Johnny Bairstow
-
Virender Sehwag: కోహ్లితో ఫైట్.. దంచికొట్టిన బెయిర్ స్టో.. సెహ్వాగ్ ట్రోలింగ్!
భారత్‌తో ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో ఆదిలోనే కీలకమైన వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడిన ఇంగ్లండ్‌ను స్టార్ బ్యాటర్ జానీ బెయిర్ స్టో ఆదుకున్నాడు. తన ఫామ్‌ను కొనసాగిస్తూ (140 బంతుల్లో 106; ఫోర్లు 14, సిక్సర్లు 2) చేశాడు. అయితే, మహ్మద్ షమీ వేసిన 32 ఓవర్లో కోహ్లి, బెయిర్‌స్టో మధ్య మాటల యుద్ధం నడిచింది. షమీ బౌలింగ్‌లో బెయిర్‌స్టో ఆడటానికి కొంత ఇబ్బంది పడ్డాడు. ఈ క్రమంలో స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న విరాట్ కోహ్లి అతన్ని చూసి నవ్వుకున్నాడు. ‘సౌథీ కంటే షమీ వేగంగా బంతులు వేస్తున్నాడు కదా’ అని కామెంట్ చేశాడు. అంతటితో ఆగకుండా ‘నీకు బాల్ తప్ప అన్నీ స్పష్టంగా కనిపిస్తాయ్’ అంటూ కోహ్లి సెడ్జింగ్ చేశాడు. దీనిపై బెయిర్‌స్టో స్పందించాడు. కోహ్లిని కూడా ఏదో అన్నాడు. విషయం ముదిరి కాసేపు ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఫీల్డ్ అంపైర్‌తో పాటు ఇంగ్లండ్ కెప్టెన్ బెన్‌స్టోక్స్ కలగజేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది. ఆ సమయానికి బెయిర్ స్టో 60 బంతుల్లో 13 పరుగులు మాత్రమే చేశాడు. చదవండి👉🏻బెయిర్ స్టో రికార్డులు! ఒకటి కాదు.. రెండు కాదు.. వరుసగా మూడో సెంచరీ! ఈ ఘటనపై టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తనదైన శైలిలో కోహ్లికి చురకలు అంటించాడు. పుజారా తరహా నింపాదిగా ఆడుతున్న బెయిర్ స్టోను అనవసరంగా గెలికాడని, దాంతో ఇంగ్లిష్ బ్యాటర్ పంత్ మాదిరిగా రెచ్చిపోయాడని ట్విటర్లో పేర్కొన్నాడు. కోహ్లితో గొడవకు ముందు బెయిర్ స్టో స్ట్రయిక్ రేట్ 21 ఉండగా.. దాని తర్వాత అతని స్ట్రయిక్ రేట్ అమాంతం 150 కి పెరిగిందని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. చదవండి👉🏻ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్.. టీమిండియాకు గుడ్ న్యూస్..! Jonny Bairstow's Strike Rate before Kohli's Sledging -: 21 Post Sledging - 150 Pujara ki tarah khel rahe thhey, Kohli ne Pant banwa diya bewajah sledge karke #IndvsEng — Virender Sehwag (@virendersehwag) July 3, 2022 It's tense out there between Virat Kohli and Jonny Bairstow 😳#ENGvIND pic.twitter.com/3lIZjERvDW — Sky Sports Cricket (@SkyCricket) July 3, 2022 -
వారెవ్వా బెయిర్ స్టో! ఒకటి కాదు.. రెండు కాదు.. వరుసగా మూడో సెంచరీ!
11 ఓవర్లు ముగిసేసరికి 44 పరుగులకే కీలకమైన మూడు వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడిన ఇంగ్లండ్‌ను స్టార్ బ్యాటర్ జానీ బెయిర్ స్టో ఆదుకున్నాడు. భారీ స్కోరుతో ఆదిత్య జట్టును బెంబేత్తించిన ప్రత్యర్థికి తన ఫామ్‌ను కొనసాగిస్తూ కొరకరాని కొయ్యగా మారాడు. 119 బంతుల్లో 100 పరుగులు పూర్తి చేసుకున్నాడు. బిల్లింగ్స్‌తో కలిసి 80 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన బెయిర్ స్టో తాజా సెంచరీతో పలురికార్డులు సాధించాడు. 2016 అనంతరం టీమిండియాపై అత్యంత వేగంగా సెంచరీ పూర్తి చేసుకున్న ఆటగాడిగా నిలిచాడు. అయితే, 55 వ ఓవర్ మొదటి బంతికి షమీ బౌలింగ్‌లో బెయిర్ స్టో (140 బంతుల్లో 106; ఫోర్లు 14, సిక్సర్లు 2) కోహ్లికి ఫస్ట్ స్లిప్‌లో క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. జట్టును కష్ట సమయంలో ఆదుకున్న అతడికి సహచర ఆటగాళ్లు స్టాండింగ్ ఓవెషన్ ఇచ్చారు. సెంచరీల వరద గత రెండు టెస్టు మ్యాచుల్లోనూ బెయిర్ స్టో పరుగుల వరద పారించాడు. ట్రెంట్ బ్రిడ్జ్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 మరియు 136 పరుగులు చేశాడు. అదే న్యూజిలాండ్‌తో హెడింగ్లీలో జరిగిన మ్యాచ్‌లో 162 మరియు 71 పరుగులతో చెలరేగిపోయాడు. ఎడ్జ్‌బాస్టన్‌లో భారత్‌తో మ్యాచులోనూ సెంచరీతో ఆకట్టుకున్నాడు. బెయిర్ స్టోకి టెస్టుల్లో ఇది 11వ సెంచరీ కావడం విశేషం. వరుసగా మూడు టెస్టుల్లో 100 పరుగులు చేసిన ఇంగ్లండ్ 15 వ ఆటగాడిగా బెయిర్ స్టో రికార్డు నెలకొల్పాడు. క్లార్క్ తర్వాత బెయిర్ స్టో! ఐదో స్థానంలో లేదా అంతకంటే తక్కువ స్థానంలో ఒక క్యాలెండర్ ఇయర్లో ఐదు లేదా అంతకంటే ఎక్కువ సెంచరీలు చేసిన రెండో ఆటగాడిగా బెయిర్ స్టో నిలిచాడు. 2012లో ఆస్ట్రేలియా ఆటగాడు మైకేల్ క్లార్క్ ఐదు సెంచరీలు చేశాడు. -
పంజాబ్ కింగ్స్ ప్లేయర్ అజేయ శతకం.. బాధలో ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్
ఆంటిగ్వా : మంగళవారం వెస్టిండీస్‌తో (మార్చి 8) ప్రారంభమైన తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్ మిడిలార్డర్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టో (109) అజేయ శతకంతో చెలరేగాడు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 48 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న దశలో బరిలోకి దిగిన బెయిర్‌స్టో.. బెన్ స్టోక్స్(36), బెన్ ఫోక్స్(42), క్రిస్ వోక్స్ (24 నాటౌట్)ల సహకారంతో బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడి జట్టును ఆదుకున్నాడు. ఈ క్రమంలో టెస్ట్‌ల్లో ఎనిమిదో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ ఇన్నింగ్స్‌లో 216 బంతులు ఎదుర్కొన్న బెయిర్ స్టో 17 ఫోర్ల సాయంతో 109 పరుగులు చేశాడు. ఫలితంగా తొలి రోజు ఆట ముగిసే సమయానికి పర్యాటక జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 268 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది. ఇదిలా ఉంటే, బెయిర్‌స్టో సెంచరీతో చెలరేగడం చూసిన అతని మాజీ ఐపీఎల్ జట్టు (సన్‌రైజర్స్ హైదరాబాద్) అభిమానులు మాత్రం చాలా బాధపడుతున్నారు. ఇలాంటి ఆటగాడిని వదులుకున్నందుకు ఫ్రాంచైజీ యజమాని కావ్య మారన్‌పై మండిపడుతున్నారు. ఈ ఏడాది మెగా వేలంలో పస లేని ఆటగాళ్లను ఎంపిక చేసుకున్నారని సన్‌రైజర్స్ యాజమాన్యంపై ఫైరవుతున్నారు. కాగా, ఎస్ఆర్హెచ్ వదిలించుకున్న బెయిర్‌స్టోను మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ రూ. 6 .75 కోట్లకు దక్కించుకుంది. బెయిర్‌స్టో తాజా శతకంతో ఓవైపు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ బాధపడుతుండగా, మరోవైపు పంజాబ్ కింగ్స్ అభిమానులు సంబురాలు చేసుకుంటున్నారు. కాగా, ఇంగ్లండ్ స్టార్ ప్లేయరైన బెయిర్‌స్టోకు ఐపీఎల్లో ఘనమైన రికార్డే ఉంది. క్యాష్ రిచ్ లీగ్‌లో అతను 28 మ్యాచ్‌ల్లో 142 స్ట్రయిక్ రేట్‌తో పాటు 41.52 సగటున 1038 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, 7 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. చదవండి: ఢిల్లీ క్యాపిటల్స్‌కు భారీ షాక్.. సీజన్ మొత్తానికి దూరం కానున్న స్టార్ బౌలర్..! -
ఆ మూడు ఐపీఎల్ జట్లకు భారీ షాక్.. ముగ్గురు స్టార్ ఆటగాళ్లు దూరం
దుబాయ్: సెప్టెంబరు 19 నుంచి ప్రారంభంకానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 రెండో దశ మ్యాచ్‌లు కళ తప్పనున్నాయా అంటే అవుననే అంటున్నాయి ఇంగ్లీష్ మీడియా కథనాలు. వివరాల్లోకి వెళితే.. వివిధ ఫ్రాంచైజీలకు చెందిన ముగ్గురు ఇంగ్లండ్ స్టార్ ఆటగాళ్లు క్యాష్ రిచ్ లీగ్‌కు దూరం కానున్నట్లు బ్రిటీష్ మీడియా వరుస కథనాలు ప్రసారం చేస్తుంది. సన్‌రైజర్స్ కీలక ఆటగాడు జానీ బెయిర్‌స్టో, పంజాబ్ కింగ్స్ ఆటగాడు డేవిడ్ మలాన్, ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు క్రిస్ వోక్స్.. మలిదశ ఐపీఎల్‌కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. త్వరలో జరుగనున్న టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని సదరు ఆటగాళ్లు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి ఈ విషయానికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల కాలేదు. ఆటగాళ్ల గైర్హాజరీపై ఆయా ఫ్రాంచైజీల యాజమాన్యాలు స్పందిచాల్సి ఉంది. కాగా, ఇదివరకే పలువురు ఇంగ్లండ్ స్టార్ ఆటగాళ్లు వివిధ కారణాల చేత లీగ్ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. రాజస్థాన్ రాయల్స్‌కు చెందిన జోస్ బట్లర్, జోఫ్రా ఆర్చర్, బెన్ స్టోక్స్ ఐపీఎల్‌కు అందుబాటులో ఉండమని ప్రకటించారు. మొత్తంగా మలిదశ ఐపీఎల్లో ఇంగ్లండ్ ఆటగాళ్ల మెరుపులు లేకపోవడంతో లీగ్ కళ తప్పనుందని అభిమానులు నిరాశ చెందుతున్నారు. చదవండి: ఈసారి టైటిల్ నెగ్గేది మేమే: డీసీ స్టార్ ప్లేయర్ -
డేవిడ్ వార్నర్ @ 50-50
ఢిల్లీ: ఐపీఎల్లో డేవిడ్ వార్నర్ 50 ఆఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో ఈ ఘనత సాధించిన మొదటి వ్యక్తి అతడే. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో వార్నర్ (52) ఆఫ్ సెంచరీ చేయడం ద్వారా ఈ రికార్డు సాధించాడు. అంతేకాదు పంజాబ్‌తో ఆడిన గత తొమ్మిది మ్యాచుల్లో వార్నర్ ఆఫ్ సెంచరీ చేయడం విశేషం. కాగా పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ 69 పరుగుల తేడాతో విజయం సాధించి పాయింట్ల పట్టికలో మూడు స్థానానికి చేరుకుంది. ఆఫ్ సెంచరీల జాబితాలో విరాట్ కోహ్లి (42), రోహిత్ శర్మ (39), రైనా (39), ఏబీ డివీలియర్స్ (38) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. హైదరాబాద్, పంజాబ్ మ్యాచ్ ద్వారా ఐపీఎల్ చరిత్రలో పలు రికార్డులు నమోదయ్యాయి. అవేంటో చూద్దామా... * హైదరాబాద్ కెప్టెన్‌గా వార్నర్ పంజాబ్ జట్టుపై వరుసగా ఏడు విజయాలు సాధించాడు. ఐపీఎల్లో ఒక జట్టుపై ఈ ఘనత సాధించిన మొదటి కెప్టెన్ వార్నర్. ఇంతకు ముందు సచిన్ టెండూల్కర్ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా ఉన్నప్పుడు కోలకతాపై ఆరు విజయాలు సాధించాడు. పంజాబ్‌పై విజయంతో వార్నర్ ఆ రికార్డును బద్దలుకొట్టాడు. * ఒక ఐపీఎల్ జట్టుపై అత్యధిక ఆఫ్ సెంచరీలు (11) చేయడమే కాకుండా, వరుసగా తొమ్మిది ఆఫ్ సెంచరీలు చేసిన రికార్డు కూడా వార్నర్ సొంతమైంది. * 150+ పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యం రెండు సార్లు సాధించిన రికార్డు వార్నర్, జానీ బెయిర్‌స్టోకే దక్కుతుంది. 2019లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో వీరిద్దరు ఓపెనర్లుగా 185 పరుగులు చేశారు. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 160 పరుగులు చేసి ఈ రికార్డు సాధించారు. * ఈ మ్యాచ్‌లో రషీద్ ఖాన్ కేవలం 12 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఐపీఎల్లో 12, అంత కంటే తక్కువ పరుగులు నాలుగు మ్యాచుల్లో ఇచ్చిన రికార్డు రషీద్‌తో పాటు డేల్ స్టెయిన్ కూడా ఉన్నాడు. కానీ రషీద్ కేవలం 52 మ్యాచుల్లో ఈ ఘనత సాధించాడు. స్టెయిన్ రషీద్ కంటే 42 మ్యాచులు ఎక్కువగా ఆడాడు. * వరుస మ్యాచుల్లో 150+ పరుగులు ఓపెనర్లకు సమర్పించుకున్న జట్టుగా పంజాబ్ నిలించింది. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో షేన్ వాట్సన్, ఫాఫ్ డూప్లెసిస్ ఇద్దరూ వికెట్ కోల్పోకుండా 179 ఛేదించారు. (ఇదీ చదవండి: వార్నర్.. నీ డ్యాన్స్ వీడియోలు పెట్టు: యువీ) -
హైదరాబాద్ క్లీన్‌బౌల్డ్
దుబాయ్: ప్రేక్షకులు లేరన్న లోటే ఉంది కానీ... ఐపీఎల్–2020 టోర్నీలో బోలెడంత థ్రిల్ రోజూ అందుతోంది. రెండో మ్యాచ్ ‘సూపర్’దాగా సాగితే... మూడో మ్యాచ్ ‘బౌల్డ్’ మలుపులు తిరిగింది. పటిష్టమనుకున్న స్కోరే తర్వాత పలుచన అయింది. సాఫీగా సాగుతున్న ఇన్నింగ్స్ సాగిలపడిపోయింది. సోమవారం జరిగిన పోరులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 10 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టును ఓడించి బోణీ కొట్టింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. ఓపెనర్ దేవ్‌దత్ పడిక్కల్ (42 బంతుల్లో 56; 8 ఫోర్లు), డివిలియర్స్ (30 బంతుల్లో 51; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలతో మెరిపించారు. లక్ష్యఛేదనకు దిగిన హైదరాబాద్ 19.4 ఓవర్లలో 153 పరుగుల వద్ద ఆలౌటైంది. బెయిర్‌స్టో (43 బంతుల్లో 61; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఒక్కడే అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ చహల్ 3 వికెట్లు తీశాడు. గాయాల తాకిడి కొనసాగింది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్‡్ష చీలమండ గాయంతో మైదానం వీడాడు. అదిరే ఆరంభం... బెంగళూరుకు ఓపెనర్లు దేవ్‌దత్, ఫించ్ (27 బంతుల్లో 29; 1 ఫోర్, 2 సిక్స్‌లు) అదిరే ఆరంభం ఇచ్చారు. భువనేశ్వర్ తొలి ఓవర్‌ను జాగ్రత్తగా ఎదుర్కొన్న దేవ్‌దత్ రెండో ఓవర్ నుంచే చెలరేగాడు. సందీప్ వేసిన ఆ ఓవర్లో 2 బౌండరీలు బాదిన దేవ్‌దత్... నటరాజన్ ఓవర్లో డోస్ పెంచాడు. వరుసగా మూడు ఫోర్లు కొట్టాడు. మరోవైపు ఫించ్... విజయ్ శంకర్ బౌలింగ్‌లో మిడ్ వికెట్ మీదుగా భారీ సిక్సర్ బాదడంతో జట్టు స్కోరు వేగంగా దూసుకెళ్లింది. రైజర్స్ కెప్టెన్ వార్నర్... రషీద్ ఖాన్‌ను ప్రయోగించినా లాభం లేకపోయింది. ఫించ్ వరుసగా 4, 6తో జోరు పెంచాడు. 10 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు 86/0తో ఉంది. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని ఎట్టకేలకు 11వ ఓవర్లో దేవ్‌దత్‌ను బౌల్డ్ చేయడం ద్వారా విజయ్ విడదీశాడు. ఆ మరుసటి ఓవర్ తొలి బంతికి ఫించ్‌ను అభిషేక్ ఎల్బీడబ్ల్యూ చేయడంతో వరుస బంతుల్లో ఓపెనర్లను కోల్పోయింది. డివిలియర్స్ ఫిఫ్టీ... కెప్టెన్ కోహ్లి, డివిలియర్స్ బెంగళూరు స్కోరును పెంచే పనిలో పడ్డారు. బంతుల్ని వృథా చేయకుండా సింగిల్స్, డబుల్స్‌తో చకచకా పరుగులు జతచేశారు. అయితే భారీ షాట్లకు ప్రయత్నిస్తుండగా కోహ్లి (14)) ఆటను నటరాజన్ ముగించాడు. తర్వాత ఆఖరి ఓవర్లలో డివిలియర్స్ మెరుపులు మెరిపించడంతో స్కోరు 150 పరుగులు దాటింది. సందీప్ శర్మ 19వ ఓవర్లో అతను ఎక్స్ట్రా కవర్లో రెండు వరుస సిక్సర్లు బాదాడు. చివరి ఓవర్లో ఏబీ రనౌట్ కావడంతో ఆశించిన పరుగులు రాలేదు. బౌలింగ్ వేస్తూ గాయపడిన మార్‡్ష మళ్లీ బ్యాటింగ్‌కు దిగినా బంతి ఆడేసరికే విలవిల్లాడాడు. రాణించిన బెయిర్‌స్టో... లక్ష్యఛేదనకు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ రెండో ఓవర్లోనే కెప్టెన్ వార్నర్ వికెట్‌ను కోల్పోయింది. బెయిర్‌స్టో కొట్టిన షాట్ ఉమేశ్ చేతికి తగిలి వికెట్లను గిరాటేయగా అప్పటికి వార్నర్ క్రీజు బయటే ఉండటంతో అతను రనౌట్‌గా వెనుదిరిగాడు. ఈ దశలో బెయిర్‌స్టోకు మనీశ్ పాండే జతయ్యాడు. ఇద్దరు అడపాదడపా బౌండరీలతో రన్‌రేట్ పడిపోకుండా సన్‌రైజర్స్ ఇన్నింగ్స్‌ను నడిపించారు. 6.2 ఓవర్లలో జట్టు స్కోరు 50 పరుగులు దాటింది. ఆ తర్వాత కూడా ఇద్దరు జాగ్రత్త ఆడటంతో పరుగుల రాక సాఫీగా సాగిపోయింది. సగం ఓవర్లు (10) ముగిసేసరికి 1 వికెట్ నష్టానికి 78 పరుగులతో పటిష్టంగానే ఉంది. అయితే తర్వాత మూడు ఓవర్లు కట్టుదిట్టగా వేయడంతో వేగం తగ్గింది. అంతలోనే మనీశ్ పాండే (33 బంతుల్లో 34; 3 ఫోర్లు, సిక్స్)ను చహల్ ఔట్ శాడు. కాసేపటికి ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో స్టెయిన్ క్యాచ్ చేజార్చడంతో బతికిపోయిన బెయిర్‌స్టో 37 బంతుల్లో (4 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధసెంచరీ సాధించాడు. ‘క్లీన్‌బౌల్డ్’ మలుపులు... అనుభవజ్ఞుడైన స్టెయిన్ బౌలింగ్‌లో రెండు బౌండరీలు బాదిన బెయిర్‌స్టో 13 పరుగులు పిండుకున్నాడు. 15వ ఓవర్ ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 121/2. ఇక ఆఖరి 30 బంతుల్లో 43 పరుగులు చేస్తే సరిపోతుంది. చేతిలో 8 వికెట్లు, క్రీజులో పాతుకుపోయిన బెయిర్‌స్టో ఉన్న హైదరాబాద్‌కు ఇదేమంత కష్టం కానేకాదు. కానీ చహల్ వేసిన 16వ ఓవర్ రైజర్స్‌నే కాదు మొత్తం ఆటనే మలుపు తిప్పింది. హైదరాబాద్ ఇన్నింగ్స్‌కు వెన్నెముకగా నిలిచిన బెయిర్‌స్టోను క్లీన్‌బౌల్డ్ చేసిన చహల్ ఆ మరుసటి బంతికే విజయ్ శంకర్నూ బౌల్డ్ చేయడంతో హైదరాబాద్‌కు అనూహ్య పతనం మొదలైంది. శివమ్ దూబే కూడా 17వ ఓవర్లో ప్రియమ్ గార్గ్ (12)ను బౌల్డ్ చేయగా... అభిషేక్ శర్మ (7) రెండో పరుగు తీసేక్రమంలో పిచ్ మధ్యలో రషీద్ ఖాన్‌ను ఢీకొట్టుకొని రనౌటయ్యాడు. దీంతో ఆ ఓవర్లో 2 వికెట్లు, సైనీ వేసిన 18వ ఓవర్లోనూ 2 వికెట్లు పడ్డాయి. భువీ (0)తో పాటు రషీద్ (6)లు కూడా క్లీన్‌బౌల్డ్ అయ్యారు. గాయపడిన మార్‡్ష (0) వచ్చీ రాగానే దూబే బౌలింగ్ కోహ్లికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 121/2తో పటిష్టంగా ఉన్న రైజర్స్ స్కోరు చూస్తుండగానే 143/9గా పతనమైంది. కేవలం 18 బంతుల వ్యవధిలోనే 7 వికెట్లను కోల్పోయింది. ఇందులో ఐదుగురు క్లీన్‌బౌల్డ్ కావడం విశేషం! దేవ్‌దత్ దూకుడు.... ఓ అంతర్జాతీయ స్టార్, ఆసీస్ కెప్టెన్ (ఫించ్)తో కలిసి ఇన్నింగ్స్ ఓపెన్ చేసిన దేవ్‌దత్ మెరిశాడు. తన తొలి ఐపీఎల్ మ్యాచ్‌లో క్రీజులో ఉన్నంతసేపు సన్‌రైజర్స్ బౌలర్లను చితక్కొట్టిన ఈ దేశవాళీ హీరో కోహ్లి సేనకు చక్కని ఆరంభాన్నిచ్చాడు. అతని షాట్లు మైదానంలోని అన్ని ప్లేసింగ్స్ను టచ్ చేశాయి. మిడ్ వికెట్, షార్ట్ ఫైన్, కవర్స్, ఎక్స్ట్రా కవర్, డీప్ స్క్వేర్ల మీదుగా బంతిని బౌండరీలకు తరలించిన తీరు ఆకట్టుకుంది. చూడచక్కని స్ట్రోక్ ప్లేతో స్కోరు బోర్డును బౌండరీలతో స్పీడెక్కించాడు. అతని జోరుకు అవతలి ఎండ్‌లో ఉన్న ఫించ్ కూడా అచ్చెరువొందాడు. ఎక్కువగా కుర్రాడికే స్ట్రయిక్ రొటేట్ చేయగా... దీన్ని అలవోకగా, అనుకూలంగా మార్చుకొని మరింతగా రెచ్చిపోయాడు. బెంగళూరు 5.2 ఓవర్లలో 50 పరుగులను చేరుకుంటే అందులో 36 పరుగులు దేవ్దత్వే! వ్యక్తిగతంగా తను 36 బంతుల్లో 8 ఫోర్లతో అర్ధసెంచరీని పూర్తి చేసుకున్నాడు. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: దేవ్‌దత్ (బి) విజయ్ 56; ఫించ్ ఎల్బీడబ్ల్యూ (బి) అభిషేక్ 29; కోహ్లి (సి) రషీద్ (బి) నటరాజన్ 14; డివిలియర్స్ (రనౌట్) 51; దూబే (రనౌట్) 7; ఫిలిప్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 163. వికెట్ల పతనం: 1–90, 2–90, 3–123, 4–162, 5–163. బౌలింగ్: భువనేశ్వర్ 4–0–25–0, సందీప్ 4–0–36–0, నటరాజన్ 4–0–34–1, మార్‡్ష 0.4–0–6–0, విజయ్ 1.2–0– 14–1, రషీద్ 4–0–31–0, అభిషేక్ 2–0–16–1. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: వార్నర్ (రనౌట్) 6; బెయిర్‌స్టో (బి) చహల్ 61; మనీశ్ పాండే (సి) సైనీ (బి) చహల్ 34; ప్రియమ్ గార్గ్ (బి) దూబే 12; విజయ్ (బి) చహల్ 0; అభిషేక్ (రనౌట్) 7; రషీద్ (బి) సైనీ 6; భువనేశ్వర్ (బి) సైనీ 0; సందీప్ శర్మ (సి) కోహ్లి (బి) స్టెయిన్ 9; మార్‡్ష (సి) కోహ్లి (బి) దూబే 0; నటరాజన్ (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (19.4 ఓవర్లలో ఆలౌట్) 153. వికెట్ల పతనం: 1–18, 2–89, 3–121, 4–121, 5–129, 6–135, 7–141, 8–142, 9–143, 10–153. బౌలింగ్: స్టెయిన్ 3.4–0–33–1, ఉమేశ్ 4–0–48–0, సైనీ 4–0–25–2, సుందర్ 1–0– 7–0, చహల్ 4–0–18–3, దూబే 3–0–15–2. -
ఇంగ్లండ్‌దే తొలి వన్డే
మాంచెస్టర్: వన్డే కెరీర్లో తొలి సెంచరీ సాధించిన జానీ బెయిర్‌స్టో (97 బంతుల్లో 100 నాటౌట్; 11 ఫోర్లు) ఇంగ్లండ్‌ను గెలిపించాడు. తొలి వన్డేలో ఇంగ్లండ్ 7 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌ను చిత్తు చేసింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1–0తో ముందంజ వేసింది. వర్షం కారణంగా 42 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో ముందుగా విండీస్ 42 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. కెప్టెన్ జేసన్ హోల్డర్ (41) టాప్ స్కోరర్‌గా నిలవగా... గేల్ (37), షై హోప్ (35) ఫర్వాలేదనిపించారు. స్టోక్స్‌కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం ఇంగ్లండ్ 30.5 ఓవర్లలో 3 వికెట్లకు 210 పరుగులు చేసింది. జో రూట్ (54) అర్ధ సెంచరీతో రాణించాడు. బెయిర్‌స్టో, రూట్ రెండో వికెట్‌కు 125 పరుగులు జోడించారు. మరోవైపు వెస్టిండీస్ ఓటమి శ్రీలంక జట్టుకు కలిసి వచ్చింది. 2019 ప్రపంచకప్‌నకు శ్రీలంక నేరుగా అర్హత పొందింది. ఇంగ్లండ్‌తో ఐదు వన్డేల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేస్తే లంకను వెనక్కినెట్టి విండీస్ ప్రపంచకప్‌కు వెళ్లేది.