Harbhajan Singh Recalls Sledging With Darenn Lehmann.. టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్బజన్ సింగ్ డిసెంబర్ 24న అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లకు గుడ్‌బై చెబుతున్నట్లు ప్రకటించాడు. 23 ఏళ్ల కెరీర్‌లో టీమిండియా స్పిన్నర్‌గా ఎన్నో ఘనతలు సాధించిన భజ్జీ టెస్టుల్లో 400కు పైగా వికెట్లు, వన్డేల్లో 200కు పైగా వికెట్లు, టి20ల్లో 25 వికెట్లు.. ఓవరాల్‌గా అన్ని ఫార్మాట్లు కలిపి 711 వికెట్లు తీశాడు. ఇక హర్భజన్ సింగ్ రిటైర్మెంట్‌పై మాజీ క్రికెటర్లు స్పందింస్తున్నారు. హర్బజన్‌కు ఆస్ట్రేలియన్ క్రికెటర్లంటే విపరీతమైన ప్రేమ ఉంది.. కానీ వారి స్లెడ్జింగ్ ఇష్టం ఉండేది కాదంటూ గతంలో ఆప్ కి అదాలత్‌కు తానే స్వయంగా ఇచ్చిన ఇంటర్య్వూలో చెప్పుకొచ్చాడు. ఈ విషయాన్ని మరోసారి గర్తుచేసుకుందాం.
చదవండి: Harbhajan Singh: ఆడతాడు... తిడతాడు... కొడతాడు! అది భజ్జీ స్పెషల్..
''ఆస్ట్రేలియా ఆటగాళ్లు అంటే స్లెడ్జింగ్‌కు మారుపేరుగా ఉండేవారు. ముఖ్యంగా వారి గడ్డపై సిరీస్ ఆడే జట్లను తమ స్లెడ్జింగ్‌తోనే మానసికంగా దెబ్బతీసి పైచేయి సాధించేవారు. కానీ నాలాంటి వారిని ఎదుర్కొనడానికి మాత్రం ఆస్ట్రేలియన్ ఆటగాళ్లు భయపడేవారు. ఒక సందర్భంగా మ్యాచ్‌లో నేను బ్యాటింగ్ చేస్తున్న సమయంలో నా పక్కనే ఉన్న డారెన్ లీమన్ అదే పనిగా నాపై స్లెడ్జింగ్ చేస్తూనే ఉన్నాడు.
దీంతో చిర్రెత్తి లీమన్ పొట్టవైపు చూస్తూ.. నువ్వేమైనా ప్రెగ్నెంటా.. ఆ పొట్టేంటి! అని నవ్వుతూనే అడిగేశాను. ఆ సమయంలో ఈ విషయంపై ఇద్దరి మధ్య చిన్నపాటి మాటలయుద్దం జరిగిందనుకోండి. అయితే ఈ విషయాన్ని లీమన్ అప్పటి స్పిన్నర్ షేన్ వార్న్‌కు చెప్పాడు. అంతే.. వార్న్ ఒక్కసారిగా పగలబడి నవ్వుతూ.. ''నా దగ్గరకొచ్చి లీమన్ ఏమైనా అన్నావా'' అని అడిగాడు. దానికి ''నేను అవునని సమాధానం ఇవ్వడంతో.. కరెక్టే.. ఆటగాళ్లకు అంత పెద్ద పొట్ట ఉండకూడదు''. ఆ తర్వాత వార్నర్ లీమన్‌తో.. మనం ఎవరినైనా స్లెడ్జ్ చేయొచ్చు.. కానీ టర్బోనేటర్‌తో(భజ్జీ) మాత్రం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పడం నాకు ఇప్పటికి గుర్తుంది.'' అని ఆప్ కి అదాలత్‌కు గతంలో ఇచ్చిన ఇంటర్య్వూలో చెప్పుకొచ్చాడు.
చదవండి: గడ్డు పరిస్థితుల్లో నా భార్య ఇచ్చిన అండ దండలు వెలకట్టలేనివి.. గర్వంగా ఉంది మై లవ్!
Comments
Please login to add a commentAdd a comment