Aussies
-
ఉత్కంఠ పోరులో పాక్ ఓటమి.. ఫైనల్లో ఆసీస్
బెనోని (దక్షిణాఫ్రికా): అండర్–19 ప్రపంచకప్ రెండో సెమీఫైనల్ మ్యాచ్ కూడా తొలి సెమీస్లాగే ఉత్కంఠభరితంగా ముగిసింది. గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఒక వికెట్ తేడా తో పాకిస్తాన్‌పై నెగ్గి ఈ టోర్నీ చరిత్రలో ఆరోసారి ఫైనల్‌కు చేరుకుంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాక్ 48.5 ఓవర్లలో 179 పరుగులకు ఆలౌటైంది. అరాఫత్ (52; 9 ఫోర్లు), అజాన్ (52; 3 ఫోర్లు) అర్ధసెంచరీలు చేశారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ టామ్ స్ట్రాకర్ (6/24) పాక్‌ను దెబ్బ తీశాడు. అనంతరం ఆస్ట్రేలియా 49.1 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 181 పరుగులు సాధించి గెలిచింది. డిక్సన్ (50; 5 ఫోర్లు), ఒలీవర్ పీక్ (49; 3 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడారు. 9వ వికెట్ కోల్పోయిన తర్వాత ఆసీస్ చివరి 4 ఓవర్లలో విజయానికి 16 పరుగులు చేయాల్సి ఉంది. తొలి 3 ఓవర్లలో 13 పరుగులు వచ్చాయి. స్లో ఓవర్ రేట్ కారణంగా పెనాల్టీ విధించడంతో ఆఖరి ఓవర్ కోసం ఫైన్ లెగ్ వద్ద ఉన్న ఫీల్డర్‌ను పాక్ రింగ్ లోపలికి తీసుకు రావాల్సి వచ్చింది. జీషాన్ వేసిన బంతిని బ్యాటర్ మెక్‌మిలన్ ఆడగా బంతి బ్యాట్ అంచుకు తాకి అదే ఫైన్ లెగ్ వైపు నుంచే బౌండరీ దాటింది. దాంతో ఆసీస్ కుర్రాళ్లు సంబరాలు చేసుకోగా, పాక్ బృందం నిరాశలో మునిగింది. ఆదివారం జరిగే తుది పోరులో భారత్‌తో ఆ్రస్టేలియా తలపడుతుంది. -
నేడు ఆసీస్‌తో రెండో వన్డే: సిరీస్ విజయం లక్ష్యంగా భారత్
ఇండోర్: వన్డే ప్రపంచకప్‌కు ముందు జరుగుతున్న చివరి సిరీస్‌ను సొంతం చేసుకొని మెగా ఈవెంట్లో పూర్తి విశ్వాసంతో బరిలోకి దిగాలనే లక్ష్యంతో భారత్... తొలి మ్యాచ్‌లో జరిగిన లోపాలను సరిదిద్దుకోవాలనే పట్టుదలతో ఆ్రస్టేలియా... నేడు ఇక్కడి హోల్కర్ స్టేడియంలో జరిగే రెండో వన్డేలో తలపడనున్నాయి. రెండు జట్లలోని బ్యాటర్లు మెరిస్తే భారీ స్కోర్లకు పెట్టింది పేరైన హోల్కర్ స్టేడియంలో అభిమానులకు మరో పరుగుల విందు లభించడం ఖాయం. శనివారం ఇండోర్‌లో వర్షం కురిసినా ఆదివారం మ్యాచ్ సమయంలో ఒకట్రెండుసార్లు చిరుజల్లులు పడే అవకాశముందని స్థానిక వాతావరణ శాఖ తెలిపింది. తొలి వన్డేలో రుతురాజ్ గైక్వాడ్, శుబ్‌మన్ గిల్, తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ అర్ధ సెంచరీలు సాధించడం శుభపరిణామం. అయితే శ్రేయస్ అయ్యర్ తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. రెండో వన్డేలో అయ్యర్ భారీ స్కోరు సాధిస్తే అతను ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో ఆడే అవకాశాలు మెరుగవుతాయి. మరోవైపు భారత సీనియర్ పేస్ బౌలర్ మొహమ్మద్ షమీ బంతితో చెలరేగాడు. తొలి వన్డే నుంచి విశ్రాంతి తీసుకున్న సిరాజ్‌ను ఆడిస్తే బుమ్రా ఈ మ్యాచ్‌లో ఆడకపోవచ్చు. ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ ఆకట్టుకున్నా ఈ ఒక్క ప్రదర్శన అతనికి సరిపోదు. రెండో మ్యాచ్‌లోనూ ఈ తమిళనాడు స్పిన్నర్ రాణించాల్సి అవసరం ఉంది. ఎడంచేతి వాటం స్పిన్నర్ అక్షర్ పటేల్ చేతి వేలి గాయం నుంచి కోలుకోకపోతే అతని స్థానంలో అశ్విన్ ప్రపంచకప్ జట్టులోకి చివరి నిమిషంలో వచ్చే అవకాశముంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1–0తో ఆధిక్యంలో ఉన్న భారత్ రెండో మ్యాచ్‌లోనూ గెలిస్తే సిరీస్‌ను 2–0తో సొంతం చేసుకుంటుంది. ఈ ఏడాది ఆరంభంలో ఆసీస్ చేతిలో ఎదురైన సిరీస్ ఓటమికి బదులు తీర్చుకుంటుంది. మరోవైపు ఆస్ట్రేలియా జట్టు సిరీస్‌లో నిలవాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితిలో నిలిచింది. తొలి మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, కామెరూన్ గ్రీన్, లబుషేన్ రాణించినా క్రీజులో నిలదొక్కుకున్న తరుణంలో అవుటవ్వడం ఆసీస్‌ను దెబ్బ కొట్టింది. ఓపెనర్‌గా వచ్చిన ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ బ్యాట్ నుంచి కూడా పరుగులు వస్తే ఆసీస్ స్కోరు 300 పరుగులు దాటే అవకాశముంటుంది. ఈ మైదానంలో ఈ ఏడాది జనవరి 24న భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య చివరిసారి వన్డే జరిగింది. రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్ సెంచరీలతో కదంతొక్కడంతో భారత్ 9 వికెట్లకు 385 పరుగులు చేసింది. న్యూజిలాండ్ 295 పరుగులకు ఆలౌటైంది. బౌండరీల దూరం తక్కువగా ఉండటంతో ఈసారీ భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశముంది. జట్ల వివరాలు (అంచనా) భారత్: రుతురాజ్ గైక్వాడ్/ఇషాన్ కిషన్, శుబ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్, కేఎల్ రాహుల్ (కెప్టెన్), జడేజా, వాషింగ్టన్ సుందర్, అశ్విన్, శార్దుల్ ఠాకూర్, షమీ, సిరాజ్/బుమ్రా. ఆ్రస్టేలియా: వార్నర్, మిచెల్ మార్ష్, స్మిత్, లబుషేన్, కామెరూన్ గ్రీన్, అలెక్స్ క్యారీ, జోస్ ఇన్‌గ్లిస్/ఆరోన్ హార్డీ, కమిన్స్ (కెప్టెన్), సీన్ అబాట్, ఆడమ్ జంపా, హాజల్‌వుడ్. -
భారత్ చేతిలో ఆసీస్ షూటౌట్
భువనేశ్వర్: గోల్ కీపర్ శ్రీజేశ్ అడ్డుగోడగా నిలవడంతో ప్రపంచ రెండో ర్యాంకర్ ఆస్ట్రేలియాపై భారత హాకీ జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ప్రొ హాకీ లీగ్ సీజన్–2లో భాగంగా శనివారం ఇక్కడి కళింగ స్టేడియంలో జరిగిన రెండో లీగ్ మ్యాచ్‌లో భారత్ 3–1తో పెనాల్టీ షూటౌట్లో ఆస్ట్రేలియాపై గెలుపొందింది. దాంతో శుక్రవారం ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. నిర్ణీత 60 నిమిషాల ఆటలో ఇరు జట్లు కూడా 2–2 గోల్స్‌తో సమంగా నిలిచాయి. భారత తరఫున రూపిందర్ పాల్ సింగ్ (25వ నిమిషంలో), హర్మన్‌ప్రీత్ సింగ్ (27వ నిమిషంలో) చెరో గోల్ చేయగా... ఆసీస్ ఆటగాళ్లలో ట్రెంట్ మిట్టన్ (23వ నిమిషంలో), అరాన్ జలేవ్స్కీ (46వ నిమిషంలో) చెరో గోల్ సాధించారు. ఫలితంగా మ్యాచ్ షూటౌట్‌కు దారి తీసింది. -
ఫించ్ ఫిట్...టై అవుట్
అడిలైడ్: పక్క టెముకల గాయంతో బాధ పడుతున్న ఆస్ట్రేలియా వన్డే, టి20 సారథి అరోన్ ఫించ్ శ్రీలంకతో జరిగే తొలి టి20కి ఫిట్నెస్ సాధించాడు. తాను ఫిట్‌గా ఉన్నానని ఆదివారం జరిగే మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్‌తో కలిసి ఓపెనింగ్‌కు దిగనున్నట్లు ఫించ్ శనివారం తెలిపాడు. అయితే టి20 డెత్ ఓవర్ స్పెషలిస్టుగా పేరుతెచ్చుకున్న అండ్రూ టై మాత్రం మోచేతి గాయం కారణంగా శ్రీలంకతో జరిగే సిరీస్‌కు దూరమయ్యాడు. బాల్ ట్యాంపరింగ్ వివాదంతో ఏడాది నిషేధం ఎదుర్కొన్న మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లు తొలిసారి పొట్టి ఫార్మాట్ బరిలో దిగుతున్నారు. -
విశాఖ చేరిన భారత్, ఆసీస్
విశాఖ స్పోర్ట్స్: రెండు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగే తొలి టి20 మ్యాచ్ ఆడేందుకు భారత్, ఆస్ట్రేలియా క్రికెట్ జట్లు శుక్రవారం విశాఖపట్నం చేరుకున్నాయి. ఆస్ట్రేలియా జట్టంతా శుక్రవారం సాయంత్రం వైజాగ్ వచ్చింది. వాస్తవానికి ఆసీస్ సేన ఐదు గంటలకే విశాఖ చేరుకోవాల్సి ఉండగా విమానం ఆలస్యం కావడంతో గంట అదనపు సమయం పట్టింది. విశాఖ చేరుకున్న ధోని, కోహ్లి శుక్రవారం వైఎస్ఆర్ స్టేడియంలో ప్రాక్టీస్ చేశారు. శనివారం భారత్‌తో పాటు ఆసీస్ జట్టు ప్రాక్టీస్ సెషన్లో పాల్గొంటుంది. -
స్టాన్లేక్ ధాటికి పాకిస్తాన్ చిత్తు
హరారే: వరుసగా 9 అంతర్జాతీయ మ్యాచ్‌లలో పరాజయం తర్వాత ఎట్టకేలకు ఆస్ట్రేలియాకు గెలుపు దక్కింది. పేస్ బౌలర్ స్టాన్లేక్ (4/8) అద్భుత బౌలింగ్ ప్రదర్శనకు, కెప్టెన్ ఆరోన్ ఫించ్ (33 బంతుల్లో 68; 4 ఫోర్లు, 6 సిక్స్‌లు) మెరుపులు తోడవడంతో ముక్కోణపు టి20 టోర్నీలో ఆస్ట్రేలియా 9 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌ను చిత్తు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ స్టాన్లేక్ ధాటికి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 19.5 ఓవర్లలో 116 పరుగులకే కుప్పకూలింది. షాదాబ్ ఖాన్ (29) టాప్ స్కోరర్. నాలుగు ఓవర్ల స్పెల్ (4–0–8–4)లో ఓవర్‌కు ఓ వికెట్ చొప్పున పడగొట్టిన స్టాన్లేక్ పాక్‌కు కోలుకునే అవకాశం ఇవ్వలేదు. ఛేదనలో కెప్టెన్ అరోన్ ఫించ్ ఆకాశమే హద్దుగా చెలరేగడంతో ఆసీస్ 10.5 ఓవర్లలో ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 117 పరుగులు చేసి గెలిచింది. పాకిస్తాన్ ఆల్‌రౌండర్ షోయబ్ మాలిక్ 100 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లు ఆడిన తొలి ఆటగాడిగా రికార్డులకెక్కాడు. -
మూడో రోజు 13 వికెట్లు
అడిలైడ్: యాషెస్ సిరీస్ రెండో టెస్టులో బౌలర్లు చెలరేగారు. దాంతో మూడో రోజు 13 వికెట్లు పడ్డాయి. మొదట ఇంగ్లండ్‌పై స్పిన్నర్ లయన్ (4/60) మాయాజాలాన్ని ప్రదర్శించగా... పేసర్లు స్టార్క్ (3/49), కమిన్స్ (2/47) దెబ్బతీశారు. తర్వాత ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌ను అండర్సన్ (2/16), వోక్స్ (2/13) వణికించారు. 29/1 ఓవర్‌నైట్ స్కోరుతో సోమవారం మూడో రోజు ఆట ఆరంభించిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 76.1 ఓవర్లలో 227 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓపెనర్ కుక్ (37; 3 ఫోర్లు) సహా మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ విన్స్ (2), కెప్టెన్ రూట్ (9), డేవిడ్ మలాన్ (19) ప్రత్యర్థి పేసర్లకు తలవంచారు. టెయిలెండర్ ఓవర్టన్ (79 బంతుల్లో 41 నాటౌట్; 5) కాసేపు ప్రతిఘటించాడు. ఆసీస్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 215 పరుగుల ఆధిక్యం లభించింది. అయితే ఇంగ్లండ్‌కు ఫాలోఆన్ ఇవ్వకుండా పిచ్ పరిస్థితుల దృష్ట్యా ఆసీస్ రెండో ఇన్నింగ్స్ ఆడింది. ఆట నిలిచే సమయానికి ఆసీస్ 26 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 53 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా 268 పరుగుల ఆధిక్యంలో ఉంది. -
ధనాధన్ దెబ్బ ఎవరిది?
ఏడాది ఆరంభంలో టెస్టు సిరీస్ కోసం భారత్‌కు వచ్చిన ఆస్ట్రేలియా 1–3తో పరాజయంపాలై వెనుదిరిగింది. ఆ పర్యటనకు కొనసాగింపులా పరిమిత ఓవర్ల కోసం మళ్లీ ఇక్కడికి వచ్చి ఇప్పటికే వన్డేల్లో చిత్తుగా ఓడింది. భారత్ తమ ఆధిపత్యం నిలబెట్టుకుంటూ నంబర్‌వన్ స్థాయిలో చెలరేగింది. ఇక సీన్ మూడో ఫార్మాట్‌కు మారింది. టి20ల్లోనూ తమ సత్తా చాటాలని టీమిండియా పట్టుదలగా ఉండగా... ఇక్కడైనా గెలిచి కాస్త పరువు కాపాడుకోవాలని కంగారూలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య మొదటి మ్యాచ్‌కు ధోని సొంత మైదానం సిద్ధమైంది. రాంచీ: ఒకరు కాదు, ఇద్దరు కాదు... జట్టులో ఒకరితో మరొకరు పోటీ పడుతూ సత్తా చాటిన వేళ ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో భారత్ అద్భుత ప్రదర్శన కనబర్చింది. ఇప్పుడు అదే ఊపును కొనసాగిస్తూ టి20 సిరీస్‌ను గెలుచుకోవడంపై కూడా జట్టు దృష్టి పెట్టింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నేడు ఇక్కడ జరిగే తొలి టి20లో భారత్, ఆసీస్‌తో తలపడుతుంది. కీలక ఆటగాళ్లు విఫలం కావడంతో వన్డేల్లో కుదేలైన ఆసీస్... పొట్టి ఫార్మాట్లోనైనా రాత మార్చుకునే ప్రయత్నం లో ఉంది. ఇరు జట్ల మధ్య 2016 జనవరిలో ఆఖరిసారిగా టి20 సిరీస్ జరిగింది. ఆస్ట్రేలియా గడ్డపైనే జరిగిన ఈ పోరును భారత్ 3–0తో గెలుచుకోవడం ఈ ఫార్మాట్లో ప్రత్యర్థిపై మన ఆధిక్యాన్ని చూపిస్తోంది. తొలి టి20 మ్యాచ్‌కు ముందు భారత జట్టు ప్రాక్టీస్ చేసేందుకు అవకాశం లేకపోయింది. వరుసగా కురుస్తున్న వర్షాల వల్ల శుక్రవారం సెషన్ రద్దయింది. రాహుల్ ఉంటాడా! కుటుంబ కారణాలతో వన్డేలకు దూరమైన శిఖర్ ధావన్ తిరిగి రావడం మినహా భారత వన్డే, టి20 జట్లలో పెద్దగా తేడా లేదు. మరో అవకాశం లేకుండా రోహిత్‌తో కలిసి అతను ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తాడు. వన్డే సిరీస్‌లో ఒక మ్యాచ్ మినహా తన స్థాయి ముద్ర చూపించలేకపోయిన కోహ్లి, ఈ ఫార్మాట్లో చెలరేగేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఆస్ట్రేలియాతో ఆఖరి సారి భారత్ తలపడిన 2016 టి20 వరల్డ్ కప్ మ్యాచ్‌లోనే కోహ్లి తన కెరీర్లో అత్యుత్తమ టి20 ఇన్నింగ్స్ ఆడాడు. జాదవ్, ధోని కూడా తమ వంతు పాత్రకు సిద్ధం కాగా... వన్డే ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ హార్దిక్ పాండ్యా తన కెరీర్‌కు ఊపునిచ్చిన ఫార్మాట్లో మళ్లీ చెలరేగేందుకు సిద్ధంగా ఉన్నాడు. అయితే ఒక్క నాలుగో స్థానం విషయంలోనే కాస్త సందేహం నెలకొంది. మనీశ్ పాండేను కొనసాగిస్తారా లేక అతని స్థానంలో లోకేశ్ రాహుల్‌కు అవకాశం ఇస్తారా చూడాలి. ఆసీస్‌తో ఒక్క వన్డే కూడా ఆడని రాహుల్‌కు టి20ల్లో మాత్రం మంచి రికార్డు ఉంది. ఐపీఎల్లో బౌలర్‌గా తన సత్తా చాటి కోహ్లిలో నమ్మకాన్ని పెంచిన యజువేంద్ర చహల్‌కు తుది జట్టులో చోటు ఖాయం కాగా, మరో స్పిన్నర్ కోసం అక్షర్, కుల్దీప్ పోటీలో ఉన్నారు. వెటరన్ ఆశిష్ నెహ్రాను సిరీస్ కోసం ఎంపిక చేయడం అంటే అతనికి ఖాయంగా తుది జట్టులో చోటు ఉన్నట్లే. కాబట్టి అతని కోసం పేస్ విభాగంలో మాత్రం ఒకరు త్యాగం చేయాల్సిన పరిస్థితి ఉంది. బుమ్రా టి20 స్పెషలిస్ట్ కాబట్టి భువనేశ్వర్ తప్పుకోవాల్సి రావచ్చు. తన ఎంపికను సరైందిగా నిరూపించుకోవాల్సిన బాధ్యత నెహ్రాపైనే ఉంది. అయితే తుది జట్టులో ఒకటి రెండు మార్పులు జరిగినా, జరగకపోయినా ప్రస్తుత భారత జట్టు మాత్రం అభేద్యంగా కనిపిస్తోంది. ఇదే జోరులో తొలి మ్యాచ్ కూడా గెలుచుకుంటే సిరీస్‌కు పట్టు చిక్కుతుంది. కొత్తగా నలుగురు! వన్డేల్లో ఆడని నలుగురు కొత్త ఆటగాళ్లు ఆసీస్ టీమ్‌లోకి వచ్చారు. ఆల్‌రౌండర్లు డాన్ క్రిస్టియాన్, మొయిజెస్ హెన్రిక్స్, లెఫ్టార్మ్ పేసర్ జేసన్ బెహ్రన్‌డార్ఫ్, వికెట్ కీపర్ టిమ్ పైన్ జట్టులో ఉన్నారు. వార్నర్, ఫించ్, స్మిత్‌లపై అతిగా ఆధార పడటమే వన్డేల్లో ఆసీస్ పరాజయానికి కారణమైంది. ఇప్పుడు కూడా వార్నర్, ఫించ్ విధ్వంసకర ఓపెనింగ్ భాగస్వామ్యం అందించగలరు. అయితే కెప్టెన్ స్మిత్ ఫామ్ ఆ జట్టును ఆందోళనపరుస్తోంది. చాంపియన్స్ ట్రోఫీ నుంచి అతని వరుస వైఫల్యా లు కొనసాగుతున్నాయి. ఆ ప్రభావం కెప్టెన్సీ మీద కూడా పడుతోంది. కనీసం ఇప్పుడైనా అతను రాణించాలని జట్టు కోరుకుంటోంది. వన్డేల్లో ఫెయిలై తుది జట్టులో స్థానం కోల్పోయిన మ్యాక్స్‌వెల్‌పై టి20ల్లోనైనా ఆసీస్ మేనేజ్మెంట్ నమ్మకం ఉంచుతుందో లేదో చూడాలి. అతని విధ్వంసకర బ్యాటింగ్ ఈ ఫార్మాట్లో పనికి రావచ్చు. మ్యాక్సీని కాదంటే అతని స్థానంలో ఆల్‌రౌండర్ హెన్రిక్స్ వస్తాడు. వన్డే సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన కూల్ట ర్నీల్తో పాటు మరో పేసర్ రిచర్డ్సన్ కూడా జట్టులో ఉంటాడు. మూడో పేసర్‌గా బెహ్రన్‌డార్ఫ్ తన తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడే అవకాశం ఉంది. లెగ్‌స్పిన్నర్ జంపా టి20ల్లో ప్రభావం చూపించగలడు. అతని స్థానంలో మరో సరైన ప్రత్యామ్నాయం కూడా ఆసీస్‌కు లేదు. ఈ ఫార్మాట్లో భారత్ చేతిలో చెత్త రికార్డు ఉన్న ఆస్ట్రేలియా దానిని మెరుగు పర్చుకోగలదా చూడాలి. ►9 భారత్, ఆస్ట్రేలియా మధ్య 13 టి20 మ్యాచ్‌లు జరగ్గా... భారత్ 9 గెలిచి 4 ఓడింది. ►1 ఈ మైదానంలో గతంలో జరిగిన ఏకైక టి20 అంతర్జాతీయ మ్యాచ్‌లో భారత్ 69 పరుగులతో శ్రీలంకను చిత్తు చేసింది. తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: కోహ్లి (కెప్టెన్), ధావన్, రోహిత్, పాండే/రాహుల్, జాదవ్, ధోని, పాండ్యా, చహల్, బుమ్రా, కుల్దీప్/ అక్షర్, నెహ్రా/భువనేశ్వర్. ఆస్ట్రేలియా: స్మిత్ (కెప్టెన్), వార్నర్, ఫించ్, హెడ్, మ్యాక్స్‌వెల్/హెన్రిక్స్, క్రిస్టియాన్, పైన్, కూల్టర్‌నీల్, జంపా, రిచర్డ్సన్, బెహ్రన్‌డార్ఫ్. పిచ్, వాతావరణం సాధారణ టి20 తరహా పిచ్. భారీ స్కోరుకు అవకాశం. అయితే రెండు రోజులుగా వర్షం వల్ల వికెట్‌పై తేమ ప్రభావం ఉండవచ్చు. రాంచీతో పాటు పరిసరాల్లో వానలు కురుస్తున్నాయి. శనివారం కూడా మ్యాచ్‌కు అంతరాయం కలిగించవచ్చు. ► రాత్రి గం. 7 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం -
ఐపీఎల్ డబ్బుల కోసమే స్లెడ్జింగ్ చేయడంలేదు...
వచ్చే ఏడాది ఐపీఎల్ వేలంలో ఫ్రాంచైజీలు తమను దూరంగా ఉంచుతాయనే భయంతోనే ఆస్ట్రేలియా ఆటగాళ్లు భారత్‌తో మ్యాచ్‌లు జరిగే సమయంలో స్లెడ్జింగ్‌కు పాల్పడటం లేదని భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ వ్యాఖ్యానించాడు. దుర్భాషలు చేస్తే ఐపీఎల్ యాజమాన్యాలు వారితో ఒప్పందం చేసుకునేందుకు వెనుకాడతాయనే విషయం కంగారూలకు బాగా తెలుసని వీరూ అభిప్రాయపడ్డాడు. భారత్‌తో వన్డే సిరీస్‌లో స్మిత్, వార్నర్, ఫించ్‌లపై అతిగా ఆధార పడటమే ఆ జట్టు పరాజయాలకు కారణమని అతను విశ్లేషించాడు. -
మా ఫీల్డర్లే గెలిపిస్తారు
ఆసీస్ బ్యాట్స్‌మన్ హెడ్ ధీమా చెన్నై: తమ జట్టులో అత్యంత నైపుణ్యం కలిగిన ఫీల్డర్లు ఉన్నారని, వారే భారత్‌తో జరిగే వన్డే సిరీస్‌లో జట్టు విజయానికి కారణమవుతారని ఆసీస్ బ్యాట్స్‌మన్ ట్రెవిస్ హెడ్ విశ్వాసం వ్యక్తం చేశాడు. ‘ఓ మ్యాచ్ గెలవాలన్నా.. ఓడాలన్నా ఫీల్డింగే కారణమవుతుంది. అయితే ఈ విషయంలో మా జట్టు గర్వపడాల్సి ఉంది. ఎందుకంటే అద్భుతమైన ఫీల్డింగ్ మా సొంతం. ఈ విషయంలో మేం చాలా కష్టపడ్డాం. తమ ఫీల్డింగ్‌తో జట్టును గెలిపించే వారు మా జట్టులో ఉన్నారు’ అని హెడ్ అన్నాడు. ఫించ్ అనుమానమే... ఆసీస్ పించ్ హిట్టర్ ఆరోన్ ఫించ్ తొలి వన్డేలో ఆడేది అనుమానంగా మారింది. అతడి కాలి పిక్క కండరాల నొప్పి ఎక్కువ కావడమే ఇందుకు కారణం. నెట్ ప్రాక్టీస్ సమయంలో తను గాయపడటంతో సెషన్‌కు దూరంగా ఉంచి విశ్రాంతి కల్పించారు. ఒకవేళ మ్యాచ్‌కు అందుబాటులో లేకపోతే హెడ్ లేదా కార్ట్రైట్లో ఒకరికి అవకాశం దక్కుతుంది. -
ఆసీస్‌కు సూపర్ ప్రాక్టీస్
బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్‌పై భారీ విజయం చెన్నై: టీమిండియాతో వన్డే సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టు తమ సన్నాహాలను ఘనంగా ఆరంభించింది. తమ బ్యాట్స్‌మెన్‌కు ఫుల్ ప్రాక్టీస్ లభించడంతో మంగళవారం బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్‌తో జరిగిన ఏకైక వన్డే ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఆసీస్ 103 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ స్టొయినిస్ (60 బంతుల్లో 76; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. అతడికి తోడుగా ఆరంభంలో వార్నర్ (48 బంతుల్లో 64; 11 ఫోర్లు), స్మిత్ (68 బంతుల్లో 55; 4 ఫోర్లు, 1 సిక్స్), హెడ్ (63 బంతుల్లో 65; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు సాధించారు. దాంతో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 50 ఓవర్లలో ఏడు వికెట్లకు 347 పరుగుల భారీ స్కోరు సాధించింది. స్టొయినిస్, మాథ్యూ వేడ్ (24 బంతుల్లో 45; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) విజృంభణకు ఆసీస్ చివరి 10 ఓవర్లలో 101 పరుగులు సాధించింది. వాషింగ్టన్ సుందర్, కుశంగ్ పటేల్ రెండేసి వికెట్లు తీశారు. ఆ తర్వాత భారీ లక్ష్య ఛేదనకు దిగిన బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్ 48.2 ఓవర్లలో 244 పరుగులకు ఆలౌట్ అయ్యింది. శ్రీవత్స్ గోస్వామి (43), మయాంక్ అగర్వాల్ (42) రాణించారు. వీరి మధ్య రెండో వికెట్‌కు 76 పరుగుల భాగస్వామ్యం నెలకొంది. లెఫ్టార్మ్ స్పిన్నర్ ఏస్టన్ అగర్‌కు 4 వికెట్లు దక్కాయి. -
అక్టోబర్ 13న హైదరాబాద్ టి20
భారత్‌లో ఆసీస్ పర్యటన ఖరారు న్యూఢిల్లీ: భారత్‌లో ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల పర్యటన ఈ నెల 12నుంచి ప్రారంభం కానుంది. ఆ రోజు చెన్నైలో ఆసీస్ వార్మప్ మ్యాచ్ ఆడుతుంది. అనంతరం ఐదు వన్డేలు, 3 టి20 మ్యాచ్‌లలో భారత్‌తో తలపడుతుంది. ఈ టూర్‌కు సంబంధించిన షెడ్యూల్ ఇప్పటికే ఖరారు కాగా... రెండు రోజుల్లో బీసీసీఐ దీనిని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో అక్టోబర్ 13న చివరి టి20 మ్యాచ్ జరుగుతుంది. ఇంగ్లండ్ పర్యటన కూడా... 2018లో ఇంగ్లండ్‌లో భారత్ సుదీర్ఘ పర్యటన వివరాలను కూడా ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) వెల్లడించింది. 3 జూలైనుంచి 11 సెప్టెంబర్ వరకు సాగే ఈ టూర్లో భారత్, ఇంగ్లండ్ ఐదు టెస్టులు, 3 వన్డేలు, 3 టి20 మ్యాచ్‌లలో తలపడతాయి. ముందుగా టి20లు, వన్డేలు... ఆ తర్వాత ఐదు టెస్టులు ఉంటాయి. బర్మింగ్‌హామ్, లార్డ్స్, నాటింగ్‌హామ్, సౌతాంప్టన్, ఓవల్‌లను టెస్టు వేదికలుగా ఖరారు చేశారు. 2014లో ఆఖరి సారిగా ఇంగ్లండ్‌లో పర్యటించిన భారత్ 5 టెస్టుల సిరీస్‌ను 1–3తో కోల్పోయింది. -
జయాంగని 178 సరిపోలేదు!
♦ లంకపై ఆసీస్‌దే పైచేయి ♦ నింగ్ 152 నాటౌట్ 124 : బౌండరీల ద్వారానే చమరి సాధించిన పరుగులు శ్రీలంక బ్యాట్స్‌మన్ చమరి అటపట్టు జయాంగని అద్భుతమైన బ్యాటింగ్, రికార్డుల హోరు శ్రీలంకను గెలిపించలేకపోయింది. అటు వైపు పోటీగా శతకం బాదిన ఆసీస్ కెప్టెన్ లానింగ్ తమ జట్టుకు వరుసగా రెండో విజయాన్ని అందించింది. బ్రిస్టల్: భారీ సెంచరీలతో హోరెత్తిన ప్రపంచకప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో శ్రీలంకను కంగుతినిపించింది. మొదట శ్రీలంక 50 ఓవర్లలో 9 వికెట్లకు 257 పరుగులు చేసింది. చమరి జయాంగని (143 బంతుల్లో 178 నాటౌట్; 22 ఫోర్లు, 6 సిక్సర్లు) వీరోచిత సెంచరీతో మహిళల వన్డే క్రికెట్ చరిత్రలో మూడో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించింది. ఆమె తర్వాత సిరివర్ధనే (24) మినహా ఇంకెవరూ రెండంకెల స్కోరు చేయలేదు. ఆస్ట్రేలియా బౌలర్లలో ఎలైస్ పెర్రీ, క్రిస్టెన్ బీమ్స్, నికోల్ బోల్టన్ తలా 2 వికెట్లు పడగొట్టారు. తర్వాత ఆస్ట్రేలియా 43.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 262 పరుగులు చేసి ఘనవిజయం సాధించింది. కెప్టెన్ మెగ్ లానింగ్ (135 బంతుల్లో 152 నాటౌట్; 19 ఫోర్లు, 1 సిక్స్) కూడా లంక బౌలర్లపై చెలరేగింది. ఓపెనర్ నికోల్ బోల్టన్ (71 బంతుల్లో 60; 8 ఫోర్లు) అర్ధసెంచరీ సాధించగా... రెండో వికెట్‌కు వీరిద్దరు 133 పరుగులు జోడించారు. తర్వాత లానింగ్, పెర్రీ అబేధ్యమైన మూడో వికెట్‌కు 124 పరుగులు జతచేయడంతో విజ యం సులువైంది. ఈ టోర్నీలో ఆసీస్‌కిది రెండో విజయం. లంక ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడింది. -
లంకను ఆదుకున్న కుషాల్
పల్లెకెలె (శ్రీలంక): బ్యాట్స్‌మన్ కుషాల్ మెండిస్ (243 బంతుల్లో 169 నాటౌట్; 20 ఫోర్లు, 1 సిక్సర్) అజేయ సెంచరీతో కదం తొక్కడంతో ఆస్ట్రేలియాతో జరుగుతోన్న తొలి టెస్టులో శ్రీలంక కోలుకుంది. గురువారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో 80 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 282 పరుగులు చేసింది. ప్రస్తుతం లంక 196 పరుగుల ఆధిక్యంలో ఉంది. మెండిస్‌తో పాటు చండీమల్ (42), ధనుంజయ డి సిల్వా (36) రాణించగా... ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. 6/1 ఓవర్ైనె ట్ స్కోరుతో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన లంకేయులకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. వన్‌డౌన్ బ్యాట్స్‌మెన్‌గా వచ్చిన కరుణరత్నే డకౌట్‌గా వెనుదిరగగా... కౌశల్ సిల్వా (7), మాథ్యుస్ (9) కూడా విఫలమయ్యారు. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన మెండిస్ టెస్టుల్లో తొలి సెంచరీ చేయడంతో పాటు చండీమల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 117 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. టీ విరామం తర్వాత డి సిల్వా వికెట్‌ను కోల్పోయిన లంక ... వ ర్షం అంతరాయం కలిగించడంతో 282 పరుగుల వద్ద మూడోరోజు ఆటను ముగించింది. మెండిస్‌తో పాటు పెరీరా (5 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. -
ఆసీస్, దక్షిణాఫ్రికా మ్యాచ్ రద్దు
ముక్కోణపు వన్డే సిరీస్ బ్రిడ్జ్‌టౌన్ (బార్బడోస్): ముక్కోణపు వన్డే సిరీస్‌లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాల మధ్య జరగాల్సిన వన్డే మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. ఆదివారం ఆట మొదలు పెట్టిన 9 నిమిషాలకే భారీ వర్షం కురవడంతో ఆటను నిలిపివేశారు. దీంతో ఇరు జట్ల ఖాతాలో చెరో 2 పాయింట్లు చేరాయి. ప్రస్తుతం 12 పాయింట్లతో దక్షిణాఫ్రికా మొదటి స్థానంలో ఉండగా... ఆసీస్ (11 పాయింట్లు) రెండో స్థానంలో ఉంది. వెస్టిండీస్ (8) పాయింట్లతో ఉంది. కరీబియన్లు ఇంకా రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. -
ఆసీస్ లక్ష్యం 412
ఇంగ్లండ్‌తో యాషెస్ తొలి టెస్టు కార్డిఫ్ : యాషెస్ సిరీస్ తొలి టెస్టు మూడో రోజు ఆసక్తికరంగా సాగింది. ఇరు జట్ల బౌలర్లు ఆధిపత్యం చూపడంతో శుక్రవారం ఒక్క రోజే 15 వికెట్లు నేలకూలాయి. మరోవైపు ఆసీస్ ముందు ఇంగ్లండ్ జట్టు 412 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఆటకు మరో రెండు రోజుల సమయం ఉంది. 122 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో తమ రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ ఆట ముగిసే సమయానికి 70.1 ఓవర్లలో 289 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 73 పరుగులకు మూడు వికెట్లు పడిన దశలో ఇయాన్ బెల్ (89 బంతుల్లో 60; 11 ఫోర్లు), జో రూట్ (89 బంతుల్లో 60; 9 ఫోర్లు) నాలుగో వికెట్‌కు 97 పరుగులు జోడించారు. ఆ తర్వాత స్టోక్స్ (59 బంతుల్లో 42; 9 ఫోర్లు) ఓ మాదిరిగా ఆడినా స్పిన్నర్ లియోన్ (4/75) ధాటికి మిగతా బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. అంతకుమందు 264/5 ఓవర్‌నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఆసీస్ 84.5 ఓవర్లలో 308 పరుగులకు ఆలౌట్ అయ్యింది. -
బ్రిస్బేన్ (గబ్బా)
స్టేడియాలు చూసొద్దాం బ్రిస్బేన్ నగరంలోని శివారు ప్రాంతమైన ఉలెన్గబ్బాలో ఈ స్టేడియాన్ని ఏర్పాటు చేశారు. ఆసీస్ స్పోర్ట్స్‌కు ఇది ఐకాన్. మొదట్లో దీర్ఘ చతురస్రాకారంలో ఉండే ఈ మైదానాన్ని 1993 నుంచి 2005 వరకు పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తూ గుండ్రంగా తీర్చిదిద్దారు. కాంక్రీట్ స్టాండ్లు, పచ్చిక బయళ్లు ఏర్పాటు చేశారు. దీంతో అధునాతన హంగులతో ఉన్న ఈ స్టేడియం అటు ఆటగాళ్లకు, ఇటు అభిమానులకూ మంచి ఆటవిడుపు ప్రదేశంగా మారింది. లెగ్ స్పిన్నర్లకు విశేషంగా సహకరించే ఈ వికెట్లపై ఎక్స్ట్రా బౌన్స్ రాబట్టడం చాలా సులువు. దీని సామర్థ్యం 42 వేలు. క్వీన్స్లాండ్ రాజధాని అయిన బ్రిస్బేన్‌లో ఉపఖండపు వాతావరణ పరిస్థితులే ఉంటాయి. ఏడాదిలో చాలా వరకు ఎండ వేడిమి ఉంటుంది. సంవత్సరానికి దాదాపు 75 మిలియన్ల మంది పర్యాటకులు ఇక్కడికి వచ్చిపోతుంటారు. అవుట్డోర్ లైఫ్ స్టయిల్, అంతర్జాతీయ స్పోర్టింగ్ ఈవెంట్స్, షాపింగ్, కల్చరల్ షోస్, ఎగ్జిబిషన్లు, డైనింగ్ సీన్స్ (రకరకాల ఆహారపదార్థాలు) ఎక్కువగా కనబడుతుంటాయి. సుందరమైన బీచ్‌లు, అద్భుతమైన ద్రాక్ష తోటలు, వన్య ప్రాణుల సంరక్షణ కేంద్రాలకు నిలయంగా ఉంది. క్వీన్స్‌లాండ్‌లో క్రూయిజ్‌ల సంచారం ఎక్కువగా ఉంటుంది. పిల్లలకు ఇష్టమైన గోల్డ్‌కోస్ట్ థీమ్ పార్క్ ఇక్కడే ఉంది. మ్యాచ్‌లు: ఈ స్టేడియంలో మూడు లీగ్ మ్యాచ్‌లు జరుగుతాయి. ఒక్కటి కూడా పెద్ద మ్యాచ్ లేదు. -
‘ఏడాదిలో మెరుగుపడతాం’
సిడ్నీ: యువకులతో కూ డిన ప్రస్తుత భారత జట్టు రాబోయే ఏడాది కాలంలో మరింత మెరుగుపడుతుందని టీమ్ డెరైక్టర్ రవి శాస్త్రి అన్నారు. ఆసీస్‌తో సిరీస్ గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ‘సిరీస్‌లో 3-0, 4-0 తేడా గురించి ఆలోచించడం లేదు. ప్రత్యర్థులపై అటాకింగ్ గేమ్ ఆడుతున్నంత వరకు దీన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కేవలం ఎలాంటి ప్రదర్శ న చూపారన్న దానిపైనే ఎక్కువగా దృష్టిసారించాలి. ఐదో బౌలర్ లేని లోటు విదేశాల్లో స్పష్టంగా కనిపిస్తోంది.గట్టిపోటీ ఇచ్చి గెలవడానికే ఇక్కడికి వచ్చాం. ఇదే జట్టు రాబోయే ఏడాదిలో అద్భుతంగా మెరుగుపడుతుంది’ అని శాస్త్రి తెలిపారు. -
మదిలో ‘అడిలైడ్’ కదలాడుతుండగా...
సాక్షి క్రీడావిభాగం: సిరీస్ తొలి టెస్టులో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ 290/5... తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 73 పరుగులు కలిపి చివరి రోజు భారత్ ముందు 364 పరుగుల విజయలక్ష్యం ఉంచింది. అయితే కోహ్లి, విజయ్ అద్భుత బ్యాటింగ్‌తో జట్టు విజయానికి చేరువగా వచ్చింది. ఇలాంటి ప్రతిఘటనను ఆస్ట్రేలియా ఊహించలేదు. అందుకే ఇప్పుడు డిక్లరేషన్ గురించి ఆ జట్టు వెనుకాడుతోంది. భారత బ్యాటింగ్ దూకుడు మీదుంది. కోహ్లి అయితే 350 అయినా ఛేదిస్తాం అంటూ అడక్కుండానే పదే పదే చెబుతున్నాడు. ఇది కచ్చితంగా వారిలో ఆందోళన రేకెత్తించింది. సాధారణంగా 300కు పైగా స్కోరు చివరి రోజు ఛేదించడం అంత సులభం కాదు. ఎంసీజీలో అయితే ఎప్పుడో 1929 తర్వాత ఏ జట్టూ ఇంత పెద్ద లక్ష్యాన్ని అందుకోలేదు. ఇలాంటి స్కోర్లు ఉన్నప్పుడు ఎన్నో సార్లు ఆసీస్ కూడా సాహసంగా డిక్లేర్ చేసి ఫలితం కోసమే ప్రయత్నించింది తప్ప ‘డ్రా’ గురించి ఆలోచించలేదు. ‘అడిలైడ్‌లో వారి పోరాటం ఏమిటో చూశాం. అదృష్టం బాగుండి బయటపడ్డాం. లేదంటే కథ మరోలా ఉండేది. వారు 1-0తో ఆధిక్యంలోకి వెళ్లేవారు. భారత్ ఇప్పుడు పాజిటివ్‌గా ఆడుతోంది. కాబట్టి ఇప్పుడున్న స్కోరుకు మేం మరికొన్ని పరుగులు జత చేయాల్సిందే’ అని వార్నర్ అంగీరించడం విశేషం. పిచ్ ఇప్పటికీ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటం ఆసీస్‌ను ఆలోచింపజేసింది. ‘డ్రా’ అయినా సిరీస్ పోతుంది కాబట్టి టీమిండియా గెలుపు కోసం ప్రయత్నించవచ్చు. ఆసీస్ వ్యూహాన్ని చూస్తే చివరి రోజు ఆ జట్టు కొన్ని పరుగులు జోడించడంతో పాటు సాధ్యమైనన్ని ఎక్కువ ఓవర్లు ఆడే ప్రయత్నం చేస్తుంది. అప్పుడు అందుబాటులో ఉన్న సమయంలో ఎంత ధాటిగా ఆడినా లక్ష్య ఛేదన భారత్‌కు కష్టమైపోతుంది. ఈ క్రమంలో వికెట్లు కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. అది ఆసీస్‌కే అనుకూలం. మంగళవారం కూడా వర్షం వచ్చి అంతరాయం ఏర్పడితే మ్యాచ్ ‘డ్రా’ అయ్యేందుకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సిరీస్ విజయంపై దృష్టి పెట్టిన స్మిత్ సేన ఈ టెస్టు వరకు తమ దూకుడును తీసి గట్టున పెట్టినట్లే! ‘వేడి’ కొనసాగింది... నాలుగో రోజు కూడా కోహ్లి, జాన్సన్ మధ్య మాటల యుద్ధం సాగింది. షమీ బౌలింగ్‌లో అవుటై జాన్సన్ వెళుతుండగా కోహ్లి అతడిని ఏదో అన్నాడు. దానిని జాన్సన్ కూడా అదే రీతిలో బదులిచ్చాడు. వెంటనే ఇద్దరు ఫీల్డ్ అంపైర్లు కలుగజేసుకొని కోహ్లికి సర్ది చెప్పారు. మరోవైపు హాడిన్ క్రీజ్‌లో ఉన్న సమయంలో చాలా సేపు అతనికి దాదాపు ఆనుకున్నంత దూరంలో నిలబడి కోహ్లి పదే పదే నోటికి పని చెప్పాడు. -
నాగ్‌పూర్ వన్డేలో టీమిండియా జయభేరి