భారత్‌తో ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో ఆదిలోనే కీలకమైన వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడిన ఇంగ్లండ్‌ను స్టార్ బ్యాటర్ జానీ బెయిర్ స్టో ఆదుకున్నాడు. తన ఫామ్‌ను కొనసాగిస్తూ (140 బంతుల్లో 106; ఫోర్లు 14, సిక్సర్లు 2) చేశాడు. అయితే, మహ్మద్ షమీ వేసిన 32 ఓవర్‌లో కోహ్లి, బెయిర్‌స్టో మధ్య మాటల యుద్ధం నడిచింది. షమీ బౌలింగ్‌లో బెయిర్‌స్టో ఆడటానికి కొంత ఇబ్బంది పడ్డాడు. ఈ క్రమంలో స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న విరాట్ కోహ్లి అతన్ని చూసి నవ్వుకున్నాడు.
‘సౌథీ కంటే షమీ వేగంగా బంతులు వేస్తున్నాడు కదా’ అని కామెంట్ చేశాడు. అంతటితో ఆగకుండా ‘నీకు బాల్ తప్ప అన్నీ స్పష్టంగా కనిపిస్తాయ్’ అంటూ కోహ్లి సెడ్జింగ్ చేశాడు. దీనిపై బెయిర్‌స్టో స్పందించాడు. కోహ్లిని కూడా ఏదో అన్నాడు. విషయం ముదిరి కాసేపు ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఫీల్డ్ అంపైర్‌తో పాటు ఇంగ్లండ్ కెప్టెన్ బెన్‌స్టోక్స్ కలగజేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది. ఆ సమయానికి బెయిర్ స్టో 60 బంతుల్లో 13 పరుగులు మాత్రమే చేశాడు.
చదవండి👉🏻బెయిర్ స్టో రికార్డులు! ఒకటి కాదు.. రెండు కాదు.. వరుసగా మూడో సెంచరీ!
ఈ ఘటనపై టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తనదైన శైలిలో కోహ్లికి చురకలు అంటించాడు. పుజారా తరహా నింపాదిగా ఆడుతున్న బెయిర్ స్టోను అనవసరంగా గెలికాడని, దాంతో ఇంగ్లిష్ బ్యాటర్ పంత్ మాదిరిగా రెచ్చిపోయాడని ట్విటర్‌లో పేర్కొన్నాడు. కోహ్లితో గొడవకు ముందు బెయిర్ స్టో స్ట్రయిక్ రేట్ 21 ఉండగా.. దాని తర్వాత అతని స్ట్రయిక్ రేట్ అమాంతం 150 కి పెరిగిందని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.
చదవండి👉🏻ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్.. టీమిండియాకు గుడ్ న్యూస్..!
Jonny Bairstow's Strike Rate before Kohli's Sledging -: 21
— Virender Sehwag (@virendersehwag) July 3, 2022
Post Sledging - 150
Pujara ki tarah khel rahe thhey, Kohli ne Pant banwa diya bewajah sledge karke #IndvsEng
It's tense out there between Virat Kohli and Jonny Bairstow 😳#ENGvIND pic.twitter.com/3lIZjERvDW
— Sky Sports Cricket (@SkyCricket) July 3, 2022
Comments
Please login to add a commentAdd a comment