ఆంటిగ్వా : మంగళవారం వెస్టిండీస్‌తో (మార్చి 8) ప్రారంభమైన తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్ మిడిలార్డర్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టో (109) అజేయ శతకంతో చెలరేగాడు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 48 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న దశలో బరిలోకి దిగిన బెయిర్‌స్టో.. బెన్ స్టోక్స్(36), బెన్ ఫోక్స్(42), క్రిస్ వోక్స్ (24 నాటౌట్)ల సహకారంతో బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడి జట్టును ఆదుకున్నాడు.
ఈ క్రమంలో టెస్ట్‌ల్లో ఎనిమిదో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ ఇన్నింగ్స్‌లో 216 బంతులు ఎదుర్కొన్న బెయిర్ స్టో 17 ఫోర్ల సాయంతో 109 పరుగులు చేశాడు. ఫలితంగా తొలి రోజు ఆట ముగిసే సమయానికి పర్యాటక జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 268 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది.
ఇదిలా ఉంటే, బెయిర్‌స్టో సెంచరీతో చెలరేగడం చూసిన అతని మాజీ ఐపీఎల్ జట్టు (సన్‌రైజర్స్ హైదరాబాద్) అభిమానులు మాత్రం చాలా బాధపడుతున్నారు. ఇలాంటి ఆటగాడిని వదులుకున్నందుకు ఫ్రాంచైజీ యజమాని కావ్య మారన్‌పై మండిపడుతున్నారు. ఈ ఏడాది మెగా వేలంలో పస లేని ఆటగాళ్లను ఎంపిక చేసుకున్నారని సన్‌రైజర్స్ యాజమాన్యంపై ఫైరవుతున్నారు.
కాగా, ఎస్‌ఆర్‌హెచ్ వదిలించుకున్న బెయిర్‌స్టోను మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ రూ. 6 .75 కోట్లకు దక్కించుకుంది. బెయిర్‌స్టో తాజా శతకంతో ఓవైపు ఎస్‌ఆర్‌హెచ్ ఫ్యాన్స్ బాధపడుతుండగా, మరోవైపు పంజాబ్ కింగ్స్ అభిమానులు సంబురాలు చేసుకుంటున్నారు. కాగా, ఇంగ్లండ్ స్టార్ ప్లేయరైన బెయిర్‌స్టోకు ఐపీఎల్‌లో ఘనమైన రికార్డే ఉంది. క్యాష్ రిచ్ లీగ్‌లో అతను 28 మ్యాచ్‌ల్లో 142 స్ట్రయిక్ రేట్‌తో పాటు 41.52 సగటున 1038 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, 7 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
చదవండి: ఢిల్లీ క్యాపిటల్స్‌కు భారీ షాక్.. సీజన్ మొత్తానికి దూరం కానున్న స్టార్ బౌలర్..!
Comments
Please login to add a commentAdd a comment