రికీ పాంటింగ్ (ఫైల్ ఫొటో)
సిడ్నీ : ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఆ జట్టు కోచింగ్ బృందంలో చేరనున్నాడు. ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా 5 వన్డేలు, ఒక టీ20 మ్యాచ్‌కు పాంటింగ్ సహాయ కోచ్‌గా సేవలందించనున్నాడు. తన మాజీ సహచర ఆటగాడు, ఆసీస్ నూతన కోచ్ జస్టిన్ లాంగర్‌తో కలిసి పాంటింగ్ పనిచేయనున్నాడు. ఈ విషయాన్ని జస్టిన్ లాంగరే ఓ ప్రకటనలో తెలిపాడు. ‘‘రికీ ఒక గొప్ప ఆటగాడు. కామెంటేటర్‌గా ఒప్పందాల నేపథ్యంలో ఇప్పటికే అతను ఇంగ్లండ్‌లోనే ఉన్నాడు. ముఖ్యమైన సిరీస్‌లకు ఆయన కోచింగ్ బృందంలో చేరడం చాలా మంచి విషయం. మ్యాచ్ పట్ల అతనికి ఉన్న అవగాహన, అనుభవం, మాకు కచ్చితంగా ఉపయోగపడుతోంది.’’ అని జస్టిన్ చెప్పుకొచ్చాడు.
బాల్‌ట్యాంపరింగ్ ఉదంతం క్రికెట్ ఆస్ట్రేలియాను (సీఏ) అతలా కుతలం చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన పట్ల బాధ్యత వహిస్తూ మాజీ కోచ్ డారెన్ లెహ్మెన్ తన బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. దీంతో జస్టిన్‌ను సీఏ నూతన కోచ్‌గా నియమించిన విషయం తెలిసిందే. తన సారథ్యంలో ఆసీస్‌కు మూడు సార్లు ప్రపంచకప్ అందించిన పాంటింగ్ తన కామెంటేటర్ ఒప్పందాలు నేపథ్యంలో జూన్ 10 నుంచి జట్టుతో చేరనున్నాడు. గతంలో కూడా పాంటింగ్ ఆసీస్ జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా వ్యవహరించాడు. గతేడాది శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్, ఈ ఏడాది ప్రారంభంలో న్యూజిలాండ్, ఇంగ్లండ్‌లతో జరిగిన ట్రై సిరీస్‌లకు సహాయ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. ఇక ఈ సీజన్ ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు హెడ్ కోచ్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment