సాల్ట్ విధ్వంసకర సెంచరీ.. విండీస్‌ను చిత్తు చేసిన ఇంగ్లండ్
వెస్టిండీస్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఇంగ్లండ్ శుభారంభం చేసింది. బార్బోడస్ వేదికగా జరిగిన తొలి టీ20లో విండీస్‌పై 8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది.విండీస్ బ్యాటర్లలో నికోలస్ పూరన్(38) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. రస్సెల్(30), రొమారియో షెపర్డ్(35), మోటీ(33) పరుగులతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో షకీబ్ మహ్మద్ 4 వికెట్లతో పడగొట్టగా, అదిల్ రషీద్ 3, ఓవర్టన్, లివింగ్ స్టోన్ తలా వికెట్ సాధించారు.సాల్ట్ విధ్వంసకర సెంచరీ..అనంతం 183 పరుగుల భారీ లక్ష్యాన్ని 16.5 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఇంగ్లండ్ ఊదిపడేసింది. ఇంగ్లండ్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. 54 బంతులు ఎదుర్కొన్న 9 ఫోర్లు, 4 సిక్స్‌లతో 103 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాట జాకబ్ బెతల్(58) హాఫ్ సెంచరీతో మెరిశాడు. విండీస్ బౌలర్లలో మోటీ, షెపర్డ్ తలా వికెట్ మాత్రమే సాధించారు. ఇక ఇరు జట్ల మధ్య రెండో టీ20 నవంబర్ 10న ఇదే బార్బోడస్‌లో జరగనుంది.చదవండి: ద్రవిడ్ చిన్న కొడుకు వచ్చేస్తున్నాడు.. ఆ టోర్నమెంట్‌కు ఎంపిక -
ఇంగ్లండ్‌తో రెండో టెస్ట్.. విండీస్ తుది జట్టు ప్రకటన
ట్రెంట్‌బ్రిడ్జ్ వేదికగా ఇంగ్లండ్‌తో రేపటి నుంచి ప్రారంభంకాబోయే రెండో టెస్ట్ మ్యాచ్ కోసం వెస్టిండీస్ తుది జట్టును ఇవాళ (జులై 17) ప్రకటించారు. ఈ మ్యాచ్ కోసం విండీస్ ఎలాంటి మార్పులు చేయలేదు. తొలి టెస్ట్‌లో ఆడిన జట్టునే ఈ మ్యాచ్‌లోనూ కొనసాగించనుంది.ఇంగ్లండ్ తమ తుది జట్టును నిన్ననే ప్రకటించింది. ఆండర్సన్ రిటైర్మెంట్ తర్వాత ఇంగ్లండ్ ఆడబోయే తొలి టెస్ట్ మ్యాచ్ ఇది. మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం వెస్టిండీస్ జట్టు ఇంగ్లండ్‌లో పర్యటిస్తుంది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 114 పరుగుల తేడాతో గెలుపొందింది.లార్డ్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ అన్ని విభాగాల్లో సత్తా చాటింది. అరంగేట్రం పేసర్ గస్ అట్కిన్సన్ ఈ మ్యాచ్‌లో చెలరేగిపోయాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఏడు, సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లతో అదరగొట్టాడు. కెరీర్లో చివరి మ్యాచ్ ఆడిన ఆండర్సన్ పర్వాలేదనిపించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఒకటి, సెకెండ్ ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు పడగొట్టాడు.ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ తరఫున అరంగేట్రం చేసిన మరో ఆటగాడు జేమీ స్మిత్ బ్యాటింగ్, వికెట్‌కీపింగ్‌లో ఆకట్టుకున్నాడు. జేమీ డెబ్యూ ఇన్నింగ్స్‌లో 70 పరుగులు చేయడంతో పాటు మ్యాచ్‌లో నాలుగు క్యాచ్‌లు అందుకున్నాడు. జేమీతో పాటు జాక్ క్రాలే, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్ హాఫ్ సెంచరీలు చేయడంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 371 పరుగులు చేసింది.తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్.. అట్కిన్సన్ ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో 121 పరుగులకు.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో 136 పరుగులకు ఆలౌటైంది. రేపటి టెస్ట్ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమవుతుంది.ఇంగ్లండ్ ప్లేయింగ్ XI: జాక్ క్రాలే, బెన్ డకెట్, ఒలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, గస్ అట్కిన్సన్, మార్క్ వుడ్, షోయబ్ బషీర్వెస్టిండీస్ ప్లేయింగ్ XI: క్రెయిగ్ బ్రాత్‌వైట్ (కెప్టెన్), మికిల్ లూయిస్, కిర్క్ మెకెంజీ, అలిక్ అథనాజ్, కవెమ్ హాడ్జ్, జాషువా డ సిల్వా (వికెట్‌కీపర్), జేసన్ హోల్డర్, గుడకేష్ మోటీ, అల్జరీ జోసెఫ్, షమర్ జోసెఫ్, జేడెన్ సీల్స్ -
ఇంగ్లండ్‌తో తొలి టెస్ట్.. విండీస్ తుది జట్టు ప్రకటన
ఇంగ్లండ్, వెస్టిండీస్ మధ్య మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జులై 10 నుంచి ప్రారంభం కానుంది. తొలి టెస్ట్ లార్డ్స్ వేదికగా జరుగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇంగ్లండ్, వెస్టిండీస్ తమతమ తుది జట్లను ప్రకటించాయి.ఈ మ్యాచ్ ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జిమ్మీ ఆండర్సన్‌కు చివరి అంతర్జాతీయ మ్యాచ్. ఈ టెస్ట్ అనంతరం ఆండర్సన్ ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలింగ్ కన్సల్టెంట్‌గా పని చేస్తాడు. ఈ సిరీస్‌లో మిగతా రెండు టెస్ట్‌లు ట్రెంట్‌బ్రిడ్జ్ (జులై 18-22), ఎడ్జ్‌బాస్టన్ (జులై 26-30) వేదికగా జరుగనున్నాయి.తొలి టెస్ట్‌కు ఇంగ్లండ్ తుది జట్టు: జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమీ స్మిత్ (వికెట్‌కీపర్), క్రిస్ వోక్స్, గస్ అట్కిన్సన్, షోయబ్ బషీర్, జేమ్స్ ఆండర్సన్.వెస్టిండీస్ తుది జట్టు: క్రెయిగ్ బ్రాత్‌వైట్ (కెప్టెన్), మికిల్ లూయిస్, కిర్క్ మెకెంజీ, అలిక్ అథనాజ్, కవెమ్ హాడ్జ్, జాషువా డ సిల్వా (వికెట్‌కీపర్), జేసన్ హోల్డర్, జేడెన్ సీల్స్, అల్జారీ జోసెఫ్, షమర్ జోసెఫ్, గుడకేష్ మోటీ. -
పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తున్న విండీస్
వివిధ కారణాల చేత పరిమిత ఓవర్ల స్పెషలిస్ట్‌లంతా ఒక్కసారిగా జట్టు నుంచి తప్పుకోవడంతో వన్డే ప్రపంచకప్‌కు సైతం అర్హత సాధించలేక ఇంటాబయటా విమర్శలు ఎదుర్కొన్న వెస్టిండీస్ క్రికెట్ జట్టు ఇటీవలికాలంలో పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తుంది. రసెల్, పూరన్ లాంటి సీనియర్లు తిరిగి జట్టులో చేరడంతో కరీబియన్ జట్టు ఇంటాబయటా వరుస సిరీస్ విజయాలతో దూసుకుపోతుంది. తాజాగా స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే, టీ20 సిరీస్‌లను కైవసం చేసుకున్న ఈ మాజీ వరల్డ్ ఛాంపియన్.. దీనికి ముందు స్వదేశంలోనే భారత్‌పై 3-2 తేడాతో టీ20 సిరీస్ నెగ్గింది. దీనికి ముందు సౌతాఫ్రికాలో వారిపై 2-1 తేడాతో టీ20 సిరీస్ గెలిచింది. వచ్చే ఏడాది స్వదేశంలో టీ20 వరల్డ్‌కప్ ఉండటంతో ఇప్పటినుంచే సన్నాహకాలను మొదలుపెట్టిన విండీస్ బోర్డు జట్టును వీడిన సీనియర్లనంతా ఒక్కొక్కరిగా తిరిగి జట్టులోకి ఆహ్వానిస్తుంది. ప్రస్తుతం విండీస్ ఉన్న ఊపు చూస్తుంటే మూడోసారి టీ20 ఛాంపియన్‌గా నిలవడం ఖయామని అనిపిస్తుంది. కాగా, ట్రినిడాడ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన నిర్ణయాత్మక ఐదో టీ20లో వెస్టిండీస్ 4 వికెట్ల తేడాతో గెలుపొంది, 3-2 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. 19.3 ఓవర్లలో 132 పరుగులకే ఆలౌటైంది. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వెస్టిండీస్.. 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరుకుంది. -
రీఎంట్రీలో రసెల్ బ్యాటింగ్ విధ్వంసం.. విండీస్ చేతిలో ఇంగ్లండ్ చిత్తు
West Indies vs England, 1st T20I: వెస్టిండీస్ క్రికెటర్ ఆండ్రీ రసెల్ జాతీయ జట్టులో పునరాగమనాన్ని ఘనంగా చాటాడు. ఇంగ్లండ్‌తో తొలి టీ20లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. తొలుత బంతితో చెలరేగిన ఈ ఆల్‌రౌండర్.. అనంతరం లక్ష్య ఛేదనలో విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుపడ్డాడు. ఇంగ్లండ్ బౌలర్ల ఎత్తులను చిత్తు చేస్తూ ధనాధన్ బ్యాటింగ్‌తో జట్టును విజయతీరాలకు చేర్చాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచి రీఎంట్రీ అదుర్స్ అనిపించాడు. కాగా మూడు వన్డే, ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆడేందుకు ఇంగ్లండ్ వెస్టిండీస్ పర్యటనకు వెళ్లింది. మూడు వికెట్లు పడగొట్టిన రసెల్ ఈ క్రమంలో వన్డే సిరీస్‌ను 2-1తో గెలిచి ఇంగ్లిష్ జట్టుకు షాకిచ్చిన వెస్టిండీస్.. టీ20 సిరీస్‌ను విజయంతో ఆరంభించి సత్తా చాటింది. బార్బడోస్ వేదికగా బుధవారం తెల్లవారుజామున జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన విండీస్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ నేపథ్యంలో ఆతిథ్య జట్టు ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 19.3 ఓవర్లలో 171 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్ 20 బంతుల్లో 40, జోస్ బట్లర్ 31 బంతుల్లో 39 పరుగులతో శుభారంభం అందించగా.. మిగతా వాళ్లలో లియామ్ లివింగ్ స్టోన్(27) ఒక్కడే ఇరవై పరుగుల పైచిలుకు స్కోరు రాబట్టాడు. కరేబియన్ బౌలర్ల ధాటికి మిగిలిన ఇంగ్లిష్ బ్యాటర్లంతా చేతులెత్తేశారు. ఇక ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో పేస్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రస్సెల్, మరో ఫాస్ట్‌బౌలర్ అల్జారీ జోసెఫ్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. మిగిలిన వాళ్లలో పేసర్లు జేసన్ హోల్డర్ ఒకటి, రొమారియో షెఫర్డ్ రెండు వికెట్లు కూల్చారు. ఇక స్పిన్నర్ అకీల్ హొసేన్‌కు ఒక వికెట్ దక్కింది. Unstoppable Russell Mania! . .#WIvENG #WIvENGonFanCode pic.twitter.com/VjbBCJMMIV — FanCode (@FanCode) December 13, 2023 పావెల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన వెస్టిండీస్‌కు ఓపెనర్లు బ్రాండన్ కింగ్(22), కైలీ మేయర్స్(35) మంచి ఆరంభం అందించగా.. వన్‌డౌన్ బ్యాటర్ షాయీ హోప్ 36 పరుగులతో రాణించాడు. ఆ తర్వాతి స్థానాల్లో వచ్చిన నికోలస్ పూరన్ 13, షిమ్రన్ హెట్మెయిర్ ఒక్క పరుగుకే పరిమితమయ్యారు. అయితే, ఆరో నంబర్ బ్యాటర్, కెప్టెన్ రోవ్‌మన్ పావెల్, ఎనిమిదో స్థానంలో వచ్చిన ఆండ్రీ రసెల్ ధనాధన్ ఇన్నింగ్స్‌తో చెలరేగారు. పావెల్ 15 బంతుల్లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 206.67 స్ట్రైక్‌రేటుతో 31 పరుగులు రాబట్టి అజేయంగా నిలిచాడు. సునామీ ఇన్నింగ్స్‌తో రసెల్ విధ్వంసం మరోవైపు రసెల్ కూడా 14 బంతులు ఎదుర్కొని 207కు పైగా స్ట్రైక్‌రేటుతో 29 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. కాగా రసెల్ దాదాపు రెండేళ్ల తర్వాత వెస్టిండీస్ తరఫున బరిలోకి దిగడం ఇదే తొలిసారి. Russell roars back! . .#WIvENG #WIvENGonFanCode pic.twitter.com/zdlJBWJdWA — FanCode (@FanCode) December 13, 2023 ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌పై టీ20 సిరీస్‌లో వెస్టిండీస్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. దీంతో జోస్ బట్లర్ బృందానికి మరోసారి నిరాశే మిగిలింది. ఇరు జట్ల మధ్య గురువారం రెండో టీ20 జరుగనుంది. చదవండి: Ind vs SA: అందుకే ఓడిపోయాం.. మాకు ఇదొక గుణపాఠం: సూర్యకుమార్ -
వెస్టిండీస్ టీ20 జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాడు రీ ఎంట్రీ
ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు 15 మంది సభ్యులతో కూడిన జట్టును తమ జట్టును క్రికెట్ వెస్టిండీస్ ప్రకటించింది. దాదాపు రెండేళ్ల పాటు జాతీయ జట్టుకు దూరమైన స్టార్ ఆల్ రౌండర్ ఆండ్రీ రస్సెల్‌కు ఇంగ్లండ్ సిరీస్ కోసం విండీస్ సెలక్టర్లు పిలుపునిచ్చారు. రస్సెల్ చివరగా వెస్టిండీస్ తరపున 2021లో ఆస్ట్రేలియాపై టీ20 మ్యాచ్ ఆడాడు. ఇటీవల కాలంలో రస్సెస్ మెరుగైన ప్రదర్శన కనబరుస్తుండంతో మళ్లీ సెలక్టర్లు అతడిని పరిగణలోకి తీసుకున్నారు. అదే విధంగా ఇంగ్లండ్‌తో వన్డేలకు దూరమైన స్టార్ ఆటగాళ్లు జాసన్ హోల్డర్, నికోలస్ పూరన్ లు టీ20 జట్టులో మాత్రం చోటు దక్కించుకున్నారు. ఈ జట్టుకు రోవ్‌మన్ పావెల్ కెప్టెన్ గా వ్యవహరించనుండగా.. షాయ్ హోప్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. డిసెంబర్ 12న బార్బోడేస్ వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. కాగా ఇప్పటికే ఇంగ్లండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో వెస్టిండీస్ సొంతం చేసుకుంది. ఇంగ్లండ్‌తో టీ20లకు విండీస్ జట్టు: రోవ్‌మన్ పావెల్ (కెప్టెన్), షాయ్ హోప్ (వైస్ కెప్టెన్), రోస్టన్ చేజ్, మాథ్యూ ఫోర్డ్, షిమ్రాన్ హెట్మెయర్, జాసన్ హోల్డర్, అకేల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, గుడాకేష్ మోటీ, నికోలస్ పూరన్, ఆండ్రీ రస్సెల్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, రొమారియో షెపర్డ్. చదవండి: ENG vs WI: ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన వెస్టిండీస్.. 24 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి -
ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన వెస్టిండీస్.. 24 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి
బార్బడోస్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో 4 వికెట్ల తేడాతో వెస్టిండీస్ విజయం సాధించింది. తద్వారా మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో విండీస్ కైవసం చేసుకుంది. కాగా కరేబియన్ దీవుల్లో ఇంగ్లీష్ జట్టుపై విండీస్ వన్డే సిరీస్‌ను సొంతం చేసుకోవడం 24 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం విశేషం. విండీస్ చివరగా తమ స్వదేశంలో 1998లో ఇంగ్లండ్‌పై వన్డే సిరీస్ విజయం సాధించింది. తాజా విజయంతో 24 ఏళ్ల నిరీక్షణకు వెస్టిండీస్ తెరదించింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. వర్షం కారణంగా మూడో వన్డేను 40 ఓవర్లకు కుదించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో బెన్ డకెట్(71) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. విండీస్ బౌలర్లలో మాథ్యూ ఫోర్డే, జోషఫ్‌య తలా 3 వికెట్లు పడగొట్టగా.. షెపెర్డ్ రెండు వికెట్లు సాధించాడు. అనంతరం విండీస్ టార్గెట్‌ను డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం 188గా నిర్ణయించారు. 188 లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ 31.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కరేబియన్ బ్యాటర్లలో ఆథనాజ్(45), కార్టీ(50) పరుగులతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో విల్ జాక్స్ 3 వికెట్లు.. అటిక్కినిసన్ 2, ఆహ్మద్ ఒక్క వికెట్ పడగొట్టారు. సిరీస్ ఆసాంతం అద్భుత ప్రదర్శన కనబరిచిన విండీస్ కెప్టెన్ షాయ్ హోప్‌కు మ్యాన్ ఆఫ్‌ది సిరీస్ అవార్డు దక్కింది. -
రాణించిన కర్రన్, బట్లర్.. విండీస్‌పై ప్రతీకారం తీర్చుకున్న ఇంగ్లండ్
ఆంటిగ్వా వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో ఇంగ్లండ్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఇంగ్లండ్ తొలి వన్డేలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుని మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-1తో సమంగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్.. ఇంగ్లండ్ బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో 39.4 ఓవర్లలో 202 పరుగులకు ఆలౌటైంది. సామ్ కర్రన్, లివింగ్‌స్టోన్ చెరో 3 వికెట్లు.. అట్కిన్సన్, రెహాన్ అహ్మద్ తలో 2 వికెట్లు పడగొట్టారు. విండీస్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ షాయ్ హోప్ (68), షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ (63) అర్ధసెంచరీలతో రాణించారు. తొలి వన్డేలో మెరుపు శతకంతో విండీస్‌ను గెలిపించిన హోప్ ఈ మ్యాచ్‌లోనూ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం 203 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. విల్ జాక్స్ (73), కెప్టెన్ జోస్ బట్లర్ (58 నాటౌట్) అర్ధసెంచరీలతో రాణించడంతో 32.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. జాక్స్, బట్లర్లతో పాటు హ్యారీ బ్రూక్ (43 నాటౌట్) కూడా రాణించాడు. విండీస్ బౌలర్లలో గుడకేశ్ మోటీకి రెండు, రొమారియో షెపర్డ్, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్‌లకు తలో వికెట్ దక్కింది. నిర్ణయాత్మకమైన మూడో వన్డే డిసెంబర్ 9న జరుగనుంది. -
ఇంగ్లండ్‌పై శతక్కొట్టిన విండీస్ కెప్టెన్.. ఇదంతా ధోని వల్లే అంటూ!
West Indies vs England, 1st ODI: ఇంగ్లండ్‌తో తొలి వన్డేలో వెస్టిండీస్ కెప్టెన్ షాయీ హోప్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అజేయ శతకంతో అదరగొట్టి జట్టును గెలుపుతీరాలకు చేర్చాడు. ఆంటిగ్వా వేదికగా ఆదివారం జరిగిన వన్డేలో మొత్తంగా 83 బంతులు ఎదుర్కొన్న షాయీ హోప్.. 4 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 109 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. తద్వారా ఇంగ్లండ్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో విండీస్‌కు 1-0 ఆధిక్యం అందించాడు. ఈ నేపథ్యంలో విజయానంతరం తన అద్బుత ఇన్నింగ్స్ గురించి షాయీ హోప్ మాట్లాడుతూ.. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి క్రెడిట్ ఇచ్చాడు. ‘‘నా సెంచరీ జట్టు విజయానికి కారణమైనందుకు సంతోషిస్తున్నా. మేము మ్యాచ్ గెలవడం ఆనందంగా ఉంది. కొన్నాళ్ల క్రితం నేను ఎంఎస్ ధోనితో మాట్లాడాను. అనుకున్న దాని కంటే ఎక్కువ సేపు క్రీజులో ఉండేందుకు ప్రయత్నించమని చెప్పాడు. కీలక సమయంలో వికెట్ కాపాడుకోవడం ముఖ్యమన్నాడు. ఈరోజు అలాగే ఆడాను. షెఫర్డ్ కూడా అద్భుత ఇన్నింగ్స్‌తో మెరిశాడు. విజయంతో సిరీస్‌ను ఆరంభించడం సంతోషం. తదుపరి మ్యాచ్‌లోనూ ఇదే ఫలితం పునరావృతం చేయాలని భావిస్తున్నాం’’ అని షాయి హోప్ పేర్కొన్నాడు. క్యాచ్‌లు డ్రాప్ చేయడం వంటి తప్పులు రిపీట్ చేయకుండా జాగ్రత్తపడతామని పేర్కొన్నాడు. కాగా ఇంగ్లండ్‌తో తొలి వన్డేలో ఆతిథ్య వెస్టిండీస్ 4 వికెట్ల తేడాతో గెలిచింది. ఇంగ్లండ్ విధించిన 326 పరుగుల లక్ష్యాన్ని 48.5 ఓవర్లలోనే ఛేదించింది. సిక్సర్‌తో విండీస్ విజయాన్ని ఖరారు చేసిన కెప్టెన్, వికెట్ కీపర్ బ్యాటర్ షాయి హోప్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. చదవండి: T20: గిల్‌కు ఇకపై గట్టి పోటీ.. వరల్డ్‌కప్‌లో ఆడాలంటే! Scenes in Antigua after the win!🇦🇬#WIvENG #WIHomeforChristmas pic.twitter.com/H68vzqu0Yo — Windies Cricket (@windiescricket) December 3, 2023 -
WI VS ENG 1st ODI: చెత్త రికార్డు మూటగట్టుకున్న సామ్ కర్రన్
వెస్టిండీస్‌తో నిన్న (డిసెంబర్ 3) జరిగిన తొలి వన్డేలో ఇంగ్లండ్ యువ ఆల్‌రౌండర్ సామ్ కర్రన్ చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో వికెట్ లేకుండా (9.5 ఓవర్లు) 98 పరుగులు సమర్పించుకున్న కర్రన్.. ఇంగ్లండ్ తరఫున వన్డేల్లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్‌గా చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. కర్రన్‌కు ముందు ఈ చెత్త రికార్డు స్టీవ్ హార్మిసన్ పేరిట ఉండేది. 2006లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో హార్మిసన్ వికెట్ లేకుండా 97 పరుగులు సమర్పించుకున్నాడు. ఇంగ్లండ్ తరఫున వన్డేల్లో అతి ధారాళంగా పరుగులు సమర్పించుకున్న బౌలర్ల జాబితాలో క్రిస్ జోర్డన్ (2015లో 1/97), జేక్ బాల్ (2017లో 1/94) కర్రన్, హార్మిసన్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఇదిలా ఉంటే, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా ఆంటిగ్వా వేదికగా ఇంగ్లండ్‌తో నిన్న జరిగిన తొలి వన్డేలో ఆతిథ్య వెస్టిండీస్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 325 పరుగులకు ఆలౌట్ కాగా.. విండీస్ మరో ఏడు బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో హ్యారీ బ్రూక్ (72 బంతుల్లో 71; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), ఫిలిప్ సాల్ట్ (45), జాక్ క్రాలే (48), సామ్ కర్రన్ (28), బ్రైడన్ కార్స్ (31 నాటౌట్) పర్వాలేదనిపించగా.. విండీస్ ఇన్నింగ్స్‌లో హోప్‌తో పాటు అలిక్ అథనాజ్ (66), రొమారియో షెపర్డ్ (49), బ్రాండన్ కింగ్ (35), షిమ్రోన్ హెట్‌మైర్ (32) రాణించారు. ఇరు జట్ల మధ రెండో వన్డే డిసెంబర్ 6న జరుగనుంది. -
WI VS ENG 1st ODI: విరాట్ రికార్డును సమం చేసిన షాయ్ హోప్
విండీస్ వన్డే జట్టు సారధి షాయ్ హోప్ పరుగుల యంత్రం విరాట్ కోహ్లి, విండీస్ బ్యాటింగ్ దిగ్గజం వివియన్ రిచర్డ్స్ పేరిట ఉన్న ఓ రికార్డును సమం చేశాడు. వన్డేల్లో అత్యంత వేగంగా (114 ఇన్నింగ్స్‌లో) 5000 పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్, వివ్ రిచర్డ్స్లతో కలిసి సంయుక్తంగా మూడో స్థానాన్ని ఆక్రమించాడు. ఇంగ్లండ్‌తో నిన్న (డిసెంబర్ 3) జరిగిన తొలి వన్డేల్లో అజేయ మెరుపు శతకంతో (83 బంతుల్లో 109 నాటౌట్; 4 ఫోర్లు, 7 సిక్సర్లు) విరుచుకుపడిన హోప్ ఈ ఘనతను సాధించాడు. వన్డేల్లో అత్యంత వేగంగా ఈ మార్కును తాకిన రికార్డు పాక్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ పేరిట ఉంది. బాబర్ కేవలం 97 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించాడు. బాబర్ తర్వాత ఈ జాబితాలో దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు హషీమ్ ఆమ్లా ఉన్నాడు. ఆమ్లా 101 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్‌ను సాధించాడు. ఇదిలా ఉంటే, స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న 3 వన్డేల సిరీస్‌లో భాగంగా నిన్న జరిగిన తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. షాయ్ హోప్ సూపర్ సెంచరీతో విండీస్‌ను గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 325 పరుగులకు ఆలౌట్ కాగా.. విండీస్ మరో ఏడు బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. ఫలితంగా ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి, సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో బ్రూక్ (72 బంతుల్లో 71; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), సాల్ట్ (45), క్రాలే (48), సామ్ కర్రన్ (28), బ్రైడన్ కార్స్ (31 నాటౌట్) పర్వాలేదనిపించగా.. విండీస్ ఇన్నింగ్స్‌లో హోప్‌తో పాటు అలిక్ అథనాజ్ (66), రొమారియో షెపర్డ్ (49), బ్రాండన్ కింగ్ (35), షిమ్రోన్ హెట్‌మైర్ (32) రాణించారు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే డిసెంబర్ 6న జరుగనుంది. ఇంగ్లండ్ జట్టు ఈ పర్యటనలో 3 వన్డేల సిరీస్‌తో పాటు 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ కూడా ఆడనుంది. -
WI VS ENG 1st ODI: శతక్కొట్టిన హోప్.. విండీస్ రికార్డు విజయం
వన్డే క్రికెట్లో వెస్టిండీస్ తమ రెండో అత్యుత్తమ లక్ష్య ఛేదనను నమోదు చేసింది. 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో నిన్న (డిసెంబర్ 3) జరిగిన తొలి మ్యాచ్‌లో విండీస్ 326 పరుగుల భారీ లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది. వన్డే క్రికెట్లో విండీస్ అత్యుత్తమ లక్ష్యఛేదన రికార్డు 328 పరుగులుగా ఉంది. 2019లో ఐర్లాండ్‌పై విండీస్ ఈ ఫీట్‌ను (47.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి) సాధించింది. 2023 వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధించలేకపోయిన విండీస్‌కు తదనంతరం దక్కిన తొలి విజయం ఇదే కావడం విశేషం. మ్యాచ్ విషయానికొస్తే.. తొలి వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 325 పరుగులు చేసి ఆలౌట్ కాగా.. విండీస్ మరో ఏడు బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. ఫలితంగా నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించి, సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. రాణించిన బ్రూక్.. మిడిలార్డర్ ఆటగాడు హ్యారీ బ్రూక్ కీలక ఇన్నింగ్స్‌తో (72 బంతుల్లో 71; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో ఇంగ్లండ్ 300 పరుగుల మార్కును దాటగలిగింది. బ్రూక్‌తో పాటు ఫిలిప్ సాల్ట్ (45), జాక్ క్రాలే (48), సామ్ కర్రన్ (28), బ్రైడన్ కార్స్ (31 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. కెప్టెన్ జోస్ బట్లర్ (3) నిరాశపరిచాడు. విండీస్ బౌలర్లలో రొమారియో షెపర్డ్, గుడకేశ్ మోటీ, ఒషేన్ థామస్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. అల్జరీ జోసఫ్, యానిక్ కారియా చెరో వికెట్ దక్కించుకున్నారు. శతక్కొట్టిన హోప్.. 326 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన విండీస్.. షాయ్ హోప్ శతక్కొట్టడంతో (83 బంతుల్లో 109 నాటౌట్; 4 ఫోర్లు, 7 సిక్సర్లు) 48.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. హోప్‌తో పాటు అలిక్ అథనాజ్ (66), రొమారియో షెపర్డ్ (49) రాణించగా.. బ్రాండన్ కింగ్ (35), షిమ్రోన్ హెట్‌మైర్ (32) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో అట్కిన్సన్, రెహాన్ అహ్మద్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. బ్రైడన్ కార్స్, లివింగ్‌స్టోన్ చెరో వికెట్ దక్కించుకున్నారు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే డిసెంబర్ 6న జరుగనుంది. ఇంగ్లండ్ జట్లు ఈ పర్యటనలో 3 వన్డేల సిరీస్‌తో పాటు 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ కూడా ఆడనుంది. -
వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ సంచలన నిర్ణయం..
వెస్టిండీస్ వెటరన్ ఆటగాడు డారెన్ బ్రావో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు తనను ఎంపిక చేయకపోవడం పట్ల నిరాశచెందిన బ్రావో.. వెస్టిండీస్ క్రికెట్‌తో తెగదింపులు చేసుకున్నాడు. తన నిర్ణయాన్ని సోషల్ మీడియా వేదికగా బ్రావో ఆదివారం వెల్లడించాడు. కాగా బ్రావో ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. దేశీవాళీ టోర్నీల్లో కూడా మెరుగ్గా రాణిస్తున్నాడు. ఇటీవల జరిగిన విండీస్ సూపర్-50 కప్ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా బ్రావో నిలిచాడు. గత కొన్నేళ్లుగా దేశీవాళీ టోర్నీల్లో అద్భుతంగా రాణిస్తున్నప్పటికి.. సెలక్టర్లు తన పట్టించుకోకపోవడంపై అతడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ క్రమంలోనే విండీస్ క్రికెట్‌కు బ్రావో గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్నాడు. కాగా వెస్టిండీస్ మాజీ ఆల్‌రౌండర్ డ్వైన్ బ్రావో సోదరుడే ఈ డారెన్ బ్రావో. "క్రికెటర్‌గా నా తదుపరి ప్రయాణం గురించి ఆలోచించడానికి కొంత సమయం తీసుకున్నాను. అన్ని విధాలగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను. విండీస్ క్రికెట్‌తో నా ప్రయాణం అంత ఈజీగా సాగలేదు. అంతర్జాతీయ క్రికెట్‌కు తిరిగి రావడానికి అన్ని విధాల కష్టపడ్డాను. కానీ విండీస్ సెలక్షన్ కమిటీ మాత్రం నాతో ఎటువంటి కమ్యూనికేషన్ లేకుండా పక్కన పెట్టేసింది. ప్రస్తుతం మూడు ఫార్మాట్లలో విండీస్ జట్టుకు ప్రాతినిథ్యం వహించడానికి 40 నుంచి 45 మంది ఆటగాళ్లు అవసరం. అందులో నేను లేనని నాకు అర్ధమైపోయింది. ప్రాంతీయ టోర్నీల్లో పరుగులు సాధించినా సెలెక్టర్లు నన్ను పక్కన పెట్టేశారు. అయితే నేను పూర్తిగా క్రికెట్ నుంచి తప్పుకోవడం లేదు. కొంతకాలం పాటు దూరండా ఉండటం ఉత్తమమని భావిస్తున్నాను. ప్రతిభావంతులైన యువ క్రికెటర్లకు అవకాశం కల్పించాలి. ప్రతీ ఒక్కరికి ఆల్‌ది బెస్ట్" అని ఇన్‌స్టాగ్రామ్‌లో బ్రావో రాసుకొచ్చాడు. కాగా ఇంగ్లండ్ జట్టు వన్డే, టీ20ల కోసం డిసెంబర్లో వెస్టిండీస్ పర్యటనకు రానుంది. ఈ క్రమంలో విండీస్ సెలక్టర్లు తొలుత వన్డే సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ప్రకటించారు. విండీస్ వన్డే జట్టు : షై హోప్(కెప్టెన్), అల్జారీ జోసెఫ్(వైస్ కెప్టెన్), అలిక్ అథనజె, యన్నిక్ కరియా, కేసీ కార్టీ, రోస్టన్ ఛేజ్, షేన్ డౌరిచ్, మాథ్యూ ఫోర్డే, షిమ్రన్ హెట్‌మైర్, బ్రాండన్ కింగ్, గుడకేశ్ మోటీ, జొర్న్ ఒట్లే, షెర్ఫనే రూథర్‌ఫర్డ్, రొమరియో షెఫర్డ్, ఒషానే థామస్. -
చరిత్రలో రెండోసారి మాత్రమే.. 145 ఏళ్ల రికార్డు బద్దలు
వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో టెస్టులో ఇంగ్లండ్ టెయిలెండర్లు కొత్త చరిత్ర సృష్టించారు. తమ అసాధారణ బ్యాటింగ్‌తో 145 ఏళ్ల చరిత్రను తిరగరాశారు. వారిద్దరే ఇంగ్లండ్ బౌలర్లు జాక్ లీచ్, సాకిబ్ మహమూద్‌లు. తొలిరోజు ఆటలో ఇంగ్లండ్ జట్టు విండీస్ బౌలర్ల దాటికి కుదేలయ్యింది. ఓపెనర్ అలెక్స్ లీస్(31) మినహా మిగతా టాప్ ఆర్డర్, మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ అంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఈ దెబ్బకు ఇంగ్లండ్ 67 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. ఈ దశలో క్రిస్ వోక్స్(25), క్రెయిగ్ ఓవర్టన్(14)లు ఇంగ్లండ్‌ను కాసేపు ఆదుకున్నారు. అయితే వరుస ఓవర్లలో ఈ ఇద్దరు ఔట్ కావడంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. అప్పటికి ఇంగ్లండ్ స్కోరు 9 వికెట్ల నష్టానికి 114. ఈ దశలో 10వ నెంబర్ బ్యాటర్ జాక్ లీచ్(41 నాటౌట్), సాకిబ్ మహమూద్(49) చివరి వికెట్‌కు రికార్డు స్థాయిలో 90 పరుగుల జత చేశారు. దీంతో ఇంగ్లండ్ 89.4 ఓవర్లలో 204 పరుగులకు ఆలౌట్ అయింది. జాక్ లీచ్, సాకిబ్ మహమూద్‌లు విండీస్ బౌలర్లను నిలువరిస్తూ చూపించిన తెగువ సూపర్ అనే చెప్పాలి. ఈ నేపథ్యంలోనే ఈ ఇద్దరు కలిసి 145 ఏళ్ల చరిత్రను తిరగరాశారు. ఆఖరి వికెట్‌కు 10,11వ బ్యాట్స్మన్లు ఎక్కువ పరుగులు జోడించడం ఇది రెండోసారి మాత్రమే. ఇంతకముందు 1885లో ఇదే ఇంగ్లండ్‌కు చెందిన టామ్ గారెట్, ఎడ్విన్ ఎవన్స్లు సిడ్నీ వేదికగా ఆసీస్‌తో జరిగిన టెస్టులో ఆఖరి వికెట్‌కు 81 పరుగులు జోడించడమే ఇప్పటివరకు అత్యుత్తమంగా ఉండేది. తాజాగా ఆ రికార్డును జాక్ లీచ్, సాకిబ్ మహమూద్‌లు బద్దలు కొట్టారు. ఇక జో రూట్ సహా మిగతా టాప్ బ్యాట్స్‌మన్ అంతా దారుణంగా విఫలమయ్యారు. విండీస్ బౌలర్లలో జైడెన్ సీల్స్ మూడు, కీమర్ రోచ్, కైల్ మేయర్స్, అల్జారీ జోసెఫ్‌లు తలా రెండు వికెట్లు తీశారు. -
WI Vs Eng: రెండో టెస్టుకూ అదే జట్టు.. వీరసామికి మరో అవకాశం!
England Tour Of West Indies 2022- నార్త్ సౌండ్ (ఆంటిగ్వా): చివరి రోజు వరకు ఆసక్తికరంగా సాగిన ఇంగ్లండ్, వెస్టిండీస్ తొలి టెస్టు ‘డ్రా’గా ముగిసిన విషయం తెలిసిందే. 71 ఓవర్లలో 286 పరుగుల ఊరించే విజయలక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ మ్యాచ్ ఐదో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లకు 147 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఎన్క్రుమా బానర్ (38 నాటౌట్), జేసన్ హోల్డర్ (37 నాటౌట్), బ్రాత్‌వైట్ (33) రాణించారు. ఆతిథ్య జట్టు ఆరంభంలో దూకుడుగా ఆడి గెలుపు కోసం ప్రయత్నించింది. అయితే 8 పరుగుల వ్యవధిలోనే 4 వికెట్లు కోల్పోవడంతో వెనక్కి తగ్గిన వెస్టిండీస్ ‘డ్రా’పై దృష్టి పెట్టింది. నాలుగో వికెట్ పడిన తర్వాత బానర్, హోల్డర్ ప్రత్యర్థికి మరో అవకాశం ఇవ్వకుండా మరో 35.4 ఓవర్లు పట్టుదలగా నిలబడ్డారు. బానర్ 138 బంతులు ఆడగా, హోల్డర్ 101 బంతులు ఎదుర్కొన్నాడు. వీరిద్దరు ఐదో వికెట్‌కు అభేద్యంగా 80 పరుగులు జోడించారు. ఇరు జట్ల మధ్య రెండో టెస్టు బుధవారం(మార్చి 16) నుంచి బ్రిడ్జ్‌టౌన్‌లో జరుగనుంది. ఇక ఈ మ్యాచ్ పాత జట్టుతోనే బరిలోకి దిగుతామని విండీస్ సెలక్టర్ డెస్మండ్ హేన్స్ స్పష్టం చేశాడు. మొదటి టెస్టు జట్టులో భాగమైన 13 మంది ఆటగాళ్లను కొనసాగిస్తామని తెలిపాడు. ఇక ఈ మ్యాచ్‌లో అద్భుతంగా రాణించిన బానర్‌పై హేన్స్ ప్రశంసలు కురిపించాడు. అతడి ఆట తీరు పూర్తి సంతృప్తినిచ్చిందని పేర్కొన్నాడు. కాగా ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 355 బంతుల్లో 123 పరుగులు సాధించిన బానర్.. రెండో ఇన్నింగ్స్‌లో 38 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇంగ్లండ్‌తో రెండో టెస్టుకు వెస్టిండీస్ జట్టు: క్రెయిగ్ బ్రాత్‌వైట్(కెప్టెన్), బ్లాక్‌వుడ్(వైస్ కెప్టెన్), ఎన్క్రుమా బానర్, బ్రూక్స్, జాన్ కాంప్‌బెల్, జాషువా డి సిల్వా, జేసన్ హోల్డర్, అల్జారి జోసెఫ్, కైలీ మేయర్స్, వీరసామి పెరుమాల్, ఆండర్సన్ ఫిలిప్, కేమార్ రోచ్, జేడెన్ సీల్స్. కాగా భారత సంతతికి చెందిన వీరసామికి ఈ జట్టులో చోటు దక్కడం గమనార్హం. తొలి టెస్టు తుదిజట్టులో భాగమైన ఈ లెష్టార్మ్ స్పిన్నర్ 87 బంతులు ఎదుర్కొని 26 పరుగులతో అజేయంగా నిలిచాడు. చదవండి: IND VS SL 2nd Test Day 2: శ్రేయస్ అయ్యర్ ఖాతాలో మరో రికార్డు This kind of resilience is priceless! Nkrumah Bonner takes our #MastercardPricelessMoment of the 1st Test. #WIvENG pic.twitter.com/nM5Di0iCtq — Windies Cricket (@windiescricket) March 12, 2022 Draw! A patient day of Test cricket comes to an end.👏🏿 #WIvENG #MenInMaroon pic.twitter.com/1LsYMQn2YW — Windies Cricket (@windiescricket) March 12, 2022 -
పంజాబ్ కింగ్స్ ప్లేయర్ అజేయ శతకం.. బాధలో ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్
ఆంటిగ్వా : మంగళవారం వెస్టిండీస్‌తో (మార్చి 8) ప్రారంభమైన తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్ మిడిలార్డర్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టో (109) అజేయ శతకంతో చెలరేగాడు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 48 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న దశలో బరిలోకి దిగిన బెయిర్‌స్టో.. బెన్ స్టోక్స్(36), బెన్ ఫోక్స్(42), క్రిస్ వోక్స్ (24 నాటౌట్)ల సహకారంతో బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడి జట్టును ఆదుకున్నాడు. ఈ క్రమంలో టెస్ట్‌ల్లో ఎనిమిదో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ ఇన్నింగ్స్‌లో 216 బంతులు ఎదుర్కొన్న బెయిర్ స్టో 17 ఫోర్ల సాయంతో 109 పరుగులు చేశాడు. ఫలితంగా తొలి రోజు ఆట ముగిసే సమయానికి పర్యాటక జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 268 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది. ఇదిలా ఉంటే, బెయిర్‌స్టో సెంచరీతో చెలరేగడం చూసిన అతని మాజీ ఐపీఎల్ జట్టు (సన్‌రైజర్స్ హైదరాబాద్) అభిమానులు మాత్రం చాలా బాధపడుతున్నారు. ఇలాంటి ఆటగాడిని వదులుకున్నందుకు ఫ్రాంచైజీ యజమాని కావ్య మారన్‌పై మండిపడుతున్నారు. ఈ ఏడాది మెగా వేలంలో పస లేని ఆటగాళ్లను ఎంపిక చేసుకున్నారని సన్‌రైజర్స్ యాజమాన్యంపై ఫైరవుతున్నారు. కాగా, ఎస్ఆర్హెచ్ వదిలించుకున్న బెయిర్‌స్టోను మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ రూ. 6 .75 కోట్లకు దక్కించుకుంది. బెయిర్‌స్టో తాజా శతకంతో ఓవైపు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ బాధపడుతుండగా, మరోవైపు పంజాబ్ కింగ్స్ అభిమానులు సంబురాలు చేసుకుంటున్నారు. కాగా, ఇంగ్లండ్ స్టార్ ప్లేయరైన బెయిర్‌స్టోకు ఐపీఎల్లో ఘనమైన రికార్డే ఉంది. క్యాష్ రిచ్ లీగ్‌లో అతను 28 మ్యాచ్‌ల్లో 142 స్ట్రయిక్ రేట్‌తో పాటు 41.52 సగటున 1038 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, 7 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. చదవండి: ఢిల్లీ క్యాపిటల్స్‌కు భారీ షాక్.. సీజన్ మొత్తానికి దూరం కానున్న స్టార్ బౌలర్..! -
World Cup 2022: ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై విండీస్ విజయం
ఐసీసీ మహిళా వన్డే ప్రపంచకప్-2022లో భాగంగా వెస్టిండీస్ జట్టు ఇంగ్లండ్‌ను ఓడించింది. ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో ఏడు పరుగుల తేడాతో గెలుపొందింది. న్యూజిలాండ్ వేదికగా బుధవారం ఈ మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన వెస్టిండీస్ మహిళా జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు డియాండ్రా డాటిన్(31 పరుగులు), హేలే మాథ్యూస్(45 పరుగులు) శుభారంభం అందించినప్పటికీ.. వీరిద్దరు అవుటైన తర్వాత వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో బ్యాటింగ్‌కు దిగిన వికెట్ కీపర్ బ్యాటర్ కాంప్‌బెల్ 80 బంతుల్లో 66 సాధించగా.. చెడియన్ నేషన్ 49 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును మెరుగైన స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించారు. వెరసి నిర్ణీత 50 ఓవర్లలో విండీస్ 6 పరుగుల నష్టానికి 225 పరుగులు చేసింది. ఈ క్రమంలో లక్ష్య ఛేధనకు దిగిన ఇంగ్లండ్ మహిళా జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ లారెన్ విన్ఫీల్డ్ హిల్ 12 పరుగులకే పెవిలియన్ చేరింది. మరో ఓపెనర్ టామీ బీమౌంట్ మాత్రం 46 పరుగులతో ఫర్వాలేదనిపించింది. మిగతా బ్యాటర్లంతా తక్కువ స్కోర్లకే పరిమితమయ్యారు. అయితే, చివర్లో సోఫీ, కేట్ క్రాస్ హిట్టింగ్ ఆడటంతో ఇంగ్లండ్ శిబిరంలో గెలుపు ఆశలు చిగురించాయి. కానీ, విండీస్ బౌలర్లు వారి ఆశలపై నీళ్లు చల్లుతూ 218 పరుగులకే ఆలౌట్ చేశారు. దీంతో ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో విజయం వెస్టిండీస్‌ను వరించింది. గెలుపులో కీలక పాత్ర పోషించిన షిమేన్ కాంప్‌బెల్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఐసీసీ మహిళా వన్డే ప్రపంచకప్-2022 వెస్టిండీస్ వర్సెస్ ఇంగ్లండ్ స్కోర్లు: విండీస్- 225/6 (50 ఓవర్లు) ఇంగ్లండ్- 218 (47.4 ఓవర్లు) చదవండి: IPL 2022- CSK: సీఎస్కే అభిమానులకు గుడ్‌న్యూస్.. అతడు వచ్చేస్తున్నాడు! -
అనవసరంగా 20 పరుగులు.. సొంత జట్టుపై పొలార్డ్ అసహనం
ఇంగ్లండ్, వెస్టిండీస్‌ల మధ్య శనివారం నాలుగో టి20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 34 పరుగులుతో గెలిచి సిరీస్‌ను సమం చేసింది. ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో ఇరు జట్లు రెండు విజయాలతో సమానంగా ఉన్నాయి. టోర్నీ విజేత ఎవరో తేలాలంటే ఆఖరి మ్యాచ్ కీలకం కానుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. కెప్టెన్ మొయిన్ అలీ 63, జేసన్ రాయ్ 52 పరుగులతో రాణించారు. అనంతరం బ్యాటింగ్ చేసిన విండీస్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసి 34 పరుగులతో ఓటమి పాలైంది. చదవండి: కెరీర్ బెస్ట్ స్కోరు నమోదు.. చేదు అనుభవమే మిగిల్చింది మ్యాచ్ ఓటమి అనంతరం విండీస్ కెప్టెన్ పొలార్డ్ తన సొంతజట్టుపై అసహనం వ్యక్తం చేశాడు.'' ఇంగ్లండ్ వికెట్లు తీయడంలో మా బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారు. . ఇంగ్లండ్‌ను 160, 170లోపే కట్టడి చేయాలని భావించాం. చివరి ఓవర్లలో అనవసరంగా 20 పరుగులు ఇచ్చుకున్నాం. ఇంగ్లండ్ చివర్లో బాగా ఆడి తమ స్కోరును 190 దాటించింది. అదే మా కొంప ముంచింది. ఇక సిరీస్ గెలవాలంటే ఆఖరి మ్యాచ్ తప్పనిసరిగా గెలవాలి. మా శక్తి మేరకు ప్రయత్నిస్తాం'' అంటూ చెప్పుకొచ్చాడు. -
అండర్సన్.. ఎంతైనా నీకు నువ్వే సాటి
-
అండర్సన్.. ఎంతైనా నీకు నువ్వే సాటి
లండన్ : ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తోన్న సంగతి తెలిసిందే. క్రికెట్ సహా అన్ని రకాల ఆటలు స్తంభించిపోయాయి. ఇప్పుడిప్పుడే క్రీడలు ప్రారంభమైన ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్‌లు జరిగే అవకాశం ఉంది. ఇందులో క్రికెట్‌కు కూడా మినహాయింపు లేదనే చెప్పొచ్చు. ఇంతకుముందులా బ్యాట్స్‌మన్ ఔట్ ఐతే ఆటగాళ్లంతా ఒకదగ్గర చేరి అభినందించుకునేది కూడా చూడకపోవచ్చు. తాజాగా అలాంటి సన్నివేశాలే ఇంగ్లండ్ ఆటగాళ్ల మధ్య చోటుచేసుకున్నాయి. ('ఆ ఆలోచన సచిన్‌దే.. చాపెల్‌ది కాదు') కరోనా విరామం తర్వాత జూలై 8 నుంచి ఇంగ్లండ్- విండీస్‌ల మధ్య మూడు టెస్టుల సిరీస్ జరగనుంది. సౌతాంప్టన్ వేదికగా జూలై 8న ఇరు జట్ల మొదటి టెస్టు ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా ఇంగ్లండ్ ఆటగాళ్లు టీమ్ బట్లర్, టీమ్ స్టోక్స్‌గా విడిపోయి అగాస్ బౌల్ మైదానంలో మూడు రోజలు ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతున్నారు. డే 1 ఆటలో భాగంగా టీమ్ స్టోక్స్ తరపున ఇంగ్లండ్ స్టార్ పేసర్ జేమ్స్ అండర్సన్ హైలట్‌గా నిలిచాడు. మొదటిరోజు ఆటలో భాగంగా ఎక్కువ ఓవర్లు వేసిన అండర్సన్ ఓవర్‌కు 3 పరుగులు మాత్రమే ఇస్తూ రెండు కీలక వికెట్లు కూడా తీశాడు. అండర్సన్ మ్యాచ్ మధ్యలోనూ తన చర్యలతో ఆకట్టుకున్నాడు. అండర్సన్ తన బౌలింగ్‌లో వికెట్ పడినప్పుడు సహచర ఆటగాళ్ల వద్దకు వెళ్లి ఎలాంటి హగ్స్, చేతులు కలపడం వంటివి లేకుండా కేవలం భుజాలతోనే అభినందించుకున్నారు. అంతేగాక ఆటగాళ్లంతా భౌతిక దూరం పాటించడం విశేషం. మ్యాచ్ మధ్యలో అప్పుడప్పుడు మైదానం నలువైపులా ఏర్పాటు చేసిన సానిటైజర్స్‌ను ఉపయోగిస్తూ కనిపించాడు. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు వీడియోతో పాటు ఫోటలోను రిలీజ్ చేయడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కరోనా వైరస్ నేపథ్యంలో ఐసీసీ విధించిన గైడ్‌లైన్స్ పాటిస్తూనే ప్రాక్టీస్ మ్యాచ్‌ను కొనసాగించినట్లు ట్విటర్లో ఈసీబీ తెలిపింది. కాగా ప్రాక్టీస్ మ్యాచ్‌లో టీమ్ బట్లర్ జట్టు మొదటిరోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్లకు 287 పరుగులు చేసింది. కాగా విండీస్‌తో ఈ నెల 8న మొదలయ్యే మొదటి టెస్ట్‌కు రెగుల్యర్ కెప్టెన్ జో రూట్ అందుబాటులో ఉండటం లేదు. దీంతో ఇంగ్లండ్ బోర్డు స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌కు కెప్టెన్సీని అప్పగించింది. జోస్ బట్లర్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించింది. రూట్ భార్య వచ్చే వారం తమ రెండో బిడ్డకు జన్మనివ్వనుంది. ప్రస్తుతం జట్టుతో కలిసున్న రూట్ నేడు నేడు ట్రైనింగ్ క్యాంప్ వదిలి వెళ్లనున్నాడు. దీంతో ఇంగ్లండ్ టీమ్ తమలో తాము ఆడే వామప్‌తో పాటు ఫస్ట్ టెస్ట్‌కు దూరం కానున్నాడు. సెకండ్ టెస్ట్‌కు తిరిగి జట్టుతో కలుస్తాడు. -
16 ఏళ్లయినా ఆ రికార్డును కొట్టలేకపోయారు
సరిగ్గా 16 ఏళ్ల క్రితం ఇదే రోజు (ఏప్రిల్ 12, 2004)లో టెస్టు క్రికెట్ చరిత్రలో ఒక అద్భుతం చోటు చేసుకుంది. అప్పటివరకు టెస్టుల్లో డబుల్, ట్రిపుల్ సెంచరీలు సాధించడమే రికార్డుగా ఉండేది. కానీ ఒక్కడు మాత్రం ఎవరు ఊహించని రీతిలో క్వాడ్రపుల్ సెంచరీ(400* పరుగులు) నమోదు చేసి తన పేరును చరిత్ర పుటల్లో లిఖించుకున్నాడు. ఇప్పటికి ఆ రికార్డు సాధించి పదహారేళ్లు అవుతున్నా దాన్ని ఎవరు బద్దలు కొట్టలేకపోయారు. ఆ రికార్డును సాధించిన ఆటగాడెవరో ఈ పాటికే మీకు అర్థమయిందని అనుకుంటున్నాం. ఆ ఆటగాడు మరెవరో కాదు.. వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా. అంతకుముందు వరకు ఆస్ట్రేలియాకు చెందిన దిగ్గజ బ్యాట్స్‌మెన్ గ్యారీ సోబర్స్ పేరిట ఉన్న అత్యధిక పరుగుల రికార్డును పదేళ్ల తర్వాత లారా 375 పరుగులతో అధిగమించాడు. అయితే లారా చేసిన 375 పరుగుల రికార్డును బ్రేక్ చేస్తూ ఆస్ట్రేలియా నుంచి మాథ్యూ హెడెన్ 2003లో జింబాబ్వేపై 380 పరుగులు చేసి టెస్టుల్లో అత్యధిక పరుగుల చేసిన ఆటగాడిగా గుర్తింపు పొందాడు. (ఆ చీకటి రోజుకు సరిగ్గా 20 ఏళ్లు) అయితే ఏడాది తిరగకుండానే హెడెన్ పేరిట ఉన్న అత్యధిక పరుగుల రికార్డును లారా సవరించడమే గాక టెస్టుల్లో అనితరసాధ్యమైన (400 నాటౌట్) సాధించాడు. లారా రికార్డును అందుకోవాలని చాలా మంది ఆటగాళ్లు ప్రయత్నించారు. ఇక భారత్ నుంచి రెండు ట్రిపుల్ సెంచరీలు సాధించిన విధ్వంసక ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ క్వాడ్రపుల్ సెంచరీని మాత్రం సాధించలేకపోయాడు. అప్పటినుంచి ఈ 400 పరుగుల రికార్డు అలాగే ఉండిపోయింది. అయితే ఈ ఇన్నింగ్స్‌కు 16 ఏళ్లు నిండడంతో మరోసారి ఆ విశేషాలు మరోసారి గుర్తుచేసుకుందాం. 2004 ఏప్రిల్‌లో ఇంగ్లండ్ జట్టు వెస్టిండీస్‌లో పర్యటించింది. నాలుగు టెస్టు సిరీస్‌లో భాగంగా మొదటి మూడు మ్యాచ్‌ల్లో లారా ఘోరంగా విఫలమయ్యాడు. 3 టెస్టుల్లో కలిపి కేవలం 100 పరుగులు చేయడంతో లారా ఫామ్‌పై అతని అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. సెయింట్ జాన్స్ స్టేడియం వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో మాత్రం క్రికెట్ చరిత్రలో ఎవరు అందుకోలేని 400 పరుగుల రికార్డును సాధించి తనపై ఉన్న అనుమానాలను పటాపంచలు చేశాడు. మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 582 బంతులు ఎదుర్కొన్న లారా ఏకంగా 43 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 400 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. లారా భారీ ఇన్నింగ్స్‌తో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 751/5 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 285 పరుగులకే ఆలౌటై.. ఫాలో ఆన్ ఆడినా ఓటమి నుంచి గట్టెక్కింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆ జట్టు 422/5 రాణించడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. (‘ఇమ్రాన్ కంటే భారత్ గురించే ఎక్కువ తెలుసు’) లారా వ్యక్తిగత రికార్డు కోసం తొలి ఇన్నింగ్స్‌ను మూడు రోజుల పాటు కొనసాగించడంపై అప్పట్లో తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. జట్టుకు విజయం అందించాలనేది పక్కనపెట్టి కేవలం తన రికార్డుల కోసం ఆరాటపడ్డాడనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. విండీస్.. తమ సొంతగడ్డపై జరిగిన నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో 0-3తో ఇంగ్లండ్ చేతిలో ఓడిపోయింది. అయితే నాలుగోటెస్టులో మాత్రం లారా ఇన్నింగ్స్‌తో డ్రాగా ముగిసింది. లారా ఆటతీరుపై ఎన్ని వివాదాలు ఉన్నప్పటికి అతను చేసిన 400 పరుగుల రికార్డు 16 ఏళ్లయినా బద్దలు కాకపోవడమనేది ప్రత్యేకంగా నిలుస్తుంది. అయితే లారా రికార్డును ఎవరు బ్రేక్ చేస్తారనేది వేచి చూద్దాం. -
వెస్టిండీస్ మురిసే.. స్టోక్స్ ఏడిచే
లక్ష్యం 156 పరుగులు.. 107 పరుగులకే ఆరు వికెట్లు.. ఊరిస్తున్న లక్ష్యం..అడుగు దూరంలో ప్రపంచకప్.. బంతులా లేక బుల్లెట్లా అన్నట్లు ప్రత్యర్థి బౌలింగ్.. ఇది వెస్టిండీస్ పరిస్థితి. అయితే ఎవరూ ఊహించని విధంగా మహాఅద్భుతం జరిగింది. కాదు మహాద్భుతం జరిగేలా చేశాడు. అతడే కార్లోస్ బ్రాత్‌వైట్. ఆశలు చనిపోయిన స్థితి నుంచి ప్రతీ ఒక్క కరేబియన్ అభిమాని కాలర్ ఎగరేశాలా చేశాడు. అయితే బ్రాత్‌వైట్ ధాటికి బలైన బౌలర్ మాత్రం కొన్ని రోజులు నిద్రలేని రాత్రులు గడిపాడు. అతడే బెన్ స్టోక్స్. అభిమానులకు అసలు సిసలైన టీ20 మజాను అందించిన ఈ మ్యాచ్‌కు కోల్‌కతాలోని ఈడెన్‌గార్డెన్స్ వేదికైంది. ఆ మహా సమరం జరిగింది ఇదే రోజు. ఈ సందర్భంగా టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌కు సంబంధించిన విశేషాలు మీకోసం.. సెమీఫైనల్లో టీమిండియాపై గెలిచి రెట్టింపు ఉత్సాహంతో ఫైనల్లో ఇంగ్లండ్ పోరుకు వెస్టిండీస్ సిద్దమైంది. టాస్ గెలిచిన విండీస్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. జాసర్ రాయ్(0), అలెక్స్ హేల్స్(1), ఇయాన్ మోర్గాన్(5)లు ఘోరంగా నిరుత్సాహపరచడంతో బ్రిటీష్ జట్టు కష్టాల్లో పడింది. ఈ క్రమంలో జోయ్ రూట్(54) బాధ్యతాయుతంగా ఆడాడు. రూట్‌కు తోడు బట్లర్(36) ఫర్వాలేదనిపించాడు. చివర్లో డేవిడ్ విల్లీ(21) మెరుపులు మెరిపించడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. విండీస్ బౌలర్లలో బ్రావో, బ్రాత్‌వైట్ తలో మూడు వికెట్లు పడగొట్టగా.. బద్రీ రెండు వికెట్లు దక్కించుకున్నాడు. శాముల్స్ ఒకేఒక్కడు.. ఇంగ్లండ్ విధించిన 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కరేబియన్ జట్టుకు ఇంగ్లండ్ ఆదిలోనే షాక్ ఇచ్చింది. చార్లెస్(1), గేల్(4), సిమ్మన్స్(0) రస్సెల్(1), డారెన్ సామీ(2)లను వరుసగా పెవిలియన్‌కు పంపించి విండీస్‌ను పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే ఈ కష్టకాలంలో సీనియర్ బ్యాట్స్‌మన్ శాముల్స్(85నాటౌట్) ఒకే ఒక్కడు నిలబడ్డాడు. ఓ వైపు వరుసగా వికెట్లు పడుతున్నా మరోవైపు ఒంటిరి పోరాటం చేశాడు. శాముల్స్కు బ్రావో(25) చక్కటి సహకారం అందించినా చివరి వరకు నిలబడలేకపోయాడు. అయితే రన్‌రేట్ పెరిగిపోతుండటంతో విండీస్ గెలుపు ఆశలు సన్నగిల్లాయి. బ్రాత్‌వైట్ విధ్వంసం 12 బంతుల్లో 27 పరుగులు చేయాల్సిన సమయంలో క్రిస్ జోర్డాన్ వేసిన 19వ ఓవర్లో శాముల్స్, బ్రాత్‌వైట్‌లు తడబడ్డారు. దీంతో ఆ ఓవర్లో 8 పరుగులు మాత్రమే వచ్చాయి. దీంతో చివరి ఓవర్లో విండీస్ విజయానికి 19 పరుగులు అవసరమయ్యాయి. ఈ క్రమంలో బెన్ స్టోక్స్ వేసిన చివరో ఓవర్లో బ్రాత్‌వైట్ విధ్వంసం సృష్టించాడు. వరుసగా నాలుగు బంతులను భారీ సిక్సర్లుగా మలచి విండీస్‌కు విజయాన్ని, ప్రపంచకప్‌ను అందించిపెట్టాడు. బ్రాత్‌వైట్(34 నాటౌట్) వరుసగా సిక్సర్లు కొట్టడంతో షాక్‌కు గురైన బెన్ స్టోక్స్ మైదానంలో కన్నీటిపర్యంతమయ్యాడు. ఇలా ఎన్నో విశేషాలు కలిగిన ఈ ప్రపంచకప్ ఫైనల్ జరిగింది ఇదే రోజు కావడంతో ఐసీసీ ట్వీట్ చేసింది. అంతేకాకుండా బ్రాత్‌వైట్ సిక్సర్లకు సంబంధించిన వీడియోనూ సైతం పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. #OnThisDay in 2016, West Indies became double @T20WorldCup champions! 🏆 They first beat 🇦🇺 by eight wickets in the women's final, before the men trumped 🏴 by four wickets in a finale which has been quoted many times since 👇 pic.twitter.com/qDW4WkpwtC — ICC (@ICC) April 2, 2020 చదవండి: ఆమెకు పెద్ద ఫ్యాన్ అయిపోయాను ఏంటి నీ వేషాలు.. కోహ్లితో చెప్పాలా? -
టీ20 చరిత్రలో ఇంత ఘోర ఓటమా!
సెయింట్ లూసియా : దనాదన్ క్రికెట్‌కు కేరాఫ్ అడ్రస్ అయిన వెస్టిండీస్ జట్టు ఇంగ్లండ్‌పై ఘోర ఓటమి చవిచూసింది. అసలు ఆడింది డిఫెండింగ్ చాంపియన్ విండీస్ జట్టేనా అని అనుమానం కలిగించేలా ఇంగ్లండ్‌పై అతి చెత్తగా ఆడారు. ఇంగ్లండ్ నిర్దేశించిన 184 పరుగుల లక్ష్యాన్ని చేదించే క్రమంలో కరీబియన్ జట్టు 45 పరుగులకే కుప్పకూలింది. దీంతో 137 పరుగుల భారీ తేడాతో ఓటమి చవిచూసి ఇంగ్లండ్‌కు టీ20 సిరీస్‌ను అప్పగించింది. టీ20 చరిత్రలోనే ఇది రెండో అత్యల్ప స్కోరు కావడం గమనార్హం. గతంలో పసికూన నెదర్లాండ్‌ను శ్రీలంక 39 పరుగులకే ఆలౌట్ చేసింది. అయితే టెస్టు జట్టు హోదాలేని నెదర్లాండ్ చేసిన చెత్త ప్రదర్శన కన్నా టీ20 డిఫెండింగ్ చాంపియన్ విండీస్ తాజా ప్రదర్శనే అతి ఘోరమైనదని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లండ్‌కు శుభారంభం అందలేదు. అయితే జోయ్ రూట్(55) బాధ్యాతయుతంగా ఆడాడు. చివర్లో బిల్లింగ్స్ (87; 47 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్కర్లు) బ్యాట్ ఝుళిపించడంతో ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 182 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన విండీస్ జట్టు ఘోరంగా తడబడింది. క్రిస్ జోర్డాన్(4/6), విల్లే(2/18), రషీద్(2/12), ప్లంకెట్(2/8)లు కరేబియన్ పతనాన్ని శాసించారు. ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి హెట్మేర్(10), బ్రాత్‌వైట్(10)లు తప్ప మిగతా బ్యాట్స్‌మెన్ రెండంకెల స్కోర్ చేయలేకపోయారు. దీంతో 11.5 ఓవర్లలో 45 పరుగులకే ఆలౌటై విండీస్ ఘోర ఓటమి చవిచూసింది. ఫలితంగా ఇంగ్లండ్ సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. ఇరుజట్ల మధ్య జరిగిన తొటి టీ20లో ఇంగ్లండ్ విజయం సాధించిన విషయం తెలిసిందే.