ఐస్‌క్యూబ్స్ తయారు చేసుకోవాలంటే, డీప్‌ఫ్రీజర్‌లోని ట్రేలలో నీళ్లు నింపుకొని గంటల తరబడి వేచి చూడక తప్పదు. ఎక్కడకు వెళితే అక్కడ, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఐస్‌క్యూబ్స్ దొరకాలంటే కష్టమే! ఇళ్లలోని రిఫ్రిజరేటర్లను బయటకు తీసుకుపోలేం. ఇలాంటి ఇబ్బందులేవీ లేకుండా ఉండేందుకు అమెరికన్ కంపెనీ ‘ఫ్లెక్స్‌టెయిల్’ ఇటీవల పోర్టబుల్ ఐస్‌మేకర్‌ను ‘ఇవో ఐసర్’ పేరుతో మార్కెట్‌లోకి విడుదల చేసింది.
ఇది రీచార్జబుల్ బ్యాటరీ సాయంతో పనిచేస్తుంది. దీనిని యూఎస్‌బీ పోర్ట్ ద్వారా చార్జింగ్ చేసుకోవచ్చు. దీని బరువు దాదాపు తొమ్మిదిన్నర కిలోలే! అంటే మిగిలిన పోర్టబుల్ రిఫ్రిజరేటర్ల కంటే చాలా తక్కువ. దీనిని ఒకసారి పూర్తిగా చార్జ్ చేసుకుంటే, మూడు గంటల వరకు పనిచేస్తుంది. ఇది కేవలం అరగంటలోనే ఐస్‌క్యూబ్స్ తయారు చేస్తుంది. దీని ధర 359 డాలర్లు (రూ.29,678) మాత్రమే!
Comments
Please login to add a commentAdd a comment