బెంగళూరు: బెంగళూరు కేంద్రంగా పనిచేసే బీటూబీ వ్యవసాయ ముడి సరుకుల ఈ–ప్లాట్‌ఫామ్ నర్చర్ పలు సస్యరక్షణ ఉత్పత్తులను విడుదల చేసింది. సంస్థ మొబైల్ యాప్ ద్వారానే వీటిని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.
హెర్బిసైడ్స్, ఫంగిసైడ్స్, ఇన్‌సెక్టిసైడ్స్, బయో స్టిమ్యులంట్స్‌ను యూనిక్వాట్, టర్ఫ్, లాన్సర్, ఈల్డ్‌విన్, మంజేట్, అమెరెక్స్, రైస్‌బ్యాక్, ఇమిడిస్టార్, లంబ్డా స్టార్ పేర్లతో విడుదల చేసింది. ఖరీఫ్ సీజన్‌లో రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని కొత్త ఉత్పత్తులు తీసుకొచ్చింది. వీటిని యూపీఎల్ ఎస్‌ఏఎస్ సీఈవో ఆశిష్ దోబాల్ సమక్షంలో విడుదల చేసింది.
దేశంలో వ్యవసాయ ముడి సరుకులు అధిక శాతం సంప్రదాయ పంపిణీ చానళ్ల ద్వారానే సరఫరా అవుతుంటాయని, నర్చర్.రిటైల్‌తో భాగస్వామ్యం ద్వారా డిజి టల్ రూపంలో మరింత మంది కస్టమర్లను చేరుకుంటామని దోబాల్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment