military drills
-
అరకు అందాలకు ‘అమెరికా’ ఫిదా
మహారాణిపేట(విశాఖ దక్షిణ): తూర్పు కనుమల్లో అమెరికా రాయబార ప్రతినిధులు ఎరిక్ గార్సెట్టి తదితరులు ఆదివారం పర్యటించారు. విశాఖలోని కైలాసగిరి, ఆర్కే బీచ్‌తోపాటు అరకు పరిసరాల్లోని పచ్చదనం, ప్రకృతి ఒడిలో అక్కడి ప్రజల జీవన విధానం చూసి ముగ్ధులైయ్యారు. విశాఖ నుంచి అరకు వెళ్లే మార్గంలో చిలకల గెడ్డ వద్ద ప్రకృతి అందాలతో పాటు పచ్చదనం లోయల్లో నీటి ప్రవాహాన్ని చూసి పరవశించిపోయారు. విశాఖ పరిసరాలు పర్యావరణానికి దగ్గరగా ఆరోగ్యకరమైన జీవనానికి చేరువగా ఉన్నట్టు యూఎస్ కాన్సులేట్ ప్రతినిధులు పేర్కొన్నారు. కాగా, భారత్–అమెరికా సైనిక సంబంధాలు, సంయుక్త విన్యాసాల ప్రదర్శనలో భాగంగా ఈ నెల 18వ తేదీ నుంచి విశాఖ తీరంలో త్రివిధ దళాల సంయుక్త కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా భారత్ స్వయం సమృద్ధిగా రూపొందించిన ఐఎన్ఎస్ జలస్వ నౌకతోపాటు అమెరికాకు చెందిన యుద్ధ నౌకలపై త్రివిధ దళ సిబ్బంది విన్యాసాలు ప్రదర్శించారు. దీనిలో భాగంగా ఇప్పటికే విశాఖ చేరుకున్న బాహుబలి నౌక యూఎస్ కాన్సులేట్ భారత–అమెరికా సైనిక సిబ్బంది వివిధ అంశాలపై అవగాహన పొందారు. ప్రపంచంలోనే అతిపెద్ద యుద్ధనౌకగా గుర్తింపు పొందిన సోమర్ సెట్లో 25 యుద్ధ ట్యాంకులు, నాలుగు హెలికాప్టర్లు, అన్నివైపులా ఆయుధ ట్యాంకులు, 1000 మంది సిబ్బంది ఈ నౌకలో ఉండడం విశేషం. 2001 సెప్టెంబర్‌లో వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై ఉగ్ర దాడుల స్మారకంగా నిరి్మంచిన ఈ యుద్ధనౌకను విపత్తుల సమయంలో రక్షణ దళాలకు ఆస్పత్రిగా సేవలు అందిస్తుంది. టైగర్ ట్రయాంప్ పేరిట ఈ నెల 31వ తేదీ వరకు సముద్రంపై విన్యాసాలు కూడా రెండు దేశాల త్రివిధ దళాలు చేయనున్నాయి. -
తైవాన్ చుట్టూ చైనా సైనిక విన్యాసాలు
బీజింగ్: చైనా, తైవాన్‌ల మధ్య మళ్లీ ఉద్రిక్తతలు నెలకొన్నాయి. తైవాన్ ఉపాధ్యక్షుడు విలియం లాయ్ చెంగ్–తె ఇటీవల పరాగ్వే పర్యటకు వెళ్లి తిరిగి వస్తూ శాన్ఫ్రాన్సిస్కో, న్యూయార్క్ నగరాల్లో ఆగారు. దీంతో డ్రాగన్ దేశం తైవాన్‌కు తీవ్ర హెచ్చరికలు పంపింది. ద్వీపం చుట్టూ శనివారం సైనిక విన్యాసాలకు దిగింది. వేర్పాటువాదులు, విదేశీ శక్తుల కవి్వంపు చర్యలకు ప్రతిగానే తాము ఈ మిలటరీ డ్రిల్స్ చేపట్టినట్టుగా చైనా రక్షణ శాఖ వెల్లడించింది. యుద్ధ విమానాలు, నౌకల్ని కూడా మోహరించింది. దీనికి సంబంధించిన వీడియో కూడా విడుదల చేసింది. తైవాన్ను శాశ్వతంగా స్వతంత్ర దేశంగా ప్రకటించుకునే ప్రయత్నాల్లో భాగంగానే ఉపాధ్యక్షుడు విలియం అమెరికాలోని న్యూయార్క్, శాన్‌ఫ్రాన్సిస్కోల్లో పర్యటించారు. తైవాన్ తమ దేశంలో భాగమని అంటున్న చైనా విలియం లాయ్ పర్యటనకి హెచ్చరికగా ఇదంతా చేస్తోంది. మరోవైపు చైనా యుద్ధ విమానాలు తమ గగనతలంలోకి రావడంపై తైవాన్ మండిపడింది. శనివారం ఉదయం నుంచి పదుల సంఖ్యలో యుద్ధ విమానాలు రావడం కవి్వంపు చర్యలకి దిగడమేనని తైవాన్ రక్షణ శాఖ పేర్కొంది. తమ దేశ స్వాతంత్య్రాన్ని కాపాడుకోవడానికి ఎంతకైనా తెగిస్తామని స్పష్టం చేసింది. -
యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్‌పై కిమ్ సోదరి ఫైర్
ఇటీవల ఉత్తర కొరియా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ప్రయోగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రపంచదేశాలతో సహా ఐక్యరాజ్యసమతి సెక్యూరిటీ కౌన్సిల్ సైతం ఉత్తర కొరియా తీరుపై మండిపడింది. ఉత్తర కొరియా దూకుడుకి అడ్డుకట్టే వేసే దిశగా పావులు కదిపింది కూడా. ఈ నేపథ్యంలో యూఎన్ఎస్సీ తీసుకున్న విధానాలను విమర్శిస్తూ...ఇది ద్వంద వైఖరి అంటూ కిమ్‌జోంగ్ ఉన్ సోదరి యో జోంగ్ సెక్యూరిటీ కౌన్సిల్‌పై నిప్పులు చెరిగింది. దక్షిణకొరియా, అమెరికా సంయుక్తంగా నిర్వహించిన ప్రమాదకరమైన సైనిక కసరత్తుల విషయంలో యూఎస్ఎస్సీ కళ్లు మూసుకుపోయినట్లు ఉన్నాయి అంటూ కస్సుమంది. అత్యాశతో ఆయుధాల పెంచుకునే దిశగా చేసిన కసరత్తులు సెక్యూరిటీ కౌన్సిల్‌కి కనిపంచటం లేదని అన్నారు. భయంతో మొరిగే కుక్కమ మాదిరిగా అమెరికా ప్రవర్తిస్తుందని కిమ్ సోదరి యో జోంగ్ అన్నారు. కేవలం కొరియా ద్వీపకల్పాన్ని సంక్షోభంలోకి నెట్టివేయడమే ప్రధాన లక్ష్యంగా అమెరికా ఇలా చేస్తుందని నిందించారు. కిమ్‌జోంగ్ ఉన్ ఇటీవలే హ్యాసాంగ్-17 అనే క్షిపణిని ప్రయోగించిన సంగతి తెలిసింది. దీన్ని రాక్షస క్షిపణిగా దక్షిణ కొరియా పేర్కొంది. ఈ క్షిపణి 6 వేల కి.మీ ఎత్తులో వెయ్యి కిలోమీటర్లు (620 మైళ్ళు) వరకు దూసుకుపోయిందని దక్షిణ కొరియా సైన్యం తెలిపింది. ఉత్తరకొరియా మార్చి 24న అత్యంత శక్తివంతమైన అణు పరీక్షల్లో ఒకటైనా ఐసీబీఎం కంటే ఈ క్షిపణి ప్రయోగం కొంచెం తక్కువగా ప్రభావంతమైందని తెలిపింది. అదీగాక ఇంతవరకు ఉత్తరకొరియా ప్రయోగించిన రికార్డు బ్రేకింగ్ క్షిపణుల్లో ఇది సరికొత్తది. అంతేగాదు దక్షిణ కొరియాలను, టోక్యోలను రక్షించడానికి వాషింగ్టన్ తీసుకుంటున్న చర్యలపై ఉత్తరకొరియా, రష్యాలు పదే పదే నిప్పులు గక్కాయి. దక్షిణ కొరియా, అమెరికాలోని విశ్లేషకులు, అధికారులు మాత్రం ఉత్తర కొరియా ఏడవ అణు పరీక్షకి సిద్ధం కానుందని హెచ్చరిస్తున్నారు. (చదవండి: ఉత్తర కొరియా కవ్వింపు చర్య.. తీవ్ర ఉద్రిక్తత, జపాన్, సౌత్ కొరియా అలర్ట్) -
అమెరికా-దక్షిణ కొరియాల స్ట్రాంగ్ కౌంటర్! ఉత్తరకొరియా ఫైర్
ఉత్తరకొరియా గతవారమే ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించిన సంగతి తెలిసిందే. దీంతో అమెరికా దక్షిణ కొరియాలు తమ ఉమ్మడి వైమానిక దళ విన్యాసాలతో ఉత్తర కొరియాకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాయి. ఈ విషయమై ఉత్తర కొరియా చాలా గట్టిగా ప్రతి స్పందించింది. దీన్ని ఉత్తర కొరియా ఉద్దేశపూర్వకంగా బహిరంగంగా రెచ్చగొట్టే చర్యగా అభివర్ణించి. అంతేగాదు తమను లక్ష్యంగా చేసుకుని ఇలా దూకుడుగా విన్యాసాలు చేపట్టిందని మండిపడింది. యుద్ధ సన్నాహాల్లో భాగంగానే ఇలా చేస్తుందంటూ సీరియస్ అయ్యింది. ఈ విన్యాసాల వల్ల ప్రంపచానికి ఎలాంటి ముప్పు ఉండదంటూ ఉత్తర కొరియా వ్యాఖ్యలను కొట్టిపారేసింది అమెరికా. వైమానిక దళ స్థావరాలపై దాడుల జరిపే బాలిస్టిక్ క్షిపణులతో సహా శత్రు విమానాలను ధ్వంసం చేసే విన్యాసాలను కూడా ప్రాక్టీస్ చేసినట్లు ఉత్తర కొరియా పేర్కొంది. ఈ విషయమై సుమారు 500 విమానాలతో ఉత్తర కొరియా ఒక భారీ కంబాట్ ఆపరేషన్ నిర్వహించినట్లు తెలిపింది. అంతేగాదు సైనిక కార్యకలాపాలకు సంబంధించిన చిత్రాలను సైతం విడుదల చేసింది. విజిలెంట్ స్టార్మ్ వంటి వైమానికి విన్యాసాలను ఉత్తర కొరియా చాలా సీరియస్‌గా తీసుకుంది. ఎందుకంటే వైమానిక దళం పరంగా ఉత్తర కొరియా చాలా బలహీనంగా ఉంటుంది. వాస్తవానికి ఉత్తర కొరియా వద్ద ఉన్న యుద్ధ విమానాల కంటే యూఎస్ దక్షిణ కొరియాల వద్ద ఉన్న విజిలెంట్ స్టార్మ్ ఎఫ్ 35 స్టెల్త్ ఫైటర్లతో సహా అత్యంత ఆధునిక యుద్ధ విమానాలు ఉన్నాయి. అందువల్లే ఈ వైమానికి విన్యాసాల విషయంలో ఉత్తరకొరియా అగ్గిమీద గుగ్గిలమవుతోంది. అదీగాక ఉత్తర కొరియ గతవారం వరుస క్షిపణి ప్రయోగాల దృష్ట్యా యూఎస్ దక్షిణ కొరియాలు ఈ విన్యాసాలను ఒకరోజు పొడిగించారు. దీంతో ఉత్తర కొరియా దీన్ని వార్ రిహార్సిల్స్ అంటూ గగ్గోలు పెడుతోంది. అదీగాక దక్షిణ కొరియా కంప్యూటర్ ఆధారిత మిలటరీ విన్యాసాన్ని కూడా సోమవారమే ప్రారంభించింది. ఉత్తర కొరియా బెదిరింపులకు తలొగ్గకుండా ఉండేలా తన సామర్థ్యాన్ని పెంపొందించుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది దక్షిణ కొరియా. (చదవండి: ఇమ్రాన్ ఖాన్ నటనలో షారుక్, సల్మాన్‌లను మించిపోయారు) -
ఆ సాహసం చేయొద్దు.. అమెరికాకు ఉత్తరకొరియా హెచ్చరిక
సియోల్: అమెరికాతో కలిసి దక్షిణకొరియా చేస్తున్న సంయుక్త వైమానిక విన్యాసాలపై ఉత్తర కొరియా తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. కొరియా ద్వీపకల్పంలో శాంతిభద్రతలను అమెరికా నాశనం చేస్తోందని దుయ్యబట్టింది. దురాక్రమణకు సాహసిస్తే దీటుగా ఎదుర్కొంటామని హెచ్చరించింది. ఉత్తర కొరియా తరచూ క్షిపణి పరీక్షలు చేస్తుండటంతో అమెరికా, దక్షిణ కొరియా 200 యుద్ధవిమానాలతో విన్యాసాలు చేస్తున్నాయి. చదవండి: (నాన్సీ పెలోసీ భర్తపై దాడి.. విచారణలో దిగ్భ్రాంతికర విషయాలు) -
మిరాకిల్.. యుద్ధ ట్యాంక్ కింద నలిగినా ప్రాణాలతో బయటపడి..
మాస్కో: సైన్యం మిలిటరీ డ్రైవ్ నిర్వహిస్తున్న సమయంలో ఓ యుద్ధ ట్యాంకర్ సైనికుడి పైనుంచి దూసుకెళ్లింది. 13 టన్నుల బరువున్న వాహనం తనపై నుంచి వెళ్లినా అతను ప్రాణాలతో బయటపడ్డాడు. చక్రాల కింద నలిగినా మరణాన్ని జయించాడు. ఇంతా జరిగినా యథావిధిగా మళ్లీ లేచి తన స్థానంలో నిల్చున్నాడు. రష్యా సైన్యం మిలిటరీ డ్రైవ్ సమయంలో ఈ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. 🤡Nothing says "Second Greatest Military Force in the World" quite like crushing your own soldiers under the wheels of a 13 tonne APC during a "cool military drive-by" demonstration. pic.twitter.com/xgFeTWYMCA — Captain Black Sea (@CaptainBlackSe1) October 13, 2022 అయితే రష్యా సైన్యం తీరుపై కొందరు నెటిజన్లు మండిపడ్డారు. ప్రపంచంలో శక్తిమైన సైన్యంగా చెప్పుకునే రష్యా ఆర్మీ.. సొంత సైనికుడి మీద నుంచే యుద్ధ ట్యాంకర్‌ను పోనివ్వడం వారి నైపుణ్యానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. మరికొందరు మాత్రం రష్యా సైనికుడు ప్రణాలతో బయటపడటం మిరాకిల్‌లా ఉందని అన్నారు. అతను అదృష్ట జాతకుడని, అందుకే ఇంకా ఆయుషు మిగిలి ఉందని పేర్కొన్నారు. చదవండి: షాకింగ్ ఘటన.. రూ.690 కోట్ల పెయింటింగ్‌పై.. -
అమెరికా బృందం టూర్‌పై ఆగ్రహం.. తైవాన్ను చుట్టుముట్టిన చైనా!
బీజింగ్: అమెరికా సెనేట్ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్ పర్యటనతో ఇప్పటికే అగ్గిమీద గుగ్గిలంలా మండిపడుతోంది చైనా. తైవాన్‌పై యుద్ధం చేసినంత పని చేసింది. ఆ ఆగ్రహ జ్వాలలకు మరింత ఆజ్యం పోస్తోంది అమెరికా. మరోమారు అమెరికాకు చెందిన చట్టసభ్యులు కొందరు తైవాన్‌లో పర్యటించారు. తైపీ నేతలతో సమావేశమైన క్రమంలో చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. తైవాన్ జలసంధివ్యాప్తంగా తాజాగా మిలిటరీ డ్రిల్స్ చేపట్టినట్లు ప్రకటించింది. యుద్ధ నౌకలు, మిసైల్స్, జెట్స్ వంటి వాటిని తైవాన్ సమీప జలాల్లోకి చైనా పంపించిన తర్వాత ఈ అప్రకటిత పర్యటన చేపట్టారు అమెరికా చట్టసభ్యులు. దీంతో డ్రాగన్‌కు మరింత కోపం తెప్పించినట్లయింది. డెమోక్రాటిక్ పార్టీ సెనేటర్ ఎడ్ మార్కీ నేతృత్వంలోని ఐదుగురు చట్ట సభ్యుల బృందం ఆదివారం రాత్రి 7 గంటలకు తైపీ చేరుకుంది. ఈ బృందం ఆది, సోమవారాల్లో అక్కడే ఉండి అమెరికా-తైవాన్‌ల సంబంధాలు, వాణిజ్యం, పెట్టుబడులు, ప్రాంతీయ భద్రత, వాతావరణ మార్పులు వంటి తదితర అంశాలపై సీనియర్ నేతలతో చర్చలు జరిపింది. ఈ బృందం ఆకస్మిక పర్యటనతో బీజింగ్‌కు ఆగ్రహం తెప్పించినట్లయింది. యుద్ధాన్ని ఎదుర్కునేందుకు పెట్రోలింగ్, యుద్ధ సన్నాహక ప్రదర్శనలు చేపట్టినట్లు సోమవారం ప్రకటించింది డ్రాగన్. ‘ తైవాన్ జలసంధిలో శాంతి, స్థిరత్వాన్ని అణగదొక్కేందుకు నిరంతరం రాజకీయ కుట్రలు చేస్తున్న అమెరికా, తైవాన్లకు వ్యతిరేకంగా చేపడుతున్న మిలిటరీ డ్రిల్స్ ఇవి. జాతీయ సమగ్రతను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటాం.’ అని పేర్కొన్నారు చైనా మిలిటరీ తూర్పు థియేటర్ కమాండ్ ప్రతినిధి షి యి. మరోవైపు.. పెలోసీ పర్యటనను చాకుగా చూపించి తమ ప్రాంతాన్ని ఆక్రమించుకునే కుట్రలు చేస్తోందని చైనాపై ఆరోపణలు చేసింది తైవాన్ ప్రభుత్వం. ఇదీ చదవండి: తైవాన్‌కు మళ్లీ అమెరికా బృందం -
ప్రశంసించడానికే వెళ్లాం! చైనాను బుజ్జగిస్తున్న అమెరికా!
వాషింగ్టన్: అమెరికా సభ ప్రతినిధుల స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్ పర్యటన తీవ్ర ఉద్రిక్తలకు దారితీసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు చైనా తైవాన్ చుట్టూతా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ గస్తీ కాయడమే కాకుండా సైనిక కసరత్తులు ప్రారంభించింది కూడా. అంతేగాక తైవాన్‌ని భయభ్రాంతులకు గురిచేసేలా సైనిక విన్యాసాలను కొనసాగించింది. పెలోసీ పర్యటన పూర్తయినప్పటికీ తన విన్యాసాలను కొనసాగించడమే కాకుండా తైవాన్ చుట్టూత తమ ఆర్మీ కార్యకలాపాలు పూర్తి అయ్యాయని, యుద్ధం చేయడమే తరువాయి అన్నట్లు ప్రకటించింది. పైగా ఏ క్షణమైన యుద్ధం చేసేందుకు రెడీ అంటూ.. తైవాన్ సరిహద్దులో తన ఆర్మీ డ్రిల్ కొనసాగుతుందని కరాఖండిగా చెప్పేసింది. దీంతో నాన్సీ పెలోసి ఈ విషయమై స్పందించి...కేవలం తైవాన్‌ని ప్రశంసించడానికే వెళ్లాం. చైనా గురించి ప్రస్తావించడానికి వెళ్లలేదు. చైనా తైవాన్‌ని ఒంటరి చేయదు అంటూ తమ స్నేహ హస్తాన్ని అందించడానికి వెళ్లాం. అలాగే ఇండో పసిఫిక్ ప్రాంత అభివృద్ధిపై దృష్టి సారించేలా, చైనాకు ఆయా ప్రాంతాల్లో ఉన్న వివాదాలను పరిష్కరించేలా సాగిన పర్యటనే తప్ప మరోకటి కాదని చెప్పారు. పెలోసి ప్రతినిధి బృందం తైవాన్‌తో పాటు, సింగపూర్, మలేషియా, దక్షిణ కొరియా, జపాన్‌లను కూడా సందర్శించిందన్న విషయాన్ని చైనాకు గుర్తు చేశారు. చైనా అధ్యక్షుడు ఏం చెప్పినప్పటికీ అమెరికా తన నిబద్ధతకు కట్టుబడి తన మిత్ర దేశాలకు అండగా ఉంటుందని చెప్పారు. అంతేకాదు తైవాన్‌ని ఒత్తిడికి గురిచేసేలా సైనిక శిక్షణ కొనసాగించడానికి అమెరికా అనుమతించదని ఫెలోసీ నొక్కి చెప్పారు. (చదవండి: 'తగ్గేదే లే' అని తెగేసి చెబుతున్న చైనా! ఎనీ టైం రెడీ!) -
China-Taiwan: తైవాన్ జలసంధిపై చైనా బాంబుల వర్షం.. వీడియో విడుదల
బీజింగ్: తైవాన్ జలసంధిపై క్షిపణులతో విరుచుకుపడింది చైనా. ఈ చర్య అంతర్జాతీయ సమాజంలో కలకలం సృష్టించింది. చైనా సైన్యంపై తైవాన్ సమీపంలో బాంబులు కురిపించిన వీడియోనూ ఆ దేశ అధికారిక మీడియా సీసీటీవీ విడుదల చేసింది. ఈ దృశ్యాలు ప్రపంచదేశాలను విస్మయానికి గురిచేశాయి. డాంగ్‌ఫెండ్ క్షిపణులను కురిపించి తమ సేనలు అనుకున్న ఫలితాలు సాధించాయని చైనా సైన్యం ప్రకటించింది. సైనిక క్రీడల్లో భాగంగా చైనా తన అధునాతన యుద్ధవిమాన వాహక నౌక, అణ్వస్త్ర సామర్థ్య జలాంతర్గామిలను తైవాన్ జలసంధిలోకి ప్రవేశపెట్టింది. తైవాన్‌లోని జపాన్‌కు చెందిన ఎక్స్‌క్లూజివ్ ఎకనమిక్ జోన్ సమీపంలోనూ క్షిపణులు పడ్డాయి. ‘మేం ఏం చెప్తామో అదే చేస్తాం’ అని చైనా రక్షణశాఖ అధికార ప్రతినిధి టాన్ కెఫీ వ్యాఖ్యానించారు. క్షిపణి పరీక్షలంటూ చైనా రాకెట్లను ప్రయోగించడం వారంలో ఇది రెండోసారి కావడం గమనార్హం. విమాన సర్వీసులు రద్దు చైనా సైన్యం క్షిపణి ప్రయోగాల నేపథ్యంలో అప్రమత్తమై తైవాన్ తన పౌర విమానాల రాకపోకలను వెనువెంటనే ఆపేసింది. రాజధాని తైపేలోని ఎయిర్పోర్ట్ నుంచి దాదాపు 50 విమాన సర్వీస్‌లు రద్దయ్యాయి. ప్రపంచవిపణిలో అత్యంత కీలకమైన ప్రాసెస్ చిప్స్‌ల సముద్రమార్గ రవాణా కొనసాగుతోందా లేదా అనే దానిపై సందిగ్ధత నెలకొంది. చైనా సైనిక డ్రిల్స్ చేస్తున్న అదే ప్రాంతానికి సమీపంలోకి అమెరికా పీ–8ఏ పోసిడాన్ గస్తీ విమానం, ఎంహెచ్–60ఆర్ జలాంతర్గామి విధ్వంసక హెలికాప్టర్లు వచ్చి ఉద్రిక్తతలను మరింత పెంచాయని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ఒక కథనంలో పేర్కొంది. తైవాన్ సైతం మిరాజ్, ఎఫ్–5 యుద్ధ విమానాలతో చైనా దళాలున్న చోటుపై పర్యవేక్షణకు వెళ్లి వచ్చాయని స్థానిక మీడియా వెల్లడించింది. చైనా చర్యను చట్టవిరుద్ధ, బాధ్యతారాహిత్య చర్యగా తైవాన్ అభివర్ణించింది. తైవాన్‌పై నోరు మెదపని పెలోసీ తైవాన్ పర్యటనతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనేలా చేసిన పెలోసీ.. దక్షిణ కొరియా పర్యటనలో ఆ విషయాన్ని ప్రస్తావించలేదు. ద.కొరియా పార్లమెంట్ స్పీకర్ కిమ్ జిన్ ప్యోను పెలోసీ కలిసినా తైవాన్ అంశాన్ని బహిరంగంగా ప్రస్తావించలేదు. ఉ.కొరియా ‘అణు’ ప్రమాదంపై చర్చించామని జిన్ చెప్పారు. చదవండి: పంజా విసిరిన చైనా.. అదే జరిగితే ప్రపంచానికే ముప్పు! -
రెచ్చగొడితే ఊరుకునేది లేదు: ఉత్తర కొరియా
ప్యాంగ్యాంగ్: సముద్ర సరిహద్దులో సైనిక విన్యాసాలు నిర్వహించి దక్షిణ కొరియా దుస్సాహసానికి పూనుకుందని ఉత్తర కొరియా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటువంటి ఘటనలు ఘర్షణకు దారి తీస్తాయని.. కవ్వింపు చర్యలకు పాల్పడితే ధీటుగా బదులిస్తామని శుక్రవారం దాయాది దేశాన్ని హెచ్చరించింది. పశ్చిమ సముద్ర సరిహద్దుల్లో యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలు మోహరిస్తూ 2018 నాటి ఒప్పందాన్ని ఉల్లంఘించిందని మండిపడింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే తాము రంగంలోకి దిగక తప్పదని.. ఆ తర్వాత చోటుచేసుకునే పరిణామాలకు తాము బాధ్యులం కాబోమని హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు ఉత్తర కొరియా సాయుధ బలగాల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. (జిన్‌పింగ్‌పై కిమ్ జోంగ్ ఉన్ ప్రశంసలు!) దక్షిణ కొరియా కౌంటర్ ఇక ఈ విషయంపై స్పందించిన దక్షిణ కొరియా రక్షణ శాఖ.. తమ ఆధీనంలోని పశ్చిమ జలాల్లో సైనిక విన్యాసాలు నిర్వహించడం నిబంధనల ఉల్లంఘన కిందకు రాదని స్పష్టం చేసింది. సరిహద్దుకు దాదాపు 300 కిలోమీటర్ల దూరంలో తమ మిలిటరీ డ్రిల్ కొనసాగిందని పేర్కొంది. 2018 నాటి ఒప్పందానికి కట్టుబడి ఉంటూనే తమ సైన్యం శత్రుదేశాల కుయుక్తులను తిప్పికొట్టేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని కౌంటర్ ఇచ్చింది. కాగా ఉభయ కొరియా దేశాల సరిహద్దుల్లో ఆదివారం కాల్పులు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఉత్తర కొరియా సైనికులు తమ సరిహద్దు లోపల తుపాకీ కాల్పులు జరపగా.. ఇందుకు హెచ్చరికగా తాము 20 రౌండ్ల కాల్పులు జరిపామని దక్షిణకొరియా వెల్లడించింది. అయితే ఈ కాల్పుల్లో తమకు ఎటువంటి నష్టం వాటిల్లలేదని స్పష్టం చేసింది. (కిమ్‌కి శస్త్ర చికిత్స జరిగిందా ?) అదే విధంగా ఈ విషయాన్ని ఉత్తర కొరియా ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లగా అటు నుంచి ఇంతవరకు సమాధానం రాలేదని పేర్కొంది. కాగా 1950-53 మధ్య జరిగిన కొరియన్ యుద్ధం ముగిసిన నాటి నుంచి దాయాది దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో దక్షిణ కొరియాకు మద్దతుగా దాదాపు 28 వేల అమెరికా సైనిక బలగాలు అక్కడే ఉండి ఉత్తర కొరియా దూకుడుకు ఎప్పటికప్పుడు కళ్లెం వేస్తున్నాయి. ఇక యువ నాయకుడు కిమ్ జోంగ్ ఉన్ ఉత్తర కొరియా పగ్గాలు చేపట్టిన తర్వాత 2018లో దాయాది దేశ అధ్యక్షుడితో మూడు దఫాలుగా సమావేశమై ఒప్పందం(కాల్పుల విరమణ) కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం కిమ్ ఆరోగ్యం క్షీణించిందనే వార్తల నేపథ్యంలో సరిహద్దుల్లో ఈ పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం.(కిమ్ తిరిగి రావడంపై ట్రంప్ ట్వీట్) -
ఉత్తర కొరియాను రెచ్చగొడుతున్న అమెరికా
-
కిమ్‌ను మళ్లీ రెచ్చగొడుతున్నారు
సియోల్ : ఉత్తర కొరియా నియంతాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ను రెచ్చగొట్టే చర్యలను అమెరికా మళ్లీ మొదలుపెట్టింది. ఆదివారం ఉదయం దక్షిణ కొరియా సైన్యంతో కలిసి సంయుక్తంగా సైనిక విన్యాసాలను చేపట్టింది. ఫోల్ ఈగల్ పేరిట ఏప్రిల్ 8వ తేదీ వరకు ఈ ఆపరేషన్ కొరియా దేశాల సరిహద్దుల్లో కొనసాగనుంది. ఇందులో 11, 500 అమెరికన్ దళాలు, 2,90,000 దక్షిణ కొరియా దళాలు పాల్గొనబోతున్నట్లు సియోల్‌కు చెందిన యోన్హప్ వార్తా సంస్థ కథనం ప్రచురించింది. అమెరికా ప్రస్తావన పక్కకు పెట్టి ఉత్తర కొరియా పొరుగు దేశం(దక్షిణ కొరియా)తో చర్చలకు సిద్ధమైంది. ఏప్రిల్ చివరి వారంలో కిమ్.. దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్‌తో భేటీ కానున్నట్లు ప్యాంగ్ యాంగ్-సియోల్ వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో తాజా డ్రిల్.. కిమ్‌ను మరింతగా రెచ్చగొట్టేదిగా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సాధారణంగా ప్రతీ యేటా ఫిబ్రవరి చివర్లో లేదా మార్చి మొదట్లో ఈ మిలిటరీ డ్రిల్ కొనసాగాలి. కానీ, వింటర్ ఒలంపిక్స్, పారా ఒలంపిక్స్ నేపథ్యంలో అవి వాయిదా పడ్డాయి. చర్చల ప్రతిపాదన కొనసాగుతున్న వేళ ళీ చర్యలపై ఉత్తర కొరియా ఎలా స్పందిస్తుందో చూడాలి. -
ఇంద్ర-2017 : చైనా ఉలికి పాటు
న్యూఢిల్లీ : భారత్ - రష్యాలు శనివారం నుంచి పది రోజుల పాటు రష్యాలోని వ్లాడివోస్టాక్ నగరంలో ‘ఇంద్ర -2017’ పేరుతో సైనిక విన్యాసాలను నిర్వహించనున్నాయి. ఈ సైనిక విన్యాసాల్లో భారత ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ విభాగాలకు చెందిన 400 మంది సిబ్బంది పాల్గొంటారని తెలుస్తోంది. ఇప్పటికే భారత్‌కు చెందిప ఐఎన్ఎస్ సాత్పూరా, ఐఎన్ఎస్ కాడ్మట్ యుద్ధ నౌకలు వ్లాడివోస్టాక్ నగరాన్ని చేరుకున్నాయి. రష్యానుంచి 1000 మంది భద్రతా సిబ్బంది విన్యాసాల్లో పాల్గొననున్నారు. విన్యాసాల్లో భాగంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సిబ్బంది.. రష్యా జెట్ విమానాలను ఉపయోగించే అవకాశమున్నట్లు తెలుస్తొంది. ఇదిలా ఉండగా.. భారత్ - రష్యా సైనిక సంబంధాలను చైనా ఆసక్తిగా గమనిస్తోంది. రష్యా-భారత్ మధ్య దూరం పెరిగిందనుకుంటున్న పరిస్థితుల్లో.. సంయుక్త సైనిక విన్యాసాలపై చైనా అయోమయంలో పడింది. కొంతకాలంగా జపాన్, అమెరికాలకు భారత్ దగ్గరవుతోంది. ఈ నేపథ్యంలో మళ్లీ భారత్‌తో పాత సంబంధాలను పునరుద్దరించుకోవడంలో భాగంగా రష్యా సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహిస్తోందన్న అనుమానాలను చైనా మీడియా వ్యక్తం చేస్తోంది. భారత్‌కూడా రక్షణ వ్యవహరాల్లో రష్యా కీలక భాగస్వామ అనే సంకేతాన్ని చైనాకు పంపేందుకే వ్యూహాత్మకంగా సైనిక విన్యాసాల్లో పాల్గొంటోందని చైనా మీడియా వ్యాఖ్యానిస్తోంది. -
బటన్ నొక్కితే అమెరికా, కొరియా బూడిదైపోతాయి
ప్యోంగ్ యాంగ్: 'ఒక్క బటన్.. ఒకే ఒక్క బటన్ నొక్కితే మీ రెండు దేశాలు నాశనమైపోతాయి. మమ్మల్ని రెచ్చగొడితే మీపై నిప్పులు కురిపిస్తాం. నిమిషాల్లో మీ నేలను బూడిదగా మార్చేస్తాం. పాతాళంలోకి నెట్టేస్తాం' అంటూ అమెరికా, దక్షిణ కొరియాలను తీవ్రంగా హెచ్చరించింది ఉత్తర కొరియా. తమ దేశంపై యుద్ధానికి తెగబడితే అమెరికా గడ్డపైనేకాక ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోనూ బీభత్సం తప్పదని కొరిన్స్ పీపుల్స్ ఆర్మీ(కేపీఏ) అధికారికంగా వెల్లడించింది. తమ దేశ సరిహద్దుల్లో అమెరికా, దక్షిణ కొరియా సైన్యాలు సంయుక్తంగా సోమవారం నుంచి చేపట్టనున్న సైనిక కవాతు నేపథ్యంలో ఉత్తర కొరియా చేసిన హెచ్చరికల నడుమ తూర్పు ఆసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏక్షణమైనా యుద్ధం ప్రారంభించేందుకు సిద్ధంగా ఉండాలంటూ నార్త్ కొరియా నియంత నేత కింగ్ జాంగ్ ఉన్.. తమ అధికారిక వార్తా సంస్థ కేసీఎన్ఏ ద్వారా దేశ సైన్యానికి పిలుపునిచ్చారు. అమెరికా, సౌత్ కొరియాలు చేపట్టిన సైనిక కవాతును 'పిల్లగుర్రం- రాక్షసగద్ద'ల దుశ్చర్యగా అభివర్ణించిన నార్త్ కొరియా.. ఒకవేళ వారు కవ్వింపు చర్యలకు దిగితే మరుక్షణమే అణుబాంబు దాడులు జరుపుతామంది. ఆ మేరకు ఇప్పటికే సరిహద్దుల్లో అవసరమైన సరంజామా సిద్ధం చేసుకుంది. ఏటా నిర్వహించే సైనిక కవాతు సందర్భంగా ఇలాంటి హెచ్చరికలు సాధారణమే అయినా కొద్ది రోజుల కిందటే నార్త్ కొరియా అణు, హైడ్రోజన్ బాంబుల్ని పరీక్షించడం, మునుపెన్నడూ లేని విధంగా ఈ సారి సౌత్ కొరియా, అమెరికాకు చెందిన బలగాలు భారీ ఎత్తున కవాతులో పాల్గొంటుండటం గమనార్హం. కవాతులో సౌత్ కు చెందిన 3 లక్షల బలగాలు, అమెరికాకు చెందిన 15 వేల మంది సైనికులు పాల్గొంటున్నారు. ఇప్పటికే అంతర్జాతీయంగా పలు ఆంక్షలను ఎదుర్కొంటున్న నార్త్ పై ఆదివారం మరికొన్ని షరతులు విధిస్తున్నట్లు ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. నార్త్ కొరియా రాకెట్ ప్రయోగాన్ని తప్పుపడుతూ ఐరాస తాజా ఆంక్షలు విధించింది. కాగా, నార్త్ పై ఐరాస ఆంక్షలను చైనా, రష్యాలు వ్యతిరేకించాయి. నార్త్ కొరియా సరిహద్దుల్లో సౌత్ కొరియా, అమెరికా సైన్యాల కవాతు(ఫైల్ ఫొటో)