మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కోచ్‌గా తన పదవీ కాలాన్ని పొడిగించుకునే ఉద్దేశం ఎంతమాత్రం లేదని అంటున్నాడు డారెన్ లీమన్. ఈ క‍్రమంలోనే 2019 చివర్లో ఆసీస్ కోచ్ పదవికి గుడ్ బై చెప్పబోతున్నట్లు ప్రకటించాడు. ముందస్తు కాంట్రాక్ట్ ప్రకారం అప్పటివరకూ ఆసీస్ కోచ్‌గా కొనసాగుతానని పేర్కొన్నాడు. 'సుదీర్ఘ కాలంగా ఆసీస్ జట్టుకు కోచ్‌గా సేవలందిస్తున్నా. నాకు అప్పచెప్పిన పనిని ఎంతగానో ఎంజాయ్ చేశా. ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. ఇక తిరిగి కోచ్ బాధ్యతలు చేపట్టడానికి సిద్దంగా లేను. 2019 చివరి వరకూ కోచ్‌గా కొనసాగుతా ' అని లీమన్ పేర్కొన్నాడు.
లీమన్ పర్యవేక్షణలో ఆస్ట్రేలియా జట్టు ఒక వన్డే వరల్డ్ కప్‌తో పాటు రెండు యాషెస్ సిరీస్‌లను గెలిచింది. కాగా, ఇంగ్లండ్‌లో జరిగిన రెండు యాషెస్‌లను కోల్పోయింది. 2013 ఆసీస్ జట్టు కోచ్‌గా లీమన్ బాధ్యతలు చేపట్టాడు. టీమిండియా పర్యటనలో ఆసీస్ ఘోర ఓటమి కారణంగా అప్పటి కోచ్‌గా ఉన్న మికీ ఆర్థర్‌పై వేటు వేసిన ఆసీస్ యాజమాన్యం.. లీమన్‌కు ఆ పదవిని అప్పజెప్పింది. దాంతో అందివచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్న లీమన్.. ఆసీస్ విజయాల్లో కీలక పాత్ర పోషించి సక్సెస్ ఫుల్ కోచ్‌గా పేరుతెచ్చుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment