Ice Cubes
-
అరగంటలో ఐస్‌క్యూబ్స్.. ఎక్కడైనా & ఎప్పుడైనా!
ఐస్‌క్యూబ్స్ తయారు చేసుకోవాలంటే, డీప్ఫ్రీజర్లోని ట్రేలలో నీళ్లు నింపుకొని గంటల తరబడి వేచి చూడక తప్పదు. ఎక్కడకు వెళితే అక్కడ, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఐస్‌క్యూబ్స్ దొరకాలంటే కష్టమే! ఇళ్లలోని రిఫ్రిజరేటర్లను బయటకు తీసుకుపోలేం. ఇలాంటి ఇబ్బందులేవీ లేకుండా ఉండేందుకు అమెరికన్ కంపెనీ ‘ఫ్లెక్స్టెయిల్’ ఇటీవల పోర్టబుల్ ఐస్మేకర్ను ‘ఇవో ఐసర్’ పేరుతో మార్కెట్లోకి విడుదల చేసింది. ఇది రీచార్జబుల్ బ్యాటరీ సాయంతో పనిచేస్తుంది. దీనిని యూఎస్బీ పోర్ట్ ద్వారా చార్జింగ్ చేసుకోవచ్చు. దీని బరువు దాదాపు తొమ్మిదిన్నర కిలోలే! అంటే మిగిలిన పోర్టబుల్ రిఫ్రిజరేటర్ల కంటే చాలా తక్కువ. దీనిని ఒకసారి పూర్తిగా చార్జ్ చేసుకుంటే, మూడు గంటల వరకు పనిచేస్తుంది. ఇది కేవలం అరగంటలోనే ఐస్‌క్యూబ్స్ తయారు చేస్తుంది. దీని ధర 359 డాలర్లు (రూ.29,678) మాత్రమే! -
కుంకుమ పువ్వు, రోజ్ వాటర్‌తో ఐస్‌క్యూబ్స్.. పిగ్మెంటేషన్‌కు చెక్!
ఐస్‌క్యూబ్స్‌తో చర్మానికి సరికొత్త అందాన్ని తీసుకురావచ్చు. చర్మం, మెడ మీద ఉండే నొప్పులు తగ్గిపోతాయి. దీంతోపాటు నలుపు మచ్చలు, ముఖం మీద పేరుకున్న మట్టి తొలగిపోతాయి. రక్త ప్రసరణ మెరుగవటంతో పాటు చర్మంలోని నూనె శాతాన్ని తగ్గించే ఈ ఐస్ క్యూబ్స్ బ్యూటీ టిప్స్‌ను తెలుసుకుందాం. తులసి, అలొవెరా జెల్ ఒక బౌల్లో నీళ్లు తీసుకుని అందులో గుప్పెడు తులసి ఆకుల్ని నలిపి వేయాలి. ఆ తర్వాత రెండు స్పూన్ల అలొవెరా జెల్‌ను వేసి బాగా కలపాలి. ఆ నీటిని ఐస్‌క్యూబ్స్ ట్రేలో వేసి ఫ్రిజ్‌లో ఉంచాలి. ఈ ఐస్‌క్యూబ్స్‌తో చర్మాన్ని రుద్దితే ముఖ చర్మం తాజాగా మెరవడంతోపాటు వేడివల్ల వచ్చిన మచ్చలు తొలగి పోతాయి. స్పిన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఐస్‌క్యూబ్స్ ట్రేలో ఒక కప్పు రోజ్‌వాటర్‌తో పాటు కప్పు మంచి నీళ్లు కలపాలి. దీనిని ఫ్రీజర్‌లో ఉంచాలి. ఆ ఐస్‌క్యూబ్స్‌తో మెల్లగా చర్మంపై రుద్దితే ముడతలు తగ్గిపోతాయి. స్కిన్ ఇన్ఫెక్షన్స్ దరి చేరవు. దీంతోపాటు ముఖం ఫ్రెష్‌గా ఉన్నట్లు అనిపిస్తుంది. దోసకాయ ముక్కలతో ఒక బౌల్లో మెత్తగా దంచిన దోసకాయ ముక్కలను వేయాలి. దీనికి ఐదారు చుక్కల నిమ్మరసం కలపాలి. ఇందులో ఐస్‌క్యూబ్స్ వేసి కొన్ని గంటల పాటు ఫ్రిజ్‌లో ఉంచి.. తీసిన తర్వాత వీటితో ముఖంపై రబ్ చేయాలి. దీనివల్ల రక్తప్రసరణ సాఫీగా జరిగి నొప్పులు, మొటిమలు తగ్గిపోతాయి. కమిలినట్లుగా ఉన్న ముఖం తాజాగా మారుతుంది. కుంకుమ పువ్వు, రోజ్ వాటర్‌తో చర్మ సౌందర్యానికి కుంకుమ పువ్వుకి సాటి లేదు. కుంకుమ పువ్వును కొంచెం రోజ్ వాటర్‌లో కలపాలి. ఈ రెండిటినీ బాగా కలిపాక.. ఐస్ క్యూబ్స్ ట్రేలో వేసి క్యూబ్స్ తయారు చేసుకోవాలి. వాటితో ముఖం మీద సున్నితంగా మర్దన చేస్తే పిగ్మెంటేషన్ , నల్లటి మచ్చలు, మొటిమలు తగ్గిపోతాయి. ముఖ్యంగా స్కిన్‌టోన్ మారిపోతుంది. చదవండి: Beauty: కొబ్బరి పాలతో స్క్రబ్.. వేపాకులు వేసిన నీటితో స్నానం చేస్తే.. -
నిమిషాల్లోనే ఐస్‌క్యూబ్స్.. అంతేనా మరెన్నో ప్రత్యేకతలు ఈ ఫ్రిజ్ సొంతం!
ఫ్రిజ్‌లో ఐస్‌క్యూబ్స్ తయారు చేసుకోవాలంటే, కొన్ని గంటల ముందుగానే ట్రేలో నీరు నింపి, డీప్ ఫ్రీజర్‌లో పెట్టుకోవాల్సి ఉంటుంది. మామూలు రిఫ్రిజిరేటర్లలో ఐస్ తయారవడానికి ఆరు నుంచి పన్నెండు గంటల సమయం పడుతుంది. అయితే, ఈ ఫ్రిజ్‌లో ఐస్‌క్యూబ్స్ నిమిషాల్లోనే తయారవుతాయి. ఇళ్లల్లో వాడుకునే ఫ్రిజ్‌లను ఎక్కడికంటే అక్కడకు తీసుకుపోలేం. ఈ ఫ్రిజ్నైతే ఎక్కడికైనా ఈజీగా తీసుకుపోవచ్చు. ఇది పోర్టబుల్ ఫ్రిజ్. సాధారణ ఫ్రిజ్‌ల కంటే చాలా తేలిక కూడా. కాస్త పెద్ద సూట్‌కేసు సైజులో ఉండే ఈ ఫ్రిజ్‌కు చక్రాలు కూడా ఉంటాయి. కాబట్టి మోత బరువు లేకుండానే దీనిని కోరుకున్న చోటుకు తేలికగా తరలించవచ్చు. ఇందులోని ట్రేలో నీరు నింపేసి పెడితే, కేవలం పన్నెండు నిమిషాల్లోనే పద్దెనిమిది ఐస్‌క్యూబ్స్ తయారవుతాయి. ఇందులో నీళ్లు, పాలు, కూల్‌డ్రింక్స్, కూరగాయలు, పండ్లు వంటివి భద్రపరచుకునేందుకు కూడా వీలవుతుంది. ఇది పూర్తిగా సోలార్ చార్జబుల్ బ్యాటరీతో పనిచేస్తుంది. బ్యాటరీని పూర్తిగా చార్జ్‌చేస్తే, ఇరవై నాలుగు గంటల వరకు నిరాటంకంగా పనిచేస్తుంది. స్మార్ట్‌ఫోన్ యాప్ ద్వారా దీనిలోని అడ్జస్ట్మెంట్స్ను ఎక్కడి నుంచైనా మార్చుకోవచ్చు. అమెరికాకు చెందిన ‘ఎకో ఫ్లో’ కంపెనీ ఈ అత్యాధునిక పోర్టబుల్ రిఫ్రిజిరేటర్‌ను రూపొందించింది. దీని ధర 899 డాలర్లు (రూ.73,402) మాత్రమే! చదవండి: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మార్పులు రానున్నాయ్, నిమిషానికి 2 లక్షల టికెట్లు! -
పచ్చి మామిడికాయ రసంలో ఉప్పు , జీలకర్ర కలిపి రోజూ తాగితే..
Summer Care- Useful Tips: ఎండలు ముదురుతున్నాయి. ఈ సమయంలో వడదెబ్బ తగిలితే కష్టం. దానికంటే కొన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఈ చిట్కాలు పాటిస్తే వడదెబ్బ నుంచి తప్పించుకోవచ్చు. ►వేసవి ఎండలో నడవవలసి వచ్చినపుడు ఒక ఉల్లిపాయను టోపీలో గాని రుమాలులో గాని నడినెత్తిన పెట్టి కట్టుకొని నడిస్తే వడదెబ్బ తగలదు. ►వడడెబ్బ తగిలిందని అనుమానంగా ఉంటే ముఖం మీద, ఒంటిమీదా నీళ్లు చల్లుతూ తలపైన ఐస్‌క్యూబ్స్ ఉంచి నిమ్మరసంలో ఉప్పు కలిపి తాగించడం వల్ల నష్ట నివారణ జరుగుతుంది. ►ఉడికించిన పచ్చి మామిడికాయ రసంలో ఉప్పు , జీలకర్ర కలిపి రోజూ తాగడం వల్ల వడదెబ్బ తగలదు. ►తరువాణి తేటలో ఉప్పు కలిపి తాగుతుండాలి. ►తాటిముంజలను పంచదారతో కలిపి తింటూ ఉంటే వడదెబ్బనుంచి తప్పించుకోవచ్చు. ►వేడి వేడి గంజిలో ఉప్పు వేసి తాగించడం, ఉల్లిపాయ రసాన్ని రెండు కణతలకు, గుండె మీద పూయడం వల్ల వడదెబ్బ తగలడం వలన కలిగిన బాధల నుంచి ఉపశమనం లభిస్తుంది. చదవండి: Inti Panta: జానెడు జాగా ఖాళీగా ఉంచరు.. అక్కడ కూరగాయలన్నీ ఉచితమే! -
Beauty Tips: ఎటువంటి మేకప్ లేకుండానే.. మెరిసిపోండిలా!
ఎటువంటి మేకప్ లేకుండా జీవన శైలిలో కొద్దిపాటి మార్పులు చేసుకోవడం ద్వారా మేని మెరుపుని సహజసిద్ధంగా కూడా పొందవచ్చు. చాలా మంది సెలబ్రిటీలు సైతం అనుసరిస్తోన్న ఈ మార్పులేంటో చూద్దాం.... రోజూ ఏడు నుంచి ఎనిమిది గ్లాసుల మంచినీరు తప్పనిసరిగా తాగాలి. నీరు తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ బయటికి వెళ్లిపోతాయి. ఫలితంగా చర్మం కాంతిని సంతరించుకుంటుంది. ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు ఐస్‌క్యూబ్‌తో ముఖానికి మర్దనా చేయాలి. ఇలా చేయడం వల్ల ఉబ్బినట్లుగా ఉన్న చర్మం సాధారణ స్థితికి చేరుకుంటుంది. మంట, దద్దుర్లు వంటివి ఉంటే తొలగి పోతాయి. ఐస్ చర్మాన్ని బిగుతుగా చేస్తుంది. అలసట, ఒత్తిడి కళ్లమీద ప్రభావం చూపుతాయి. అందువల్ల పడుకునేముందు కళ్లకింది భాగంలో అలోవెరా జెల్ లేదా కొబ్బరి నూనె, ఏదైనా ఐ క్రీమ్‌ను రాసి మర్దన చేయాలి. పడుకునే ముందు ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవడం వల్ల రోజు మొత్తంలో ముఖం మీద పేరుకుపోయిన దుమ్మూధూళీ వదిలి చర్మం మృదువుగా యవ్వనంగా కనిపిస్తుంది. చదవండి: Ragi Java Health Benefits: రాగిజావను పాలు, బెల్లం, యాలకుల పొడితో కలిపి కాచుకుని తాగే అలవాటు ఉందా.. అయితే -
ఇంటిప్స్
►టొమాటోలను ఉడికించి, తగినంత ఉప్పు కలిపి గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ఐస్ ట్రేలలో పోసి డీప్ ఫ్రిజ్‌లో ఉంచాలి. టొమాటో ఐస్‌క్యూబ్స్‌ను ప్లాస్టిక్ బ్యాగ్‌లో వేసి ఫ్రీజర్‌లోనే ఉంచాలి. అవసరమైనప్పుడు సూప్‌లు, కూరలలో గ్రేవీగా వాడుకోవచ్చు. ►పాలు పొంగి అంచుభాగం అంతా పాల మరక పట్టుకునే ఉంటుంది. ఇలాంటప్పుడు, పాలు మరిగించడానికి ముందు పాత్ర పై అంచు భాగాన నెయ్యి రాస్తే పాలు త్వరగా పొంగవు, పొంగినా అంచుకు మరక పట్టదు. ►వంటలలో ఉప్పు ఎక్కువైతే టొమాటో ముక్కలు లేదా బంగాళదుంప ముక్కలు లేదా టీ స్పూన్ పంచదార వేయాలి. ►నిమ్మకాయలను ఫ్రిజ్‌లో నిల్వచేసేముందు వాటి పైన కొద్దిగా కొబ్బరి నూనె రాస్తే ఎక్కువ కాలం మన్నుతాయి. ►అన్నం ముద్దగా కాకుండా ఉండాలంటే ఉడికేటప్పుడు కొన్ని చుక్కల నిమ్మరసం కలపాలి. -
చల్ల చల్లని హాయి..
చేతి నిండా ఐస్‌క్యూబ్స్ తీసుకోండి. వాటితో ముఖం మీద, చేతులు, మెడ పైన మృదువుగా రబ్ చేయండి. ఎందుకంటే ఐస్ మీకు ఫేస్ మాస్క్‌లా పని చేసి చర్మాన్ని తిరిగి వికసింపజేస్తుంది. ముఖ్యంగా ఈ వేసవి కాలంలో.. ఒక చిన్న గుడ్డ సంచిలో ఐస్‌క్యూబ్స్ వేసి ఈవిధంగా చేయవచ్చు.. ∙కళ్ల కింద చర్మం ఉబ్బినట్టుగా కనిపిస్తుంటే చల్లటి నీళ్లతో లేదంటే ఒక ఐస్‌క్యూబ్‌తో మృదువుగా మర్దన చేయండి. డల్‌గా ఉన్న మీ కళ్లలో జీవం వచ్చేస్తుంది. కళ్లకింద వలయాలు కూడా తగ్గుముఖం పడతాయి. రోజూ పగటి వేళ ఒకసారైనా ఇలా చేయవచ్చు. వేసవి తాపం నుంచి ఉపశమనం లభిస్తుంది. ∙ఈ కాలం చమటకు ఒరుసుకుపోయే భాగాలలో ఎర్రగా అవుతుంటుంది. ధరించే దుస్తుల రాపిడి వల్ల కూడా చర్మం ఎర్రబడవచ్చు. ఇలాంటప్పుడు ఎర్రబడిన ఆ ప్రాంతంలో ఐస్‌తో 5 నుంచి 10 నిమిషాలు మెల్లగా రాస్తూ ఉండండి. మంట ఫీలింగ్ నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది. ∙మృతకణాలను తొలగించడానికి మేలైన చిట్కా.. దోసకాయ లేదా స్ట్రాబెర్రీ, పుచ్చకాయ ముక్కలను విడివిడిగా గుజ్జు చేయండి. ఈ మిశ్రమాన్ని ఫ్రిజ్‌లో ఉండే ఐస్ ట్రేలో పోసి దానిని డీప్ ఫ్రీజర్‌లో ఉంచండి. గట్టిపడ్డాక ఒక ఐస్ క్యూబ్ తీసుకొని అది కరిగేంతవరకు ముఖాన్ని, చేతులకు రబ్ చేస్తూ ఉండండి. వారంలో నాలుగైదు సార్లు ఇలా చేయవచ్చు. ∙చేతి నిండా ఐస్ క్యూబ్స్ తీసుకొని వాటిని కాటన్ టవల్లో వేసి, కొన్ని చుక్కల లావెండర్ ఆయిల్ వేసి మూటలా చుట్టాలి. దీంతో ముఖాన్ని, చేతులు, పాదా లను రబ్ చేయాలి. రోజూ పడుకునే ముందు ఇలా చేస్తే చర్మం వడలిపోదు. -
ఈ వేసవి చల్లచల్లగా...
ఉన్నట్టుండి చుట్టాలు వచ్చారు. చల్లగా ఏ మజ్జిగో, జ్యూసో ఇద్దామనుకుంటాం. ఐస్ క్యూబ్స్ వేస్తే ఎంతకీ కరగవు. డ్రింక్ ఓ పట్టాన చల్లబడదు. సమయం వృథా. * రోడ్డు మీద వెళ్తూ ఉంటాం. పిల్లలు ఉన్నట్టుండి గొడవ మొదలుపెడతారు. రోడ్డుపక్కన అమ్మే రంగురంగుల ఐస్ గోలా కావాలని ఏడుస్తారు. కొనిద్దామంటే వాళ్ల ఆరోగ్యాలు పాడవుతాయేమోనని భయం. * ఈ రెండు ఇబ్బందులనూ ఒకేసారి తీరుస్తుంది ఇక్కడ కనిపిస్తోన్న బుజ్జి మెషీన్. దీన్ని ఐస్ క్రషర్ అంటారు. చూడ్డానికి చిన్న బాక్సులా కనిపిస్తోన్న దీనిలో ఐస్‌క్యూబ్స్ వేసి, ప్లగ్గు కనెక్ట్ చేసి ఆన్ చేస్తే చాలు. క్షణంలో ఐస్ అంతా పొడిలా అయిపోతుంది. అంటే క్రష్ అవుతుంది. దీన్ని డ్రింక్స్‌లో కలిపితే క్షణాల్లో చల్లబడిపోతాయి. ఇందులో కాస్త రంగులు, చక్కెర నీళ్లు కలిపి చుట్టి ఇస్తే పిల్లలకు ఐస్ క్యాండీ రెడీ అయిపోతుంది. ఖరీదు కూడా పెద్ద ఎక్కువేం కాదు. మోడల్, సైజును బట్టి రెండు వందల రూపాయల నుంచి మొదలవుతోంది.