'అతడు 300 వికెట్లు పడగొడతాడు'
బ్రిస్బేన్: మిచెల్ స్టార్క్ గ్రేట్ బౌలర్ గా ఎదుగుతాడని ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్ కోచ్ డారెన్ లీమన్ విశ్వాసం వ్యక్తం చేశాడు. అతడు ఫిట్నెస్ కాపాడుకుంటే టెస్టుల్లో 300 వికెట్లు పడగొడతాడని, ఆసీస్ దిగ్గజ బౌలర్ల సరసన చోటు సంపాదిస్తాడని అన్నాడు. మిచెల్ జాన్సన్ రిటైర్ కావడంతో అతడి వారసుడిగా స్టార్క్ ను పేర్కొంటున్నారు.
ఇప్పటివరకు 25 టెస్టు మ్యాచ్ లు ఆడిన స్టార్క్ 91 వికెట్లు తీశాడు. మోకాలి ఆపరేషన్ అనంతరం గతనెలలో వెస్టిండీస్, దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్ లో స్టార్క్ సత్తా చాటాడు. మెక్గ్రాత్(563), డెన్నిస్ లిల్లీ(355), జాన్సన్(313), బ్రెట్ లీ(310) ఆస్ట్రేలియా తరపున 300 వికెట్లు పడగొట్టిన ఫాస్ట్ బౌలర్లుగా ఘనత సాధించారు.
ఫిట్నెస్ కాపాడుకుంటూ, ఎక్కువ మ్యాచ్లు ఆడితే స్టార్క్ కూడా 300 టస్టు వికెట్లు సాధిస్తాడని లీమాన్ చెప్పాడు. జూలై 26 నుంచి శ్రీలంకతో జరగనున్న టెస్ట్ మ్యాచ్ లో రివర్స్ స్వింగ్ తో అతడు చెలరేగుతాడని ఆశాభావం వ్యక్తం చేశాడు.