natural beauty
-
అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం చీర కట్టులో మెరిసిన సాయిపల్లవి
-
సామాజిక కళకు సై అంటున్నారు...
‘నా కాళ్లకు ప్రయాణ దాహం పట్టుకుంది’ అంటున్నారు యువ ఆర్టిస్ట్‌లు. ఆ ప్రయాణ అనుభవాలు వారి కళకు బలాన్ని ఇస్తున్నాయి. సమాజంతో కలిసి పనిచేయడానికి అవసరమైన స్ఫూర్తిని ఇస్తున్నాయి. పబ్లిక్ ఆర్ట్‌గా ప్రాచుర్యం ΄పొందిన ‘మ్యూరల్ ఆర్ట్’ ద్వారా మానసిక ఆరోగ్యం నుంచి మహిళాశక్తి వరకు ఎన్నో విషయాలను ప్రచారం చేస్తున్నారు. కార్టూన్లతో నవ్వించడమే కాదు ఆరోగ్య సమస్యల గురించి ఆలోచించేలా చేస్తున్నారు. కళకు సామాజిక ప్రయోజనాన్ని జోడించిన వారి క్రియేటివ్ జర్నీ గురించి....ముంబైకి చెందిన మేఘకు మ్యూరల్ ఆర్ట్ అంటే ఎంత ఇష్టమో ప్రయాణాలు అంటే కూడా అంతే ఇష్టం. ఆ ప్రయాణాలలో ప్రకృతి అందాలను ఆస్వాదించడం అంటే ఇష్టం.ఆమె దృష్టిలో ప్రకృతి అనేది విశాలమైన కాన్వాస్. అస్సాంలోని పచ్చటి కొండల నుంచి జమ్మూ కశ్మీర్‌లోని తెల్లటి మంచుల కొండల వరకు నదుల జలకళ నుంచి ఎడారుల ఇసుక మెరుపుల వరకు ఎన్నో ప్రాంతాల అందాలను ఆస్వాదించింది.తన కళకు ఇన్స్పిరేషన్ తాను వెళ్లిన ప్రాంతాలే. ‘ప్రయాణం అంటే ప్రతి రోజు ఒక కొత్త ఎనర్జీతో నిద్ర లేచే ఉత్సాహం. ఆ ఉత్సాహ శక్తి మన కళలో ప్రతి ఫలిస్తుంది’ అంటుంది మేఘ.మానసిక ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన కలిగించడానికి తన మ్యూరల్ ఆర్ట్‌ను సాధనంగా వాడుకుంటుంది స్నేహ చక్రవర్తి. ‘మైండ్ అండ్ మ్యాటర్’ చారిటబుల్ ట్రస్టుతో కలిసి ‘ది ట్రావెల్ అండ్ పెయింట్: ఇండియా టూర్’ చేసింది. ఆల్ ఇండియా ఆర్ట్ టూర్లో ఎన్నో కొత్త విషయాలు తెలుసుకుంది. అట్టడుగు వర్గాల పిల్లలతో సంభాషించి వారితో స్నేహం చేసే అవకాశం వచ్చింది.‘కళ’ అనేది మానసిక ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుందో విస్తృతంగా ప్రచారం చేస్తోంది స్నేహ చక్రవర్తి.తిరువనంతపురానికి చెందిన అమితకు చిన్నప్పటి నుంచి చిత్రకళ అంటే ఇష్టం. ప్రయాణాలు అంటే మరీ ఇష్టం. ‘మొదట్లో ప్రముఖ చిత్రకారుల ఆర్ట్‌వర్క్స్‌ను అనుసరిస్తూ ఆనందించేదాన్ని. అయితే అసలైన ఆనందం నాకు వివిధ ప్రాంతాలకు వెళ్లినప్పుడు అక్కడి ప్రజలతో మాట్లాడినప్పుడు దొరికింది. ఒక ప్రాంతానికి తనదైన అందాలు ఉన్నట్లే సమస్యలు కూడా ఉంటాయి. ఆ సమస్యలను నా కళ ద్వారా ప్రతిబింబించాలనుకుంటు న్నాను’ అంటుంది అమిత.చిత్రకళకు సంబంధించి నిర్దిష్టమైన శైలికి పరిమితం కావడం అంటే అమితకు ఇష్టం లేదు. ఐడియాల విషయంలో ఔట్ ఆఫ్ బాక్స్ ఆలోచించడం ఆమెకు ఇష్టం. ‘యూనిక్ ఎక్స్ప్రెషన్’ను అమితంగా ఇష్టపడుతుంది.మేఘ, స్నేహ, అమితలుæమాత్రమే కాదు దేశవ్యాప్తంగా ఎంతోమంది యువ కళాకారులు తమవైన కళారూపాలతో సమాజంతో కలిసి నడుస్తున్నారు. సామాజిక కళకు సై అంటున్నారు.జస్ట్ లోకల్...చెన్నైకి చెందిన పదహారుమంది యువ ఆర్టిస్ట్‌లు ఐశ్వర్య మణివణ్ణన్ మార్గదర్శకత్వంలో ‘లోకల్’ థీమ్‌తో వందకుపైగా కళారూపాలు ఆవిష్కరించారు. టెక్నాలజీపై అతిగా ఆధారపడడం వల్ల కోల్పోతున్నది ఏమిటో తెలియజేస్తాయి ఈ చిత్రాలు. సామాజిక మాధ్యమాల ద్వారా ఎక్కడో జరిగే సంఘటనల గురించి తెలుసుకునే మనం, సమీపంలోని వాటి గురించి మాత్రం తెలుసుకోలేము. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడో విషయాల గురించి అన ర్గళంగా చెప్పగలిగే వాళ్లలో చాలామందికి లోకల్ విషయాలలో అంతంత మాత్రమే అవగాహన ఉంటుంది. ‘తమ స్థానికతతో కళాకారులు మమేకం కావడానికి లోకల్ అనే థీమ్ ఉపయోగపడుతుంది’ అంటుంది ఐశ్వర్య. చెన్నైలోని వైబ్రెంట్ స్ట్రీట్ లైఫ్... అందులోని సాంస్కృతిక వైవిధ్యం అంటే ఐశ్వర్యకు ఇష్టం. తన స్టూడెంట్స్‌తో కలిసి నార్త్ చెన్నైలోని కాశిమేడుకు వెళ్లింది. గంభీరమైన సముద్రాన్ని చూసిన తరువాత స్టూడెంట్స్‌కు కొత్తప్రపంచంలోకి వచ్చినట్లు అనిపించింది. ఎంతోమంది జాలరులతో మాట్లాడారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది వారి ట్రాన్స్ఫర్మేటివ్ జర్నీ. అక్కడి దృశ్యాలు స్టూడెంట్స్ ముందున్న కాన్వాస్‌లోకి నడిచొచ్చాయి. సహజత్వాన్ని ప్రతిబింబించాయి.ఈజ్ దట్ యూ? ‘టాలెంటెడ్ ఇలస్ట్రేటర్’గా చిన్న వయసులోనే పెద్ద పేరు తెచ్చుకుంది ముంబైకి చెందిన ప్రణిత కొచ్రేకర్. దైనందిన జీవిత దృశ్యాల నుంచి మానసిక ఒత్తిడి, ఆందోళన వరకు ఎన్నో అంశాలు ఆమె చిత్రాలకు థీమ్‌గా ఉంటాయి. ఊహల్లో నుంచి కాకుండా సొంత అనుభవాల్లో నుంచి చిత్రాలు వేయడం అంటే ప్రణితకు ఇష్టం.‘కళకు సామాజిక ప్రయోజం ఉంది. అది శక్తిమంతమైన మాధ్యమం’ అంటున్న ప్రణిత తన కళ ద్వారా మానసిక ఆరోగ్యంపై అవగాహన తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది. వివిధ సామాజిక మాధ్యమాలను తన కళకు వేదికగా ఉపయోగించుకుంటోంది.యాంగ్జయిటీ డిజార్డర్లపై ‘ఇజ్ దట్ యూ?’ టైటిల్‌తో వేసిన డ్రాయింగ్ సిరీస్‌కు మంచి స్పందన వచ్చింది. తన బొమ్మల ద్వారా నవ్వించడంతోపాటు ఆలోచించేలా చేయడం ప్రణిత ప్రత్యేకత.‘డా.ఇంటర్నెట్’ పేరుతో యాంగ్జయిటీని తగ్గించుకోవడానికి ఏంచేస్తే బాగుంటుందో చిత్రం చివర సలహా కూడా ఇస్తుంది ప్రణిత. -
అరకు అందాలకు ‘అమెరికా’ ఫిదా
మహారాణిపేట(విశాఖ దక్షిణ): తూర్పు కనుమల్లో అమెరికా రాయబార ప్రతినిధులు ఎరిక్ గార్సెట్టి తదితరులు ఆదివారం పర్యటించారు. విశాఖలోని కైలాసగిరి, ఆర్కే బీచ్‌తోపాటు అరకు పరిసరాల్లోని పచ్చదనం, ప్రకృతి ఒడిలో అక్కడి ప్రజల జీవన విధానం చూసి ముగ్ధులైయ్యారు. విశాఖ నుంచి అరకు వెళ్లే మార్గంలో చిలకల గెడ్డ వద్ద ప్రకృతి అందాలతో పాటు పచ్చదనం లోయల్లో నీటి ప్రవాహాన్ని చూసి పరవశించిపోయారు. విశాఖ పరిసరాలు పర్యావరణానికి దగ్గరగా ఆరోగ్యకరమైన జీవనానికి చేరువగా ఉన్నట్టు యూఎస్ కాన్సులేట్ ప్రతినిధులు పేర్కొన్నారు. కాగా, భారత్–అమెరికా సైనిక సంబంధాలు, సంయుక్త విన్యాసాల ప్రదర్శనలో భాగంగా ఈ నెల 18వ తేదీ నుంచి విశాఖ తీరంలో త్రివిధ దళాల సంయుక్త కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా భారత్ స్వయం సమృద్ధిగా రూపొందించిన ఐఎన్ఎస్ జలస్వ నౌకతోపాటు అమెరికాకు చెందిన యుద్ధ నౌకలపై త్రివిధ దళ సిబ్బంది విన్యాసాలు ప్రదర్శించారు. దీనిలో భాగంగా ఇప్పటికే విశాఖ చేరుకున్న బాహుబలి నౌక యూఎస్ కాన్సులేట్ భారత–అమెరికా సైనిక సిబ్బంది వివిధ అంశాలపై అవగాహన పొందారు. ప్రపంచంలోనే అతిపెద్ద యుద్ధనౌకగా గుర్తింపు పొందిన సోమర్ సెట్లో 25 యుద్ధ ట్యాంకులు, నాలుగు హెలికాప్టర్లు, అన్నివైపులా ఆయుధ ట్యాంకులు, 1000 మంది సిబ్బంది ఈ నౌకలో ఉండడం విశేషం. 2001 సెప్టెంబర్‌లో వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై ఉగ్ర దాడుల స్మారకంగా నిరి్మంచిన ఈ యుద్ధనౌకను విపత్తుల సమయంలో రక్షణ దళాలకు ఆస్పత్రిగా సేవలు అందిస్తుంది. టైగర్ ట్రయాంప్ పేరిట ఈ నెల 31వ తేదీ వరకు సముద్రంపై విన్యాసాలు కూడా రెండు దేశాల త్రివిధ దళాలు చేయనున్నాయి. -
ఈ తల్లులు ప్రకృతే మురిసేలా ..పిల్లల పెళ్లి ఘనంగా చేశారు
ఆకాశం దిగివచ్చి మబ్బులతో వేయాలి మన పందిరి... ఊరంతా చెప్పుకునేలా జరగాలి పెళ్లంటే మరి!’ అంట అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి నేటితరం పెళ్లిళ్లు. ఏమాత్రం పర్యావరణ స్పృహలేకుండా హంగు, ఆర్భాటాలు చేస్త తెగ గొప్పలు చెప్పేసుకుంటున్నారు. దీనివల్ల ప్రకృతమ్మ ఎంత తల్లడిల్లిపోతుందో కూడా పట్టడం లేదు. ఒకతల్లి మనసు మరో తల్లికే తెలుస్తుందేవె! అందుకే బెంగళూరుకు చెందిన ఇద్దరమ్మలు కలిసి తమ పిల్లల పెళ్లిని ప్లాస్టిక్ వ్యర్థాలు లేకుండా ఎంతో ఘనంగా, ప్రకృతి మురిసేలా జరిపించి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. బెంగుళూరుకు చెందిన అనుపమ కువరుడికి, చారులత కూతురుతో వివాహం నిశ్చయమైంది. రెండు కుటుంబాలకు అన్ని విషయాల్లో సఖ్యత కుదిరింది. కానీ ‘పెళ్లిలో ప్లాస్టిక్‌ను అస్సలు వాడకడదు’ అని అనుపమ కండిషన్ పెట్టింది. ఇది చారులతకు నచ్చడంతో మరింత సంతోషంతో ఒప్పుకుని ‘‘ఇద్దరం కలిసి ప్లాస్టిక్ రహిత పెళ్లి చేద్దాం వదినా!’’ అని ఒక నిర్ణయానికి వచ్చారు. తమ పిల్లల పెళ్లిని మూడురోజులపాటు అంగరంగా వైభవంగా ప్లాస్టిక్ లేకుండా జరిపేందుకు నామమాత్రపు పెళ్లిపత్రికలను కొట్టించారు. కొంతమందికి మాత్రమే ఆహ్వాన పత్రికలు ఇచ్చి, మిగతా వారిని నేరుగా పెళ్లికి పిలిచారు. పెళ్లికి పిలిచేటప్పుడే.. ‘‘ఎవరూ బొకేలు, బహుమతులు వంటివి తీసుకు రావద్దు’’ అని మనవి చేశారు. అరిటాకులు.. స్టీల్ ప్లేట్లు... వచ్చిన వెయ్యిమంది అతిథులకు వడ్డించేందుకు అరటి ఆకులు, స్టీల్ ప్లేట్స్‌ను ఎంచుకున్నారు. ప్లాస్టిక్ కప్పులు, గ్లాసులు, ప్లేట్లు, వాటర్ బాటిల్స్ స్థానంలో స్టీల్ సామాన్లు వాడారు. తాజా పువ్వులు, లైట్లతో పెళ్లిమండపాన్ని అలంకరించారు. పంతొమ్మిదేళ్లనాటి పేపర్‌తో... అనుపమ కొడుకుకు 2004లో ఉపనయనం జరిగిన సందర్భంగా జరిపిన వేడుకలో బటర్పేపర్ను వాడారు. అప్పుడు మిగిలిన పేపర్ తో పెళ్లికి వచ్చిన అతిథులకు రిటన్ గిఫ్ట్స్ ఇచ్చారు. సహజసిద్ధ పద్ధతుల్లో రంగులద్దిన జాకెట్ ముక్కలు, కాగితం పొట్లాల్లో పసుపు, కుంకుమను పేరంటాళ్లకు పంచారు. స్టీల్ ప్లేటులు, గ్లాసులతో పెళ్లిలో డెకరేషన్ల కోసం వాడిన తాజా పువ్వులను వేడుక ముగిసిన తరువాత ముంబైలోని సహజ రంగుల తయారీ స్టూడియోకి పంపించారు. వెయ్యికేజీల వేస్ట్ నుంచి ... ప్లాస్టిక్ వాడకపోయినప్పటికీ, కొన్ని సహజసిద్ధ వ్యర్థాలు ఉత్పన్నమవుతాయి కాబట్టి వాటికోసం క్యాటరింగ్ సిబ్బంది తడి, పొడి చెత్తను విడివిడిగా డ్రమ్స్లో వేసేవాళ్లు. ఈ వ్యర్థాలను కోకోపీట్ నింపిన డ్రమ్స్లో వేసేది. కాగితాలను, పువ్వులను కలెక్షన్ సెంటర్‌కు పంపించారు. డ్రమ్‌లలో వేసిన వెయ్యికేజీల వ్యర్థాల నుంచి మూడు వందల కేజీల సేంద్రియ ఎరువును తయారు చేశారు. ‘‘పెళ్లిలో ప్లాస్టిక్ వాడకుండా చేయడం మాకు చాలెంజింగ్‌గా అనిపించినప్పటికీ ఇద్దరం కలిసి విజయవంతం చేశాం. మా అమ్మ, అమ్మమ్మల కాలంలో పెళ్లిళ్లకు ఇలానే స్టీల్ సామాన్లు వాడేవారు. మేము అలాగే మా పిల్లల పెళ్లి చేయాలనుకున్నాం. అందుకు అందర సహకరించడం సంతోషం’’ అని అనుపమ, చారులతలు చెప్పకొచ్చారు. (చదవండి: గూగుల్ మ్యాప్‌లో వినిపించే వాయిస్.. ఏ మహిళదో తెలుసా?) -
68 ప్రాంతాల్లో పర్యాటక ప్రాజెక్టులు
సాక్షి, విశాఖపట్నం: ప్రకృతి అందాలతో అలరారే రాష్ట్రంలోని ప్రతి ప్రాంతంలో పర్యాటకరంగం కొత్తపుంతలు తొక్కేలా సరికొత్త ఆలోచనలతో పర్యాటకశాఖ ముందుకెళ్తోంది. పెట్టుబడుల రాకకు ప్రధాన అవరోధాలుగా ఉన్న నియమ నిబంధనలు మార్చి కొత్తదారుల్ని అన్వేషించింది. రాష్ట్రవ్యాప్తంగా 68 ప్రాంతాల్లో వాటర్ స్పోర్ట్స్, ట్రెక్కింగ్, అడ్వెంచర్ స్పోర్ట్స్ ప్రాజెక్టులకు ప్రాధాన్యమిచ్చేందుకు నిబంధనల్ని మరింత సరళతరం చేసింది. కొత్తగా రాబోతున్న ప్రాజెక్టులకు కనిష్టంగా రూ.20 లక్షల నుంచి గరిష్టంగా రూ.70 లక్షల వరకు మాత్రమే పెట్టుబడులుగా నిర్దేశించింది. వాటర్ స్పోర్ట్స్‌లో బిడ్ వేయాలంటే ఐదేళ్ల అనుభవం ఉండాలనే నిబంధన ఉంది. దీన్ని ఏడాదికి తగ్గించింది. ఒకవేళ ఆసక్తి ఉండి అనుభవం లేని ఎవరైనా పాల్గొనాలని భావిస్తే కన్సోటియం తీసుకున్నా సరిపోతుంది. టూరిజం ప్రాజెక్టులకు బిడ్ ఫీజును రూ.లక్ష నుంచి రూ.10 వేలకు తగ్గించింది. దీంతోపాటు టెండర్లలో కనీస ఆదాయం వాటా వాటర్ స్పోర్ట్స్‌కు 15 శాతం, అడ్వెంచర్ స్పోర్ట్స్‌కు 25 శాతం, ట్రెక్కింగ్‌కు 10 శాతంగా నిర్ణయించింది. ఇందులో ఎవరు ఎక్కువగా టెండర్లలో కోట్‌చేస్తే వారికి అవకాశం కల్పించేలా నిబంధనల్ని మార్చింది. ఈ నేపథ్యంలో సోమవారం విజయవాడలో ప్రీ బిడ్డింగ్ సమావేశం నిర్వహిస్తోంది. టూరిజం ఎండీ కన్నబాబు ఆధ్వర్యంలో పర్యాటకశాఖ కార్యాలయంలో జరిగే ఈ సమావేశంలో కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. -
మంచుతెరలు.. సూర్యోదయం అందాలు అదుర్స్.. ఎక్కడంటే!
సాక్షి, అరకు(అల్లూరి సీతారామరాజు జిల్లా): ప్రముఖ పర్యాటక కేంద్రం అరకు – అనంతగిరి ఘాట్‌మార్గంలో గాలికొండ వ్యూపాయింట్ వద్ద ప్రకృతి అందాలు మంత్ర ముగ్ధులను చేస్తున్నాయి. గురువారం ఉదయం తరలివచ్చిన పర్యాటకుల సెల్ఫోన్ల వీటిని బంధించారు. మలుపుల వద్ద మంచు అందాలను తిలకించి పులకించిపోయారు. వంజంగి హిల్స్‌లో మంచుతెరలు పాడేరు : మేఘాలు, మంచు అందాల నిలయంగా విశ్వవ్యాప్తి పొందిన పాడేరు మండలం వంజంగి హిల్స్‌లో గురువారం ప్రకృతి కనువిందు చేసింది. అనేక ప్రాంతాలకు చెందిన పర్యాటకులు బుధవారం రాత్రే వంజంగి హిల్స్‌కు చేరుకుని కల్లాలబయలు, బోనంగమ్మ పర్వతంపై గుడారాలు వేసుకుని బస చేసారు. తెల్లవారుజాము 4.30 గంటల సమయంలో సూర్యోదయం అందాలు పర్యాటకులను అబ్బురపరిచాయి. కొండల నిండా మంచు నెలకొనడంతో ఇక్కడ ప్రకృతి రమ్యతను చూసి పర్యాటకులంతా మంత్రముగ్ధులయ్యారు. ఉదయం పది గంటల వరకు మంచుతెరలు ఆకట్టుకున్నాయి. (క్లిక్: అందమైన పెళ్లికి ఆదివాసీలే పేరంటాలు) -
Beauty Tips: ఎటువంటి మేకప్ లేకుండానే.. మెరిసిపోండిలా!
ఎటువంటి మేకప్ లేకుండా జీవన శైలిలో కొద్దిపాటి మార్పులు చేసుకోవడం ద్వారా మేని మెరుపుని సహజసిద్ధంగా కూడా పొందవచ్చు. చాలా మంది సెలబ్రిటీలు సైతం అనుసరిస్తోన్న ఈ మార్పులేంటో చూద్దాం.... రోజూ ఏడు నుంచి ఎనిమిది గ్లాసుల మంచినీరు తప్పనిసరిగా తాగాలి. నీరు తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ బయటికి వెళ్లిపోతాయి. ఫలితంగా చర్మం కాంతిని సంతరించుకుంటుంది. ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు ఐస్‌క్యూబ్‌తో ముఖానికి మర్దనా చేయాలి. ఇలా చేయడం వల్ల ఉబ్బినట్లుగా ఉన్న చర్మం సాధారణ స్థితికి చేరుకుంటుంది. మంట, దద్దుర్లు వంటివి ఉంటే తొలగి పోతాయి. ఐస్ చర్మాన్ని బిగుతుగా చేస్తుంది. అలసట, ఒత్తిడి కళ్లమీద ప్రభావం చూపుతాయి. అందువల్ల పడుకునేముందు కళ్లకింది భాగంలో అలోవెరా జెల్ లేదా కొబ్బరి నూనె, ఏదైనా ఐ క్రీమ్‌ను రాసి మర్దన చేయాలి. పడుకునే ముందు ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవడం వల్ల రోజు మొత్తంలో ముఖం మీద పేరుకుపోయిన దుమ్మూధూళీ వదిలి చర్మం మృదువుగా యవ్వనంగా కనిపిస్తుంది. చదవండి: Ragi Java Health Benefits: రాగిజావను పాలు, బెల్లం, యాలకుల పొడితో కలిపి కాచుకుని తాగే అలవాటు ఉందా.. అయితే -
గంధం పొడి, రోజ్ వాటర్, నిమ్మరసం.. నేచురల్ బ్లీచ్ తయారీ ఇలా!
Natural Face Bleaching Home Remedies: ముఖ చర్మాన్ని లోతుగా శుభ్రపరిచి, ముఖవర్చస్సుని మరింతగా మెరిపించడంలో ఫేషియల్ బ్లీచ్ బాగా పనిచేస్తుంది. కానీ రసాయనాలతో తయారైన బ్లీచ్ల వల్ల కొన్నిరకాల అలెర్జీలు, దద్దుర్లు వంటివి వచ్చి ముఖం పాడైపోతుంటుంది. ఇలాంటి సమస్యలేవి ఎదురుకాకుండా ఇంట్లోనే సులభంగా బ్లీచ్‌ను తయారు చేసుకోవచ్చు. అదెలాగో చూద్దాం... ►టీస్పూను పసుపు, టీస్పూను రోజ్ వాటర్, అర టీస్పూను నిమ్మరసం, పావు టీస్పూను గంధం పొడి ఒక గిన్నెలో తీసుకుని కలపాలి. ►ఈ మిశ్రమాన్ని పదినిమిషాలు నానబెట్టుకోవాలి. ►ముఖాన్ని శుభ్రంగా కడిగి తడిలేకుండా తుడుచుకోవాలి. నానబెట్టిన మిశ్రమాన్ని బ్రష్ తో ముఖానికి అప్లై చేసి పదినిమిషాలపాటు ఆరనివ్వాలి. ►పది నిమిషాల తరువాత టొమాటో లేదా నిమ్మ చెక్కతో ముఖాన్ని గుండ్రంగా ఏడు నిమిషాలపాటు మర్దన చేసి చల్లని నీటితో కడిగేయాలి. ►తడిలేకుండా తుడిచి, ముఖానికి అలొవెరా జెల్‌ను అప్లై చేయాలి. పదిహేనురోజులకొకసారి ఇలా చేయడం వల్ల ముఖం మెరుపుని సంతరించుకుంటుంది. చదవండి: ‘రక్తపిశాచ’ జబ్బు.. దీని గురించి మీకు తెలుసా! -
Spectacular Video: హంసనావ
నిశ్చలంగా ఉన్న కొలను, అందులో చంద్రుడి ప్రతిబింబం, చుట్టూ పొగమంచు.. తెరలు తెరలుగా కమ్ముకు వస్తున్న చీకటి. ఆ చీకటిని చీల్చుకుంటూ వస్తున్న తెల్లని హంస... వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్స్ తీసిన ఈ వీడియోకి ఫిదా అవుతున్నారు నెటిజన్లు. 🦢 This is a spectacular shot. Wait for it. #wildlife #NaturePhotography #wildlifephotography via/follow @buitengebieden_ pic.twitter.com/1p04vTaWS4 — Alexander Verbeek 🌍 (@Alex_Verbeek) May 30, 2021 -
కళావిహీనంగా భైరవకోన..
సాక్షి, ప్రకాశం : అది ప్రకాశం జిల్లాలోనే అత్యంత ప్రాచీన పుణ్యక్షేత్రం... అందమైన ఎత్తయిన జలపాతం ప్రకృతి అందాలతో భక్తులనే కాక పర్యాటకులను సైతం విశేషంగా ఆకర్షించే దివ్య శైవ క్షేత్రం. గత రెండు రోజులుగా అక్కడ కురుస్తున్న భారీ వర్షానికి ఆ ప్రాంతం మొత్తం దెబ్బతిని కళావిహీనంగా మారడం భక్తులను తీవ్ర ఆవేదనకు గురిచేస్తుంది. అదే ప్రకాశం జిల్లా సిఎస్ పురం మండలంలోని చారిత్రిక శైవ క్షేత్రం భైరవకోన త్రిముఖ దుర్గాంబ దేవి ఆలయం. ఎత్తయిన కొండలు.. జలజలా జాలువారే జలపాతం.. ఒకే రాతి పై చెక్కిన వివిధ శైవ ఆలయాలు... మంత్రముగ్ధుల్ని చేసే ప్రకృతి సౌందర్యం భక్తులను, పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంటాయి. నిత్యం భక్తులతో కళకళలాడే ఈ ప్రాంతం గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు భారీగా దెబ్బతింది. భైరవకోనకు చేరుకునే ఆర్ అండ్ బి రహదారులు ధ్వంసమై రాకపోకలకు వీలు లేకుండా పోయింది. ప్రాచీన గుడికి దగ్గర్లోని కళావేదిక అన్నదాన సత్రం, అతిథి గృహం దెబ్బతిన్నాయి. భైరవకోన ఆలయం చుట్టూ ఉండే కొండ ప్రాంతం నుండి కొండ చరియలు విరిగిపడటంతో భారీగా రాళ్లు కొట్టుకు వచ్చి ఆలయం చుట్టుపక్కల ప్రాంతాలను కప్పివేయడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. ప్రకృతి సోయగాలతో పర్యాటకులను మైమరిపిస్తున్న బైరవకోన క్షేత్రం ఇలా కళావిహీనంగా మారడం భక్తులను తీవ్రంగా కలచివేస్తోంది. అధికారులు తక్షణం స్పందించి దెబ్బతిన్న రహదారులను యుద్ధ ప్రాతి పదికన పునర్ నిర్మించేలా చర్యలు తీసుకోవాలని అక్కడికి వచ్యే భక్తులు, పర్యాటకులు కోరుతున్నారు. దీంతో పాటు అక్కడ ఉన్న రాళ్ల గుట్టలను తొలగించి రాకపోకలను పునరుద్ధరించాలన్నారు. అలాగే దెబ్బతిన్నకళా భవనం, అన్నదాన సత్రం, అతిథి గృహలను వెంటనే నిర్మాణం చేపట్టాలని పేర్కొన్నారు. -
లక్నవరం అందాలు మరువలేను
టూరిజం ప్రిన్సిపల్ సెక్రటరీ అనితా రాజేంద్రన్ గోవిందరావుపేట : ప్రకృతి అందాలతో కళకళలాడుతున్న లక్నవరం సరస్సు అందాలను మరువలేను.. విదేశాలకు వెళ్లిన అనుభూతి కలిగిందని రాష్ట్ర హోంశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ, టూరిజం శాఖ ఇన్చార్జి ప్రిన్సిపల్ సెక్రటరీ అనితా రాజేం ద్రన్ అన్నారు. ఆదివారం మండలంలోని లక్నవ రం సరస్సును ఆమె సందర్శించారు. హరితహా రం కార్యక్రమంలో భాగంగా ఉదయం ఉడెన్ కాటేజీలు ఉన్న దీవిలో మొక్క నాటారు. శనివార మే ఇక్కడికి వచ్చిన ఆమె బుగద జలపాతం, మేడారం, రామప్ప పర్యాటక ప్రాంతాలను చుట్టివచ్చి సాయంత్రానికి లక్నవరం చేరుకున్నారు. సరస్సు వద్ద జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఏజెన్సీ ప్రాంతం లో తాము పొందిన హాలిడే అనుభూతులను ఎప్పటికీ మరిచిపోలేనని చెప్పారు. అనంతరం తిరిగి హైదరాబాద్‌కు వెళ్లిపోయారు. ఆమె వెంట తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ జిల్లా మేనేజర్ నాథన్, లక్నవరం ఇన్చార్జి రఘుపతి, సిబ్బంది ఉన్నారు. -
శ్రీన'హీ'గరం!
టూర్‌దర్శన్ - సమ్మర్ స్పెషల్ కశ్మీర్ అంటే కల్లోలాలు కాదు. ప్రకృతి అందాలకు నెలవు. కశ్మీర్ అంటే అశాంతి కాదు. ఆనందాల కొలువు. కశ్మీర్ అంటే తుపాకీ మోతలు, ఆర్తుల హాహాకారాలు కాదు. సరదాల సందళ్లు. సంతోషపు కేరింతలు. సరిహద్దు తగాదాలతో అలజడితో ఉంటుందని కశ్మీర్‌కి పేరుంది. కానీ ఆ పేరును శ్రీనగర్ మార్చేసింది. వివాదాల వేడి సంగతి ఎంతా ఉన్నా... వేసవి వేడి మాత్రం శ్రీనగర్‌లో అడ్రస్ లేకుండా పోతుంది. మే నెలలో సైతం చల్లగాలులతో ఆహ్లాదాన్ని పంచుతుంది. నా పేరు శ్రీనగరం, నా దగ్గరుంటే నహీ గరం అంటుంది. మనోల్లాసాన్ని హద్దులు దాటిస్తాను రమ్మంటూ ఆహ్వానం పలుకుతుంది. అందమైన అనుభూతులను పంచిస్తానంటూ పిలుస్తుంది. మన దేశంలోని బెస్ట్ సమ్మర్ టూరిస్ట్ స్పాట్స్‌లో ఒకటైన శ్రీనగర్ పరిచయం... ఈవారం మీకోసం! ఏం చూడాలి? శ్రీనగర్‌కు వెళ్లిన ప్రతి ఒక్కరూ తప్పక చూడాల్సిన టూరిస్టు స్పాట్... దాల్ లేక్. ఈ సరస్సు 22 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. ఈ సరస్సు ఫిష్షింగ్, వాటర్ ప్లాంట్ హార్వెస్టింట్ లాంటి వాటి ద్వారా శ్రీనగర్ ఆర్థికా భివృద్ధికి ఎంతో తోడ్పడుతోంది. ఇక్కడి ప్రధాన ఆకర్షణ ‘షికారాలు’. అంటే గూటి పడవలు. అందంగా అలంకరించిన ఈ పడవల్లో ప్రయా ణించడానికి పర్యాటకులు ఉవ్విళ్లూరుతుంటారు. చలికాలంలో ఈ సరస్సు పూర్తిగా గడ్డ కట్టేస్తుంది. అందుకే దీన్ని చూడాలంటే ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలోనే వెళ్లాలి. భారతదేశంలో ఉన్న ఏకైక ఫ్లోటింగ్ మార్కెట్ శ్రీనగర్‌లోనే ఉంది. కూరగాయలు, పండ్లు, పూలు అన్నిటినీ పడవల్లోకెక్కించి, దాల్ సరస్సు నీటిపై తేలియాడుతూ అమ్ముతుం టారు. ఈ పూలు, కూరగాయలు, పండ్లు అన్నీ దాల్ లేక్ పరిసర ప్రాంతాల్లో సాగు చేసినవే. రోజూ ఉదయం 5 నుంచి 7 గంటల వరకు ఈ మార్కెట్ ఉంటుంది. పడవలో ప్రయాణిస్తూ అన్నీ కొనుక్కోవడం భలే ఉంటుంది కదూ! శ్రీనగర్‌లో ఎన్ని గార్డెన్స్ ఉన్నాయో లెక్క లేదు. 17వ శతాబ్దంలో కట్టిన షాలిమార్ బాగ్... శ్రీనగర్‌లో ఉన్న మూడు మొఘల్ గార్డెన్స్లోనూ పెద్దది. మే నుంచి అక్టోబర్ నెలల మధ్య ప్రతి రోజూ సాయంత్రం ఇక్కడ లైట్ అండ్ సౌండ్ షో జరుగుతుంది. శుక్రవారం సెలవు. నిషాత్ గార్డెన్ కూడా ఫేమస్. ఈ రెండూ పర్షియన్ పద్ధతిలో నిర్మితమయ్యాయి. శరదృతువు (ఆకులు రాలే కాలం)లో ఈ మొఘల్ గార్డెన్స్ రాలిపడిన ఎరుపు-బంగారం రంగు ఆకులతో కొత్త అందాన్ని సంతరించుకుంటాయి. ఇక మొక్కలపై ఆసక్తి ఉన్నవాళ్లెవరైనా జవహర్లాల్ నెహ్రూ మెమోరియల్ బొటానికల్ గార్డెన్‌ను చూడాల్సిందే. ఇక్కడ లేని మొక్క ఉండదు. 80 హెక్టార్ల విస్తీర్ణంలో ఉండే ఈ గార్డెన్లో... 17 హెక్టార్ల మేర ఓ అందమైన సరస్సు ఉంటుంది. అలాగే నసీం బాగ్. ఇది ప్రశాంతతకు మారు పేరు. 1586లో అక్బర్ చక్రవర్తి దీన్ని నిర్మించా రట. ఇక్కడి ప్రకృతి అందాన్ని చూడటానికి, అలసిన మనసును శాంతపర్చుకోడానికి సందర్శకులు ఇక్కడికి వస్తుంటారు. ఆధ్యాత్మిక భావాలు అధికంగా ఉన్న వారికి శ్రీనగర్ ఎంతో నచ్చుతుంది. అక్కడ ఉన్న గుళ్లు, మసీదులు చూస్తే మనసులో భక్తి అలలై ఎగసిపడుతుంది. కశ్మీర్ మధ్య భాగంలో విస్తరించి ఉన్న జబర్వాన్ పర్వతాన్ని శంకరా చార్య హిల్ అంటారు. పూర్వం దీనికి ఎన్నో పేర్లుండేవి. అయితే వెయ్యేళ్ల కిందట ఆది శంకరాచార్యుడు ఇక్కడికి వచ్చి, కొన్ని రోజులు ఉన్నాడట. అందుకే ఆ కొండకు ఆయన పేరును పెట్టారు. ఈ కొండపై 11వ శతాబ్దంలో నిర్మించిన శివుడి గుడి ఉంది. ఆ గుడి ఆవరణ లోకి సెల్ఫోన్లను, కెమెరాలను అనుమతించరు. అలాగే క్రీ.శ 1400లో నిర్మించిన జామియా మసీదు. ఇందులో 370 చెక్క స్తంభాలున్నాయి. ఒకేసారి 33,333 మంది నమాజ్ చేసుకునేం దుకు వీలుంది ఈ మసీదులో. ఇక ఖీర్ భవానీ టెంపుల్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇది శ్రీనగర్ దగ్గర్లోని తుల్లా ముల్లా గ్రామంలో ఉంటుంది. ఇక్కడ కొలువై ఉన్న దేవతని దుర్గా దేవి అవతారంగా చెబుతుంటారు. నైవేద్యంగా ఖీర్ (పాయసం) పెడుతుంటారు. అందుకే ఆ ఆలయానికి ఖీర్ భవానీ టెంపుల్‌గా పేరొచ్చింది. ఈ ఆలయంలో శుక్ల పక్ష అష్టమి నాడు వేలమంది భక్తులు చేరి యాగాలు, హోమాలు చేస్తుంటారు. శ్రీనగర్ శివార్లలో ఉంది సోనామార్గ్. అంటే అర్థం ‘మెడోస్ ఆఫ్ గోల్డ్’ అని. దీని చుట్టూ ఉండే కొండలపై ట్రెక్కింగ్ జరుగుతూ ఉంటుంది. పచ్చదనానికి, ఆల్పైన్ పూలకు ఇది ప్రసిద్ధి. ఈ ప్రదేశం సముద్ర మట్టానికి 2,740 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ మార్గ్ చుట్టుపక్కల చాలా సరస్సులు ఉంటాయి. సరదా ఉన్నవారు ఫిషింగ్ చేయవచ్చు. శ్రీనగర్‌లోని సింథన్ టాప్ గురించి చాలామందికి తెలియదు. ఇది శ్రీనగర్ శివార్లలో ఉంటుంది. ఇక్కడ ప్రకృతి అందాలను తిలకించ డానికి రెండు కళ్లూ చాలవు. సముద్ర మట్టానికి 12 వేల అడుగుల ఎత్తులో ఉండటంతో, ఆ ప్రదేశం చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది. మంచుతో పర్వతం మొత్తం కప్ప బడి ఉండటం వల్ల మరింత అందంగా ఉంటుంది. ఇక్కడి అందాలను ఆస్వాదించా లంటే ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య కాలమే సరైన సమయం. చలికాలం వస్తే మంచు విపరీతంగా కురుస్తుంది కాబట్టి పర్యాటకులను అనుమతించరు. యాపిల్ కొనుక్కు తినడమే తెలిసిన మనకు యాపిల్ పండ్ల తోటల్లో తిరుగాడుతూ, వాటిని స్వయంగా కోసుకుని తినే అవకాశం వస్తే ఎలా ఉంటుంది? ఆ అవకాశాన్ని ఎవరైనా జారవిడుచుకుంటారా? అందుకే శ్రీనగర్‌లోని యాపిల్ తోటలు ఎప్పుడూ సందర్శకులతో కిటకిటలాడుతూనే ఉంటాయి. పండ్లను కోయడం మీద ఎటువంటి ఆంక్షలూ లేకపోవ డంతో అక్కడి పనివాళ్లతో పాటు సందర్శకులు కూడా కాయలను తెంపి మురిసిపోతుంటారు. సినిమా పాటల్లో టులిప్ తోటల్ని చూసినప్పుడు... ఇలాంటి ప్రదేశానికి మనమూ వెళ్తే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది కదా! అయితే దానికోసం విదేశాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీనగర్ వెళ్తే చాలు. ‘ఇందిరాగాంధీ మెమోరియల్ టులిప్ గార్డెన్స్’ ఆసియాలోనే అతి పెద్ద టులిప్ గార్డెన్. ఇక్కడ మనం ఒకేసారి 20 లక్షల పూలను చూడొచ్చు. యేటా మార్చి, ఏప్రిల్ నెలల్లో ‘టులిప్ ఫెస్టివల్’ కూడా జరుగుతుంది. ఏం తినాలి? శ్రీనగర్‌లో వాజ్వాన్ తిని తీరాలి. వాజ్వాన్ అంటే వంటకం పేరు కాదు. 36 రకాల వంటకాలతో కూడిన మీల్స్. ఇది తింటే కశ్మీర్ ఫుడ్ మొత్తాన్నీ రుచి చూసినట్టే లెక్క. అలాగే ‘తుజ్జీ’ చాలా ఫేమస్. అంటే మటన్ బాల్స్‌ని ఐరన్ రాడ్ మీద పెట్టి కాల్చి చేసే వంటకం. దీన్ని స్థానికంగా దొరికే బ్రెడ్, చట్నీతో సర్వ్ చేస్తారు. ఖావా అనే స్పెషల్ గ్రీన్ టీ రుచి నాలుకను వదలదు. నూన్ చాయ్ అని పిలిచే సాల్టీ టీ అయితే ఇక్కడ తప్ప ఎక్కడా దొరకదు. పాలు, గ్రీన్ టీ, ఉప్పు, సోడా బైకార్బనేట్ కలిపి చేసే ఈ టీ గులాబి రంగులో ఉంటుంది. ఒక్కసారి దీన్ని రుచి చూస్తే జీవితంలో మర్చిపోలేం అంటారు దాన్ని టేస్ట్ చూసినవాళ్లు! ఏం కొనాలి? శ్రీనగర్‌లో షాపింగ్ చేయాలంటే షాపులకి వెళ్లడం కంటే... స్ట్రీట్ మార్కెట్స్‌కి వెళ్లడం మంచిది. ఎందుకంటే ఆ మార్కెట్లలో షాపుల్లో కంటే విభిన్నమైన, వైవిధ్యమైన వస్తువులు దొరుకుతాయి. పైగా వెల కూడా అందుబాటులో ఉంటుంది. అన్నిటికంటే ముందు కొనాల్సింది... శాలువాలు, కార్పెట్లు. అక్కడ దొరికేంత అందమైన శాలువాలు, అద్భుతంగా రూపొందించిన కార్పెట్లు మన దేశంలో మరెక్కడా దొరకవు. లాల్ చౌక్, బాద్షా చౌక్ ప్రాంతాల్లో ఉన్న షాపుల్లో కని, పష్మినా శాలువాలు తప్పక కొనాల్సిందే. అలాగే పోలో వ్యూ మార్కెట్లో యాంటిక్ సిల్వర్ జ్యూయెలరీ, వూడెన్ జ్యూయెలరీ బాగా దొరుకుతుంది. ఫ్లవర్‌వాజ్‌లు, ఆర్టిఫీషియల్ పువ్వులు కూడా బాగుంటాయి. కశ్మీర్ గవర్నమెంట్ ఆర్ట్స్ ఎంపోరియంలో బ్యాగులు, టేబుల్ ల్యాంప్స్ లాంటివి అతి తక్కువ ధరకు దొరకుతాయి. ఇక రెసిడెన్సీ రోడ్లో అడుగుపెడితే డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసుల వాసన గుప్పుమంటుంది. ఆపైన అవి కొనకుండా రావడం మనవల్ల కాదు. ఎలా వెళ్లాలి? హైదరాబాద్ నుంచి శ్రీ నగర్ డొమెస్టిక్ ఎయిర్ పోర్ట్‌కి నేరుగా ఫ్లయిట్స్ ఉన్నాయి. గంటన్నర నుంచి రెండు గంటల్లో వెళ్లిపో వచ్చు. బస్సులో వెళ్తే ఇరవై గంటల పైనే పడుతుంది. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి రైళ్లు ఉన్నాయి. వాటిలో వెళ్లినా బానే ఉంటుంది. అక్కడికెళ్లాక ఉండటానికి బోలెడు హోటళ్లున్నాయి. మన బడ్జెట్‌ను బట్టి ఎంచుకోవచ్చు. ఏం చేయాలి? ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్లినప్పుడు అక్కడి వింతలు, విశేషాలను చూసి రావడం అందరూ చేస్తారు. కానీ ఏదైనా కొత్తగా చేయడంలోనే ఉంటుంది మజా. శ్రీనగర్ వెళ్తే అలాంటి కొత్త అడ్వెంచర్స్ చాలా చేయవచ్చు. వాటిలో ముఖ్యమైనది పారా గ్లైడింగ్. తేలికైన గ్లైడర్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను వీపునకు కట్టుకుని, గాల్లో ఎగురుతూ కశ్మీర్ అందాలను చూస్తుంటే మనసు కూడా విహంగమై ఎగిరిపోతుంది. ఎయిర్ బెలూన్స్లో కూర్చుని ఎగురుతూ సిటీని చూసే అవకాశం కూడా ఉంది. పర్వత సానువులపై ట్రెక్కింగ్ చేస్తూ, వాటి ఎత్తుల్ని కొలిచే అనుభూతిని మిస్సవ్వడానికి లేదు. అలాగే రివర్ ర్యాఫ్టింగ్ కూడా. నదీ అలలపై తేలియాడుతూ, చల్లగా వీచే గాలిని ఆస్వాదిస్తుంటే మనసు మరో లోకంలోకి వెళ్లిపోవడం ఖాయం. -
టూరు.. బోరే
మారేడుమిల్లి : కనువిందు చేసే ప్రకృతి అందాలు, మైమరిపించే వాతావరణం, అహ్లాదపరిచే సెలయేళ్లు ఇలా ప్రకృతి రమణీయతకు మారేడుమిల్లి పేరు. ఇక్కడికి ఏటా అధిక సంఖ్యలో పర్యాటకులు పెద్ద ఎత్తున వస్తుంటారు. దీంతో కమ్యూనిటీ బేస్డ్ ఏకో-టూరిజంలో భాగంగా అటవీశాఖ అధికారులు పలు ప్రాంతాలను అందంగా తీర్చిదిద్దారు. అయితే ప్రసుత్తం ఇవి అధ్వానంగా, కళావిహీనంగా తయారయ్యాయి. కళావిహీనంగా నందనవనం పార్కు స్థానిక కాఫీ తోటల సమీపం వద్ద పర్యాటకుల కోసం పార్కు నిర్మించారు. నందనవనం అని పేరు పెట్టారు. ఇక్కడికి వచ్చే పర్యాటకుల నుంచి రూ.పది టికెట్ రూపంలో వసూలు చేసేవారు. దీంతో టూరిజం అధికారులకు అదాయం బాగా ఉండేది. రానురాను ఈ పార్కు నిర్వహణపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో కళావిహీనంగా మారింది అధ్వాన స్థితిలో పుష్పంజలి రెస్టారెంట్ పర్యాటకుల సౌకర్యార్థం వారికి మంచి టిఫిన్, భోజన వసతులు కల్పించాలనే ఉద్దేశంతో స్థానిక హెచ్‌ఎంటీసీ ఫారం సమీపంలో పుష్పాంజలి రెస్టారెంట్‌ను అధికారులు 2004లో నిర్మించారు కొన్నేళ్లు బాగానే నిర్వహించినా ప్రస్తుతం అది నిరుపయోగంగా మారింది. ఈ భవనం అసాంఘిక కార్యకలాపాలకు నిలయమైంది. తుప్పల మధ్య గుడారాలు పర్యాటకులకు సేద తీరడానికి గ్రామానికి సమీపంలో అటవీ ప్రాంతంలో నిర్మించిన హట్స్ (చిన్న చిన్న గుడారాలు) తుప్పలు, మొక్కలతో అధ్వానంగా మారాయి. వాటిలోకి వెళ్లడానికి పర్యాటకులు ఇష్టపడడంలేదు. అలాగే అమృతధార జలపాత ం, జంగిల్ స్టార్ క్యాంపు ప్రదేశాలకు వెళ్లే రహదారులు ప్రస్తుతం చాలా అధ్వానస్థితిలో ఉన్నాయి, అక్కడికి నడిచి వెళ్లడానికి పర్యాటకులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయాలని పర్యాటకులు, స్థానిక గిరిజనులు కోరుతున్నారు. -
సిమ్లాలో ఆకట్టుకుంటున్న వాతావరణం
-
శీతాకాలంలో కాశ్మీరయానం
జాన్‌బాబు కొయ్యే ప్రకృతి అందాలకు చక్కని చిరునామా కాశ్మీరు. పర్వతాలు, లోయలు, సెలయేరుల సవ్వడులు, విశాల సరస్సులు, పచ్చని మైదానాలు, సహజవనాలు, ఎత్తై దేవదారు వృక్షాలు, గొర్రెల మందలు... ఇవన్నీ పర్యాటకులను పరవసింపజేస్తాయి. వీక్షకులకు కనువిందు చేస్తాయి. ప్రపంచంలో తప్పక సందర్శించవలసిన స్థలాల్లో కాశ్మీరు ఒకటి. పీర్‌పంజాల్ పర్వత పంక్తి నుండి గ్రేటర్ హిమాలయాల మధ్యలో ఏర్పడిన విశాలమైన లోయ ప్రాంతమే కాశ్మీరు. సముద్రమట్టం నుండి సుమారు 5-6 వేల మీటర్ల ఎత్తులో, అధిక తేమ కలిగి ఉండుట వల్ల వేసవిలో చల్లగా, శీతాకాలంలో మరింత చల్లగా మంచు కప్పబడి ఉంటుంది. కాశ్మీరు కేంద్ర విశ్వవిద్యాలయంలో జర్నలిజం విభాగంలో సహ ఆచార్యులుగా ఉద్యోగం చేస్తూ నాలుగు ఋతువులను చూశాను. చాలా ప్రాంతాలను స్వయంగా సందర్శించాను. ఎటు చూసినా కొత్త అనుభూతినిచ్చే ఈ ప్రాంతం పురాతన సంస్కృతి సాంప్రదాయాలు కలిగి ఉంటుంది. సంవత్సరాన్ని ప్రధానంగా వేసవి శీతాకాలాలు చెరోసగం పంచుకుంటాయి. వేసవిలో కాశ్మీరును సందర్శించడానికి పర్యాటకులు ఇష్టపడతారు కానీ శీతాకాలంలో హిమగిరులతో కనిపించే కాశ్మీరు అనుభూతులను పొందలేరు. అసలైన కాశ్మీరు అందాలను చూడాలనుకునేవారు నవంబర్ నుండి ఏప్రిల్ వరకు కొనసాగే శీతాకాలంలో సందర్శించక తప్పదు. కాశ్మీరు అందాలను చిత్రీకరించిన రోజా, హైదర్ సినిమాల్లో చివరి ఘట్టాలు ఇక్కడి శీతాకాల అందాలకు నిలువుటద్దాలు. కాశ్మీరులో కాలుష్యం ఇతర ప్రాంతాలతో పోలిస్తే కాస్త తక్కువే. కారణం ఇక్కడ పంటలు తప్ప పరిశ్రమలు లేవు. అక్టోబర్ నెలలో కాశ్మీరు ఆపిల్, నవంబర్‌లో కాశ్మీరు కుంకుమ పంట మొదలువుతాయి. ప్రపంచంలో ఉత్తమ శ్రేణి కుంకుమ ఇరాన్, స్పెయిన్ కాశ్మీరు నుండి లభిస్తున్నాయి. స్థానిక స్త్రీ, పురుషులు వేరుగా ప్రత్యేకంగా తయారు చేసిన ఉలెన్ నిలువుటంగీ ‘ఫెరన్’ ధరిస్తారు. ఇది కాశ్మీర్ సంప్రదాయానికి ప్రతీక. డిసెంబర్ 8న కాశ్మీరులో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని నరేంద్రమోడి కాశ్మీర్ శీతాకాల సంప్రదాయ దుస్తులైన ‘ఫెరన్’ ధరించి ప్రసంగించారు. ‘కాంగ్రీ’ అని పిలిచే నిప్పుల కుండను చిన్న బుట్టలో పెట్టి కూడా తీసుకెళతారు. వెచ్చదనాన్ని పొందుతారు. సందర్శనీయ స్థలాలు శ్రీనగర్‌లో ఎత్తై హరిపర్వతం, గోపాధారి (శంకరాచార్యుని కొండ) ఎక్కి చూస్తే నగరాన్ని డాల్ సరస్సును చూడవచ్చు. ఇక్కడ పురాతన దేవాలయాలు, మధ్య యుగం నాటి మసీదులు, కోట బురుజులు అలనాటి వైభవాన్ని జ్ఞాపకం చేస్తాయి. హజ్రత్బాల్ దర్గాలో మహ్మద్ ప్రవక్త యొక్క తల వెంట్రుక భద్రం చేయబడిందని ఇక్కడ ప్రజల నమ్మకం. కోర్ భవాణి దేవాలయం పురాతనమైన చారిత్రక పూజా స్థలం. కల్హణుడు తన గ్రంథం ‘రాజతరంగిణి’లో ఈ దేవాలయాన్ని గూర్చి ప్రస్తావించాడు. శ్రీనగర్ ప్రధాన కూడలిలో ఒక చర్చి కూడా ఉంది. ఇక షాలిమర్ గార్డెన్, నిషార్ గార్డెన్, పీర్మహల్ గార్డెన్లు రమణీయమైన సహజ వనాలు. పీర్మహల్ను దారాషికో తన సూఫీ గురువు కొరకు నిర్మించాడు. ప్రపంచ ఖ్యాతి పొందిన ‘డాల్ లేక్’లో తేలియాడే ఇళ్లు దర్శనమిస్తాయి. ఈ బోట్ హౌసుల్లో పర్యాటకులు బస చేయవచ్చు. కాస్త ఖరీదు ఎక్కువైనా వసతులు, రాచమర్యాదలు, కాశ్మీర్ వంటలు, చలిని తట్టుకోవడానికి తగిన వెచ్చని ఏర్పాట్లు చేయుట వల్ల మంచి అనుభూతిని పొందవచ్చు. ఇక సరస్సులో రొమాంటిక్ షికారా (బోట్ విహారం)కు వెళ్లి చిన్న చిన్న దోవులను చూసి రావచ్చు. తేలియాడే కూరగాయల బజారును సందర్శించవచ్చు. ఇది 8 కి.మీ. పొడవు, 4. కి.మీ. వెడల్పుతో సుమారు 26 చ.కి.మీ. విస్తీర్ణంలో ఉంది. చుట్టూ కొండలు ఒక పక్క మొగల్ గార్డెన్తో మధ్యలో ఫౌన్టెన్లతో పర్యాటకులకు ఆహ్లాదంగా ఉంటుంది. దీనికి దగ్గర్లో నిగోన్ లేక్, శ్రీనగర్‌కి కొంత దూరంలో ఊలార్లేక్, మానసబల్ లేక్‌లు చెప్పుకోదగ్గ సందర్శనా స్థలాలు. జీలమ్ నది కాశ్మీరుకు జీవనధార. అనంతనాగ్ జిల్లాలో ‘వెరినాగ్’ దగ్గర ఒకే నీటి ఊట నుండి జలధార ప్రవహించినందున దీనిని ‘జీలమ్’ అని అంటారు. కొంచెం దూరంలో కొక్రనాగ్ దగ్గర ఐదు పాయలుగా వీడి సహజమైన వనాన్ని సృష్టించి పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఈ చిన్న సెలయేరులు కోడి పాదం వలే వీడి ప్రవహించుట వల్ల కోక్రనాగ్ అని పిలుస్తారు. తేటగా కనిపించే స్వచ్ఛమైన జలధారల దగ్గర విద్యార్థులతో ఒక రోజంతా గడిపాను. శ్రీనగర్ నుండి ఉదయమే బయలుదేరి సాయంకాలానికి తిరిగి వచ్చేసే సందర్శనా స్థలాలు చాలా ఉన్నాయి. ఇలాంటి స్థలాల్లో గుల్మార్గ్ ముఖ్యమైనది. నగరానికి వంద కి.మీ. దూరంలో ఉన్న ఈ ప్రాంతం 30 కి.మీ.ఘాట్ రోడ్డు పైకి ఎక్కాలి. ఇది ఎత్తై ప్రాంతమే కాదు, దేవదారు వృక్షాలతో తెల్లని మంచుతో కప్పబడి ఉంటుంది. వాహనాలు పైకి ఎక్కడం ఒక సాహసోపేతమైన చర్యే. టంగ్మార్గ్ బిగించి జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. ఇక్కడ అద్దెకు చైన్లు బిగిస్తారు. మంచు బూట్లు చలి దుస్తులు కూడా అద్దెకు ఇస్తారు. శీతాకాలమంతా దట్టమైన మంచు ఆవరించి ఉంటుంది. గుల్మార్గ్ పైకి వెళ్లగానే విశాలమైన మంచు మైదానం ప్రత్యక్షమవుతుంది. ధృవ ప్రాంతాలలోకి వెళ్లిన అనుభూతి కలుగుతుంది. నడవలేనివారి కొరకు గుర్రాలతో గుజ్జార్లు, స్లెడ్జ్ బండ్లతో కుర్రాళ్లు వచ్చి సేవలందిస్తామంటారు. భాష లోపాలను అనువుగా తీసుకుని ఎక్కువ డబ్బులు కూడా గుంజుతారు. ఇక్కడ బస చేయుటకు హోటల్ నివాసాలు ఉంటాయి. మంచుపై స్కేటింగ్ (స్కీయింగ్) చేయుటకు శిక్షణా శిబిరాలున్నాయి. తగిన ఐడి కార్డు చూపిస్తే కావలసిన పరికరాలు అద్దెకు ఇస్తారు. మంచుపై స్కీయింగ్ చక్కని అనుభూతి కలుగుతుంది. ఇక్కడ నుండి మరింత ఎత్తై పర్వతాలపైకి వెళ్లడానికి ‘రోప్ వే’ ఉంది. రెండు దశలుగా పైకి వెళ్లాలి. పర్యాటక విభాగం వారు రక్షణాదళం సహాయంతో ఈ ‘రోప్ వే’ నిర్వహిస్తున్నారు. టిక్కెట్లు ఆన్లైన్లో కూడా లభిస్తాయి. ఇంకా సొనా మార్గ్, పెహుల్ గామ్, బేతాజ్ వేలీ, దోద్పత్రి పర్యాటకులను ఆకర్షించే స్థలాలు. సందర్శకులు కాశ్మీరులో ఎదుర్కొనే చిన్న సమస్య ఒకటుంది. రాష్ట్రంలోకి ప్రవేశించగానే వారి మొబైల్ ఫోన్లు, పోస్టు పెయిడ్ అయితేనే పని చేస్తాయి. కాశ్మీర్‌లోని పర్యాటక స్థలాలలో సందర్శకులు ఏమైనా ఇబ్బందులు పడినా లేక చిక్కుబడినా నిత్యం పహారా కాస్తున్న భాతర సైనికులు తక్షణమే ప్రత్యక్షమవుతారు. షాపింగ్ చేయడానికి... కాశ్మీర్లో షాపింగ్ చేయుటకు శ్రీనగర్‌లోని లాల్ చౌక్, రోగల్ చౌక్, అనువైన స్థలాలు. శీతాకాల దుస్తులు, శాలువాలు, కాశ్మీర్ క్రాఫ్ట్స్ ఆకర్షణీయంగా ఉంటాయి. ఢిల్లీలోని పాలికా బజార్, కరోల్ బాగ్ వలె ఇక్కడ వ్యపారస్థులు మోసం చేయరు. కానీ, పష్మీనా శాలువాలు రెండు నుండి డెబ్భై వేల వరకూ ఉంటాయి. ఎందుకంటే పష్ మీనా జాతి గొర్రెల నుండి తీసి నేసిన ఈ ఊలు మృదువుగా తేలికగా ఉంటుంది. ఆ నాణ్యత, ఖరీదు తెలియకుండా కొనాలని ప్రయత్నిస్తే నష్టపోయే ప్రమాదముంది. చేనేత కార్పెట్లు, మెరిసే రాగి, నగిషీ వెండి వస్తువులు ఆకర్షణీయంగా ఉంటాయి. దూర విదేశాలకు పర్యాటనకు వెళ్లేవారు ముందు మన కాశ్మీరులోని శీతాకాల అందాలను వీక్షించండి. -
అదిగదిగో అద్దాల మేడ
మన దగ్గరే ప్రాణహిత గలగలలు, ప్రకృతి అందాలు మూడు రాష్ట్రాల సరిహద్దులో మురిపిస్తున్న కట్టడంఇంగ్లండ్ నుంచి అద్దాలను తెప్పించారు. భవన నిర్మాణానికి అద్దాలను ఎక్కువగా వాడడంతో ‘అద్దాల మేడ’ అనే పేరు వచ్చింది. భవనాన్ని ముందు నుంచి చూస్తే తాబేలు ఆకారంలో ఉంటుంది. అట్టెం మదునయ్య చెన్నూరు, అదిలాబాద్ తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దులోని సిరొంచా పట్టణంలో ఉన్న అద్దాల మేడ రజాకార్లకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమంలో ప్రధాన భూమిక పోషించింది. ఆదిలాబాద్ జిల్లా కోటపల్లి మండలం సరిహద్దుకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాణహిత నది అవతలి ఒడ్డున సిరొంచాలోని అద్దాల మేడ నుంచే రజాకార్లకు వ్యతిరేకంగా భారతసైన్యం చర్యలు చేపట్టింది. ఇక్కడి నుంచే నిజాం సర్కార్‌పై సైనికులు ఉద్యమించారు.1906లో అప్పటి కలెక్టర్ గ్లాస్‌ఫోర్డ్ దీన్ని నిర్మించగా కలెక్టర్ బంగ్లాగా వినియోగించారు. అద్దాల మేడ నిర్మించి 108 ఏళ్లు... అద్దాల మేడ నిర్మించి ఈ ఏడాదికి 108 ఏళ్లు పూర్తయ్యాయి. మేడ ఇప్పటికీ చెక్కుచెదరక పోవడం విశేషంగా. ఈ మేడకు ఇంగ్లండ్ నుంచి అద్దాల తెప్పించారు. భవనానికి అద్దాలను ఎక్కువగా వాడడంతో ‘అద్దాల మేడ’ అనే పేరు వచ్చింది. భవనాన్ని ముందు నుంచి చూస్తే తాబేలు ఆకారంలో ఉంటుంది. లోపల అందమైన గదులు, వంటశాల, విశ్రాంతి గది, సమావేశ గదులు చూపరులను ఆకట్టుకుంటాయి. మూడంతస్తుల మేడ కావడంతో మొదటి అంతస్తులో కలెక్టర్ కార్యాలయం, రెండో అంతస్తులో కలెక్టర్ నివాసం, మూడో అంతస్తు ఎక్కితే 12 కిలో మీటర్ల మేరకు అన్ని గ్రామాలు కనిపిస్తాయి. భవనం లోపల నుంచి 10 కిలో మీటర్ల సొరంగం ఉండేదని, ఈ సొరంగం ప్రాణహిత ఒడ్డు వరకు ఉండేదని సైనికులకు ఈ మార్గం నుంచి ఆయుధాలు అందేవని చరిత్ర చెబుతుంది ప్రాణిహిత గలగలలు... అద్దాల మేడ ప్రాణహిత నది ఒడ్డున ఉంది. ఒకవైపు ప్రాణహిత గలగలలు, మరోవైపు పచ్చని చెట్లు పర్యాటకులకు కనువిందు చేస్తాయి. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. కోటపల్లి మండలంలోని అర్జున్ గుట్ట దగ్గర నుంచి పడవపై ప్రాణహిత దాటితే అద్దాల మేడ సాక్షాత్కరిస్తుంది. మూడు రాష్ట్రాల సరిహద్దులో ఉన్న ఈ భవనం పర్యాట ప్రేమికుల మనసు దోచుకుంటుంది. -
ప్రకృతి మెడలో పచ్చల హారం...
పాపి కొండలు అమాయకపు కొండరెడ్ల ఆచారాలు, గలగలా పారే గోదావరి తల్లి ఒడిలో లాంచీ ప్రయాణం, పచ్చని పండ్ల చెట్లు, ఆనందంగా ఆహ్వానించే గిరిజనులు, అలవోకగా గిరిజనుల చేతిలో తయారైన వెదురు వస్తువులు... ఇన్ని అందాల సమాహారమే పేరంటపల్లి, పాపికొండలు. ఈ ప్రదేశాన్ని ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు. ఈ అనుభూతులన్నీ కావాలనుకుంటే ఖమ్మం జిల్లాలోని వేలేరుపాడు మండలంలో ఉన్న ఈ ప్రాంతానికి వెళ్ళాల్సిందే. కూనవరం నుంచి లాంచీలో బయలుదేరితే గోదావరి శబరి సంగమం మొదలుకొని పురాతన రామగిరి, వాలి సుగ్రీవ గుట్టలు, పేరంటపల్లి, శివాలయం, పాపికొండలు, కొల్లూరు కాటేజీలను చూడవచ్చు. ప్రశాంతతకు నిలయం ఎన్నో ప్రకృతి అందాలకు పెట్టింది పేరు పేరంటపల్లి. ఇక్కడ 36 కొండ రెడ్ల కుటుంబాలున్నాయి. వీరంతా వెదురు వస్తువుల తయారీతో తమ జీవనాన్ని సాగిస్తున్నారు. ఇక్కడ పనస, జీడిమామిడి తోటలతో పాటు దట్టమైన చెట్లతో నిండిన పచ్చని కొండల నడుమ ప్రశాంతతకు నిలయమైన రామకృష్ణ మునివాటిక ఉంది. నిష్టా నియమాలతో గ్రామంలోని కొండ రెడ్ల మహిళలే ఆశ్రమ బాధ్యతలు నిర్వహిస్తారు. ఎలాంటి కానుకలూ స్వీకరించరు. ఇక్కడ నిశ్శబ్దాన్ని పాటించాలి. జలపాతం గలగలలు ఈ ఆశ్రమానికి దగ్గర్లోనే పారే జలపాతం పర్యాటకులను ఆహ్లాదపరుస్తోంది. ఎక్కడో కొండల్లో నుంచి జాలువారే ఈ జలపాతం మండు వేసవిలో సైతం మంచును తలపిస్తుంది. ఈ నీటిలో పర్యాటకులు స్నానమాచరించి ఆలయంలో పూజలు నిర్వహిస్తారు. రమణీయ గంధం పాపికొండల అందం గోదావరి తల్లి సుడులు తిరుగుతూ... గిరుల నడుమ గలగలా పరుగులు తీసే ప్రదేశమే పాపికొండలు. ఇక్కడ గోదావరి వెడల్పు తక్కువగా ఉంటుంది. మైదాన ప్రాంతంతో మూడు కిలో మీటర్ల మేర వెడల్పుతో విస్తరించి ఉన్న గోదావరి, ఇక్కడ 200 మీటర్ల వెడల్పులోనే ఒదిగిపోతుంది. ఇక్కడ ఎప్పుడూ నీళ్ళు సుడులు తిరుగుతుంటాయి. ఈ ప్రాంతంలో గోదావరికి దారి చూపుతున్నట్లు ఉండే రెండు కొండలనే పాపికొండలుగా పిలుస్తారు. లాంచీ శబ్దం తప్ప మరే శబ్దం ఇక్కడ విన్పించదు. ఈ కొండలను చూస్తే మనసు పరవశించిపోతుంది. సినీ దృశ్యాలు పుష్కలం సినిమాల చిత్రీకరణకు పనికొచ్చే సుందర దృశ్యాలు యాత్రలో పుష్కలంగా కన్పిస్తాయి. ఈ ప్రాంతంలోనే అనేక సినిమాల షూటింగ్‌లు జరిగాయి. అనాటి ‘అందాలరాముడు’, నేటి ‘గోదావరి’, ‘ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’.., ఇంకా అనేక సినిమాలలో ఈ సుందర ప్రకృతి సౌందర్యాలను కెమరాలో బంధిం చారు. సినిమాల్లో చూపించే లాంచీ ప్రయాణాలు ఇక్కడ చిత్రీకరించినవే. అనేక టీవీ సీరియల్స్ చిత్రీకరణ కూడా ఈ ప్రాంతంలో జరుగుతుంటుంది. ఎలా చేరుకోవచ్చంటే... కూనవరానికి 17 కిలో మీటర్ల దూరంలో ఉన్న పోచవరం నుంచి లాంచీపై వెళితే రెండు గంటల్లో పేరంటపల్లి చేరుకోవచ్చు. ఖమ్మంజిల్లా టూరిజం శాఖ ఆధ్వర్యంలో కృష్ణదేవర, కనిష్క, అక్బర్ అనే పేర్లు ఉన్న మూడు లాంచీలు పాపికొండల వరకు తిరుగుతున్నాయి. ఖమ్మంలో విహారి టూర్స్ ద్వారా కూడా టికెట్ బుకింగ్‌లను టూరిజం శాఖ నిర్వహిస్తోంది. పెద్దలకు రూ.250, పిల్లలకు రూ.150 చొప్పున చెల్లిస్తే పాపికొండల వరకు తీసుకెళ్ళి మరలా భద్రాచలంలో దించుతారు. భోజనంతో పాటు టిఫిన్ కూడా లాంచీలోనే పెడతారు. ఖమ్మంలో టికెట్లు బుక్ చేయాలంటే 9492101066, 9440281518, సెల్ ఫోన్ నెంబర్లను సంప్రదించాలి. భద్రాచలంలో అయితే 9553089342 నెంబర్‌కు సంప్రదించాలి. ప్రతీ వారం టూరిజం శాఖ ప్యాకేజ్ టూర్లు కూడా నిర్వహిస్తోంది. అదే విధంగా వేలేరుపాడు మండలంలోని కొయిదా నుంచి కూడా పడవలు నడుస్తున్నాయి. కొయిదా నుంచి అయితే 45 నిమిషాల్లో పేరంటపల్లి వెళ్ళవచ్చు. వేలేరుపాడు మండలం మీదుగా అయితే సమయం ఆదా అవుతుంది. ఇక్కడి నుంచి కూడా ప్రైవేట్ పడవలు నడుస్తున్నాయి. రాజమండ్రి నుంచి అయితే ఇలా.. తూర్పుగోదావరిజిల్లా రాజమండ్రి నుంచి పాపికొండలకు చేరుకోవాలంటే అక్కడి నుంచి కూడా టూరిజం లాంచీలు, లగ్జరీ బోట్లు తిరుగుతున్నాయి. రాజమండి నుంచి పట్ట్టిసీమ, పోచమ్మగండి మీదుగా పేరంటపల్లి పాపికొండలకు చేరుకోవాలంటే రానూ పోనూ 13 గంటల సమయం పడుతుంది. రాజమండ్రి, పురుషోత్తమ పట్టణం, పట్టిసీమ నుంచి ఏపీ టూరిజం ప్రైవేట్ ఏసీ బోట్లను నడుపుతోంది. ఈ బోట్లలో రానూ పోనూ ప్రయాణానికి ఒక్కొక్కరూ రూ.650 వరకు చెల్లించాలి. ఉదయం 7 గంటలకు రాజమండ్రిలో బయలుదేరితే రాత్రి 9 గంటలకు తిరిగి చేరుస్తారు. ఇక్కడి నుండి 15 ప్రైవేట్ లాంచీలు కూడా తిరుగుతున్నాయి. రాజమండ్రిలో విహారయాత్రనిర్వాహకుల వద్ద టిక్కెట్లు బుక్ చేయాలంటే 9866148177, 9866146177 నెంబర్లను సంప్రదించాలి. పర్యాటకులకు భోజన వసతితో పాటు ఒక రోజు ఉండాలంటే గెస్ట్‌హౌస్ సౌకర్యం కూడా కొల్లూరులో కల్పిస్తారు. - ఎం.ఏ సమీర్ సాక్షి ప్రతినిధి, వేలేరుపాడు ఖమ్మం జిల్లా విశ్రాంతికి వెదురు గుడిసెలు కొల్లూరులో వెదురు బొంగులతో తయారు చేసిన గడ్డి గుడిసెల్లో హాయిగా విశ్రాంతి పొందవచ్చు. వెదురుతో నిర్మించే ఈ హట్స్ పర్యాటకులకు గెస్ట్‌హౌస్‌లుగా మారాయి. వీటిలో ఒక రోజు ఉండాలంటే భోజనం, వసతి సౌకర్యం కూడా కల్పిస్తారు. ఇక్కడ ఒక్కొక్కరికి రూ.600 చెల్లిస్తే అన్ని వసతులతో ఆతిథ్యం కల్పిస్తున్నారు. -
తిరుమల అందాలు