అరకు అందాలకు ‘అమెరికా’ ఫిదా | Two weeks of India US military exercises off the coast of vizag | Sakshi
Sakshi News home page

అరకు అందాలకు ‘అమెరికా’ ఫిదా

Published Mon, Mar 25 2024 2:17 AM | Last Updated on Mon, Mar 25 2024 11:46 AM

Two weeks of India US military exercises off the coast of vizag  - Sakshi

తూర్పు కనుమల్లో పర్యటించిన అమెరికా రాయబారిఎరిక్‌ గార్సెట్టి తదితరులు

విశాఖ తీరంలో రెండు వారాలపాటు భారత్‌–అమెరికా సైనిక విన్యాసాలు 

ఈ నెల 18 నుంచి కొనసాగుతున్న త్రివిధ దళ విన్యాసాలు 

మహారాణిపేట(విశాఖ దక్షిణ):  తూర్పు కనుమల్లో అమెరికా రాయబార ప్రతినిధులు ఎరిక్‌ గార్సెట్టి తదితరులు ఆదివారం పర్యటించారు. విశాఖలోని కైలాసగిరి, ఆర్కే బీచ్‌తోపాటు అరకు పరిసరాల్లోని పచ్చదనం, ప్రకృతి ఒడిలో అక్కడి ప్రజల జీవన విధానం చూసి ముగ్ధులైయ్యారు. విశాఖ నుంచి అరకు వెళ్లే మార్గంలో చిలకల గెడ్డ వద్ద ప్రకృతి అందాలతో పాటు పచ్చదనం లోయల్లో నీటి ప్రవాహాన్ని చూసి పరవశించిపోయారు.

విశాఖ పరిసరాలు పర్యావరణానికి దగ్గరగా ఆరోగ్యకరమైన జీవనానికి చేరువగా ఉన్నట్టు యూఎస్‌ కాన్సులేట్‌ ప్రతినిధులు పేర్కొన్నారు. కాగా, భారత్‌–అమెరికా సైనిక సంబంధాలు, సంయుక్త విన్యాసాల ప్రదర్శనలో భాగంగా ఈ నెల 18వ తేదీ నుంచి విశాఖ తీరంలో త్రివిధ దళాల సంయుక్త కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా భారత్‌ స్వయం సమృద్ధిగా రూపొందించిన ఐఎన్‌ఎస్‌ జలస్వ నౌకతోపాటు అమెరికాకు చెందిన యుద్ధ నౌకలపై త్రివిధ దళ సిబ్బంది విన్యాసాలు ప్రదర్శించారు.

దీనిలో భాగంగా ఇప్పటికే విశాఖ చేరుకున్న బాహుబలి నౌక యూఎస్‌ కాన్సులేట్‌ భారత–అమెరికా సైనిక సిబ్బంది వివిధ అంశాలపై అవగాహన పొందారు. ప్రపంచంలోనే అతిపెద్ద యుద్ధనౌకగా గుర్తింపు పొందిన సోమర్‌ సెట్‌లో 25 యుద్ధ ట్యాంకులు, నాలుగు హెలికాప్టర్లు, అన్నివైపులా ఆయుధ ట్యాంకులు, 1000 మంది సిబ్బంది ఈ నౌకలో ఉండడం విశేషం.

2001 సెప్టెంబర్‌లో వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌పై ఉగ్ర దాడుల స్మారకంగా నిరి్మంచిన ఈ యుద్ధనౌకను విపత్తుల సమయంలో రక్షణ దళాలకు ఆస్పత్రిగా సేవలు అందిస్తుంది. టైగర్‌ ట్రయాంప్‌ పేరిట ఈ నెల 31వ తేదీ వరకు సముద్రంపై విన్యాసాలు కూడా రెండు దేశాల త్రివిధ దళాలు చేయనున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement