జస్టిన్ లాంగర్ సరైన వ్యక్తి | Justin Langer will be next coach of Australia, Darren Lehmann | Sakshi
Sakshi News home page

జస్టిన్ లాంగర్ సరైన వ్యక్తి

Published Mon, Feb 2 2015 11:45 AM | Last Updated on Sat, Sep 2 2017 8:41 PM

జస్టిన్ లాంగర్ సరైన వ్యక్తి

జస్టిన్ లాంగర్ సరైన వ్యక్తి

మెల్ బోర్న్:ఆస్ట్రేలియా క్రికెట్ కోచ్ గా తదుపరి బాధ్యతలు చేపట్టేందుకు జస్టిన్ లాంగర్ కు అన్ని అర్హతలున్నాయని జట్టు ప్రధాన కోచ్ డారెన్ లీమన్ అభిప్రాయపడ్డాడు. ఇప్పటికే కోచ్ గా అతను సక్సెస్ సాధించిన విషయాన్ని ఈ సందర్భంగా లీమన్ గుర్తు చేశాడు. పశ్చిమ ఆస్ట్రేలియా కోచ్ గా ఉన్న లాంగర్ చాలా విజయాలను అందించినట్లు తెలిపాడు.  2017 వరకూ ఆస్ట్రేలియా కోచ్ గా ఉండనున్న లీమన్.. అటు తరువాత కోచ్ గా చేసే అవకాశం లేదన్నాడు.

 

దాంతో లాంగర్ పేరును తాజాగా ముందుకు తీసుకొచ్చాడు. అతను సాధించిన విజయాలు అద్భుతమని లీమన్ పేర్కొన్నాడు. 2009 లో లాంగర్ ఆస్ట్రేలియా బ్యాటింగ్ కోచ్ గా, మెంటర్ గా పనిచేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement