న్యూఢిల్లీ : భారత్ - రష్యాలు శనివారం నుంచి పది రోజుల పాటు రష్యాలోని వ్లాడివోస్టాక్ నగరంలో ‘ఇంద్ర -2017’ పేరుతో సైనిక విన్యాసాలను నిర్వహించనున్నాయి. ఈ సైనిక విన్యాసాల్లో భారత ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ విభాగాలకు చెందిన 400 మంది సిబ్బంది పాల్గొంటారని తెలుస్తోంది. ఇప్పటికే భారత్‌కు చెందిప ఐఎన్‌ఎస్ సాత్పూరా, ఐఎన్‌ఎస్ కాడ్‌మట్ యుద్ధ నౌకలు వ్లాడివోస్టాక్ నగరాన్ని చేరుకున్నాయి. రష్యానుంచి 1000 మంది భద్రతా సిబ్బంది విన్యాసాల్లో పాల్గొననున్నారు. విన్యాసాల్లో భాగంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సిబ్బంది.. రష్యా జెట్ విమానాలను ఉపయోగించే అవకాశమున్నట్లు తెలుస్తొంది.
ఇదిలా ఉండగా.. భారత్ - రష్యా సైనిక సంబంధాలను చైనా ఆసక్తిగా గమనిస్తోంది. రష్యా-భారత్ మధ్య దూరం పెరిగిందనుకుంటున్న పరిస్థితుల్లో.. సంయుక్త సైనిక విన్యాసాలపై చైనా అయోమయంలో పడింది. కొంతకాలంగా జపాన్, అమెరికాలకు భారత్ దగ్గరవుతోంది. ఈ నేపథ్యంలో మళ్లీ భారత్‌తో పాత సంబంధాలను పునరుద్దరించుకోవడంలో భాగంగా రష్యా సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహిస్తోందన్న అనుమానాలను చైనా మీడియా వ్యక్తం చేస్తోంది. భారత్‌కూడా రక్షణ వ్యవహరాల్లో రష్యా కీలక భాగస్వామ అనే సంకేతాన్ని చైనాకు పంపేందుకే వ్యూహాత్మకంగా సైనిక విన్యాసాల్లో పాల్గొంటోందని చైనా మీడియా వ్యాఖ్యానిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment