లార్డ్స్ : స్లెడ్జింగ్‌తో తాము ఎంత నష్టపోయామో ఆస్ట్రేలియా జట్టుకు తెలిసిరానట్లుంది. గత దక్షిణాఫ్రికా పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న బాల్‌ట్యాంపరింగ్ ఉదంతానికి మూలం స్లెడ్జింగ్ అనే విషయాన్ని ఆసీస్ క్రికెటర్లు ఇంకా గుర్తించనట్లున్నారు. బాల్ ట్యాంపరింగ్‌తో ప్రపంచం ముందు తల వంచుకున్న ఆసీస్ జట్టు కీలక ఆటగాళ్లను దూరం చేసుకొవడమే కాకుండా కోచ్ డారెన్ లెహ్మెన్ సేవలను కోల్పోయింది. అతని స్థానంలో వచ్చిన నూతన కోచ్ జస్టిన్ లాంగర్ అయినా తమ ఆటగాళ్లు స్లెడ్జింగ్ పాల్పడకుండా జాగ్రత్తలు తీసుకుంటాడని అనుకుంటే ఆయన ఏకంగా స్లెడ్జింగ్ మంచిదే అని ఓ స్టేట్‌మెంట్ ఇచ్చాడు.
ఆయన ఏమన్నాడంటే.. ‘‘స్లెడ్జింగ్ చాలా మంచింది. కానీ శృతిమించకూడదు. స్లెడ్జింగ్ అంటే అందరు తిట్టుకోవడం అని భావిస్తారు. కానీ స్లెడ్జింగ్ ఓ పరిహాసం. ఆస్ట్రేలియాలో స్లెడ్జింగ్ సహజమైన విషయం. నా కూతురితో యూనో (కార్డ్ గేమ్) ఆడినప్పుడు ఇద్దరం ఒకరికొకరం స్లెడ్జ్ చేసుకుంటాం. నేను మా తల్లిదండ్రులతో గోల్ఫ్ ఆడినప్పుడు కూడా వారిని నేను. నన్ను వారు స్లెడ్జ్ చేస్తారు. గత ముప్పై ఏళ్లుగా ఆస్ట్రేలియన్స్ స్లెడ్జింగ్‌కు పాల్పడుతున్నారు’’. అని చెప్పుకొచ్చాడు. ఇక స్టీవ్ స్మిత్ స్థానంలో కెప్టెన్‌గా ఎంపికైన టీమ్ పెయిన్ సైతం మైదానంలో నిశబ్దంగా ఉండమని, మర్యాదకరమైన స్లెడ్జింగ్‌కు పాల్పడుతూ.. ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టేస్తామని తెలిపాడు. అయితే కేవలం పరిహాసమే ఆడుతాం తప్పా.. వ్యక్తిగత దూషణలకు దిగమని చెప్పుకొచ్చాడు. ఇక లాంగర్ కామెంట్స్‌పై సోషల్ మీడియా వేదికగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment