sledging
-
Virender Sehwag: కోహ్లితో ఫైట్.. దంచికొట్టిన బెయిర్ స్టో.. సెహ్వాగ్ ట్రోలింగ్!
భారత్‌తో ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో ఆదిలోనే కీలకమైన వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడిన ఇంగ్లండ్‌ను స్టార్ బ్యాటర్ జానీ బెయిర్ స్టో ఆదుకున్నాడు. తన ఫామ్‌ను కొనసాగిస్తూ (140 బంతుల్లో 106; ఫోర్లు 14, సిక్సర్లు 2) చేశాడు. అయితే, మహ్మద్ షమీ వేసిన 32 ఓవర్లో కోహ్లి, బెయిర్‌స్టో మధ్య మాటల యుద్ధం నడిచింది. షమీ బౌలింగ్‌లో బెయిర్‌స్టో ఆడటానికి కొంత ఇబ్బంది పడ్డాడు. ఈ క్రమంలో స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న విరాట్ కోహ్లి అతన్ని చూసి నవ్వుకున్నాడు. ‘సౌథీ కంటే షమీ వేగంగా బంతులు వేస్తున్నాడు కదా’ అని కామెంట్ చేశాడు. అంతటితో ఆగకుండా ‘నీకు బాల్ తప్ప అన్నీ స్పష్టంగా కనిపిస్తాయ్’ అంటూ కోహ్లి సెడ్జింగ్ చేశాడు. దీనిపై బెయిర్‌స్టో స్పందించాడు. కోహ్లిని కూడా ఏదో అన్నాడు. విషయం ముదిరి కాసేపు ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఫీల్డ్ అంపైర్‌తో పాటు ఇంగ్లండ్ కెప్టెన్ బెన్‌స్టోక్స్ కలగజేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది. ఆ సమయానికి బెయిర్ స్టో 60 బంతుల్లో 13 పరుగులు మాత్రమే చేశాడు. చదవండి👉🏻బెయిర్ స్టో రికార్డులు! ఒకటి కాదు.. రెండు కాదు.. వరుసగా మూడో సెంచరీ! ఈ ఘటనపై టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తనదైన శైలిలో కోహ్లికి చురకలు అంటించాడు. పుజారా తరహా నింపాదిగా ఆడుతున్న బెయిర్ స్టోను అనవసరంగా గెలికాడని, దాంతో ఇంగ్లిష్ బ్యాటర్ పంత్ మాదిరిగా రెచ్చిపోయాడని ట్విటర్లో పేర్కొన్నాడు. కోహ్లితో గొడవకు ముందు బెయిర్ స్టో స్ట్రయిక్ రేట్ 21 ఉండగా.. దాని తర్వాత అతని స్ట్రయిక్ రేట్ అమాంతం 150 కి పెరిగిందని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. చదవండి👉🏻ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్.. టీమిండియాకు గుడ్ న్యూస్..! Jonny Bairstow's Strike Rate before Kohli's Sledging -: 21 Post Sledging - 150 Pujara ki tarah khel rahe thhey, Kohli ne Pant banwa diya bewajah sledge karke #IndvsEng — Virender Sehwag (@virendersehwag) July 3, 2022 It's tense out there between Virat Kohli and Jonny Bairstow 😳#ENGvIND pic.twitter.com/3lIZjERvDW — Sky Sports Cricket (@SkyCricket) July 3, 2022 -
'కోహ్లి స్లెడ్జింగ్ వేరే లెవెల్.. తలదించుకొనే బ్యాటింగ్ కొనసాగించా'
ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్ టీమిండియా మెషిన్ గన్ విరాట్ కోహ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లి స్లెడ్జింగ్ వేరే లెవెల్లో ఉంటుందని.. మనం తట్టుకోవడం కష్టమంటూ పేర్కొన్నాడు. గౌరవ్ కపూర్ నిర్వహించిన బ్రేక్‌ఫాస్ట్ విత్ చాంపియన్స్ యూట్యూబ్ షోలో సూర్యకుమార్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ 2020 సీజన్లో ముంబై ఇండియన్స్, ఆర్సీబీ మధ్య కీలకమైన ప్లేఆఫ్ మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్‌లో కోహ్లితో జరిగిన అనుభవాన్ని సూర్య ఆసక్తికరంగా చెప్పుకొచ్చాడు. ''165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగాం. అయితే రెండు వికెట్లు కోల్పోవడంతో మా చేజింగ్ కాస్త స్లోగా సాగుతుంది. ఎలాగైనా మ్యాచ్ గెలవాలనే పట్టుదలతో ఎవరు ఏం చేసినా నా బ్యాటింగ్ ఫోకస్‌ను కోల్పోకూడదని భావించాను. కానీ అప్పటి ఆర్సీబీ కెప్టెన్ కోహ్లి రూపంలో నాకు ఎదురుగా కనిపించాడు. గ్రౌండ్లో ఉంటే కోహ్లి ఎనర్జీ లెవెల్స్ వేరుగా ఉంటాయి. అతను పొరపాటు స్లెడ్జింగ్‌కు దిగాడో తట్టుకోవడం కష్టం. ఒక రకంగా కోహ్లికి ఎనర్జీ లాంటిది. తన చర్యలతో ప్రత్యర్థి జట్ల బ్యాట్స్మెన్లను కన్ఫూజ్ చేస్తాడు. అతని మాయలో పడకూడదని గట్టిగా ఫిక్స్ అయ్యా. పైగా ఇరుజట్లకు అది కీలక మ్యాచ్. ఓడిన జట్టు ఇంటికి.. గెలిచిన జట్టు ఫైనల్‌కు. ఈ పరిస్థితుల్లో కోహ్లి కళ్లలో పడకూడదనే ఉద్దేశంతో బ్యాటింగ్ కొనసాగించా. కోహ్లి నాకు ఎదురుగా ఉన్నప్పుడు తలదించుకొని బ్యాటింగ్ చేశా. దీనివల్ల నా ఫోకస్ దెబ్బతినలేదు. నేను బ్యాటింగ్ చేస్తున్నంత సేపు కోహ్లిని నేను ఏమి అనలేదు.. నన్ను కోహ్లి ఎలాంటి స్లెడ్జ్ చేయలేదు. మ్యాచ్ విజయానికి చేరువవుతున్న తరుణంలో మనుసులో ఈ విధంగా అనుకున్నా.'' ఇంతవరకు అంతా సక్రమంగానే జరిగింది. ఇంకో 10 సెకన్లు ఓపిక పడితే మ్యాచ్ గెలుస్తాం.. ఈ సమయంలో ఎలాంటి పొరపాట్లు చేయకూడదు''.. ఇక కోహ్లి ఒక సందర్బంలో నా దగ్గరికి వచ్చాడు. కానీ అదే సమయంలో నా బ్యాట్ కిందపడిపోవడంతో ఏం మాట్లాడకుండా బ్యాట్ తీసుకోవడానికి కిందకు వంగాను. కోహ్లి నవ్వుతూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత మేము మ్యాచ్ గెలవడం.. ఆపై టైటిల్ గెలవడం జరిగిపోయింది'' అంటూ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2020 సీజన్లో ముంబై ఇండియన్స్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఫైనల్లో ముంబై ఇండియన్స్ ఐదు వికెట్ల తేడాతో నెగ్గి ఐదోసారి ఐపీఎల్ టైటిల్ ఎగురేసుకపోయింది. చదవండి: IPL 2022: కోహ్లి చెత్త రికార్డు.. ప్లీజ్.. భారంగా మారొద్దు.. ఇకనైనా! Kohli-Wasim Jaffer: కోహ్లి పరిస్థితిని కళ్లకు కట్టిన టీమిండియా మాజీ క్రికెటర్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
'నువ్వేమైనా గర్భవతివా!.. ఆ పొట్టేంటి?'
Harbhajan Singh Recalls Sledging With Darenn Lehmann.. టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్బజన్ సింగ్ డిసెంబర్ 24న అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లకు గుడ్‌బై చెబుతున్నట్లు ప్రకటించాడు. 23 ఏళ్ల కెరీర్లో టీమిండియా స్పిన్నర్‌గా ఎన్నో ఘనతలు సాధించిన భజ్జీ టెస్టుల్లో 400కు పైగా వికెట్లు, వన్డేల్లో 200కు పైగా వికెట్లు, టి20ల్లో 25 వికెట్లు.. ఓవరాల్‌గా అన్ని ఫార్మాట్లు కలిపి 711 వికెట్లు తీశాడు. ఇక హర్భజన్ సింగ్ రిటైర్మెంట్పై మాజీ క్రికెటర్లు స్పందింస్తున్నారు. హర్బజన్‌కు ఆస్ట్రేలియన్ క్రికెటర్లంటే విపరీతమైన ప్రేమ ఉంది.. కానీ వారి స్లెడ్జింగ్ ఇష్టం ఉండేది కాదంటూ గతంలో ఆప్ కి అదాలత్‌కు తానే స్వయంగా ఇచ్చిన ఇంటర్య్వూలో చెప్పుకొచ్చాడు. ఈ విషయాన్ని మరోసారి గర్తుచేసుకుందాం. చదవండి: Harbhajan Singh: ఆడతాడు... తిడతాడు... కొడతాడు! అది భజ్జీ స్పెషల్.. ''ఆస్ట్రేలియా ఆటగాళ్లు అంటే స్లెడ్జింగ్‌కు మారుపేరుగా ఉండేవారు. ముఖ్యంగా వారి గడ్డపై సిరీస్ ఆడే జట్లను తమ స్లెడ్జింగ్‌తోనే మానసికంగా దెబ్బతీసి పైచేయి సాధించేవారు. కానీ నాలాంటి వారిని ఎదుర్కొనడానికి మాత్రం ఆస్ట్రేలియన్ ఆటగాళ్లు భయపడేవారు. ఒక సందర్భంగా మ్యాచ్‌లో నేను బ్యాటింగ్ చేస్తున్న సమయంలో నా పక్కనే ఉన్న డారెన్ లీమన్ అదే పనిగా నాపై స్లెడ్జింగ్ చేస్తూనే ఉన్నాడు. దీంతో చిర్రెత్తి లీమన్ పొట్టవైపు చూస్తూ.. నువ్వేమైనా ప్రెగ్నెంటా.. ఆ పొట్టేంటి! అని నవ్వుతూనే అడిగేశాను. ఆ సమయంలో ఈ విషయంపై ఇద్దరి మధ్య చిన్నపాటి మాటలయుద్దం జరిగిందనుకోండి. అయితే ఈ విషయాన్ని లీమన్ అప్పటి స్పిన్నర్ షేన్ వార్న్‌కు చెప్పాడు. అంతే.. వార్న్ ఒక్కసారిగా పగలబడి నవ్వుతూ.. ''నా దగ్గరకొచ్చి లీమన్ ఏమైనా అన్నావా'' అని అడిగాడు. దానికి ''నేను అవునని సమాధానం ఇవ్వడంతో.. కరెక్టే.. ఆటగాళ్లకు అంత పెద్ద పొట్ట ఉండకూడదు''. ఆ తర్వాత వార్నర్ లీమన్‌తో.. మనం ఎవరినైనా స్లెడ్జ్ చేయొచ్చు.. కానీ టర్బోనేటర్తో(భజ్జీ) మాత్రం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పడం నాకు ఇప్పటికి గుర్తుంది.'' అని ఆప్ కి అదాలత్‌కు గతంలో ఇచ్చిన ఇంటర్య్వూలో చెప్పుకొచ్చాడు. చదవండి: గడ్డు పరిస్థితుల్లో నా భార్య ఇచ్చిన అండ దండలు వెలకట్టలేనివి.. గర్వంగా ఉంది మై లవ్! -
India Vs England: 'మాతో పెట్టుకోవద్దు'
2007 సిరీస్... నాటింగ్‌హామ్‌లో భారత్, ఇంగ్లండ్ టెస్టు మ్యాచ్. మన పేసర్ జహీర్ ఖాన్ బ్యాటింగ్‌కు వచ్చిన సమయంలో క్రీజ్ చుట్టూ ఇంగ్లండ్ ఆటగాళ్లు కొన్ని జెల్లీ బీన్స్ విసిరి అతడిని ఆట పట్టించేందుకు ప్రయత్నించారు. అది చూసి జహీర్‌కు బాగా కోపం వచ్చింది. ఇంగ్లండ్‌తో వాదనకు దిగిన అతను బౌలింగ్‌కు వచ్చినప్పుడు తన కసినంతా చూపించాడు. ఐదు వికెట్లతో ప్రత్యర్థిని కుప్పకూల్చడం, భారత్ ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం జరిగిపోయాయి. తాజాగా బుమ్రా ఉదంతాన్ని బట్టి చూస్తే 14 ఏళ్ల తర్వాత కూడా ఇంగ్లండ్ పాఠాలు నేర్చుకోలేదని అనిపిస్తోంది. – సాక్షి క్రీడా విభాగం లార్డ్స్ టెస్టు విజయంలో షమీ, బుమ్రా బ్యాటింగ్ ప్రదర్శన కూడా కీలక పాత్ర పోషించింది. ఏకంగా 20 ఓవర్ల పాటు క్రీజ్‌లో నిలిచిన వీరిద్దరు 89 పరుగుల భాగస్వామ్యంతో టీమిండియా పైచేయి సాధించడానికి కారణమయ్యారు. ఈ క్రమంలో మైదానంలో ఇంగ్లండ్ ఆటగాళ్లనుంచి వీరిద్దరు బంతులే కాదు, మాటల తూటాలు కూడా ఎదుర్కొన్నారు. అయితే ఎక్కడా తగ్గకుండా పట్టుదలగా క్రీజ్‌లో నిలబడ్డారు. షమీ తనదైన శైలిలో దూకుడుగా ఆడి ఇంగ్లండ్ బౌలర్లపై చెలరేగగా... బుమ్రా తన బ్యాటింగ్ సత్తా చూపించడంతో పాటు బౌలింగ్‌లో తన స్థాయి ఏమిటో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌ను రుచి చూపించాడు. నిజానికి భారత్ 8 వికెట్లు కోల్పోయిన తర్వాత మరో వికెట్ తీసే లక్ష్యంతో బౌలింగ్ చేయకుండా బుమ్రా శరీరంపైకి బంతులు ఎక్కు పెట్టి పదే పదే షార్ట్ బంతులతో ఇబ్బంది పెట్టాలని ఇంగ్లండ్ ప్రయత్నించింది. తొలి ఇన్నింగ్స్‌లో అండర్సన్‌కు ఒక ఓవర్ బుమ్రా ప్రమాదకరంగా వేసినందుకు ప్రతీకారంగా అందరూ కలిసి పాఠం చెప్పాలని భావించినట్లున్నారు. నిజానికి 164 టెస్టుల అనుభవం ఉన్న అండర్సన్‌కు ఇలాంటివి కొత్త కాదు. 2007 నాటింగ్‌హామ్‌లో టెస్టులో కూడా అతను ఆడాడు. అతనికంటే ఎక్కువగా స్పందించిన ఇతర బౌలర్లు ఈ వేడిలో బౌలింగ్‌లో గతి తప్పగా...షమీ, బుమ్రా పండగ చేసుకున్నారు. కోహ్లి దారి చూపగా... ఈ టెస్టులో భారత ఆటగాళ్ల శారీరక భాష చూస్తే ప్రతీ ఒక్కరు ఒక్కో అగ్నిగోళంగా కనిపించారు. ముఖ్యంగా కెప్టెన్ విరాట్ కోహ్లి ప్రతీ క్షణం అమితోత్సాహంతో కనిపిస్తూ, తన సహచరులను ప్రేరేపిస్తున్న తీరు...వికెట్ పడినప్పుడు ప్రదర్శిస్తున్న హావభావాలు ప్రత్యర్థిని ఒత్తిడిలో పడేస్తున్నాయి. ఎక్కడా తగ్గేదే లేదు అన్నట్లుగా క్రికెటర్లు మాటల దాడికి వెనుకాడలేదు. అండర్సన్‌తో కోహ్లి వాదన, వికెట్ తీసినప్పుడు ‘నిశ్శబ్దం’ అన్నట్లుగా నోటిపై వేలుతో సిరాజ్ సంబరాలతో మొదలైన టెస్టు బుమ్రా, బట్లర్ మాటల యుద్ధం వరకు సాగింది. ఒక దశలో ఇది శృతి మించడంతో బుమ్రా చివరకు అంపైర్‌కు కూడా ఫిర్యాదు చేయాల్సి వచ్చింది. ఆ ఆగ్రహాన్నంతా బుమ్రా తర్వాత తన బౌలింగ్‌లో చూపించాడు. ‘మాలో ఒక్కడిని అంటే పది మందిని అన్నట్లే. అందుకే ఎవరిని దూషంగా అందరం మళ్లీ జవాబిచ్చేందుకు సిద్ధంగా ఉంటాం తప్ప వెనక్కి తగ్గం’ అంటూ మ్యాచ్ ముగిసిన తర్వాత రాహుల్ చేసిన వ్యాఖ్య మ్యాచ్ చివరి రోజు ఎలా సాగిందో చెబుతోంది. ఆస్ట్రేలియన్లూ ఇలాగే... అడిలైడ్‌లో 36 ఆలౌట్ తర్వాత మెల్బోర్న్లో బరిలోకి దిగిన టీమిండియాను ఆసీస్ ఆటగాళ్లు మొదటి సెషన్నుంచే మాటలతో వేధించారు. అయితే రహానే నాయకత్వంలో జట్టు మరింత కసిగా ఆటను ప్రదర్శించింది. చివరకు అద్భుత విజయం సాధించి మమ్మల్ని రెచ్చగొడితే ఇలాగే ఉంటుందంటూ చూపించింది. ఇక బ్రిస్బేన్ అద్భుతం గురించి ఎంత చెప్పినా తక్కువే. సిడ్నీ టెస్టులో డ్రాకు ప్రయత్నిస్తున్న సమయంలో గాబా మైదానానికి రా చూసుకుందాం అంటూ కెప్టెన్ పైన్ సవాల్ విసిరాడు. ఇది కూడా టీమిండియా సీరియస్‌గా తీసుకుంది. అత్యద్భుత ఆట తో అనూహ్య లక్ష్యాన్ని ఛేదించి మూడు దశాబ్దాలుగా ఆసీస్ ఓటమి ఎరుగని మైదానంలో వారిని మట్టికరిపించింది. అన్నట్లు ఇటీవల ఓడిన వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో భారత్, న్యూజిలాం డ్ ఆటగాళ్ల మధ్య చిన్నపాటి వాదన కూడా జరగలేదు. భారత్‌ను ఎలా ఓడించాలో మాకు తెలుసన్నట్లుగా కివీస్ చాలా కూల్‌గా ఆటపై మాత్రమే దృష్టి పెట్టి ఫలితం సాధించింది! -
బెయిర్ స్టో ప్రతీకారం.. ట్విస్ట్ ఏంటంటే
లండన్: క్రికెట్‌ను జెంటిల్మెన్ గేమ్‌గా పిలవడం ఆనవాయితీగా వస్తుంది. అలాంటి ఆటలో వివాదాలు.. స్లెడ్జింగ్‌లు సాధారణంగా మారిపోయాయి. ఆటలో సందర్భంగా ఒక్కోసారి జరిగే సంఘటనలు ఫన్నీగా ఉంటూనే సిరీయస్‌గా కనిపిస్తాయి. తాజాగా ఇంగ్లండ్ ఆటగాడు జానీ బెయిర్ స్టో మ్యాచ్‌లో తనకు జరిగిన అన్యాయానికి బదులు తీర్చుకున్నాడు. కానీ ట్విస్ట్ ఏంటంటే.. తాను అవుటవ్వడానికి కారణమైన ఆటగాడిని వదిలేసి మరొక ఆటగాడిపై స్లెడ్జింగ్‌కు దిగి అతని ఔట్‌కు కారణమయ్యాడు. ఈ ఘటన ఇంగ్లండ్, శ్రీలంకల మధ్య జరిగిన రెండో టెస్టులో చోటుచేసుకుంది. అసలు విషయంలోకి వెళితే.. గాలే వేదికగా జరిగిన రెండో టెస్టులో ఇంగ్లండ్ బ్యాటింగ్ సమయంలో జానీ బెయిర్ స్టోపై లంక వికెట్ కీపర్ నిరోషన్ డిక్వెల్లా స్లెడ్జింగ్‌కు దిగాడు. 'ఇండియా టూర్‌కు ఎంపిక కాలేకపోయావు.. కానీ ఐపీఎల్ ఆడేందుకు మాత్రం వెళ్తావు.. కేవలం డబ్బుల కోసమే ఆడతావా అంటూ' ట్రోల్ చేశాడు. దీంతో ఏకాగ్రత కోల్పోయిన బెయిర్ స్టో 28 పరుగుల వద్ద క్యాచ్ అవుట్‌గా వెనుదిరిగాడు. స్లెడ్జింగ్‌కు దిగి తనను అవుట్ చేశారన్న కోపంతో ఉన్న బెయిర్ స్టో అనువైన సమయం కోసం వేచి చూశాడు. చదవండి: 'గిల్ తల దించుకొని ఆడితే బాగుంటుంది' Bairstow: Come on Chandi, throw your wicket away! Chandimal: Say less ❤️#SLvENG pic.twitter.com/znPUZrkWBA — sonali (@samtanisonali1) January 25, 2021 ఈ దశలో లంక రెండో ఇన్నింగ్స్‌లో భాగంగా 47 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన లంక కెప్టెన్ దినేష్ చండిమల్‌ను టార్గెట్ చేస్తూ బెయిర్ స్టో స్లెడ్జింగ్‌కు దిగాడు. 'కమాన్ చండీ.. నీ వికెట్‌ను త్వరగా పోగొట్టుకొని పెవిలియన్‌కు వెళ్లిపో అంటూ' పేర్కొన్నాడు. అండర్సన్ వేసిన బంతిని చండిమల్ గాల్లోకి లేపగా.. లాంగాఫ్‌లో ఉన్న జాక్ లీచ్ వెనుకకు పరిగెడుతూ అద్భుతక్యాచ్ అందుకున్నాడు. దీంతో చండిమల్ నిరాశగా క్రీజను వదిలిపెట్టి పెవిలియన్ బాట పట్టాడు. దీనికి సంబంధించిన వీడియోలను ట్విటర్లో షేర్ చేయగా.. వైరల్‌గా మారాయి. చదవండి: మ్యాక్సీని కొనుగోలు చేస్తే మూల్యం చెల్లించుకున్నట్లే 'బెయిర్ స్టో ప్రతీకారం బాగానే ఉంది.. కానీ వేరొక క్రికెటర్ బలి కావడం బాధగా అనిపించిందని కొందరు పేర్కొంటే.. దెబ్బకు దెబ్బ తీయడం అంటే ఇదే అంటూ' మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఇంగ్లండ్ జట్టు ఆరు వికెట్ల తేడాతో లంకపై విజయం సాధించి రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తేడాతో వైట్‌వాష్ చేసింది. Dickwella’s sledge work against bairstow 😂😂 “ Dropped from the India tour, but going to play the ipl, playing for cash only “ 😂😂 pic.twitter.com/d5zw36ij3h — rizwan (@rizwan68301915) January 24, 2021 -
'టీమిండియాపై స్లెడ్జింగ్ ఈసారి కష్టమే'
సిడ్నీ : ఆసీస్ అంటేనే స్లెడ్జింగ్‌కు మారుపేరు అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.గతంలోనూ చాలా సార్లు ఆసీస్ ఆటగాళ్లు ప్రత్యర్థి ఆటగాళ్లపై స్లెడ్జింగ్‌కు పాల్పడి మానసికంగా వారిపై విజయం సాధించేవారు. 2000వ సంవత్సరం నుంచి 2012 వరకు ఆసీస్ తిరుగులేని జట్టుగా ఉన్నప్పుడు ప్రత్యర్థి ఆటగాళ్లపై కవ్వింపు చర్యలకు పాల్పడి సగం విజయాలు సాధించేవారు. ఆండ్రూ సైమండ్స్- హర్బజన్ మంకీగేట్ వివాదం ఇలాంటి కోవకు చెందినదే. గత దశాబ్ద కాలంలో ఆసీస్ ఆటగాళ్లలో స్లెడ్జింగ్ విపరీతంగా ఉన్నా ఈ మధ్యన కాస్త తగ్గిందనే చెప్పొచ్చు. (చదవండి : అందుకే ముంబై అలా చెలరేగిపోతోంది) ఐపీఎల్ 13వ సీజన్ ముగిసిన తర్వాత టీమిండియా సుధీర్ఘ పర్యటనలో భాగంగా ఆసీస్ గడ్డపై అడుగుపెట్టనున్న సంగతి తెలిసిందే. ఆసీస్ పర్యటనలో టీమిండియా మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టులు ఆడనుంది. కాగా నవంబర్ 27 నుంచి టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ఆసీస్ మాజీ ఆటగాడు స్టీవ్ వా స్లెడ్జింగ్ అంశాన్ని మరోసారి ప్రస్థావనకు తెచ్చాడు. ఈఎస్పీఎన్కు ఇచ్చిన ఇంటర్య్వూలో స్టీవా పలు ఆసక్తికర విషయాలు పేర్కొన్నాడు. 'ఈసారి కోహ్లి సేనపై స్లెడ్జింగ్ కాస్త కష్టమే అని చెప్పొచ్చు. భారత ఆటగాళ్లపై స్లెడ్జింగ్ పనిచేయకపోవచ్చు. ఎందుకంటే టీమిండియా కొన్నేళ్లుగా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటుంది. అలాంటి ఆటగాళ్లపై స్లెడ్జింగ్‌కు దిగితే వారికి బూస్ట్‌నిచ్చి సిరీస్‌లో మరింత రెచ్చిపోయే అవకాశం ఉంటుంది. అందుకే ఆసీస్ ఆటగాళ్లకు ఒక విజ్ఞప్తి చేస్తున్నా. టీమిండియాను వదిలేయండి.. వారి ఆటను ఆడనివ్వండి..దయచేసి ఎవరు స్లెడ్జింగ్‌కు పాల్పడొద్దు. ఇక కోహ్లి విషయానికి వస్తే ఆసీస్ సిరీస్‌లో తన అత్యుత్తమ ప్రదర్శన కనబరిచేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు. ఇప్పటికే వరల్డ్ కాస్ ప్లేయర్‌గా పేరు తెచ్చుకున్న కోహ్లి నిజానికి ఆసీస్ పర్యటనపై కసితో ఉన్నాడు. 2018-19 ఇండియా పర్యటనలో స్మిత్.. కోహ్లిలు ఒకరినొకరు పోటీపడగా.. అందులో స్మిత్ పైచేయి సాధించాడు. ఆ సిరీస్‌లో స్మిత్ మూడు సెంచరీలు చేయగా.. కోహ్లి పెద్దగా రాణించలేకపోయాడు. నెంబర్‌వన్ బ్యాట్స్‌మెన్‌గా ఉన్న కోహ్లి ఆ పేరును నిలబెట్టుకునే ప్రయత్నంలో ఉన్నాడు.అని స్టీవా తెలిపాడు. కాగా 2018-19 బోర్డర్ గవాస్కర్ ట్రోపిని టీమిండియా నిలబెట్టుకున్న సంగతి తెలిసిందే. -
కోహ్లిపై నోరుపారేసుకున్న రబాడ
లండన్: ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియాతో మ్యాచ్‌కు ముందే దక్షిణాఫ్రికా స్టార్ బౌలర్ కగిసో రబాడ మాటల యుద్దానికి తెరదీశాడు. టీమిండియాలో కీలక ఆటగాడు, సారథి విరాట్ కోహ్లిని రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. కోహ్లి గొప్ప బ్యాట్స్‌మన్ అయినప్పటికీ అతడికి పరిపక్వత లేదని ఎద్దేవ చేశాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్లో కూడా కోహ్లితో వాగ్వాదానికి దిగిన విషయం తెలిసిందే. అయితే ఆ టోర్నీలో జరిగిన వివాదాన్ని వివరిస్తూ కోహ్లిని చులకన చేసి మాట్లాడాడు. ‘ఐపీఎల్లో ఆరోజు వివాదానికి కారణం కోహ్లినే. నా బౌలింగ్‌లో అతడు ఫోర్ కొట్టడంతో నేను ఆలోచనలో పడ్డాను. అప్పుడు కోహ్లి నన్ను ఓ మాట అనడంతో అదే మాటను కోహ్లిని అన్నాను. దీంతో వెంటనే అతడు కోపంతో రగిలిపోయాడు. అతను అద్బుతమైన బ్యాట్స్‌మన్ అయినంత మాత్రాన అతడు అన్న మాటలు పడాలా?. అతడు తిడితే నేను పడను. కోహ్లి ఇంకా పరిపక్వత సాధించాల్సి ఉంది. ఆట మాత్రమే కాదు వ్యక్తిత్వం కూడా ఉండాలి’అంటూ రబాడ వ్యాఖ్యానించాడు. అయితే ఆటగాళ్లతో గొడవలు పడటం రబాడకు కొత్తేం కాదు. 2017లో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ సందర్భంగా ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌తో అనుచితంగా ప్రవర్తించడంతో ఒక టెస్టు మ్యాచ్ నిషేధాన్ని ఎదుర్కొన్నాడు. గతేడాది ఆసీస్ ఆటగాళ్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లపై నోరు పారేసుకున్నాడు. ఇక స్మిత్‌తో శృతిమించి ప్రవర్తించడంతో మరోసారి సస్సెన్షన్‌కు గురయ్యాడు. -
టిమ్‌పైన్‌కు స్లెడ్జింగ్ రుచి చూపించిన పంత్
-
మాంకీ.. టెంపరరీ కెప్టెన్ వచ్చాడు: పంత్ స్లెడ్జింగ్
మెల్బోర్న్ : స్లెడ్జింగ్ చేయడంలో తానేం తక్కువ కాదంటున్నాడు టీమిండియా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్ట్‌లో కమిన్స్‌కు మాటకు మాటతోనే బదులిచ్చిన ఈ యువ వికెట్ కీపర్ తాజాగా జరుగుతున్న మూడో టెస్ట్‌లో ఆ జట్టు కెప్టెన్ టీమ్‌పైన్‌కు అదే తరహాలో బుద్ది చెప్పాడు. ఇక మూడో రోజు ఆటలో టీమ్ పైన్ తన నోటి దురుసు ప్రదర్శించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా పంత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో పదే పదే సూటి పోటి మాటలతో అతని ఏకాగ్రతను దెబ్బతీయాలనే ప్రయత్నం చేశాడు. ‘ధోని వచ్చాడు కదా.. ఇప్పుడేం చేస్తావ్? వచ్చి బీబీఎల్ ఆడుతావా?’ అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలతో కవ్వించాడు. పైన్ ఎంత రెచ్చగొట్టినా.. పంత్ మాత్రం సహనం కోల్పోకుండా తన ఆటను కొనసాగించాడు. ఇదంతా మనసులో పెట్టుకున్న పంత్ అవకాశం కోసం ఎదురు చూసి సరైన రీతిలో బదులిచ్చాడు. నాలుగో రోజులో ఆటలో బ్యాటింగ్‌కు వచ్చిన పైన్‌పై మాటల దాడి చేసి.. తానేం తక్కువ కాదని ‘స్లెడ్జింగ్ నీకు ఒక్కడికే కాదు.. మాకు తెలుసు’ అన్నట్లు వ్యవహరించాడు. ఫార్వార్డ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న మయాంక్‌తో మాట్లాడుతూ.. ‘మాంకీ.. ఈ రోజు నీకు ఓ ముఖ్య అతిథి కనిపిస్తాడు. కమాన్ మాంకీ. ఎప్పుడైన, ఎక్కడైనా తాత్కలిక కెప్టెన్ అనే పదం విన్నావా? అతను ఔట్ అవ్వడానికి అంతగా కష్టపడాల్సిన అవసరం లేదు. అతనికి మాట్లాడటం అంటే ఇష్టం. అదొక్కటే అతను చేయగలడు.’ అని సెటైరిక్‌గా వ్యాఖ్యానిస్తూ రెచ్చగొట్టాడు. ఈ వ్యాఖ్యలు స్టంప్స్ మైక్స్‌లో స్పష్టంగా రికార్డయ్యాయి. టిమ్ పైన్ దురదృష్టమో.. ఏమో కానీ పంత్‌కే క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. పంత్ స్లెడ్జింగ్‌ను భారత్ అభిమానులు సమర్ధిస్తున్నారు. యాక్షన్‌కు రియాక్షన్ ఉంటుందని, పైన్‌కు దిమ్మతిరిగినట్లుంటుందని కామెంట్ చేస్తున్నారు. ఇక పంత్ స్లెడ్జింగ్‌పై టాలీవుడ్ హాస్య నటుడు వెన్నెల కిషోర్ సైతం తనదైన శైలిలో స్పందించాడు. ఓ అభిమాని పోస్ట్‌కు బదులుగా ‘ఏదో మనసులో పెట్టుకున్నాడు. పాపం టిమ్.. క్యూట్‌గా అంపైర్‌కు ఫిర్యాదు చేసినట్టున్నాడు’ అని తన కామిక్ స్టైల్లో రిప్లే ఇచ్చాడు. Edo manasulo pettukunnadu🤣🤣..Paapam tim cute ga umpire ku complain chesinattunnadu — vennela kishore (@vennelakishore) December 29, 2018 చదవండి : పంత్‌పై నోరుపారేసుకున్న టిమ్ పైన్ -
‘నోటికి కాదు.. బ్యాటుకు పని చెప్పండి’
పెర్త్: ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు అంటేనే స్లెడ్జింగ్‌కు పెట్టింది పేరు. తరం మారినా వారి మైండ్ సెట్ మారలేదు. ఎన్ని వివాదాలు చుట్టు ముట్టినా తాము ఆటకంటే ఎక్కువగా మాటలకే ప్రాధాన్యత ఇస్తామనే భావన వారికి ఉంది. తాజాగా పెర్త్ వేదికగా ఆసీస్-టీమిండియాల మధ్య జరిగిన రెండో టెస్టులో ఇరుజట్ల సారథుల మధ్య వాగ్వాదం తారాస్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. మ్యాచ్ అనంతరం ఆటలో ఇవి సహజమంటూ ఆసీస్ క్రికెటర్లు తీసిపారేయడం ఎవ్వరికీ రుచించడం లేదు. దీనిపై ఇప్పటికే మాజీ క్రికెటర్లు ఆగ్రహించిన విషయం తెలిసిందే. తాజాగా ఆసీస్ మాజీ సారథి రికీ పాంటింగ్ ఈ వివాదంపై స్పందించాడు. (కోహ్లిసేన ఓటమికి కారణాలివేనా?) ‘మీ తెలివితేటలను మాటలకే ఉపయోగిస్తున్నారు.. కానీ ఆటకు ఉపయోగించటం లేదు. మీరు అద్వితీయమైన ఆటతీరును ప్రదర్శిస్తే ప్రత్యర్థి జట్లలోని ఆటగాళ్లు ఎలాంటి ఆలోచన లేకుండా అభినందిస్తారు. మైదానంలో బ్యాటు, బంతి మాత్రమే మాట్లాడుకోవాలి. చక్కటి నైపుణ్యంతో మీరు ఆడుతుంటే ప్రత్యర్థి ఆటగాళ్లు అయోమయంలో ఉండటాన్ని ఆనందించవచ్చు. మిమ్మల్ని ఎదుర్కోవడానికి ప్రత్యర్థి జట్టు వేసే వ్యూహాలు, ఫీల్డింగ్, బౌలింగ్ మార్చుతుంటే ఆ ఆనందం వర్ణనాతీతం.. అలాంటివి ఆస్వాదించండి’ అంటూ ఆటగాళ్లకు పాంటింగ్ సూచించాడు. (కోహ్లిపై ఆసీస్ బౌలర్ పరుష వ్యాఖ్యలు!) -
అలిగి మ్యాచ్ మధ్యలోనే వెళ్లిపోయాడు!
సిడ్నీ : బాల్ ట్యాంపరింగ్‌తో నిషేధం ఎదుర్కొంటున్న ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ స్లెడ్జింగ్‌తో మరోసారి అసహనానికి గురయ్యాడు. దక్షిణాఫ్రికా పర్యటనలో ఇదే స్లెడ్జింగ్‌కు బలైన వార్నర్ 12 నెలల నిషేధం ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా సిడ్నీగ్రేడ్ మ్యాచ్‌లో ప్రత్యర్థి ఆటగాళ్లు స్లెడ్జింగ్ పాల్పడటంతో చికాకు గురైన వార్నర్ అసహనంతో మ్యాచ్ మధ్యలోనే వెళ్లిపోయాడు. అనంతరం తన సహచర ఆటగాళ్లు బతిమాలడంతో తిరుగొచ్చి సెంచరీ బాదాడు. గత శనివారం జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన చోటుచేసుకోగా.. ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఈ మ్యాచ్‌లో స్లెడ్జింగ్‌కు పాల్పడింది బౌన్సర్ తగిలి మరణించిన ఫిలిఫ్ హ్యూస్ సోదరుడు జాసన్ హ్యూస్‌గా ఆసీస్ మీడియా గుర్తించింది. అతడు డేవిడ్ వార్నర్‌ను అవమానించడాన్ని.. దీంతో అసహనం వ్యక్తం చేసిన వార్నర్ ఏం మాట్లాడకుండా మైదానం వీడాడని పేర్కొంది. ఇక వార్నర్ చర్య పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు వార్నర్‌కు మద్దతిస్తుండగా.. మరికొందరు అతని చర్యను తప్పుబడుతున్నారు. ఇక ఈ ఏడాది మార్చిలో దక్షిణాఫ్రికాతో మూడో టెస్టు సందర్భంగా చోటుచేసుకున్న బాల్ ట్యాంపరింగ్ ఉదంతం.. వార్నర్‌తో పాటు స్టీవ్ స్మిత్, బెన్‌క్రాఫ్ట్‌లపై నిషేధం పడేటట్లు చేసిన విషయం తెలిసిందే. -
బ్రాడ్.. స్లెడ్జింగ్ మాకు వచ్చు: కోహ్లి
నాటింగ్‌హామ్: ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టులో భారత్ 203 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత్ తరపున అరంగేట్రం చేసిన వికెట్ కీపర్ రిషబ్ పంత్ పట్ల ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ అసభ్యంగా ప్రవర్తించి రిఫరీలతో చివాట్లు కూడా తిన్నాడు. అయితే జట్టును ముందుండి నడిపించే సారథి కోహ్లి ఆటగాళ్లను వెన్నంటి ప్రోత్సహించడంలోను ముందుంటాడు. ముఖ్యంగా యువ ఆటగాళ్లకు మైదానంలో ఎదురయ్యే స్లెడ్జింగ్‌పై తనదైన శైలిలో స్పందిస్తూ మద్దతు పలుకుతాడు. ఇలా ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన బ్రాడ్‌కు కోహ్లి దిమ్మతిరిగేలా చేశాడు. స్లెడ్జింగ్ అంటే ఎంటో పాఠాలు చెప్పాడు. షమీ బౌలింగ్‌లో బ్రాడ్ బ్యాటింగ్ చేస్తుండగా.. టీమిండియా ఫీల్డర్లు ‘కమాన్ షమ్మో’ అని అరవసాగారు. ఇది బ్రాడ్‌కు కొంత ఇబ్బంది కలిగించింది. వెంటనే కోహ్లితో ‘మ్యాన్.. వారు చాలా కోపంగా ఉన్నారు’ అని అన్నాడు. దీనికి కోహ్లి ‘ఇది నీవు యంగస్టార్తో ప్రవర్తించిన తీరుకు సమాధానం’ అని తెలిపాడు. మళ్లీ బ్రాడ్ ఇది టెస్టు క్రికెట్ అనగా.. ఈ ఆగ్రహం.. ఆ కోపమేనని కోహ్లి బదులిచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో హల్చల్ చేస్తుంది. ‘మీరు మంచిగా ఉంటే మేం మంచిగా ఉంటాం.. మీరు స్లెడ్జింగ్ చేస్తే మేం చేస్తాం’ అనే రితీలో కోహ్లి సమాధానమివ్వడాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఐసీసీ నిబంధనలు ఉల్లంఘించిన బ్రాడ్ మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించడంతో పాటు ఒక డీ మెరిట్ పాయింట్ ఇచ్చారు. బ్యాట్స్‌మన్ ఔటైనప్పుడు ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు అనుచిత వ్యాఖ్యలు చేయడం కానీ, అసభ్య సంకేతాలతో ఎగతాళి చేస్తే ఐసీసీ నిబంధనల్లోని ఆర్టికల్ 2.1.7 ప్రకారం తప్పిదంగా పరిగణిస్తారన్న విషయం తెలిసిందే. ఇక ఐదు టెస్టుల సిరీస్‌లో 2-1 ఇంగ్లండ్ ఆధిక్యంలో ఉంది.నాలుగో టెస్టు ఆగస్టు 30 నుంచి ప్రారంభంకానుంది. చదవండి: బ్రాడ్ ఓవరాక్షన్.. మ్యాచ్ ఫీజులో కోత -
స్లెడ్జింగ్ మంచిదే: ఆసీస్ కోచ్
లార్డ్స్ : స్లెడ్జింగ్‌తో తాము ఎంత నష్టపోయామో ఆస్ట్రేలియా జట్టుకు తెలిసిరానట్లుంది. గత దక్షిణాఫ్రికా పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న బాల్‌ట్యాంపరింగ్ ఉదంతానికి మూలం స్లెడ్జింగ్ అనే విషయాన్ని ఆసీస్ క్రికెటర్లు ఇంకా గుర్తించనట్లున్నారు. బాల్ ట్యాంపరింగ్‌తో ప్రపంచం ముందు తల వంచుకున్న ఆసీస్ జట్టు కీలక ఆటగాళ్లను దూరం చేసుకొవడమే కాకుండా కోచ్ డారెన్ లెహ్మెన్ సేవలను కోల్పోయింది. అతని స్థానంలో వచ్చిన నూతన కోచ్ జస్టిన్ లాంగర్ అయినా తమ ఆటగాళ్లు స్లెడ్జింగ్ పాల్పడకుండా జాగ్రత్తలు తీసుకుంటాడని అనుకుంటే ఆయన ఏకంగా స్లెడ్జింగ్ మంచిదే అని ఓ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన ఏమన్నాడంటే.. ‘‘స్లెడ్జింగ్ చాలా మంచింది. కానీ శృతిమించకూడదు. స్లెడ్జింగ్ అంటే అందరు తిట్టుకోవడం అని భావిస్తారు. కానీ స్లెడ్జింగ్ ఓ పరిహాసం. ఆస్ట్రేలియాలో స్లెడ్జింగ్ సహజమైన విషయం. నా కూతురితో యూనో (కార్డ్ గేమ్) ఆడినప్పుడు ఇద్దరం ఒకరికొకరం స్లెడ్జ్ చేసుకుంటాం. నేను మా తల్లిదండ్రులతో గోల్ఫ్ ఆడినప్పుడు కూడా వారిని నేను. నన్ను వారు స్లెడ్జ్ చేస్తారు. గత ముప్పై ఏళ్లుగా ఆస్ట్రేలియన్స్ స్లెడ్జింగ్‌కు పాల్పడుతున్నారు’’. అని చెప్పుకొచ్చాడు. ఇక స్టీవ్ స్మిత్ స్థానంలో కెప్టెన్‌గా ఎంపికైన టీమ్ పెయిన్ సైతం మైదానంలో నిశబ్దంగా ఉండమని, మర్యాదకరమైన స్లెడ్జింగ్‌కు పాల్పడుతూ.. ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టేస్తామని తెలిపాడు. అయితే కేవలం పరిహాసమే ఆడుతాం తప్పా.. వ్యక్తిగత దూషణలకు దిగమని చెప్పుకొచ్చాడు. ఇక లాంగర్ కామెంట్స్‌పై సోషల్ మీడియా వేదికగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చదవండి: ఆస్ట్రేలియా.. పాంటింగ్ రీ ఎంట్రీ.! -
‘స్లెడ్జింగ్ చేయను.. హారన్ కొట్టను’
సాక్షి, స్పోర్ట్స్ : మైదానంలో స్లెడ్జింగ్ చేయడం, డ్రైవింగ్ చేస్తుండగా హారన్ కొట్టడం ఇష్టం ఉండదని టీమిండియా క్రికెటర్ అజింక్యా రహానే తెలిపాడు. మహారాష్ట్ర మోటార్ వెహికల్ డిపార్ట్మెంట్(ఎమ్వీడీ), టాటా గ్రూప్ సంయుక్తంగా రోడ్డు భద్రత, శబ్ద కాలుష్యంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఓ కార్యక్రమాన్ని చేపట్టింది. దీనిలో భాగంగా మార్చి 24న ముంబై వాంఖడే మైదానంలో రోడ్ సేఫ్టీ ఎలెవన్-నో హాంకింగ్ ఎలెవన్ అనే జట్ల పేరుతో ఓ టీ20 మ్యాచ్ నిర్వహిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో రహానేతో పాటు యువరాజ్ సింగ్, కేఎల్ రాహుల్, దినేశ్ కార్తీక్, హర్భజన్ సింగ్, శిఖర్ ధావన్, హార్దిక్ పాండ్యా, సురేశ్ రైనా పలువురు దేశవాళీ కిక్రెటర్లు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా రహానె మాట్లాడుతూ.. మైదానంలో స్లెడ్జింగ్ చేయడం ఇష్టం ఉండదని, అలాగే డ్రైవింగ్ చేసే సమయంలో అనవసరంగా కారు హారన్ మోగించడం కూడా తనకు ఇష్టం ఉండదని తెలిపాడు. ముంబై వంటి మెట్రో నగరాల్లో శబ్ద కాలుష్యం అనేది చాలా పెద్ద సమస్యగా మారిందని చెప్పుకొచ్చాడు. క్రికెట్ ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించే ఇలాంటి కార్యక్రమంలో భాగస్వామి కావడం సంతోషంగా ఉందన్నాడు. -
లియోన్‌కు జరిమానా హద్దులు మీరిన స్లెడ్జింగ్..
-
వార్నర్, డికాక్ : బీరు తాగుతూ కలిసిపోండి!
సాక్షి, స్పోర్ట్స్: ఆటగాళ్ల మధ్య స్లెడ్జింగ్, ఎగతాళిలు ద్వైపాక్షిక సిరీస్‌ల్లో భాగమేనని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వార్న్ అభిప్రాయపడ్డాడు. దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలి టెస్టులో స్లెడ్జింగ్ తారస్థాయికి చేరి ఆటగాళ్లు ఒకరినొకరు దూషించుకునే వరకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో షేన్ వార్న్ ఇవన్నీ ఆటలో భాగమేనని బీరు తాగి కలిసిపోవాలని ఇద్దరి ఆటగాళ్లకు సూచించాడు. నాలుగో రోజు టీ విరామానికి ఇరు జట్ల ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్‌కు వెళుతున్న సమయంలో వార్నర్-డికాక్ పరస్పరం దూషించుకున్నారు. డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లే దారిలో ఉన్న మెట్ల వద్దే వార్నర్ ఆవేశంగా డి కాక్ వైపు దూసుకుపోయే ప్రయత్నం చేయడం కెమెరాల్లో రికార్డయింది. సహచరుడు ఖాజా పక్కకు తీసుకెళ్లే ప్రయత్నం చేసినా వార్నర్ మాత్రం తగ్గలేదు. కొద్ది దూరంలోనే ఉన్న డి కాక్ కూడా ఆ సమయంలో ఏదో అంటూ తమ జట్టు గది వైపు వెళ్లిపోయాడు. ఈ వ్యవహరమంతా బయటకు రావడంతో చర్చనీయాంశమైంది. ఈ వివాదంపై షేన్ వార్న్ ట్విటర్ వేదికగా స్పందించాడు. ‘‘ఆటగాళ్ల మధ్య ఎగతాళిలు, చీదరింపులు, స్లెడ్జింగ్‌లు ద్వైపాక్షిక సిరీస్‌ల్లో భాగమే. ఇరు జట్లు ఆటగాళ్లు ఇంతటితో వదిలేయండి. ఒకరికొకరు మర్యాదగా నడుచుకోవడం మంచిది. ఎవరైనా వ్యక్తిగత విషయాలు ప్రస్తావించొద్దు. ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేయడం మానేసి బీరు తాగుతూ కలిసిపోండి’’ అని వార్న్ ట్వీట్ చేశాడు. ఇక దక్షిణాఫ్రికా ఆటగాళ్ల పట్ల వార్నర్ ఎన్నోసార్లు తన హద్దులు దాటి ప్రవర్తించాడని, అందుకే అతని రియాక్షన్ పట్ల మేం ఆశ్చర్య పడలేదని, ఒకరిపై కామెంట్ చేసేముందు తీసుకోవడానికి కూడా సిద్దంగా ఉండాలని దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ ట్వీట్ చేశాడు. డర్బన్‌లో నీచమైన దృశ్యాలు చోటు చేసుకున్నాయని, ఆటగాళ్లు వ్యక్తిగతంగా దూషించుకోవడం అంత మంచిది కాదని గిల్‌క్రిస్ట్ ట్వీట్ చేశాడు. Chat, banter, sledging has always been apart of any series between SA & Oz. Both sides always give it out. Respect is the key & I hope nothing personal was said to any player towards anyone from either side. Have a beer together afterwards & get on with it - stop the whinging ! — Shane Warne (@ShaneWarne) 5 March 2018 -
హద్దులు మీరిన స్లెడ్జింగ్.. లియోన్‌కు జరిమానా
డర్బన్ : ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా మధ్య జరిగిన తొలి టెస్టులో అతిగా ప్రవర్తించిన స్పిన్నర్ నాథన్ లియోన్‌కు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్( ఐసీసీ) జరిమాన విధించింది. నాలుగు టెస్టుల ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా మొదటి టెస్టులోనే స్లెడ్జింగ్ తారా స్థాయికి చేరింది. ప్రొటీస్ రెండో ఇన్నింగ్స్‌లో ఆటగాళ్లు క్రీడా స్పూర్తి మరిచి ప్రవర్తించారు. లియోన్ వేసిన 12 ఓవర్లో మార్క్రమ్తో సమన్వయ లోపంతో ఏబీ డివిలియర్స్ రనౌట్ అయ్యాడు. ఆనందంలో మునిగిపోయిన లియోన్ బంతిని ఏబీ పైకి విసరడంతో చాతికి తగిలింది. ఇది ఐసీసీ నిబంధనలకు విరుద్ధం కావడంతో నాథన్‌కు మ్యాచ్ ఫీజులో 15 శాతం జరిమానా విధించింది. అయితే బంతి కావాలని విసరలేదని నాథన్ క్షమాపణలు కోరాడు. ఈ రనౌట్ వ్యవహారంలోనే వార్నర్-డికాక్‌ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. నాలుగో రోజు టీ విరామం సమయంలో ఇరు జట్ల ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్‌కు వెళుతున్న సమయంలో ఈ ఇద్దరు ఆటగాళ్లు పరస్పరం దూషించుకున్నారు. డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లే దారిలో ఉన్న మెట్ల వద్దే వార్నర్ ఆవేశంగా డి కాక్ వైపు దూసుకుపోయే ప్రయత్నం చేయడం కెమెరాల్లో రికార్డయింది. సహచరుడు ఖాజా పక్కకు తీసుకెళ్లే ప్రయత్నం చేసినా వార్నర్ మాత్రం తగ్గలేదు. కొద్ది దూరంలోనే ఉన్న డి కాక్ కూడా ఆ సమయంలో ఏదో అంటూ తమ జట్టు గది వైపు వెళ్లిపోయాడు. ఇక తొలి టెస్టులో ఆతిథ్య జట్టుపై ఆసీస్118 పరుగులతో ఘన విజయం సాధించింది. -
ప్రత్యర్థి హేళన.. ద్రావిడ్ సమాధానం ఎలాగంటే...
సాక్షి, స్పోర్ట్స్ : అది 2001 ఈడెన్ గార్డెన్ మైదానం. ఆస్ట్రేలియాతో టెస్ట్ మ్యాచ్. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 445 పరుగులు చేయగా.. భారత్ కేవలం 171 రన్స్‌కే ఆలౌటై ఫాలో ఆన్ ఆడింది. ఆటగాళ్ల పేలమైన ఫామ్.. పైగా 274 పరుగులతో వెనుకబడి ఉంది. మ్యాచ్ పోయినట్లేనని అంతా నిరుత్సాహాంలో ఉన్నారు. కానీ, లక్ష్మణ్, ద్రావిడ్ ఆడిన వీరోచిత ఇన్నింగ్స్.. ఆపై బంతితో హర్భజన్ సింగ్ చేసిన మ్యాజిక్ భారత్ ను విజయతీరాలకు చేర్చింది. అనూహ్యమైన ఆ ఇన్నింగ్స్ క్రికెట్ చరిత్రలోనే ఓ అద్భుతంగా క్రికెట్ పండితులు అభివర్ణిస్తుంటారు. ఇక మ్యాచ్‌లో ద్రావిడ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆటగాళ్లంతా పెవిలియన్ కు క్యూ కట్టిన క్రమంలో ద్రావిడ్ క్రీజులోకి వచ్చాడు. అప్పటికే ద్రావిడ్ ఫామ్‌పై తీవ్ర చర్చ జరుగుతోంది. గత కొన్ని మ్యాచ్‌ల్లో మరీ దారుణమైన ప్రదర్శన ఆయన ఇచ్చారు. అందుకే ఆయన్ని ఆరోస్థానంలో బరిలోకి పంపారు. అప్పుడు ఆసీస్ కెప్టెన్‌గా ఉన్న స్టీవ్ వా స్లెడ్జింగ్‌కు పాల్పడ్డాడు. ఏం ద్రావిడ్.. ఈ ఇన్నింగ్స్‌లో ఆరో స్థానం.. తర్వాత ఏంటి? 12వ స్థానమా? అంటూ హేళన చేశాడు. కానీ, ద్రావిడ్ మాత్రం అవేం పట్టనట్లు క్రీజులోకి వెళ్లిపోయాడు. లక్ష్మణ్ కు జత కలిసిన ద్రావిడ్.. ఆట స్వరూపమే మారిపోయింది. బౌలర్లు ఎందరు మారుతున్నా... చెమట చిందించినా లాభం లేకపోయింది. ద్రావిడ్-లక్ష్మణ్ ద్వయం చితకబాదుతూనే ఉన్నారు. ముఖ్యంగా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్‌ను ఇద్దరూ ఓ ఆటాడేసుకున్నారు. వీరోచిత బ్యాటింగ్ కారణంగా 376 పరుగుల భాగస్వామ్యంతో భారత్ 657 పరుగులు చేసింది. ఆపై భజ్జీ మాయాజాలంతో ఆస్ట్రేలియా 212 పరుగులకే కుప్పకూలటంతో 171 పరుగుల చరిత్రాత్మక విజయం సాధించింది. తాజాగా బెంగళూరులో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ద్రావిడ్ ఈ విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. ‘‘ఆ సమయంలో నా ఫామ్ నిజంగా బాగోలేదు. మైదానంలోకి వెళ్లేముందు వా మాటలు నా చెవిని తాకాయి. కానీ, నా దృష్టిని మరలించలేకపోయాయి. అప్పుడు నేను ఆలోచించింది ఒక్కటే. గతం, భవిష్యత్ రెండూ ఇప్పుడు నా చేతుల్లో లేవు. ప్రస్తుతం నా ముందు ఉన్నది ఒక్కటే. వీలైనన్నీ బంతిని ఎదుర్కోవటం... పరుగులు సాధించటం. ఈ క్రమంలో లక్ష్మణ్ తో భాగస్వామిని కావటం అదృష్టంగా భావిస్తున్నా. జీవితంలో కష్టకాలం ఎదురైనప్పుడు వాటిని ఎలా అధిగమించాలో చూడాలి తప్ప.. వెనకడుగు వేసేందుకు యత్నించకూడదు. ’’ అని ద్రావిడ్ సభికులను ఉద్దేశించి పేర్కొన్నారు. కాగా, ఈడెన్ గార్డెన్స్‌లో వీవీఎస్ లక్ష్మణ్ (281) చిరస్మరణీయ ఇన్నింగ్స్ గడచిన అర్ధ శతాబ్దపు అత్యుత్తమ ప్రదర్శనగా గౌరవం కూడా అందుకుంది. -
ఐపీఎల్ డబ్బుల కోసమే స్లెడ్జింగ్ చేయడంలేదు...
వచ్చే ఏడాది ఐపీఎల్ వేలంలో ఫ్రాంచైజీలు తమను దూరంగా ఉంచుతాయనే భయంతోనే ఆస్ట్రేలియా ఆటగాళ్లు భారత్‌తో మ్యాచ్‌లు జరిగే సమయంలో స్లెడ్జింగ్‌కు పాల్పడటం లేదని భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ వ్యాఖ్యానించాడు. దుర్భాషలు చేస్తే ఐపీఎల్ యాజమాన్యాలు వారితో ఒప్పందం చేసుకునేందుకు వెనుకాడతాయనే విషయం కంగారూలకు బాగా తెలుసని వీరూ అభిప్రాయపడ్డాడు. భారత్‌తో వన్డే సిరీస్‌లో స్మిత్, వార్నర్, ఫించ్‌లపై అతిగా ఆధార పడటమే ఆ జట్టు పరాజయాలకు కారణమని అతను విశ్లేషించాడు. -
‘స్లెడ్జింగ్’ లేకుంటే ఆటను ఆస్వాదించలేం..
సాక్షి, హైదరాబాద్: స్లెడ్జింగ్ ఆటలోని ఒక భాగమేనని మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్రసెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. స్లెడ్జింగ్ లేకుంటే ఆటను ఆస్వాదించలేమని, ఆటగాళ్లు హద్దులు దాటనంత వరకే స్లెడ్జింగ్ బాగుంటుందని ఈ మాజీ క్రికెటర్ చెప్పుకొచ్చాడు. ఆటగాళ్ల బ్యాటింగ్, బౌలింగ్ శైలీలను అనుకరిస్తూ స్లెడ్జింగ్‌కు పాల్పడాలి తప్ప వ్యక్తిగత దూషణలకు దిగకూడదని సెహ్వాగ్ పేర్కొన్నాడు. ఇక కోహ్లి దూకుడతనం గురించి స్పందిస్తూ అది తన సహజశైలి అని గేమ్‌ను అస్వాదించడంలో అతను దూకుడుగా ప్రవర్తిస్తాడని సెహ్వాగ్ ఈ యువ కెప్టెన్‌ను వెనుకేసుకొచ్చాడు. మ్యాచ్ గెలిచినప్పుడే దూకుడుగా ప్రవర్తిస్తాడని, ఎవరైన తనపై స్లెడ్జింగ్ పాల్పడితే తిరిగి సమాధానం చెబుతాడని సెహ్వాగ్ పేర్కొన్నాడు. దీన్ని స్లెడ్జింగ్గా పరిగణించవద్దని కూడా సూచించాడు. ఈ సంవత్సరం మొదట్లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో ఇరు జట్ల మధ్య స్లెడ్జింగ్ తారాస్తాయికి చేరిన విషయం తెలిసిందే. టీమిండియా కెప్టెన్ కోహ్లి, ఆసీస్ కెప్టెన్ స్మిత్‌లు పరస్పరం వ్యక్తిగత దూషణల వరకు వెళ్లారు. ఇక మరోసారి భారత్‌తో వన్డే సిరీస్ కోసం ఆస్ట్రేలియా భారత గడ్డపై అడుగుపెట్టనుంది. దీంతో స్లెడ్జింగ్‌పై సర్వత్రా చర్చనెలకొనగా.. సెహ్వాగ్ వ్యాఖ్యలు మరింత హాట్ టాపిక్ అయ్యాయి. ఇక శ్రీలంక పర్యటన అనంతరం భారత్ ఆసీస్‌తో 5 వన్డేల ఆడనుంది. తొలి మ్యాచ్ సెప్టెంబర్ 17న చెన్నైలో జరగనుంది. -
నేను తిడతా... కాచుకోండి!
భారత్‌పై స్లెడ్జింగ్ చేస్తానంటున్న జాన్సన్ సిడ్నీ: భారత్‌తో జరిగే ప్రపంచకప్ సెమీస్‌లో కచ్చితంగా స్లెడ్జింగ్‌కు దిగుతానని ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ జాన్సన్ తేల్చి చెప్పాడు. ఇదంతా ఆటలో భాగమేనని సమర్థించుకున్నాడు. ‘వార్నర్ ఈసారి అలాంటి చేష్టలకు దిగనని చెప్పినట్టు విన్నాను. ఈసారి ఆ బాధ్యతను నేను తీసుకుంటాను. ఇదంతా ఆటలో భాగమే. పాక్‌తో క్వార్టర్స్‌లో వాట్సన్, వహాబ్ మధ్య మాటల యుద్ధం నిజంగా అసాధారణం. ఇద్దరూ ఏ స్థాయిలో ఆడారో చూశాం కదా’ అని జాన్సన్ గుర్తుచేశాడు. మరోవైపు ప్రపంచకప్‌లో పదే పదే ఆటగాళ్లతో ఘర్షణలకు దిగే వారిపై మ్యాచ్ నిషేధం విధిస్తామని గతంలోనే ఐసీసీ సీఈవో డేవ్ రిచర్డ్సన్ హెచ్చరించారు. ‘స్నేహితులు’ ఒక్కటయ్యారు... ఆసీస్, పాక్ మధ్య జరిగిన క్వార్టర్స్ మ్యాచ్‌లో మాటల యుద్ధానికి దిగిన పేసర్ వహాబ్ రియాజ్, బ్యాట్స్‌మన్ షేన్ వాట్సన్ ట్విట్టర్ సాక్షిగా ఒక్కటయ్యారు. పాక్ బ్యాటింగ్ సమయంలో వహాబ్‌ను వాట్సన్ మాటలతో రెచ్చగొట్టాడు. ఆ తర్వాత బౌలింగ్‌కు దిగిన వహాబ్.. తన పదునైన బౌన్సర్లతో వాట్సన్ వెన్నులో వణుకుపుట్టిస్తూ రెచ్చగొట్టాడు. ఇద్దరిపై ఐసీసీ జరిమానా కూడా విధించింది. ‘ఆ మ్యాచ్ అద్భుతంగా సాగింది. నీవు చాలా బాగా ఆడావు. సెమీస్‌లో ఇలాగే మెరుగ్గా ఆడాలని కోరుకుంటున్నాను’ అని వాట్సన్‌కు పాక్ పేసర్ ట్వీట్ చేశాడు. ‘వహాబ్ నుంచి ప్రత్యేక స్పెల్ వచ్చింది. నాకెలాంటి గాయాలు కానందుకు అదృష్టవంతుణ్ణి. నీపై నాకెలాంటి దురుద్దేశం లేదు’ అని వాట్సన్ స్పందించాడు.