డిస్నీ కిస్‌ | Disney Channel: 'Star vs. Forces of Evil' | Sakshi
Sakshi News home page

డిస్నీ కిస్‌

Published Sat, Mar 4 2017 12:37 AM | Last Updated on Tue, Dec 25 2018 2:55 PM

డిస్నీ కిస్‌ - Sakshi

డిస్నీ కిస్‌

అసహజాలను ఆమోదించడం ఆధునిక సమాజపు కొత్త సంస్కారం! సేమ్‌ సెక్స్‌ ప్రేమల్ని, పెళ్లిళ్లనీ, సహజీవనాలను ప్రపంచం కొద్దికొద్దిగా అర్థంచేసుకోగలుగుతోంది. అంగీకరించగలుగుతోంది. లేటెస్టుగా ఇప్పుడు డిస్నీ చానెల్‌ తన ‘స్టార్‌ వర్సెస్‌ ఫోర్సెస్‌ ఆఫ్‌ ఈవిల్‌’ కార్టూన్‌ సీరీస్‌లో తొలిసారి ఒక సేమ్‌సెక్స్‌ కిస్‌ను చూపించింది! ‘స్టార్‌’ అమె ఫ్రెండ్‌ మార్కో ఒక సంగీత కచేరికి హాజరవుతారు. ఆడియెన్స్‌లో... ముద్దులు పెట్టుకుంటున్న జంటలు వాళ్లకు కనిపిస్తారు.

వాళ్లలో ఒక గే జంట  కూడా ఉంటుంది. అదే సమయానికి ‘జస్ట్‌ ఫ్రెండ్స్‌’ అనే పాట వినిపిస్తుంటుంది. ఒకర్నొకరు ముద్దుపెట్టుకుంటున్న ఇద్దరు ఆడవాళ్లు కూడా ఆడియెన్స్‌లో ఉంటారు. ‘డిజిటల్‌ స్పై’ అనే సంస్థ కనిపెట్టేవారకూ టీవీ ప్రేక్షకులెవరూ దీనిని కనిపెట్టలేకపోయారు. ‘పిల్లలకు ఇవా చూపించేది’ అనే విమర్శను ఎదుర్కొనేందుకు డిస్నీ సిద్ధమైనట్లే ఉంది!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement