ప్రతీకాత్మక చిత్రం
ఎటువంటి మేకప్ లేకుండా జీవన శైలిలో కొద్దిపాటి మార్పులు చేసుకోవడం ద్వారా మేని మెరుపుని సహజసిద్ధంగా కూడా పొందవచ్చు. చాలా మంది సెలబ్రిటీలు సైతం అనుసరిస్తోన్న ఈ మార్పులేంటో చూద్దాం....
రోజూ ఏడు నుంచి ఎనిమిది గ్లాసుల మంచినీరు తప్పనిసరిగా తాగాలి. నీరు తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ బయటికి వెళ్లిపోతాయి. ఫలితంగా చర్మం కాంతిని సంతరించుకుంటుంది.
ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు ఐస్‌క్యూబ్‌తో ముఖానికి మర్దనా చేయాలి. ఇలా చేయడం వల్ల ఉబ్బినట్లుగా ఉన్న చర్మం సాధారణ స్థితికి చేరుకుంటుంది. మంట, దద్దుర్లు వంటివి ఉంటే తొలగి పోతాయి. ఐస్ చర్మాన్ని బిగుతుగా చేస్తుంది.
అలసట, ఒత్తిడి కళ్లమీద ప్రభావం చూపుతాయి. అందువల్ల పడుకునేముందు కళ్లకింది భాగంలో అలోవెరా జెల్ లేదా కొబ్బరి నూనె, ఏదైనా ఐ క్రీమ్‌ను రాసి మర్దన చేయాలి. పడుకునే ముందు ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవడం వల్ల రోజు మొత్తంలో ముఖం మీద పేరుకుపోయిన దుమ్మూధూళీ వదిలి చర్మం మృదువుగా యవ్వనంగా కనిపిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment