Darren Lehmann
-
'అలా అయితేనే టీమిండియాను కొట్టగలం'.. ఆసీస్‌కు సూచనలు
ఫిబ్రవరిలో టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య బోర్డర్-గావస్కర్ టెస్టు సిరీస్ మొదలుకానుంది. ఈ సిరీస్ కోసం ఆస్ట్రేలియా ఇప్పటికే తమ జట్టును ప్రకటించింది. ఇప్పటికే వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ పోరుకు అర్హత సాధించిన ఆసీస్ టీమిండియాతో టెస్టు సిరీస్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అటు టీమిండియా కూడా ఈ టెస్టు సిరీస్ నెగ్గితేనే వరల్డ్ టెస్టు చాంపియనషిప్ ఫైనల్ ఆడే చాన్స్ ఉంటుంది. ఇక నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు ఫిబ్రవరి 9న మొదలుకానుంది. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ అనంతరం ఇరుజట్ల మధ్య మూడు వన్డే మ్యాచ్‌లు జరగనున్నాయి. 2017 పర్యటనలో ఆసీస్ బౌలర్ స్టీవ్ ఓకఫీ ఇక ఆస్ట్రేలియా చివరిసారి 2017లో భారత పర్యటనకు వచ్చినప్పుడు టెస్టు సిరీస్‌ను 2-1 తేడాతో టీమిండియాకు కోల్పోయింది. ఆ సిరీస్‌లో తొలి టెస్టులో ఆసీస్ 333 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. అప్పటి మ్యాచ్‌లో లెఫ్టార్మ్ స్పిన్నర్ స్టీవ్ ఒకఫీ 12 వికెట్లతో టీమిండియాను శాసించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. అయితే ఆ తర్వాత ఫుంజుకున్న టీమిండియా రెండు, నాలుగు టెస్టుల్లో గెలిచి.. మూడో టెస్టు డ్రా చేసుకొని 2-1 తేడాతో సిరీస్ గెలిచింది. ఆ తర్వాత 2020-21లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన టీమిండియా రహానే సారధ్యంలో 2-1 తేడాతో టెస్టు సిరీస్‌ను గెలిచి చారిత్రక విజయాన్ని అందుకుంది. తాజాగా ఐదేళ్ల తర్వాత భారత గడ్డపై టెస్టు సిరీస్ ఆడేందుకు వచ్చిన ఆస్ట్రేలియా ఈసారి ఎలాగైనా సిరీస్‌ను ఒడిసి పట్టుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ కోచ్ డారన్ లీమన్ ఆస్ట్రేలియా జట్టుకు టీమిండియా గడ్డపై టెస్టు సిరీస్ ఎలా గెలవాలనే దానిపై పలు సూచనలు ఇచ్చాడు.స్పిన్ విభాగం ఎంత బలంగా ఉంటే టీమిండియాను అంత బలంగా కొట్టగలం అని పేర్కొన్నాడు. 2017 టీమిండియా పర్యటనలో ఆస్ట్రేలియా జట్టుకు లీమన్ కోచ్‌గా వ్యవహరించాడు. తాజాగా ఆస్ట్రేలియన్ రేడియో స్టేషన్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో డారన్ లీమన్ మాట్లాడుతూ.. ''సొంతగడ్డపై టీమిండియాను మట్టికరిపించడం అంత ఈజీ కాదు. స్వదేశంలో టీమిండియా ప్రత్యర్థి పాలిట సింహస్వప్నం. తొలి టెస్టులో ఓడిపోయినా తిరిగి ఫుంజుకోవడం వారికి బాగా అలవాటు. 2017 పర్యటనలో మన జట్టు ఆ దెబ్బను రుచి చూసింది. అయితే తెలివిగా వ్యవహరిస్తే టీమిండియాను ఓడించొచ్చు. భారత్ పిచ్‌లు స్పిన్ బౌలింగ్‌కు ఎక్కువగా అనుకూలిస్తాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ మధ్యన పేస్ ట్రాక్‌లు తయారు చేస్తున్నప్పటికి సంప్రదాయ టెస్టుల్లో స్పిన్నర్ల ప్రభావమే ఎక్కువగా కనిపిస్తుంది. స్పిన్నర్ ఆష్టన్ అగర్ ఆస్ట్రేలియా జట్టులో ఆఫ్ స్పిన్నర్ నాథన్ లియోన్ ప్రస్తుతం ప్రధాన స్పిన్నర్‌గా ఉన్నాడు. అతనికి తోడుగా ఒక లెగ్ స్పిన్నర్ కాంబినేషన్ కోసం చూడడం మంచింది. లియోన్ కాకుండా ఆష్టన్ అగర్, మిచెల్ స్వీప్సన్, టాడ్ ముర్పే లాంటి స్పిన్నర్లు కూడా జట్టులో ఉన్నారు. ఆష్టన్ అగర్ లెఫ్టార్మ్ స్పిన్నర్ కాగా మిచెల్ స్వీప్సన్ లెగ్ స్పిన్నర్. మ్యాచ్‌ల పరంగా ఇద్దరు దాదాపు సమానంగా ఉన్నారు. అయితే ఆస్టన్ అగర్ బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ కూడా చేయగల సమర్థుడు. కానీ భారత్ లాంటి పిచ్‌లపై లెగ్ స్పిన్నర్ మిచెల్ స్వెప్సన్కు వికెట్లు తీయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇక ఈ సిరీస్‌కు ఎంపికైన మరొక ఆటగాడు ఆఫ్ స్పిన్నర్ టాడ్ మర్ఫీ. ముగ్గురు పేసర్లు.. ఇద్దరు స్పిన్నర్లు.. లేదా ఇద్దరు పేసర్లు.. ముగ్గురు స్పిన్నర్ల కాంబినేషన్ అయినా బాగానే ఉంటుంది. ఇద్దరు స్పిన్నర్లు కావాలంటే నా ఓటు ఆస్టన్ అగర్కే ఉంటుంది. ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగాలనుకుంటే అప్పుడు మిచెల్ స్వీప్సన్ను కూడా ఎంపిక చేసుకోవచ్చు. టీమిండియా కచ్చితంగా ఇదే తరహాలో జట్టును ఎంపిక చేస్తుంది. అయితే వారికి పిచ్‌పై పూర్తి అవగాహన ఉండడం మనకు ప్రతికూలం. అని పేర్కొన్నాడు. టీమిండియాతో టెస్టు సిరీస్‌కు ఆస్ట్రేలియా జట్టు: పాట్ కమిన్స్ (కెప్టెన్), స్టీవ్ స్మిత్ (వైస్ కెప్టెన్), ఆష్టన్ అగర్, స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, కామెరాన్ గ్రీన్, పీటర్ హ్యాండ్స్కాంబ్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుషేన్, నాథన్ లియోన్, లాన్స్ మోరిస్, టాడ్ మర్ఫీ, మాథ్యూ రెన్షా, మిచెల్ స్టార్క్, మిచెల్ స్వెప్సన్, డేవిడ్ వార్నర్ టెస్టు సిరీస్ షెడ్యూల్: ఫిబ్రవరి 9-13 వరకు: తొలి టెస్టు, నాగ్‌పూర్ ఫిబ్రవరి 17-21 వరకు: రెండో టెస్టు, ఢిల్లీ మార్చి 1-5 వరకు : మూడో టెస్టు, ధర్మశాల మార్చి 9-13 వరకు: నాలుగో టెస్టు, అహ్మదాబాద్ వన్డే సిరీస్ షెడ్యూల్: మార్చి 17న తొలి వన్డే, ముంబై మార్చి 19న రెండో వన్డే, విశాఖపట్నం మార్చి 22న మూడో వన్డే, చెన్నై చదవండి: 'కివీస్‌ను క్లీన్‌స్వీప్ చేస్తే టీమిండియాకు సువర్ణావకాశం' 'పంత్ త్వరగా కోలుకోవాలి'.. టీమిండియా క్రికెటర్ల పూజలు -
'నువ్వేమైనా గర్భవతివా!.. ఆ పొట్టేంటి?'
Harbhajan Singh Recalls Sledging With Darenn Lehmann.. టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్బజన్ సింగ్ డిసెంబర్ 24న అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లకు గుడ్‌బై చెబుతున్నట్లు ప్రకటించాడు. 23 ఏళ్ల కెరీర్లో టీమిండియా స్పిన్నర్‌గా ఎన్నో ఘనతలు సాధించిన భజ్జీ టెస్టుల్లో 400కు పైగా వికెట్లు, వన్డేల్లో 200కు పైగా వికెట్లు, టి20ల్లో 25 వికెట్లు.. ఓవరాల్‌గా అన్ని ఫార్మాట్లు కలిపి 711 వికెట్లు తీశాడు. ఇక హర్భజన్ సింగ్ రిటైర్మెంట్పై మాజీ క్రికెటర్లు స్పందింస్తున్నారు. హర్బజన్‌కు ఆస్ట్రేలియన్ క్రికెటర్లంటే విపరీతమైన ప్రేమ ఉంది.. కానీ వారి స్లెడ్జింగ్ ఇష్టం ఉండేది కాదంటూ గతంలో ఆప్ కి అదాలత్‌కు తానే స్వయంగా ఇచ్చిన ఇంటర్య్వూలో చెప్పుకొచ్చాడు. ఈ విషయాన్ని మరోసారి గర్తుచేసుకుందాం. చదవండి: Harbhajan Singh: ఆడతాడు... తిడతాడు... కొడతాడు! అది భజ్జీ స్పెషల్.. ''ఆస్ట్రేలియా ఆటగాళ్లు అంటే స్లెడ్జింగ్‌కు మారుపేరుగా ఉండేవారు. ముఖ్యంగా వారి గడ్డపై సిరీస్ ఆడే జట్లను తమ స్లెడ్జింగ్‌తోనే మానసికంగా దెబ్బతీసి పైచేయి సాధించేవారు. కానీ నాలాంటి వారిని ఎదుర్కొనడానికి మాత్రం ఆస్ట్రేలియన్ ఆటగాళ్లు భయపడేవారు. ఒక సందర్భంగా మ్యాచ్‌లో నేను బ్యాటింగ్ చేస్తున్న సమయంలో నా పక్కనే ఉన్న డారెన్ లీమన్ అదే పనిగా నాపై స్లెడ్జింగ్ చేస్తూనే ఉన్నాడు. దీంతో చిర్రెత్తి లీమన్ పొట్టవైపు చూస్తూ.. నువ్వేమైనా ప్రెగ్నెంటా.. ఆ పొట్టేంటి! అని నవ్వుతూనే అడిగేశాను. ఆ సమయంలో ఈ విషయంపై ఇద్దరి మధ్య చిన్నపాటి మాటలయుద్దం జరిగిందనుకోండి. అయితే ఈ విషయాన్ని లీమన్ అప్పటి స్పిన్నర్ షేన్ వార్న్‌కు చెప్పాడు. అంతే.. వార్న్ ఒక్కసారిగా పగలబడి నవ్వుతూ.. ''నా దగ్గరకొచ్చి లీమన్ ఏమైనా అన్నావా'' అని అడిగాడు. దానికి ''నేను అవునని సమాధానం ఇవ్వడంతో.. కరెక్టే.. ఆటగాళ్లకు అంత పెద్ద పొట్ట ఉండకూడదు''. ఆ తర్వాత వార్నర్ లీమన్‌తో.. మనం ఎవరినైనా స్లెడ్జ్ చేయొచ్చు.. కానీ టర్బోనేటర్తో(భజ్జీ) మాత్రం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పడం నాకు ఇప్పటికి గుర్తుంది.'' అని ఆప్ కి అదాలత్‌కు గతంలో ఇచ్చిన ఇంటర్య్వూలో చెప్పుకొచ్చాడు. చదవండి: గడ్డు పరిస్థితుల్లో నా భార్య ఇచ్చిన అండ దండలు వెలకట్టలేనివి.. గర్వంగా ఉంది మై లవ్! -
ట్విటర్ అకౌంట్ హ్యాక్.. అసభ్యకరంగా పోస్టులు
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, కోచ్ డారెన్ లీమన్ ట్విటర్ అకౌంట్ హ్యాక్‌కు గురైంది. ఈ విషయాన్ని లీమన్ అధికారికంగా ప్రకటించాడు. బిగ్‌బాష్ లీగ్‌లో భాగంగా బ్రిస్బేన్ హీట్‌కు కోచ్‌గా లీమన్ వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. సోమవారం బ్రిస్బేన్- సిడ్నీ థండర్స్ మ్యాచ్ సందర్భంగా లీమన్ బిజీగా ఉండటంతో అతడి ట్విటర్ అకౌంట్ హ్యాక్‌కు గురైన విషయాన్ని ఆలస్యంగా గుర్తించాడు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. లీమన్ ట్విటర్ ఖాతాను హ్యాక్ చేసిన ఓ హ్యాకర్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మద్దతుగా.. ఇరాన్, ఖాసీం సులేమానీలకు వ్యతిరేకంగా పోస్ట్‌లు చేశాడు. అంతేకాకుండా లీమన్ ఖాతా పేరును 'Qassem Soleimani| F**k Iran' గా అసభ్యకరంగా మార్చాడు. దీంతో లీమన్ ఫాలోవర్స్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అంతేకాకుండా కొందరు లీమన్‌పై దుమ్మెత్తిపోశారు. అయితే ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన లీమన్ వెంటనే దిద్దుబాటు చర్యలకు దిగాడు. తన ట్విటర్ ఆకౌంట్‌కు హ్యాక్‌కు గురైందని బ్రిస్బేన్ హీట్ అధికారిక ట్విటర్ లో పేర్కొన్నాడు. అంతేకాకుండా ఆ అకౌంట్ నుంచి వచ్చే మెసేజ్‌లు, పోస్ట్‌లను ఎవ్వరూ నమ్మవద్దని, తనను తప్పుగా అపార్థం చేసుకోవద్దని తన ఫోలవర్స్‌కు, అభిమానులకు విజ్ఞప్తి చేశాడు. అంతేకాకుండా తన ఫాలోవర్స్‌కు క్షమాపణలు చెప్పాడు. అయితే తన ట్విటర్ హ్యాక్ గురవడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలను చూశాక కొంతకాలం సోషల్ మీడియాకు దూరంగా ఉండబోతున్నట్లు ప్రకటించాడు. కాస్త విరామం తర్వాత మళ్లీ వసానని, అప్పుడు మరింత అప్రమత్తంగా ఉంటానన్నాడు. లీమన్‌కు 3,40,000కు పైగా మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇక లీమన్ సోషల్ మీడియాలో చాలా ఆక్టీవ్‌గా ఉంటాడు. ఆటకు సంబంధించి ఛలోక్తులు విసురుతుంటాడు. బాల్ ట్యాంపరింగ్ ఉదంతం తర్వాత ఆస్ట్రేలియా కోచ్ పదవికి లీమన్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ మధ్యకాలంలో ట్విటర్ హ్యాక్‌కు గురైన రెండో ఆసీస్ మాజీ క్రికెటర్‌గా లీమన్ చేరాడు. గతేడాది అక్టోబర్‌లో షేన్ వాట్సన్ అకౌంట్ కూడా హ్యాక్‌కు గురైంది. వాట్సన్ ట్విటర్ ఆకౌంట్‌ను హ్యాక్ చేసిన హ్యాకర్ అశ్లీల ఫోటోలు, వీడియోలను పోస్ట్ చేశాడు. దీంతో అభిమానులతో పాటు, వాట్సన్ కూడా షాక్‌కు గురయ్యాడు. అయితే తన వలన జరిగిన అసౌకర్యానికి వాట్సన్ అభిమానులకు క్షమాపణలు కోరిన విషయం తెలిసిందే. అమెరికా జరిపిన వైమానిక దాడిలో ఇరాన్ జనరల్ ఖాసీం సులేమానీ మరణించిన విషయం తెలిసిందే. ఆ హెలికాప్టర్‌ను తమ సైన్యమే పేల్చేసిందని, వేలాది మంది అమాయకుల ప్రాణాలను బలి తీసుకున్నందునే సులేమానీని హతమార్చినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడంతో రెండు దేశాల మధ్య అగ్గి రాజుకుంది. అమెరికాపై ప్రతిదాడి తప్పదని ఇరాన్.. గట్టిగానే హెచ్చరించింది. అయితే, ఉద్రిక్తతలు పెరగడంతో ఇరాక్‌కు మరిన్ని సైనిక బలగాలను పంపుతున్నట్టు అమెరికా ప్రకటించింది. దీంతో రెండు దేశాల మధ్య యుద్ధవాతావరణం చోటు చేసుకుంది. -
స్లెడ్జింగ్ మంచిదే: ఆసీస్ కోచ్
లార్డ్స్ : స్లెడ్జింగ్‌తో తాము ఎంత నష్టపోయామో ఆస్ట్రేలియా జట్టుకు తెలిసిరానట్లుంది. గత దక్షిణాఫ్రికా పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న బాల్‌ట్యాంపరింగ్ ఉదంతానికి మూలం స్లెడ్జింగ్ అనే విషయాన్ని ఆసీస్ క్రికెటర్లు ఇంకా గుర్తించనట్లున్నారు. బాల్ ట్యాంపరింగ్‌తో ప్రపంచం ముందు తల వంచుకున్న ఆసీస్ జట్టు కీలక ఆటగాళ్లను దూరం చేసుకొవడమే కాకుండా కోచ్ డారెన్ లెహ్మెన్ సేవలను కోల్పోయింది. అతని స్థానంలో వచ్చిన నూతన కోచ్ జస్టిన్ లాంగర్ అయినా తమ ఆటగాళ్లు స్లెడ్జింగ్ పాల్పడకుండా జాగ్రత్తలు తీసుకుంటాడని అనుకుంటే ఆయన ఏకంగా స్లెడ్జింగ్ మంచిదే అని ఓ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన ఏమన్నాడంటే.. ‘‘స్లెడ్జింగ్ చాలా మంచింది. కానీ శృతిమించకూడదు. స్లెడ్జింగ్ అంటే అందరు తిట్టుకోవడం అని భావిస్తారు. కానీ స్లెడ్జింగ్ ఓ పరిహాసం. ఆస్ట్రేలియాలో స్లెడ్జింగ్ సహజమైన విషయం. నా కూతురితో యూనో (కార్డ్ గేమ్) ఆడినప్పుడు ఇద్దరం ఒకరికొకరం స్లెడ్జ్ చేసుకుంటాం. నేను మా తల్లిదండ్రులతో గోల్ఫ్ ఆడినప్పుడు కూడా వారిని నేను. నన్ను వారు స్లెడ్జ్ చేస్తారు. గత ముప్పై ఏళ్లుగా ఆస్ట్రేలియన్స్ స్లెడ్జింగ్‌కు పాల్పడుతున్నారు’’. అని చెప్పుకొచ్చాడు. ఇక స్టీవ్ స్మిత్ స్థానంలో కెప్టెన్‌గా ఎంపికైన టీమ్ పెయిన్ సైతం మైదానంలో నిశబ్దంగా ఉండమని, మర్యాదకరమైన స్లెడ్జింగ్‌కు పాల్పడుతూ.. ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టేస్తామని తెలిపాడు. అయితే కేవలం పరిహాసమే ఆడుతాం తప్పా.. వ్యక్తిగత దూషణలకు దిగమని చెప్పుకొచ్చాడు. ఇక లాంగర్ కామెంట్స్‌పై సోషల్ మీడియా వేదికగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చదవండి: ఆస్ట్రేలియా.. పాంటింగ్ రీ ఎంట్రీ.! -
ఆస్ట్రేలియా.. పాంటింగ్ రీ ఎంట్రీ.!
సిడ్నీ : ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఆ జట్టు కోచింగ్ బృందంలో చేరనున్నాడు. ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా 5 వన్డేలు, ఒక టీ20 మ్యాచ్‌కు పాంటింగ్ సహాయ కోచ్‌గా సేవలందించనున్నాడు. తన మాజీ సహచర ఆటగాడు, ఆసీస్ నూతన కోచ్ జస్టిన్ లాంగర్‌తో కలిసి పాంటింగ్ పనిచేయనున్నాడు. ఈ విషయాన్ని జస్టిన్ లాంగరే ఓ ప్రకటనలో తెలిపాడు. ‘‘రికీ ఒక గొప్ప ఆటగాడు. కామెంటేటర్‌గా ఒప్పందాల నేపథ్యంలో ఇప్పటికే అతను ఇంగ్లండ్‌లోనే ఉన్నాడు. ముఖ్యమైన సిరీస్‌లకు ఆయన కోచింగ్ బృందంలో చేరడం చాలా మంచి విషయం. మ్యాచ్ పట్ల అతనికి ఉన్న అవగాహన, అనుభవం, మాకు కచ్చితంగా ఉపయోగపడుతోంది.’’ అని జస్టిన్ చెప్పుకొచ్చాడు. బాల్‌ట్యాంపరింగ్ ఉదంతం క్రికెట్ ఆస్ట్రేలియాను (సీఏ) అతలా కుతలం చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన పట్ల బాధ్యత వహిస్తూ మాజీ కోచ్ డారెన్ లెహ్మెన్ తన బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. దీంతో జస్టిన్ను సీఏ నూతన కోచ్‌గా నియమించిన విషయం తెలిసిందే. తన సారథ్యంలో ఆసీస్‌కు మూడు సార్లు ప్రపంచకప్ అందించిన పాంటింగ్ తన కామెంటేటర్ ఒప్పందాలు నేపథ్యంలో జూన్ 10 నుంచి జట్టుతో చేరనున్నాడు. గతంలో కూడా పాంటింగ్ ఆసీస్ జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా వ్యవహరించాడు. గతేడాది శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్, ఈ ఏడాది ప్రారంభంలో న్యూజిలాండ్, ఇంగ్లండ్‌లతో జరిగిన ట్రై సిరీస్‌లకు సహాయ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. ఇక ఈ సీజన్ ఐపీఎల్లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు హెడ్ కోచ్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. -
స్మిత్ మళ్లీ కెప్టెన్ అవుతాడు: లీమన్
సిడ్నీ: బాల్ ట్యాంపరింగ్ వివాదం కారణంగా ఆస్ట్రేలియా క్రికెట్ కోచ్ పదవి నుంచి తప్పుకున్న డారెన్ లీమన్‌కు తాజాగా కోచింగ్ బాధ్యతలు అప్పగించారు. ఆస్ట్రేలియా జాతీయ జట్టుకు ఆటగాళ్లను సిద్ధం చేసే నేషనల్ ఫర్మార్మెన్స్ స్క్వాడ్ (ఎన్పీఎస్)కు కోచ్‌గా వ్యవహరించనున్నాడు. అయితే బాల్ ట్యాంపరింగ్ వివాదంతో ఏడాది పాటు క్రికెట్‌కు దూరమైన స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌తో పాటు 9నెలల పాటు నిషేధం ఉన్న బాన్‌క్రాఫ్ట్ చాలా మంచివాళ్లని చెప్పాడు లీమన్. స్థానిక రేడియోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్యాంపరింగ్ వివాదంపై మరోసారి లీమన్ స్పందించారు. ‘స్మిత్, వార్నర్, బాన్‌క్రాఫ్ట్‌లు చాలా మంచివాళ్లు. పొరపాటున తప్పు చేశారు. వారిపై నిషేధం పూర్తయ్యాక మళ్లీ జాతీయ జట్టులో ఆడతారని నమ్మకం ఉంది. వారిపై నిషేధం ముగిసేవరకు రోజూ బాధపడతాను. వాళ్లు ఆసీస్‌కు మళ్లీ ఆడి దేశ ప్రతిష్టను రెట్టింపు చేస్తారు. స్మిత్ మళ్లీ కెప్టెన్ అవుతాడు. అదృష్టవశాత్తూ అందరూ వారి తప్పుల్ని క్షమించేశారని’ లీమన్ వివరించాడు. నేషనల్ ఫర్మార్మెన్స్ స్క్వాడ్‌కు ట్రాయ్ కూలీ, ర్యాన్ హ్యారిస్, క్రిస్ రోజర్స్లతో కలిసి లీమన్ సేవలందించనున్నాడు. -
ఆస్ట్రేలియా కోచ్‌గా లాంగర్
సిడ్నీ: ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కోచ్ స్థానాన్ని మరో మాజీ ఆటగాడు భర్తీ చేశాడు. వచ్చే నాలుగేళ్ల కాలానికి కోచ్‌గా జస్టిన్ లాంగర్‌ను నియమిస్తున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ప్రకటించింది. బాల్ ట్యాంపరింగ్ వివాదం తర్వాత పదవి నుంచి తప్పుకున్న డారెన్ లీమన్ స్థానంలో 47 ఏళ్ల లాంగర్‌ను ఎంపిక చేశారు. లీమన్ తప్పుకున్న తర్వాత కోచ్‌గా లాంగర్ పేరు ప్రముఖంగా వినిపించగా... అతని నియామకాన్ని గురువారం అధికారికంగా ఖరారు చేశారు. జూన్ 13 నుంచి ఇంగ్లండ్‌తో జరిగే ఐదు వన్డేల సిరీస్ కోచ్‌గా లాంగర్‌కు తొలి పర్యటన కానుంది. ఆసీస్ జట్టుతో కోచింగ్‌కు సంబంధించి లాంగర్‌కు గతానుభవం ఉంది. టిమ్ నీల్సన్, మికీ ఆర్థర్లు కోచ్‌లుగా వ్యవహరించిన సమయంలో అతను సహాయక కోచ్‌గా పని చేశాడు. ఆ తర్వాత వెస్ట్రన్ ఆస్టేలియా, బిగ్‌బాష్‌లో పెర్త్ స్కార్చర్స్ జట్లకు కూడా కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. అతని శిక్షణలో పెర్త్ స్కార్చర్స్ మూడు సార్లు బిగ్‌బాష్ టైటిల్ గెలుచుకోవడం విశేషం. ‘ఆస్ట్రేలియా జట్టుకు కోచ్‌గా ఎంపిక కావడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. క్రికెట్ ప్రపంచం దృష్టిలో మా జట్టుపై గౌరవం పెంచడం కూడా నాకు అన్నింటికంటే ముఖ్యం. రాబోయే రోజుల్లో ఆటపరంగా అనేక సవాళ్లు నా కోసం సిద్ధంగా ఉన్నాయి. అయితే అన్నింటికంటే పెద్దది మాత్రం భారత్‌లో భారత్‌తో సిరీస్ ఆడటమే. అక్కడి ప్రదర్శనపైనే మా జట్టు గొప్పతనం గురించి ఒక అంచనాకు రాగలను. ఎందుకంటే 2004లో అక్కడ సిరీస్ గెలిచిన జట్టులో నేనూ ఉన్నాను. నా కెరీర్లో అదే మౌంట్ ఎవరెస్ట్లాంటి ఘటన’ అని లాంగర్ వ్యాఖ్యానించాడు. ఆస్ట్రేలియా తరఫున అత్యుత్తమ టెస్టు క్రికెటర్లలో ఒకడిగా జస్టిన్ లాంగర్‌కు గుర్తింపు ఉంది. కొత్త మిలీనియంలో కంగారూలు క్రికెట్ ప్రపంచాన్ని శాసించిన సమయంలో జట్టులో ఓపెనర్‌గా అతను కీలక పాత్ర పోషించాడు. 14 ఏళ్ల కెరీర్లో లాంగర్ 105 టెస్టుల్లో 45.27 సగటుతో 7696 పరుగులు చేశాడు. ఇందులో 23 సెంచరీలు ఉన్నాయి. మరో ఓపెనర్ మాథ్యూ హేడెన్‌తో కలిసి ఆసీస్‌కు చిరస్మరణీయ విజయాలు అందించాడు. హేడెన్–లాంగర్ జంట 113 టెస్టుల్లో కలిపి సంయుక్తంగా 5655 పరుగులు జత చేసి టెస్టు క్రికెట్లో గ్రీనిడ్జ్–హేన్స్ (6482) తర్వాత రెండో అత్యుత్తమ ఓపెనింగ్ జోడిగా గుర్తింపు పొందారు. -
కోచ్ పదవి నుండి తప్పుకున్న డారెన్ లీమన్
-
ఆసీస్‌కు మరో షాక్.. కోచ్ కూడా..!
బాల్ ట్యాంపరింగ్ కుంభకోణం ఆస్ట్రేలియా క్రికెట్‌ను కుదిపేస్తూనే ఉంది. ఈ కుంభకోణానికి బాధ్యులైన స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, కామెరాన్ బెన్‌క్రాఫ్ట్ ఇప్పటికే నిషేధానికి గురయ్యారు. ఈ వివాదంతో కుంగిపోయిన ఆసీస్ జట్టుకు మరో షాక్ తగిలింది. తాజాగా ఆస్ట్రేలియా కోచ్ డారెన్ లీమన్ కూడా జట్టుకు దూరం కాబోతున్నారు. బాల్ ట్యాంపరింగ్ స్కాంతో ప్రమేయం లేకపోయినప్పటికీ.. తాను రాజీనామా చేస్తున్నట్టు లీమన్ ప్రకటించారు. దక్షిణాఫ్రికాతో నాలుగో టెస్టు ముగిసిన తర్వాత తాను కోచ్ పదవి నుంచి తప్పుకుంటానని తెలిపారు. ‘ఈ ప్రస్థానంలో ఎన్నిసార్లు ప్రియమైన వారికి దూరంగా ఉంటామో ఇక్కడ ఉండేవారికి తెలుసు. కుటుంబసభ్యులతో మాట్లాడిన తర్వాత నేను రాజీనామా చేయడానికి ఇదే మంచి సమయమని నిర్ణయించుకున్నా’ అంటూ కంటతడి పెడుతూ లీమన్ మీడియాతో తెలిపారు. బాల్ ట్యాంపరింగ్ విషయంలో లీమన్ ప్రమేయం లేదని, తాము బాల్ ఆకారాన్ని మార్చాలనుకున్న విషయం ఆయనకు తెలియనే తెలియదని స్టీవ్ స్మిత్ ప్రకటించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా మైదానంలో బాల్ ఆకారాన్ని మార్చేందుకు బెన్‌క్రాఫ్ట్ ప్రయత్నిస్తున్న సమయంలో ‘ఏం జరుగుతోంది. అసలేం జరుగుతోంది’ అంటూ సబ్‌స్టిట్యూట్ ఆటగాడు పీటర్ హ్యాంద్స్కంబ్తో లీమన్ వాకీటాకీలో పేర్కొనడంతో.. ఆయన ఈ వివాదం నుంచి బయటపడ్డారు. ‘ఆటగాళ్లతో మాట్లాడి.. వారికి వీడ్కోలు చెప్పడం చాలా కష్టమైన పని. కానీ నేను వెళ్లిపోక తప్పదు. గత కొన్నిరోజులుగా ఎన్నో పరిణామాలు.. ఎన్నో దుర్భాషలు ఎదుర్కొన్నాను. దీనికి ఎవరో ఒకరు మూల్యం చెల్లించాలి. వాళ్లు (స్టీవ్‌స్మిత్, వార్నర్, బెన్‌క్రాఫ్ట్) తప్పు చేశారు. ఆస్ట్రేలియా జట్టు మళ్లీ బలోపేతం అవుతుందని, ఈ యువ ఆటగాళ్లను ఆస్ట్రేలియా ప్రజలు మన్నిస్తారని, వారు తిరిగి జట్టులోకి వస్తారని ఆశిస్తున్నా’ అని లీమన్ మీడియాతో తెలిపాడు. -
ఆ ముగ్గురికి రెండో అవకాశం ఇవ్వండి...
ఎంతోమంది అభిమానుల నమ్మకాన్ని వమ్ము చేశాం. నా మనసు లోతుల్లోంచి వారందరికీ క్షమాపణలు చెబుతున్నాను. నేను ఆ ముగ్గురి మానసిక పరిస్థితి గురించే (స్మిత్, వార్నర్, బాన్‌క్రాఫ్ట్) ఆందోళన చెందుతున్నాను. ప్రస్తుతం మేము ఆడుతున్న తీరును మార్చుకోవాల్సిన అవసరం ఉంది. మళ్లీ అభిమానుల మద్దతు, అభిమానం సంపాదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. స్మిత్, వార్నర్, బాన్‌క్రాఫ్ట్ తీవ్రమైన తప్పిదమే చేశారు. అయితే వాళ్లు చెడ్డవాళ్లు మాత్రం కాదు. అభిమానులు వారికి రెండో అవకాశం ఇవ్వాలని కోరుతున్నాను. -
ట్యాంపరింగ్; ఆ ముగ్గురిపై ఏడాది నిషేధం!
జొహన్నెస్‌బర్గ్/కాన్బెరా: బాల్ ట్యాంపరింగ్ ఉదంతంలో ఆస్ట్రేలియా ఆటగాళ్లు స్టీవ్ స్మిత్, కామెరూన్ బెన్‌క్రాఫ్ట్, డేవిడ్ వార్నర్‌లపై ఏడాది నిషేధం విధించనున్నారా, ప్రధాన కోచ్ డారెన్ లీమన్ తక్షణమే పదవి నుంచి తప్పుకుంటారా అన్న ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తోంది. మంగళవారం ఆస్ట్రేలియన్ ప్రధాన మీడియా నిండా ఇవే కథనాలు. ట్యాంపరింగ్ వ్యవహారాన్ని తేలికగా తీసుకోవద్దన్న ప్రధాని టర్న్‌బుల్ సూచన మేరకు ఆస్ట్రేలియా క్రికెట్(సీఏ).. స్మిత్, వార్నర్, బెన్‌క్రాఫ్ట్‌లపై కొరడా ఝుళిపించడం ఖాయమని, నాలుగో టెస్టు ప్రారంభానికి ముందే లీమన్ రాజీనామా చేస్తాడని సర్వత్రా చర్చజరుగుతోంది. ఇప్పటికే సౌతాఫ్రికాకు వచ్చి ఆటగాళ్లను విచారిస్తోన్న సీఏ బృందం.. మంగళవారమే తన రిపోర్టును సమర్పించనున్న నేపథ్యంలో నిషేధం వార్తలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఐసీసీ చేయనిది సీఏ చేస్తుంది: నిబంధనలకు విరుద్ధంగా బంతి ఆకారాన్ని మార్చి ప్రత్యర్థిని దెబ్బతీయాలనే కుట్ర చేయడమేకాక, అది సమిష్టి నిర్ణయమని చెప్పిన ఆసీస్ సారథి స్టీవ్ స్మిత్‌పై అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) అరకొర చర్యలతో సరిపెట్టడం దుమారాన్ని రేపుతోంది. అంతపెద్ద తప్పుకు ఇంత చిన్న శిక్ష ఏమిటనే సందేశాలు వ్యక్తమవుతున్నాయి. తన చేతులతో ట్యాంపర్ చేసిన బెన్‌క్రాఫ్ట్‌పై వేటు పడకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఐతే, ఆటగాళ్లను శిక్షించడంలో ఐసీసీ చేయనిది సీఏ తప్పక చేస్తుందని ఆసీస్ మీడియా తెలిపింది. క్రికెట్ నిబంధనలను రూపొందించే మెల్బోర్న్ క్రికెట్ క్లబ్(ఎంసీసీ) సైతం ట్యాంపరింగ్ ఉదంతంపై ఘాటుగా స్పందించింది. ఆసీస్ ప్లేయర్లను కఠినంగా శిక్షించాల్సిందేనని, అలా చేస్తేనే జెంటిల్మన్ గేమ్ పట్ల భవిష్యత్ తరాలకు మంచి సందేశం ఇచ్చినట్లు అవుతుందని ఎంసీసీ ఉపకార్యదర్శి జాన్ స్టీఫెన్సన్ అభిప్రాయపడ్డారు. కుట్రలో హెడ్ కోచ్ పాత్ర ఏంటి?: జట్టు సభ్యులంతా ముందే చర్చించుకుని ట్యాంపరింగ్ కుట్రను అమలు చేసినట్లు చెప్పుకొచ్చిన స్మిత్.. ఇందులో కోచింగ్ స్టాఫ్ ప్రమేయమేది లేదని అన్నాడు. కాగా, స్మిత్ చెప్పినదాంట్లో అర్థంలేదని ఆసీస్ మాజీ కెప్టెన్ క్లార్క్ అభిప్రాయపడ్డాడు. ‘‘కుట్రలో కోచ్ లీమన్‌కు ప్రమేయం లేదంటే.. జట్టుపై అతనికి పట్టులేనట్టు అర్థం. ఒకవేళ ప్రమేయం ఉందని తేలితే ఆటగాళ్లతోపాటు అతనూ దోషే అవుతాడు. ఈ రెండు సందర్భాల్లోనూ లీమన్ తప్పుచేసినవాడే అవుతాడు’’ అని క్లార్క్ వ్యాఖ్యానించాడు. -
'2019లో కోచ్ పదవికి గుడ్ బై'
మెల్బోర్న్: ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కోచ్‌గా తన పదవీ కాలాన్ని పొడిగించుకునే ఉద్దేశం ఎంతమాత్రం లేదని అంటున్నాడు డారెన్ లీమన్. ఈ క్రమంలోనే 2019 చివర్లో ఆసీస్ కోచ్ పదవికి గుడ్ బై చెప్పబోతున్నట్లు ప్రకటించాడు. ముందస్తు కాంట్రాక్ట్ ప్రకారం అప్పటివరకూ ఆసీస్ కోచ్‌గా కొనసాగుతానని పేర్కొన్నాడు. 'సుదీర్ఘ కాలంగా ఆసీస్ జట్టుకు కోచ్‌గా సేవలందిస్తున్నా. నాకు అప్పచెప్పిన పనిని ఎంతగానో ఎంజాయ్ చేశా. ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. ఇక తిరిగి కోచ్ బాధ్యతలు చేపట్టడానికి సిద్దంగా లేను. 2019 చివరి వరకూ కోచ్‌గా కొనసాగుతా ' అని లీమన్ పేర్కొన్నాడు. లీమన్ పర్యవేక్షణలో ఆస్ట్రేలియా జట్టు ఒక వన్డే వరల్డ్ కప్‌తో పాటు రెండు యాషెస్ సిరీస్‌లను గెలిచింది. కాగా, ఇంగ్లండ్‌లో జరిగిన రెండు యాషెస్లను కోల్పోయింది. 2013 ఆసీస్ జట్టు కోచ్‌గా లీమన్ బాధ్యతలు చేపట్టాడు. టీమిండియా పర్యటనలో ఆసీస్ ఘోర ఓటమి కారణంగా అప్పటి కోచ్‌గా ఉన్న మికీ ఆర్థర్‌పై వేటు వేసిన ఆసీస్ యాజమాన్యం.. లీమన్‌కు ఆ పదవిని అప్పజెప్పింది. దాంతో అందివచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్న లీమన్.. ఆసీస్ విజయాల్లో కీలక పాత్ర పోషించి సక్సెస్ ఫుల్ కోచ్‌గా పేరుతెచ్చుకున్నాడు. -
'యాషెస్ ను బాయ్ కాట్ చేయరు'
సిడ్నీ: క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ)కు ఆటగాళ్లకు నెలకొన్న కొత్త కాంట్రాక్ట్ వివాదంతో యాషెస్ సిరీస్ కు ఎటువంటి ముప్పు ఉండదనే తాను అనుకుంటున్నట్లు ఆ దేశ కోచ్ డారెన్ లీమన్ అభిప్రాయపడ్డాడు. ఆ సిరీస్ ను ఆసీస్ ఆటగాళ్లు బాయ్ కాట్ చేయరనే అనుకుంటున్నట్లు లీమన్ పేర్కొన్నాడు. త్వరలోనే బోర్డుకు క్రికెటర్లకు మధ్య చోటు చేసుకున్న వివాదానికి పరిష్కారం దొరుకుతుందని ఆశిస్తున్నట్లు తెలిపాడు. 'యాషెస్ సిరీస్ జరుగుతుందని నేను కచ్చితంగా చెబుతున్నాను. ఆసీస్ క్రికెట్ లో ప్రస్తుతం ఏమి జరుగుతున్నా నా దృష్టిలో చూస్తే అది పెద్ద సమస్యే కాదు. నేను ఆటగాళ్లతో బోర్డుతో మాట్లాడుతూనే ఉన్నా. అంత సర్దుకుంటుందనే భావిస్తున్నా. ఇందుకు పరిష్కారం వెతకమని ఆసీస్ క్రికెట్ బోర్డుకు విజ్ఞప్తి చేశా' అని లీమన్ తెలిపాడు. -
అదొక ఛాలెంజ్: ఆసీస్ కోచ్
రాంచీ: భారత్ తో మూడో టెస్టు చివరిరోజు ఆటలో ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా బౌలింగ్ ను ఎదుర్కొని నిలబడటం తమకు అసలు సిసలైన ఛాలెంజ్ అని ఆసీస్ ప్రధాన కోచ్ డారెన్ లీమన్ స్పష్టం చేశాడు. నాల్గో రోజు ఆటలో స్వల్ప వ్యవధిలో రెండు వికెట్లను తీసిన జడేజాపైనే ప్రధానంగా దృష్టి సారించినట్లు పేర్కొన్నాడు. తమ ఆటగాళ్లు ఇద్దరూ మంచి బంతులకే పెవిలియన్ చేరారని పేర్కొన్న లీమన్.. ఈ తరహా ఘటనలు క్రికెట్ గేమ్‌లో సహజమన్నాడు. ఆఖరి రోజు ఆటలో తాము కచ్చితంగా భారత్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటామని ఆశాభావం వ్యక్తం చేశాడు. 'మూడో టెస్టు ఆఖరి రోజు ఆట మాకు ఛాలెంజ్. ప్రధానంగా జడేజాను సమర్దవంతంగా ఎదుర్కోవాలి. అతను సంధించిన రెండు అద్భుతమైన బంతులకు రెండు వికెట్లను కోల్పోయాం. ముఖ్యంగా డేవిడ్ వార్నర్ ను జడేజా అవుట్ చేసిన తీరు అమోఘం. జడేజాపై మా ఫోకస్ పెట్టాం. మా వికెట్లను కాపాడుకోవడం ఎంత ముఖ్యమో, మా పది వికెట్లను తీసి గెలుపొందడం భారత్ కు కఠినమైన సవాల్'అని లీమన్ తెలిపాడు. -
ఆస్ట్రేలియాకు మరో ఎదురుదెబ్బ
బెంగళూరు: రెండో టెస్టులో టీమిండియా చేతిలో చిత్తుగా ఓడిన ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. భుజం గాయం కారణంగా తర్వాతి రెండు మ్యాచ్ ల్లో అతడు బరిలోకి దిగడం లేదు. స్వదేశానికి తిరిగి వెళ్లనున్నాడు. 'కొంతకాలంగా మిచెల్ మార్ష్ భుజం గాయంతో బాధ పడుతున్నాడు. సమ్మర్ సీజన్ లో చాలా వరకు ఇలానే ఆడాడు. ఇప్పటివరకు ఇలాగే మేనేజ్ చేశాం. గాయం ఎక్కువకావడంతో అతడు ఆడలేకపోతున్నాడ'ని ఆస్ట్రేలియా జట్లు ఫిజియో డేవిడ్ బీక్లే తెలిపారు. నిపుణుల పర్యవేక్షణలో చికిత్స తీసుకునేందుకు మార్ష్ స్వదేశానికి తిరిగిరానున్నాడని క్రికెట్ ఆస్ట్రేలియా ఒక ప్రకటనలో తెలిపింది. టీమిండియాతో జరిగిన రెండు టెస్టుల్లో మిచెల్ మార్ష్ పెద్దగా రాణించలేదు. నాలుగు ఇన్నింగ్స్ లో కలిపి 48 పరుగులు మాత్రమే సాధించాడు. ఐదు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. అతడి స్థానంలో ఇంకా ఎవరినీ ఎంపిక చేయలేదు. మార్ష్ స్థానంలో ఉస్మాన్ ఖ్వాజా, గ్లెన్ మ్యాక్స్ వెల్ ను ఆడించే అవకాశాలున్నామని కోచ్ డారెన్ లెహమాన్ తెలిపాడు. వీరిద్దరూ జట్టులో ఉన్నప్పటికీ ఆడే అవకాశం రాలేదు. నాలుగు టెస్టుల సిరీస్ లో భారత్-ఆస్ట్రేలియా చెరో మ్యాచ్ గెలిచి 1-1తో సమంగా ఉన్నాయి. మూడో టెస్టు రాంచీలో మార్చి 16 నుంచి ప్రారంభమవుతుంది. -
విరాట్ సేనకు పోటీ ఇవ్వాలంటే..
సిడ్నీ:వచ్చే నెల్లో భారత్ పర్యటనకు రానున్న ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు అప్పుడే తన ప్రణాళికలకు పదును పెడుతోంది. ఈసారి టీమిండియాను వారి దేశంలో ఓడించి సత్తా చాటుకోవాలని భావిస్తోంది. ఇటీవల పాకిస్తాన్‌తో టెస్టు సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన ఆస్ట్రేలియా.. వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత్ ను ఆపేందుకు వ్యూహాలను సిద్ధం చేస్తోంది. దీనిలో భాగంగా భారత్‌లో కచ్చితంగా అమలు చేయాల్సిన ప్రణాళికల్ని ఆటగాళ్లకు ఆసీస్ ప్రధాన కోచ్ డారెన్ లీమన్ దిశా నిర్దేశం చేస్తున్నాడు. ప్రధానంగా భారత్‌కు గట్టి పోటీ ఇవ్వాలంటే సుదీర్ఘంగా క్రీజ్‌లో బ్యాటింగ్ చేయడమే ఒక్కటే సరైన మార్గమని ముందుగా స్టీవ్ స్మిత్ సేనను సిద్ధం చేస్తున్నాడు. ఈ మేరకు విరాట్ సేనతో జరిగిన టెస్టు సిరీస్ లో ఇంగ్లండ్ ఘోరంగా ఓడిపోవడానికి కారణాన్ని విశ్లేషించాడు. భారత్‌తో సిరీస్‌లో ఇంగ్లండ్ మంచి స్కోర్లు చేసినప్పటికీ వారు ఘోర పరాజయన్ని ఎదుర్కొన్న సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేశాడు. భారత్‌పై ఇంగ్లండ్ జట్టు సుదీర్ఘంగా క్రీజ్‌లో నిలవకపోవడమే వారి ఓటమికి ప్రధాన కారణమని లీమన్ పేర్కొన్నాడు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆసీస్ ఆడితేనే భారత్‌కు సరైన పోటీ ఇవ్వగలమని, లేని పక్షంలో మరోసారి ఘోర పరాభవం తప్పదంటూ హెచ్చరించాడు. 'స్వదేశంలో పాకిస్తాన్ జరిగిన టెస్టు సిరీస్‌లో ఆసీస్ ఆకట్టుకుంది. ప్రధానంగా సిడ్నీలో జరిగిన టెస్టు తొలి ఇన్నింగ్స్ లో 135.0 ఓవర్ల పాటు ఆసీస్ బ్యాటింగ్ చేసింది. అయితే ఇది మంచి ప్రదర్శనే. కానీ భారత్‌లో ఓవర్ రేట్‌ను మరింత పెంచుకోవాలి. కనీసం 150.0 ఓవర్లపాటు ఒక ఇన్నింగ్స్ ఆడితేనే భారీ స్కోరు వస్తుంది. అప్పుడే భారత్‌కు భారీ స్కోరును నిర్దేశించగలం. ప్రస్తుత యువ క్రికెటర్లకు ఇది ఒక ఛాలెంజ్.ఇక్కడ ఫిట్‌గా ఉండటంతో పాటు, సాధ్యమైనంతవరకూ ఎక్కువ సేపు క్రీజ్‌లో ఉండటానికి యత్నించండి'అని లీమన్ ఉపదేశం చేశాడు. ఇరు జట్ల మధ్య నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు పుణెలో ఫిబ్రవరి 23వ తేదీన జరుగనుంది. 2013లో చివరిసారి భారత్‌లో పర్యటించిన ఆసీస్.. ఆ సిరీస్‌ను 4-0 తేడాతో కోల్పోయింది. -
'అతడు 300 వికెట్లు పడగొడతాడు'
బ్రిస్బేన్: మిచెల్ స్టార్క్ గ్రేట్ బౌలర్ గా ఎదుగుతాడని ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్ కోచ్ డారెన్ లీమన్ విశ్వాసం వ్యక్తం చేశాడు. అతడు ఫిట్నెస్ కాపాడుకుంటే టెస్టుల్లో 300 వికెట్లు పడగొడతాడని, ఆసీస్ దిగ్గజ బౌలర్ల సరసన చోటు సంపాదిస్తాడని అన్నాడు. మిచెల్ జాన్సన్ రిటైర్ కావడంతో అతడి వారసుడిగా స్టార్క్ ను పేర్కొంటున్నారు. ఇప్పటివరకు 25 టెస్టు మ్యాచ్ లు ఆడిన స్టార్క్ 91 వికెట్లు తీశాడు. మోకాలి ఆపరేషన్ అనంతరం గతనెలలో వెస్టిండీస్, దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్ లో స్టార్క్ సత్తా చాటాడు. మెక్‌గ్రాత్(563), డెన్నిస్ లిల్లీ(355), జాన్సన్(313), బ్రెట్ లీ(310) ఆస్ట్రేలియా తరపున 300 వికెట్లు పడగొట్టిన ఫాస్ట్ బౌలర్లుగా ఘనత సాధించారు. ఫిట్నెస్ కాపాడుకుంటూ, ఎక్కువ మ్యాచ్‌లు ఆడితే స్టార్క్ కూడా 300 టస్టు వికెట్లు సాధిస్తాడని లీమాన్ చెప్పాడు. జూలై 26 నుంచి శ్రీలంకతో జరగనున్న టెస్ట్ మ్యాచ్ లో రివర్స్ స్వింగ్ తో అతడు చెలరేగుతాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. -
'ఐపీఎల్ తో ఆటగాళ్లు అలసిపోతున్నారు'
సిడ్నీ: ఇప్పటికే మూడు ఫార్మాట్ల క్రికెట్‌తో సతమవుతున్న క్రికెటర్లు.. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) వంటి టోర్నీలతో మరిన్ని సమస్యలను కొని తెచ్చుకుంటున్నారని ఆస్ట్రేలియా కోచ్ డారెన్ లీమన్ అభిప్రాయపడ్డాడు. ఈ తరహా టోర్నమెంట్ల వల్ల ఆటగాళ్లు మానసికంగా, శారీరకంగా అలసిపోతున్నారన్నాడు. దీంతో అంతర్జాతీయ సిరీస్‌లకు ఆటగాళ్ల ఎంపిక కష్ట సాధ్యంగా మారుతుందని లీమన్ పేర్కొన్నాడు. తద్వారా వారి కెరీర్ కూడా ప్రశ్నార్ధకంగా మారే అవకాశం ఉందన్నాడు. ' ఐపీఎల్ వంటి టోర్నీలలో ఆటగాళ్లు పాల్గొని గాయాల బారిన పడుతున్నారు. ఆయా ఫ్రాంచైజీలతో కాంట్రాక్టు చేసుకుని టోర్నీలతో బిజీగా గడుపుతున్నారు. ఆటగాళ్లు కాంట్రాక్టులతో జాతీయ సెలక్టర్లకు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయి. అంతర్జాతీయ షెడ్యూల్ బిజీగా లేనప్పుడు ఈ టోర్నీలను నిర్వహిస్తే బాగుంటుంది. ఈ తరహా విధానంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) మార్పులు తీసుకువస్తుందని ఆశిస్తున్నా'అని లీమన్ తెలిపాడు. వచ్చే సెప్టెంబర్‌లో మినీ ఐపీఎల్ నిర్వహించడానికి రంగం సిద్ధం చేసిన తరుణంలో లీమన్ స్పందించాడు. ఆ టోర్నీకి వేరే సమయాన్ని కేటాయిస్తే బాగుంటుందని ఐసీసీకి సూచించాడు. ఇటీవల జరిగిన ఐపీఎల్లో తమ దేశ ఆటగాళ్లు ఎక్కువగా గాయపడిన సంగతిని ఈ సందర్భంగా లీమన్ ప్రస్తావించాడు. -
జస్టిన్ లాంగర్ సరైన వ్యక్తి
మెల్ బోర్న్:ఆస్ట్రేలియా క్రికెట్ కోచ్ గా తదుపరి బాధ్యతలు చేపట్టేందుకు జస్టిన్ లాంగర్ కు అన్ని అర్హతలున్నాయని జట్టు ప్రధాన కోచ్ డారెన్ లీమన్ అభిప్రాయపడ్డాడు. ఇప్పటికే కోచ్ గా అతను సక్సెస్ సాధించిన విషయాన్ని ఈ సందర్భంగా లీమన్ గుర్తు చేశాడు. పశ్చిమ ఆస్ట్రేలియా కోచ్ గా ఉన్న లాంగర్ చాలా విజయాలను అందించినట్లు తెలిపాడు. 2017 వరకూ ఆస్ట్రేలియా కోచ్ గా ఉండనున్న లీమన్.. అటు తరువాత కోచ్ గా చేసే అవకాశం లేదన్నాడు. దాంతో లాంగర్ పేరును తాజాగా ముందుకు తీసుకొచ్చాడు. అతను సాధించిన విజయాలు అద్భుతమని లీమన్ పేర్కొన్నాడు. 2009 లో లాంగర్ ఆస్ట్రేలియా బ్యాటింగ్ కోచ్ గా, మెంటర్ గా పనిచేశాడు.