
వచ్చే ఏడాది ఐపీఎల్ వేలంలో ఫ్రాంచైజీలు తమను దూరంగా ఉంచుతాయనే భయంతోనే ఆస్ట్రేలియా ఆటగాళ్లు భారత్‌తో మ్యాచ్‌లు జరిగే సమయంలో స్లెడ్జింగ్‌కు పాల్పడటం లేదని భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ వ్యాఖ్యానించాడు. దుర్భాషలు చేస్తే ఐపీఎల్ యాజమాన్యాలు వారితో ఒప్పందం చేసుకునేందుకు వెనుకాడతాయనే విషయం కంగారూలకు బాగా తెలుసని వీరూ అభిప్రాయపడ్డాడు. భారత్‌తో వన్డే సిరీస్‌లో స్మిత్, వార్నర్, ఫించ్‌లపై అతిగా ఆధార పడటమే ఆ జట్టు పరాజయాలకు కారణమని అతను విశ్లేషించాడు.