మిరాకిల్‌.. యుద్ధ ట్యాంక్‌ కింద నలిగినా ప్రాణాలతో బయటపడి.. | Russian Tank Runs Over Own Soldier Video Gone Viral | Sakshi
Sakshi News home page

వండర్.. యుద్ధ ట్యాంక్ తొక్కుకుంటూ వెళ్లినా ప్రాణాలతో బయటపడ్డ సైనికుడు

Published Fri, Oct 14 2022 8:11 PM | Last Updated on Fri, Oct 14 2022 9:19 PM

Russian Tank Runs Over Own Soldier Video Gone Viral - Sakshi

మాస్కో: సైన్యం మిలిటరీ డ్రైవ్ నిర్వహిస్తున్న సమయంలో ఓ యుద్ధ ట్యాంకర్ సైనికుడి పైనుంచి దూసుకెళ్లింది. 13 టన్నుల బరువున్న వాహనం తనపై నుంచి వెళ్లినా అతను ప్రాణాలతో బయటపడ్డాడు. చక్రాల కింద నలిగినా మరణాన్ని జయించాడు. ఇంతా జరిగినా యథావిధిగా మళ్లీ లేచి తన స్థానంలో నిల్చున్నాడు. రష్యా సైన్యం మిలిటరీ డ్రైవ్ సమయంలో ఈ ఘటన జరిగింది.  ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

అయితే రష్యా సైన్యం తీరుపై కొందరు నెటిజన్లు మండిపడ్డారు. ప్రపంచంలో శక్తిమైన సైన్యంగా చెప్పుకునే రష్యా ఆర్మీ.. సొంత సైనికుడి మీద నుంచే యుద్ధ ట్యాంకర్‌ను పోనివ్వడం వారి నైపుణ్యానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు.

మరికొందరు మాత్రం రష్యా సైనికుడు ప్రణాలతో బయటపడటం మిరాకిల్‌లా ఉందని అన్నారు. అతను అదృష్ట జాతకుడని, అందుకే ఇంకా ఆయుషు మిగిలి ఉందని పేర్కొన్నారు.
చదవండి: షాకింగ్‌ ఘటన.. రూ.690 కోట్ల పెయింటింగ్‌పై..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement