
టెలివిజన్ ప్రేక్షకులు తగ్గిపోవడం, ఆన్‌లైన్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లకు ఆదరణ పెరుగుతుండడం సంప్రదాయ ఎంటర్‌టైన్‌మెంట్ నెటవర్క్‌లకు శాపంగా మారుతోంది. మారుతున్న మీడియా అవకాశాలకు అనుగుణంగా డిస్నీ ఏబీసీ న్యూస్ గ్రూప్, డిస్నీ ఎంటర్‌టైన్‌మెంట్ నెట్‌వర్క్‌ల్లో పని చేస్తున్న తన సిబ్బందిని తగ్గించే ప్రణాళికలను ప్రకటించింది. సంస్థలోని ఆరు శాతం ఉద్యోగులు అంటే సుమారు 200 మందిపై ఈ ప్రభావం పడనుందని కంపెనీ వర్గాలు తెలిపాయి.
ఏబీసీ వార్తలపై ప్రభావం
‘20/20’, ‘నైట్ లైన్’తో సహా అనేక షోలు ఒకే యూనిట్‌గా ఏకీకృతం కాబోతున్న ఏబీసీ న్యూస్‌పై ఈ తొలగింపులు ప్రభావం చూపుతాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. పాపులర్ న్యూస్ టాక్ షో ‘గుడ్ మార్నింగ్ అమెరికా’ దాని మూడు గంటల షో సమయాన్ని ఒకే ప్రొడక్షన్ టీమ్ కింద ఏకీకృతం చేయనున్నారు. లేఆఫ్స్‌తో దీని కార్యకలాపాలను క్రమబద్ధీకరించబోతున్నట్లు తెలుస్తుంది. డిస్నీ పునర్నిర్మాణ ప్రయత్నాల్లో భాగంగా తన డిజిటల్ ఎడిటోరియల్, సోషల్ బృందాలను వార్తల సేకరణ, ప్రదర్శనలు, సొంత స్టేషన్ల విభాగాలతో అనుసంధానించాలని యోచిస్తోంది.
ఇదీ చదవండి: బ్యాంకు ఉద్యోగుల సమ్మె.. వరుసగా నాలుగు రోజులు సెలవు
సంప్రదాయ కేబుల్ టీవీల వాడకం తగ్గుతుండడం, స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లకు ప్రేక్షకులు మళ్లుతుండడంతో డిస్నీ ఇలా లేఆఫ్స్ నిర్ణయం తీసుకున్నట్లు కొందరు అధికారులు తెలిపారు. డిమాండ్ ఉన్న కంటెంట్(కంటెంట్ ఆన్ డిమాండ్) ఆధిపత్యం చలాయిస్తున్న యుగంలో ఇతర పోటీదారులకంటే మెరుగ్గా ఉండేందుకు ప్రపంచవ్యాప్తంగా మీడియా కంపెనీలు తమ వ్యాపార నమూనాలను పునర్నిర్మిస్తున్నాయి. డిస్నీ తీసుకున్న ఈ లేఫ్స్ ప్రకటన ఉద్యోగుల్లో ఆందోళనను రేకెత్తించినప్పటికీ, మారుతున్న వినియోగదారుల ప్రాధాన్యతల నేపథ్యంలో మీడియా సంస్థలు అభివృద్ధి చెందాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతోంది. కార్యకలాపాలను క్రమబద్ధీకరించడం, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లకు ప్రాధాన్యత ఇవ్వడంపై డిస్నీ దృష్టి పెట్టడం కంపెనీకి మేలు చేస్తుందని కొందరు నమ్ముతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment