
విశాఖ స్పోర్ట్స్: రెండు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగే తొలి టి20 మ్యాచ్ ఆడేందుకు భారత్, ఆస్ట్రేలియా క్రికెట్ జట్లు శుక్రవారం విశాఖపట్నం చేరుకున్నాయి. ఆస్ట్రేలియా జట్టంతా శుక్రవారం సాయంత్రం వైజాగ్ వచ్చింది. వాస్తవానికి ఆసీస్ సేన ఐదు గంటలకే విశాఖ చేరుకోవాల్సి ఉండగా విమానం ఆలస్యం కావడంతో గంట అదనపు సమయం పట్టింది. విశాఖ చేరుకున్న ధోని, కోహ్లి శుక్రవారం వైఎస్‌ఆర్ స్టేడియంలో ప్రాక్టీస్ చేశారు. శనివారం భారత్‌తో పాటు ఆసీస్ జట్టు ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొంటుంది.