Disney Channel
-
‘జీ’ పై చర్యలకు డిస్నీ స్టార్ కసరత్తు
న్యూఢిల్లీ: మీడియా, ఎంటర్టైన్మెంట్ దిగ్గజం జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్‌ప్రైజెస్‌ని మరిన్ని సమస్యలు చుట్టుముడుతున్నాయి. క్రికెట్ మ్యాచ్‌ల టీవీ ప్రసార హక్కులకు సంబంధించిన ఒప్పందం నుంచి తప్పుకున్నందుకు గాను కంపెనీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిస్నీ స్టార్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జపాన్ దిగ్గజం సోనీ గ్రూప్ భారత విభాగం విలీన డీల్ రద్దుతో సతమతమవుతున్న జీకి ఈ పరిణామం మరింత సమస్యాత్మకంగా మారవచ్చని వివరించాయి. నాలుగేళ్ల పాటు ఐసీసీ మెన్స్, అండర్–19 క్రికెట్ టీవీ ప్రసార హక్కుల కోసం డిస్నీ స్టార్‌తో 2022లో జీ 1.4 బిలియన్ డాలర్ల సబ్–లైసెన్సింగ్ ఒప్పందం కుదుర్చుకుంది. దీని కింద తొలి విడతగా 200 మిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంది. సోనీతో డీల్ కుదిరితే వచ్చే నిధుల నుంచి ఈ మొత్తాన్ని చెల్లించవచ్చని జీ భావించింది. కానీ అది రద్దవడంతో చెల్లింపులు జరపలేకపోయింది. తదుపరి ఈ విషయంలో ముందుకెళ్లదల్చుకోవడం లేదంటూ డిస్నీ స్టార్‌కి తెలిపింది. దీంతో డిస్నీ స్టార్ తదుపరి చర్యలకు ఉపక్రమిస్తున్నట్లుగా సమాచారం. -
డిస్నీప్లస్‌లో హాట్‌స్టార్.. హాట్‌హాట్
ముంబై, సాక్షి: ప్రపంచవ్యాప్తంగా డిస్నీప్లస్కున్న 8.68 కోట్ల సబ్స్క్రైబర్లలో హాట్‌స్టార్ యూజర్ల సంఖ్య 30 శాతానికి చేరింది. ఈ నెల 2కల్లా హాట్‌స్టార్ యూజర్లు 2.6 కోట్లకు చేరినట్లు డిస్నీస్ ప్రపంచ కార్యకలాపాలు, డైరెక్ట్ టు కన్జూమర్ విభాగం చైర్మన్ రెబెక్కా క్యాంప్‌బెల్ వెల్లడించారు. గత రెండు నెలల్లోనే 75 లక్షల మంది కొత్తగా జత కలసినట్లు ఇన్వెస్టర్ల డే సందర్శంగా తెలియజేశారు. సెప్టెంబర్ చివరికల్లా హాట్‌స్టార్ యూజర్ల సంఖ్య 1.85 కోట్లుగా నమోదు కాగా.. హాట్‌స్టార్ సబ్స్క్రైబర్ల సంఖ్యలో భారత్‌కు మెజారిటీ వాటా ఉన్నట్లు పేర్కొన్నారు. సెప్టెంబర్‌లో ఇండొనేసియా, సింగపూర్‌లో గత నెలలో సర్వీసులను ప్రారంభించింది. కాగా. ప్రపంచవ్యాప్తంగా వివిధ స్ట్రీమింగ్ సర్వీసులకు ప్రస్తుతం 13.7 కోట్లమంది పెయిడ్ సబ్స్క్రైబర్లున్నట్లు డిస్నీ సీఎఫ్‌వో క్రిస్టీన్ మెకార్థీ తెలియజేశారు. 2024కల్లా ఈ సంఖ్య 30-35 కోట్లకు చేరవచ్చని భావిస్తున్నట్లు చెప్పారు. (ఫేస్బుక్ నుంచి విడిగా వాట్సాప్, ఇన్స్టాగ్రామ్?) ఐపీఎల్ ఎఫెక్ట్ గత నెలలో ముగిసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ 13వ ఎడిషన్ కారణంగా హాట్‌స్టార్ యూజర్ల సంఖ్యలో వృద్ధి నమోదైనట్లు పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. దీంతో దేశీయంగా ఈ సర్వీసులపై సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ఒక్కో వినియోగదారుడిపై సగటున 2.19 డాలర్ల ఆదాయం నమోదైంది. భారత్‌లో వేగంగా పెరుగుతున్న మధ్యతరగతి ప్రజల కారణంగా డిస్నీప్లస్కు ప్రధాన మార్కెట్‌గా మారినట్లు క్యాంప్‌బెల్ పేర్కొన్నారు. ఇందుకు ప్రధానంగా స్టార్ టీవీ, హాట్‌స్టార్ కారణమవుతున్నట్లు తెలియజేశారు. ప్రస్తుతం డిస్నీప్లస్ హాట్‌స్టార్ ఏడు ప్రాంతీయ భాషలలో సర్వీసులు అందిస్తున్నట్లు వెల్లడించారు. ప్రతీ ఏటా 17,000 గంటల స్థానిక ఒరిజినల్ కార్యక్రమాలను జత చేస్తున్నట్లు వివరించారు. కాగా.. దేశీయంగా డిస్నీప్లస్ హాట్‌స్టార్.. ఇతర గ్లోబల్ దిగ్గజాలు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జీ5 (ఎస్సెల్ గ్రూప్), సోనీ లైవ్ తదితరాలతో పోటీని ఎదుర్కొంటున్నట్లు ఈ సందర్భంగా పరిశ్రమవర్గాలు తెలియజేశాయి. (టెస్లా కార్లూ, షేర్లూ- మనకు భలే ఆసక్తి) -
డిస్నీ కిస్
అసహజాలను ఆమోదించడం ఆధునిక సమాజపు కొత్త సంస్కారం! సేమ్ సెక్స్ ప్రేమల్ని, పెళ్లిళ్లనీ, సహజీవనాలను ప్రపంచం కొద్దికొద్దిగా అర్థంచేసుకోగలుగుతోంది. అంగీకరించగలుగుతోంది. లేటెస్టుగా ఇప్పుడు డిస్నీ చానెల్ తన ‘స్టార్ వర్సెస్ ఫోర్సెస్ ఆఫ్ ఈవిల్’ కార్టూన్ సీరీస్‌లో తొలిసారి ఒక సేమ్‌సెక్స్ కిస్‌ను చూపించింది! ‘స్టార్’ అమె ఫ్రెండ్ మార్కో ఒక సంగీత కచేరికి హాజరవుతారు. ఆడియెన్స్‌లో... ముద్దులు పెట్టుకుంటున్న జంటలు వాళ్లకు కనిపిస్తారు. వాళ్లలో ఒక గే జంట కూడా ఉంటుంది. అదే సమయానికి ‘జస్ట్ ఫ్రెండ్స్’ అనే పాట వినిపిస్తుంటుంది. ఒకర్నొకరు ముద్దుపెట్టుకుంటున్న ఇద్దరు ఆడవాళ్లు కూడా ఆడియెన్స్‌లో ఉంటారు. ‘డిజిటల్ స్పై’ అనే సంస్థ కనిపెట్టేవారకూ టీవీ ప్రేక్షకులెవరూ దీనిని కనిపెట్టలేకపోయారు. ‘పిల్లలకు ఇవా చూపించేది’ అనే విమర్శను ఎదుర్కొనేందుకు డిస్నీ సిద్ధమైనట్లే ఉంది!