new products
-
యాపిల్ ఈవెంట్లో కొత్త ఉత్పత్తులు (ఫోటోలు)
-
యాక్సిస్ బ్యాంక్ నుంచి రెండు డిజిటల్ సొల్యూషన్స్
హైదరాబాద్: ప్రైవేట్ రంగ యాక్సిస్ బ్యాంక్ తాజాగా రిటైల్, వ్యాపార వర్గాల కోసం రెండు ఉత్పత్తులను ప్రవేశపెట్టింది. యూపీఐ–ఏటీఎం, భారత్ కనెక్ట్ (గతంలో బీబీపీఎస్) ఫర్ బిజినెస్ వీటిలో ఉన్నాయి. కార్డ్‌లెస్ నగదు విత్‌డ్రాయల్, డిపాజిట్లకు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) టెక్నాలజీ ఆధారిత ఆండ్రాయిడ్ క్యాష్ రీసైక్లర్‌గా యూపీఐ–ఏటీఎం పని చేస్తుంది. అకౌంటు తెరవడం, క్రెడిట్ కార్డుల జారీ, డిపాజట్లు, రుణాలు, ఫారెక్స్ మొదలైన సరీ్వసులన్నీ కూడా ఒకే ప్లాట్‌ఫాం మీద అందించేందుకు ఇది ఉపయోగపడుతుందని బ్యాంకు డిప్యుటీ ఎండీ రాజీవ్ ఆనంద్ తెలిపారు. మరోవైపు, వ్యాపార సంస్థలు సప్లై చెయిన్లోని వివిధ దశల్లో నిర్వహణ మూలధన అవసరాల కోసం, అకౌంట్ రిసీవబుల్స్–పేయబుల్స్ను సమర్ధవంతంగా క్రమబదీ్ధకరించుకునేందుకు భారత్ కనెక్ట్ ఫర్ బిజినెస్ ఉపయోగపడుతుంది. ఎన్పీసీఐలో భాగమైన భారత్ బిల్‌పే భాగస్వామ్యంతో దీన్ని రూపొందించింది. -
కెనరా బ్యాంక్ నుంచి సరికొత్త సేవలు
హైదరాబాద్: కెనరా బ్యాంక్ పలు కొత్త ఉత్పత్తులు, సరీ్వసులు ప్రారంభించింది. ‘కెనరా హీల్’ పేరుతో వినూత్న హెల్త్ ప్రొడక్ట్ ప్రవేశపెట్టింది. ఆసుపత్రుల్లో చికిత్సలకు బీమా క్లెయిమ్ పూర్తిగా రాని సందర్భాల్లో ‘కెనరా హీల్’ ద్వారా రుణ సహాయం అందించనుంది. మహిళల కోసం ‘కెనరా ఏంజెల్’ అనే పేరుతో కస్టమైజ్డ్ సేవింగ్స్ ఖాతాను ప్రవేశపెట్టింది. ఎస్‌హెచ్‌జీ గ్రూప్ సభ్యులకు ఆన్లైన్ ద్వారా తక్షణ రుణ సదుపాయానికి ‘కెనరా ఎస్‌హెచ్‌జీ ఈ–మనీ’ తీసుకొచి్చంది. అలాగే ప్రీ–అప్రూడ్ వ్యక్తిగత రుణాలకు ‘కెనరా రెడీక్యా‹Ù’; ఆన్లైన్ టర్మ్ డిపాజిట్ రుణాలకు ‘కెనరా మైమనీ’; అవాంతరాలు లేని చెల్లింపులకు ‘కెనరా యూపీఐ 123పే ఏఎస్ఐ’ సేవలు ప్రారంభించింది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్ సీఈఓ రాజేష్ బన్సాల్, కెనరా బ్యాంక్ ఎండీ, సీఈవో సత్యనారాయణ రాజు తదితరులు పాల్గొన్నారు. -
ఫార్మాకు కొత్త పీఎల్ఐ పథకం!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ రంగానికి కొత్త ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకాన్ని ప్రవేశపెట్టడంపై కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియెంట్స్ (ఏపీఐ) తయారీకి అవసరమైన కీలక రసాయనాల ఉత్పత్తిని దేశీయంగా పెంచడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. తద్వారా కీలక రసాయనాల ఉత్పత్తుల కోసం భారతీయ కంపెనీలు చైనాపై ఆధారపడటాన్ని తగ్గించడం ఈ నిర్ణయం వెనుక ఉన్న ముఖ్య ఉద్ధేశం. ఫార్మాతో ముడిపడి ఉన్న అన్ని విభాగాలు ప్రస్తుత పీఎల్ఐ కింద కవర్ కాలేదు. దీని కారణంగా ఈ రసాయనాలు ఇప్పటికీ చైనా నుండి పెద్దమొత్తంలో భారత్‌కు దిగుమతి అవుతున్నాయి. అయితే కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాత్రమే నూతన పీఎల్ఐ కార్యరూపంలోకి వచ్చే అవకాశం ఉంది. అలాగే తదుపరి కేంద్ర బడ్జెట్లో ప్రతిపాదిత పథకం భాగం కావచ్చు. ప్రస్తుత పథకానికి సవరణ.. భారత్‌కు దిగుమతి అవుతున్న ఫార్మా ముడిపదార్థాల్లో 55–56 శాతం వాటా చైనాదే. 2013–14లో దిగుమతైన యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియెంట్స్‌లో చైనా వాటా విలువ పరంగా 64 శాతం, పరిమాణం పరంగా 62 శాతం వృద్ధి నమోదైంది. 2022–23 వచ్చేసరికి ఇది వరుసగా 71 శాతం, 75 శాతానికి ఎగబాకింది. చైనా నుంచి ముడిపదార్థాల (బల్క్ డ్రగ్) దిగుమతులు 2013–14లో 2.1 బిలియన్ డాలర్లు, 2018–19లో 2.6 బిలియన్ డాలర్లు, 2022–23 వచ్చేసరికి 3.4 బిలియన్ డాలర్లకు ఎగబాకాయి. చైనాలో ఈ రసాయనాల తయారీ వ్యయాలు చాలా తక్కువగా ఉన్నాయి. దీని కారణంగా ఏపీఐల ఉత్పత్తికై భారతీయ తయారీ సంస్థలు చైనా నుంచే వీటిని ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఈ రసాయనాలు కాలుష్యకారకాలు. ఈ రసాయనాలను పీఎల్ఐ పరిధిలోకి చేర్చేందుకు ప్రస్తుత పథకాన్ని సవరించడాన్ని కూడా ప్రభుత్వం పరిశీలించవచ్చని తెలుస్తోంది. జాప్యాలకు దారితీయవచ్చు.. ప్రస్తుతం ఉన్న ఫార్మా పీఎల్ఐ పథకం కింద పరిశ్రమకు కీలక స్టారి్టంగ్ మెటీరియల్స్, డ్రగ్ ఇంటర్మీడియట్స్, యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియెంట్స్‌ను స్థానికంగా తయారు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలను అందిస్తోంది. ఫార్మా సరఫరా వ్యవస్థ మొత్తాన్ని ప్రస్తుత పీఎల్ఐ పథకం కవర్ చేయడం లేదు. అయితే ఏపీఐల తయారీలో వాడే రసాయనాల ధరలను చైనా తగ్గించింది. పీఎల్ఐ పథకంలో భాగం కాని కంపెనీలు చైనా నుంచి ఈ రసాయనాలను తక్కువ ధరకు దిగుమతి చేసుకుంటున్నాయి. కీలక ఔషధ ముడి పదార్ధాల కోసం ఒకే దేశంపై ఎక్కువగా ఆధారపడటం భారత ఫార్మా పరిశ్రమకు ప్రమాదం కలిగించే అవకాశమూ లేకపోలేదు. దీనికి కారణం ఏమంటే సరఫరా వ్యవస్థలో అంతరాయాలు ఏర్పడినట్టయితే మందుల కొరత, తయారీ జాప్యాలకు దారితీయవచ్చు. -
బీటావోల్ట్ బ్యాటరీ.. ఛార్జింగ్ లేకుండా 50 ఏళ్ళు పనిచేసే కెపాసిటీ!
టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో ఎలక్ట్రానిక్ వినియోగం మరింత ఎక్కువగా ఉంది. పరికరాలు పెరుగుతుంటే.. వాటికి ఛార్జింగ్ కీలకమైన అంశంగా మారింది. దీంతో నిత్యా జీవితంలో ఉపయోగించే దాదాపు అన్ని పరికరాలకు ప్రతి రోజు ఛార్జింగ్ వేసుకోవాల్సి వస్తోంది. ఈ సమస్యకు చెక్ పెట్టడానికి చైనా కంపెనీ ఓ కొత్త బ్యాటరీ ఆవిష్కరించింది. బీజింగ్‌కు చెందిన బీటావోల్ట్ (Betavolt) ఇటీవల 'న్యూక్లియర్ బ్యాటరీ' పరిచయం చేసింది. కంపెనీ ఆవిష్కరించిన ఈ బ్యాటరీ అటామిక్ ఎనర్జీని గ్రహించి ఏకంగా 50 ఏళ్ళు పనిచేస్తుందని తెలుస్తోంది. ఈ బ్యాటరీ చూడటానికి పరిమాణంలో చాలా చిన్నదిగా ఉంటుంది. బీటావోల్ట్ అటామిక్ ఎనర్జీ బ్యాటరీలు ఏరోస్పేస్, AI పరికరాలు, వైద్య పరికరాలు, మైక్రోప్రాసెసర్లు, లేటెస్ట్ సెన్సార్లు, చిన్న డ్రోన్లు, మైక్రో-రోబోట్ వంటి వాటి వినియోగంలో చాలా ఉపయోగపడతాయని కంపెనీ వెల్లడించింది. బ్యాటరీ కొలతలు బీటావోల్ట్ ఆవిష్కరించిన కొత్త బ్యాటరీ కేవలం 15 x 15 x 5 మిమీ కొలతల్లో ఉంటుంది. ఇది న్యూక్లియర్ ఐసోటోప్లు, డైమండ్ సెమీకండక్టర్ల పొరలతో తయారు చేసినట్లు సమాచారం. ఈ న్యూక్లియర్ బ్యాటరీ ప్రస్తుతం 3 వోల్టుల వద్ద 100 మైక్రోవాట్ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. 2025 నాటికి 1-వాట్ పవర్ అవుట్‌పుట్‌ని ప్రొడ్యూస్ చేసేలా తయారు చేయనున్నట్లు సమాచారం. ఈ బ్యాటరీ రేడియేషన్ వల్ల మానవ శరీరానికి ఎలాంటి ప్రమాదం ఉండదని, పేస్మేకర్ల వంటి వైద్య పరికరాల్లో కూడా సులభంగా ఉపయోగించవచ్చని బీటావోల్ట్ వెల్లడించింది. బ్యాటరీ ఎలా పని చేస్తుంది? బీటావోల్ట్ కొత్త బ్యాటరీ ఐసోటోపుల నుంచి శక్తిని పొందుతుంది. ఈ విధానంవైపు 20 శతాబ్దం ప్రారంభంలోనే పరిశోధనలు మొదలయ్యాయి. అయితే చైనా 2021-2025 వరకు 14వ పంచవర్ష ప్రణాళిక కింద అణు బ్యాటరీలను తయారు చేయడమే లక్ష్యంగా కృషి చేస్తోంది. ఇదీ చదవండి: ప్రపంచ వ్యాపార సామ్రాజ్య పతనం! భయపడుతున్న సీఈఓలు.. బ్యాటరీ లేయర్ డిజైన్ కలిగి ఉండటం వల్ల.. ఆకస్మికంగా పేలే అవకాశాలు లేదని చెబుతున్నారు. మైనస్ 60 డిగ్రీల సెల్సియస్ నుంచి 120 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలను తట్టుకుని ఈ బ్యాటరీ పనిచేస్తుంది. ప్రస్తుతం కంపెనీ ఈ బ్యాటరీని టెస్ట్ చేస్తూనే ఉంది, ప్రభుత్వాల నుంచి అవసరమైన అన్ని అనుమతులు లభించిన తరువాత ఉత్పత్తి ప్రారంభమవుతుంది. -
భారత్‌లో కొత్త 'మ్యాక్‌బుక్ ప్రో, ఐమ్యాక్' లాంచ్ - ధరలు, వివరాలు
ప్రపంచ మార్కెట్లో యాపిల్ ఉత్పత్తులకు భారీ డిమాండ్ ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని సంస్థ ఎప్పటికప్పుడు వినియోగదారుల కోసం కొత్త ఉత్పత్తులను పరిచయం చేస్తోంది. ఇందులో భాగంగా తాజాగా మ్యాక్‌బుక్ ప్రో, ఐ మ్యాక్ ఆవిష్కరించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. మ్యాక్‌బుక్ ప్రో ఎమ్3 ధరలు యాపిల్ మ్యాక్‌బుక్ ఎమ్3, ఎమ్3 ప్రో, ఎమ్3 ప్రో మ్యాక్స్ అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. ధరలు సైజ్, ర్యామ్ వంటి వాటిని మీద ఆధారపడి ఉంటాయి. మ్యాక్‌బుక్ ప్రో ఎమ్3 ప్రారంభ ధర రూ. 1,69,900 14 ఇంచెస్ ఎమ్3 ప్రో ప్రారంభ ధర రూ. 1,99,900 16 ఇంచెస్ మ్యాక్‌బుక్ ప్రో ప్రారంభ ధర రూ. 2,49,900 ఈ కొత్త యాపిల్ మ్యాక్‌బుక్ ప్రో కొనుగోలు చేయాలనుకునే వారు యాపిల్ స్టోర్లలో లేదా యాపిల్ స్టోర్ యాప్‌లో ఆర్డర్ చేసుకోవచ్చు. డెలివరీలు నవంబర్ 7 నుంచి ప్రారంభమవుతాయి. ఐమ్యాక్ ధరలు యాపిల్ 8-కోర్ GPU కలిగిన iMac ధర రూ.1,34,900. ఇది గ్రీన్, పింక్, బ్లూ, సిల్వర్ కలర్లలో లభిస్తుంది. ఇది 8-కోర్ CPU, 8GB మెమరీ, 256GB SSD, రెండు థండర్‌బోల్ట్ పోర్ట్ వంటి ఫీచర్లతో మ్యాజిక్ కీబోర్డ్ అండ్ మ్యాజిక్ మౌస్తో వస్తుంది. ఇదీ చదవండి: 81.5 కోట్ల భారతీయుల ఆధార్ వివరాలు లీక్ - అమ్మడానికి సిద్దమైన హ్యాకర్! ఐమ్యాక్ కొనుగోలు చేయాలనుకువారు యాపిల్ ఆన్లైన్ స్టోర్‌లో ఆర్డర్ చేసుకోవచ్చు. ఇది ప్రపంచ వ్యాప్తంగా 27 దేశాల్లో అందుబాటులో ఉంటుంది. డెలివరీలు నవంబర్ 7 నుంచి ప్రారంభమవుతాయి. ఇవి యాపిల్ స్టోర్లలో కూడా లభిస్తుంది. -
టెక్నో మెగాబుక్ టీ1 ల్యాప్టాప్స్ - వివరాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రానిక్స్ తయారీ దిగ్గజం చైనాకు చెందిన ట్రాన్సన్ గ్రూప్ బ్రాండ్ టెక్నో తాజాగా మెగాబుక్ టీ1 సిరీస్ ల్యాప్‌టాప్స్‌ను ప్రవేశపెట్టింది. 11వ తరం ఇంటెల్ ప్రాసెసర్స్‌తో ప్రీమియం అల్యూమినియం మెటల్ కేసింగ్‌తో రూపొందాయి. వేరియంట్‌నుబట్టి 16 జీబీ వరకు ర్యామ్, 1 టీబీ వరకు స్టోరేజ్ స్పేస్‌తో వీటిని విడుదల చేసింది. ధర రూ.37,999 నుంచి మొదలై రూ.59,999 వరకు ఉంది. 17.5 గంటల బ్యాటరీ లైఫ్, 14.8 మిల్లీ మీటర్ల మందం, 1.48 కిలోల బరువు, 2 ఎంపీ ఫిజికల్ ప్రైవసీ కెమెరా, ఫింగర్ ప్రింట్ పవర్ బటన్, 180 డిగ్రీల వ్యూయింగ్ యాంగిల్, 9 పోర్ట్స్ వంటి హంగులు ఉన్నాయి. అమెజాన్ స్పెషల్ ఉత్పాదనగా విడుదల చేశారు. -
ఐటీఐ లిమిటెడ్ కొత్త ల్యాప్‌టాప్‌లు - ప్రత్యర్థులకు గట్టి పోటీ!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికమ్యూనికేషన్స్ పరికరాల తయారీలో ఉన్న ప్రభుత్వ రంగ ఐటీఐ లిమిటెడ్ స్మాష్ బ్రాండ్ పేరుతో ల్యాప్‌టాప్‌లు, మైక్రో పర్సనల్ కంప్యూటర్ల విభాగంలోకి ప్రవేశించినట్టు ప్రకటించింది. ఇంటెల్ కార్పొరేషన్‌తో కలిసి అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలతో వీటిని తయారు చేస్తున్నట్లు వెల్లడించింది. ఇంటెల్ ఐ3, ఐ5, ఐ7 తదితర ప్రాసెసర్లతో ఉపకరణాలు రూపుదిద్దుకున్నాయని ఐటీఐ పేర్కొంది. ‘స్మాష్ ఉత్పత్తులను ఇప్పటికే మార్కెట్లో ప్రవేశపెట్టాం. ఏసర్, హెచ్‌పీ, డెల్, లెనొవో వంటి ఎంఎన్సీ బ్రాండ్స్‌తో పోటీపడి అనేక ఆర్డర్లు దక్కించుకున్నాం. 12,000 పైచిలుకు పీసీలను కస్టమర్లు వినియోగిస్తున్నారు’ అని సంస్థ సీఎండీ రాజేశ్ రాయ్ తెలిపారు. కాగా, తాజా ప్రకటన నేపథ్యంలో ఐటీఐ షేరు ధర క్రితం ముగింపుతో పోలిస్తే బీఎస్ఈలో సోమవారం 20 శాతం ఎగసి రూ.149.40 వద్ద స్థిరపడింది. -
మెరుగైన వ్యవసాయానికి కొత్త ఉత్పత్తులు - నర్చర్ రిటైల్
బెంగళూరు: బెంగళూరు కేంద్రంగా పనిచేసే బీటూబీ వ్యవసాయ ముడి సరుకుల ఈ–ప్లాట్‌ఫామ్ నర్చర్ పలు సస్యరక్షణ ఉత్పత్తులను విడుదల చేసింది. సంస్థ మొబైల్ యాప్ ద్వారానే వీటిని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది. హెర్బిసైడ్స్, ఫంగిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్, బయో స్టిమ్యులంట్స్ను యూనిక్వాట్, టర్ఫ్, లాన్సర్, ఈల్డ్విన్, మంజేట్, అమెరెక్స్, రైస్బ్యాక్, ఇమిడిస్టార్, లంబ్డా స్టార్ పేర్లతో విడుదల చేసింది. ఖరీఫ్ సీజన్లో రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని కొత్త ఉత్పత్తులు తీసుకొచ్చింది. వీటిని యూపీఎల్ ఎస్ఏఎస్ సీఈవో ఆశిష్ దోబాల్ సమక్షంలో విడుదల చేసింది. దేశంలో వ్యవసాయ ముడి సరుకులు అధిక శాతం సంప్రదాయ పంపిణీ చానళ్ల ద్వారానే సరఫరా అవుతుంటాయని, నర్చర్.రిటైల్‌తో భాగస్వామ్యం ద్వారా డిజి టల్ రూపంలో మరింత మంది కస్టమర్లను చేరుకుంటామని దోబాల్ పేర్కొన్నారు. -
మస్కిటో జాపర్ - దోమల బెడదకు గుడ్ బై.. ధర రూ. 824 మాత్రమే
కాలాలతో సంబంధం లేకుండా చీకటి పడేసరికి చాలా ఇళ్లల్లో.. దోమలు ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. వాటికి చెక్ పెట్టడానికి దోమల చక్రాలు, దోమల అగరొత్తులు, ఆల్ ఔట్స్ వంటి ప్రొడక్ట్స్ వాటడం సర్వసాధారణం. అయితే కొన్ని మొండి దోమలు కాసేపటికే ఆ మత్తు నుంచి తేరుకుని.. తమ ప్రతాపాన్ని చూపెడుతుంటాయి. అందుకే చాలా మంది దోమల బ్యాట్ అందుకుని యుద్ధం చేస్తుంటారు. (అదరగొట్టిన పోరీలు..ఇన్‌స్టాను షేక్ చేస్తున్న వీడియో చూస్తే ఫిదా!) ఈ డివైస్ ఇంట్లో ఉంటే.. బ్యాట్ తీసుకుని మూల మూలకు తిరగాల్సిన పనిలేదు. వాటంతట అవే ఆ మెషిన్ దగ్గరకు వచ్చి చటుక్కున చస్తాయి. దీని హైసింథైన్ ఎల్ఈడీ లైట్.. ఇరువైపుల నుంచి ప్రత్యేకమైన కాంతిని వెదజల్లుతూ దోమలను, కీటకాలను ట్రాప్ చేసి తనవైపు రప్పిస్తుంది. క్షణాల్లో లోపలకు లాగి.. లోపలున్న బాస్కెట్లో వేసేస్తుంది. ఇది రసాయనాలు, విషపదార్థాలు, రేడియేషన్స్ జోలికి వెళ్లదు. ఈ మెషిన్ ఆన్‌లో ఉన్నప్పుడు.. పిల్లలు, పెంపుడు జంతువులు పొరబాటున తగిలినా.. విద్యుదాఘాతం వంటి ప్రమాదాలేం జరగవు. దీన్ని ఎక్కడికైనా సులభంగా వెంట తీసుకెళ్లొచ్చు. ఇది పనిచేస్తున్నప్పుడు ఎలాంటి శబ్దం చేయదు. మరునాడు ఉదయాన్నే బాస్కెట్‌ని క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. దీని ధర 10 డాలర్లు మాత్రమే. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ. 824. (ఆకాష్ అంబానీ-శ్లోక లిటిల్ ప్రిన్సెస్ పేరు: పండితులు ఏమంటున్నారంటే?) ఇదీ చదవండి: ఒకప్పుడు రెస్టారెంట్లో పని:.. ఇప్పుడు లక్షల కోట్ల టెక్ కంపెనీ సీఈవో -
స్మార్ట్‌ఫోన్‌లో బీపీ చూసుకోవచ్చు.. ధర రూ. 10 కంటే తక్కువ
బీపీ రీడింగ్ కోసం క్లినిక్‌లకు వెళ్లక్కర్లేదు. ఇంట్లో పెద్ద పెద్ద బీపీ మానిటర్లు ఉంచుకోనక్కర్లేదు. ఈ ఫొటోలో కనిపిస్తున్న వేలికి తొడుక్కునే ఈ చిన్న క్లిప్ ఉంటే చాలు, ఇంచక్కా స్మార్ట్‌ఫోన్‌లోనే ఎప్పటికప్పుడు బీపీ రీడింగ్ ఎంతో తేలికగా తెలుసుకోవచ్చు. ‘బీపీ క్లిప్’ పేరుతో కాలిఫోర్నియా యూనివర్సిటీలోని ‘డిజిటల్ లాబ్’ శాస్త్రవేత్తలు రూపొందించిన ఈ పరికరం ద్వారా బీపీ మాత్రమే కాకుండా, రక్తంలోని ఆక్సిజన్ స్థాయి, గుండె వేగం వంటి వివరాలను కూడా చాలా ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. ఇది త్రీడీ ప్రింటర్ ద్వారా ముద్రించిన ప్లాస్టిక్ క్లిప్. ఈ క్లిప్‌ను ఒకవైపు వేలికి తొడుక్కుని, మరోవైపు స్మార్ట్‌ఫోన్ టచ్‌స్క్రీన్‌కు ఆనిస్తే చాలు, స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ మీద అన్ని వివరాలూ కనిపిస్తాయి. ఇది యాప్ ఆధారంగా పనిచేస్తుంది. ప్రస్తుతం దీనిపై అమెరికాలోను, దక్షిణ కొరియాలోను క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. ఇవి పూర్తయితే, ఈ బీపీ క్లిప్ వచ్చే ఏడాదికి మార్కెట్లో అందుబాటులోకి రానుంది. దీని తయారీ ధర కేవలం ఎనభై సెంట్లు (రూ.5.64) మాత్రమేనని చెబుతున్నారు. -
అరగంటలో ఐస్‌క్యూబ్స్.. ఎక్కడైనా & ఎప్పుడైనా!
ఐస్‌క్యూబ్స్ తయారు చేసుకోవాలంటే, డీప్ఫ్రీజర్లోని ట్రేలలో నీళ్లు నింపుకొని గంటల తరబడి వేచి చూడక తప్పదు. ఎక్కడకు వెళితే అక్కడ, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఐస్‌క్యూబ్స్ దొరకాలంటే కష్టమే! ఇళ్లలోని రిఫ్రిజరేటర్లను బయటకు తీసుకుపోలేం. ఇలాంటి ఇబ్బందులేవీ లేకుండా ఉండేందుకు అమెరికన్ కంపెనీ ‘ఫ్లెక్స్టెయిల్’ ఇటీవల పోర్టబుల్ ఐస్మేకర్ను ‘ఇవో ఐసర్’ పేరుతో మార్కెట్లోకి విడుదల చేసింది. ఇది రీచార్జబుల్ బ్యాటరీ సాయంతో పనిచేస్తుంది. దీనిని యూఎస్బీ పోర్ట్ ద్వారా చార్జింగ్ చేసుకోవచ్చు. దీని బరువు దాదాపు తొమ్మిదిన్నర కిలోలే! అంటే మిగిలిన పోర్టబుల్ రిఫ్రిజరేటర్ల కంటే చాలా తక్కువ. దీనిని ఒకసారి పూర్తిగా చార్జ్ చేసుకుంటే, మూడు గంటల వరకు పనిచేస్తుంది. ఇది కేవలం అరగంటలోనే ఐస్‌క్యూబ్స్ తయారు చేస్తుంది. దీని ధర 359 డాలర్లు (రూ.29,678) మాత్రమే! -
గాలిలోని వైరస్‌లనూ ఖతం చేస్తుంది.. ధర ఎంతంటే?
ఇటీవలి కాలంలో రకరకాల ఎయిర్ ప్యూరిఫైయర్లు అందుబాటులోకి వచ్చాయి. ఫొటోలో కనిపిస్తున్నది వాటికి పూర్తి భిన్నమైన ఎయిర్‌ప్యూరిఫైయర్. ఇది గాలిలోని దుమ్ము, ధూళితో పాటు ఫంగస్, బ్యాక్టీరియా, వైరస్ల వంటి సూక్ష్మజీవులను పూర్తిగా ఖతం చేసేస్తుంది. హాంకాంగ్‌కి చెందిన ‘హోమ్ప్యూర్’ కంపెనీ ఈ ఎయిర్ ప్యూరిఫైయర్ని రూపొందించింది. ఇది ఆరు దశలలో తన పరిసరాల్లోని గాలిని శుభ్రపరుస్తుందని, కోవిడ్ వైరస్‌లోని ఒమిక్రాన్ వేరియంట్‌ను కూడా ఇట్టే ఖతం చేసేస్తుందని తయారీదారులు చెబుతున్నారు. ఇందులోని ప్రీఫిల్టర్, ఎలక్ట్రోస్టాటిక్ ఫిల్మ్, హైప్రెషర్ ప్రాసెసర్లు సమ్మిళితంగా పనిచేస్తూ, గాలిలోని 0.1 మైక్రాన్ల పరిమాణంలోని సూక్షా్మతి సూక్ష్మమైన కణాలను కూడా తొలగిస్తాయని చెబుతున్నారు. దీని ధర 820 డాలర్లు (రూ. 67,767) మాత్రమే! -
భారత్‌లో హెచ్‌పీ నూతన ఉత్పత్తులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రపంచంలో తొలి 45 అంగుళాల సూపర్ అల్ట్రావైడ్ డ్యూయల్ క్యూహెచ్డీ కర్వ్డ్ డిస్ప్లేను టెక్నాలజీ సంస్థ హెచ్‌పీ భారత మార్కెట్లో విడుదల చేసింది. ప్రారంభ ధర రూ.1,26,631 ఉంది. అలాగే పాలీ వాయేజర్ ఫ్రీ 60 యూసీ ఇయర్‌బడ్స్, 960 4కే స్ట్రీమింగ్ వెబ్‌క్యామ్, 925 ఎర్గానమిక్ వర్టికల్ మౌస్, థండర్‌బోల్ట్ జీ4 డాక్ సైతం ప్రవేశపెట్టింది. వీటి ధరలు రూ.8,999 నుంచి ప్రారంభం. -
యాపిల్ కంపెనీ కొత్త ఉత్పత్తులు.. ఒకదాన్ని మించి మరొకటి
Apple WWDC 2023: 2023 జూన్ 5 నుంచి ప్రారంభమైన 'డబ్ల్యూడబ్ల్యూడీసీ' (వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్) మొదటి రోజే యాపిల్ సంస్థ విజన్ ప్రో, కొత్త మాక్ బుక్స్, లేటెస్ట్ ఓఎస్ అప్‌గ్రేడ్స్ వంటి వాటిని లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కొత్త ఉత్పత్తులను గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. విజన్ ప్రో యాపిల్ కంపెనీ డబ్ల్యూడబ్ల్యూడీసీలో విడుదల చేసిన విజన్ ప్రో అందరి దృష్టిని ప్రత్యేకంగా ఆకర్శించింది. సంస్థ చరిత్రలోనే మిక్స్డ్ రియాలిటీ హెడ్సెట్. దీనిని గ్లాస్ఎం కార్బన్ ఫైబర్, అల్యూమినియం మిశ్రమాలతో తయారు చేసారు. దీని ధర 3,499 డాలర్లు. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం రూ.2.88 లక్షలు. ఈ విజన్ ప్రో కర్వడ్ ఫ్రేమ్, ఫ్రెంట్ గ్లాస్, థర్మల్ వెంట్స్, ఎడమవైపు పుష్ బటన్స్ వంటి వాటిని పొందుతుంది. అంతే కాకుండా ఇందులో డ్యూయెల్ 1.41 ఇంచెస్ 4కే మైక్రో ఓఎల్ఈడీ, 23 మిలియన్ కంబైన్డ్ పిక్సెల్స్, 12 కెమెరాలు ఉన్నాయి. అయితే ఇందులో ఎలాంటి కంట్రోలర్స్, హార్డ్‌వేర్ లేవు కానీ కెమెరాలతో కళ్లు ట్రాక్ అయ్యి యాప్ ఓపెన్ అవుతుంది. విజన్ ప్రోలో ఎమ్2 చిప్, ఆర్1 కోప్రాసెసర్, 16జీబీ ర్యామ్ వంటివి ఉంటాయి. ఇంటిగ్రేటెడ్ ఆడియో డ్రైవర్స్, 6 మైక్రోఫోన్స్, 6 సెన్సార్స్, కంపాస్, యాంబియెంట్ లైట్ సెన్సార్, యాక్సలరోమీటర్, గైరోస్కోప్ వంటి సెన్సార్లు కూడా ఇందులో ఉన్నాయి. వైఫై, బ్లూటూత్, సిరి, టైప్-సీ ఛార్జర్ వంటివి కనెక్టెడ్ ఫీచర్స్ లభిస్తాయి. 15 ఇంచెస్ మాక్‌బుక్ ఎయిర్ డబ్ల్యూడబ్ల్యూడీసీ ఈవెంట్లో కంపెనీ '15 ఇంచెస్ మాక్‌బుక్ ఎయిర్'ని విడుదల చేసింది. ఇది థండర్‌బోల్ట్ పోర్ట్స్, మాగ్‌సేఫ్ ఛార్జింగ్ పోర్ట్ వంటి వాటిని పొందుతుంది. ఇది నాలుగు కలర్ ఆప్షన్స్‌లో వచ్చే వారం నుంచి అందుబటులో ఉండే అవకాశం ఉంటుంది. ఇందులోని బ్యాటరీ ప్యాకప్ వ్యవధి సుమారు 18 గంటల వరకు ఉంటుంది. (ఇదీ చదవండి: భారత్‌లో ఎక్కువ రేంజ్ అందించే టాప్ 5 ఎలక్ట్రిక్ కార్లు - ఈక్యూఎస్ 580 నుంచి ఆట్టో 3 వరకు..) అప్డేటెడ్ మాక్ స్టూడియో యాపిల్ సంస్థ 2023 డబ్ల్యూడబ్ల్యూడీసీ ఈవెంట్లో ఎం2 మ్యాక్స్, ఎం2 అల్ట్రా చిప్సెట్స్ వంటి వాటిని రిలీవ్ చేసింది. ఇప్పటికే మాక్‌బుక్ ప్రో మోడల్స్‌లో ఎం2 మ్యాక్స్ అందుబాటులో ఉంది. కొత్త మోడల్ దాని మునుపటి మోడల్ కంటే కూడా చాలా వేంగంగా పనిచేస్తుండనై కంపెనీ వెల్లడించింది. మాక్ స్టూడియో ప్రారంభ ధర భారతదేశంలో రూ. 2.99 లక్షలు కాగా, మ్యాక్ ప్రో ధర రూ. 7.29 లక్షలు. (ఇదీ చదవండి: దేశంలో మొట్టమొదటి సెల్ఫ్ డ్రైవింగ్ కారు - టెక్నాలజీలో భళా భారత్) ఐఓఎస్ 17 సంస్థ మెసేజెస్, ఫేస్‌టైమ్ యాప్స్ కోసం ఐఓఎస్ 17 లాంచ్ చేసింది. కావున ఇప్పుడు టైపోగ్రఫీతో కస్టమైజ్డ్ పోస్టర్లను తయారు చేసుకోవచ్చు. ఆటో- కరెక్ట్, డిక్టేషన్ వంటి ఫీచర్స్ మరింత మెరుగుపడ్డాయి. ఐఓఎస్ 17లో జర్నల్ అనే కొత్త యాప్ వస్తోంది. ఇందులో యూజర్లు తమకు నచ్చినవి రాసుకోవచ్చు. 2023 డబ్ల్యూడబ్ల్యూడీసీ ఈవెంట్లో ఐపాడ్ఓఎస్17, మ్యాక్ఓఎస్ సోనోమా, వాచ్ఓఎస్ 10, టీవీఓఎస్ 17 వంటి వాటిని కూడా సంస్థ పరిచయం చేసింది. -
రెక్కల్లేని ఫ్యాన్.. ధర తక్కువ & నిమిషాల్లో చల్లదనం
ఈ ఫొటోలో గది మధ్య స్తంభంలా కనిపిస్తున్నది 36 అంగుళాల టవర్ ఫ్యాన్. దీనికి రెక్కలు లేకపోయినా, దీన్ని ఆన్ చేసుకుంటే గదిలో గాలికి లోటుండదు. అమెరికాకు చెందిన బహుళజాతి సంస్థ ‘వెసింక్’కు అనుబంధ సంస్థ అయిన ‘లెవోయిట్’ ఈ స్తంభంలాంటి టవర్ ఫ్యాన్‌ను ఇటీవల విడుదల చేసింది. మిగిలిన ఫ్యాన్ల మాదిరిగానే దీనిలోనూ గాలి వేగాన్ని అదుపు చేసుకునే వెసులుబాటు ఉంది. అయితే, మామూలు ఫ్యాన్ల మాదిరిగా ఇది శబ్దం చేయదు. (ఇదీ చదవండి: సమయం ఆదా చేసే 'అల్ట్రాస్పీడ్ త్రీడీ ప్రింటర్' - ధర ఎంతంటే?) తొంభై డిగ్రీల కోసం అటూ ఇటూ తిరుగుతూ గాలిని కోరుకున్న వేగంలో ప్రసరిస్తుంది. అంతేకాదు, ఇందులో ఇంకో విశేషమూ ఉంది. ఇది ‘టెంపరేచర్ రెస్పాన్సివ్ ఫ్యాన్’. అంటే, ఈ ఫ్యాన్ గదిలోని ఉషోగ్రతకు అనుగుణంగా పనిచేస్తుంది. లోపల బాగా వేడిగా ఉంటే, ఇందులోని సెన్సర్లు ఉషోగ్రతను గుర్తించి, నిమిషాల్లోనే గదిని చల్లబరుస్తాయి. ఇది దాదాపుగా ఏసీకి ప్రత్యామ్నాయంగా పనిచేస్తుందని చెబుతున్నారు. దీని ధర 69.99 డాలర్లు (రూ. 5,743) మాత్రమే! -
పర్సనల్ కేర్ ఉత్పత్తుల్లోకి రిలయన్స్
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్లో వేగంగా విస్తరిస్తున్న రిలయన్స్ కన్జూమర్ ప్రోడక్ట్స్ (ఆర్సీపీఎల్) తాజాగా గృహ, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులను ఆవిష్కరించింది. గ్లిమర్ బ్యూటీ సోప్‌లు, ప్యూరిక్ హైజీన్ సబ్బులు, డోజో డిష్ వాష్ లిక్విడ్లు, హోమ్‌గార్డ్ టాయిలెట్.. ఫ్లోర్ క్లీనర్లు మొదలైనవి వీటిలో ఉన్నాయి. ఈ ఉత్పత్తులతో ఆయా విభాగాల్లో దిగ్గజాలైన హెచ్‌యూఎల్, పీ అండ్ జీ, రెకిట్ మొదలైన వాటితో రిలయన్స్ పోటీపడనుంది. నాణ్యమైన ఉత్పత్తులను అందుబాటు ధరల్లో అందించాలనే తమ లక్ష్యానికి అనుగుణంగా వీటిని ఆవిష్కరించినట్లు ఆర్సీపీఎల్ ప్రతినిధి తెలిపారు. -
స్మార్ట్ టీవీల విక్రయాల్లో 38 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో (జూలై–సెప్టెంబర్) స్మార్ట్ టీవీల షిప్మెంట్లు (విక్రయాలు/రవాణా) 38 శాతం పెరిగాయి. పండుగల సీజన్ కావడం, కొత్త ఉత్పత్తుల విడుదల, డిస్కౌంట్ ఆఫర్లు ఈ వృద్ధికి కలిసొచ్చినట్టు కౌంటర్ పాయింట్ రీసెర్చ్ నివేదిక తెలిపింది. ఈ నివేదిక ప్రకారం.. అంతర్జాతీయ బ్రాండ్ల స్మార్ట్ టీవీల వాటా 40 శాతంగా ఉంటే, చైనా బ్రాండ్ల వాటా 38 శాతంగా ఉంది. ఇక స్థానిక బ్రాండ్ల స్మార్ట్ టీవీల వాటా రెట్టింపై 22 శాతానికి చేరుకుంది. మొత్తం షిప్మెంట్లలో 32 నుంచి 42 అంగుళాల స్క్రీన్ టీవీల వాటా సగం మేర ఉంది. ఎల్ఈడీ డిస్ప్లేలకు వినియోగదారులు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఓఎల్ఈడీ, క్యూఎల్ఈడీ వంటి అత్యాధునిక టెక్నాలజీ స్క్రీన్లు సైతం క్రమంగా వాటా పెంచుకుంటున్నాయి. ఇప్పుడు ఎక్కువ కంపెనీలు క్యూఎల్ఈడీ స్క్రీన్లతో విడుదలకు ఆసక్తి చూపిస్తున్నాయి. స్క్రీన్ తర్వాత కస్టమర్లు ఆడియోకు ప్రాధాన్యం ఇస్తుండడంతో డాల్బీ ఆడియో ఫీచర్‌తో విడుదల చేస్తున్నాయి. స్మార్ట్ టీవీల విక్రయాలు మొత్తం టీవీల్లో 93 శాతానికి చేరాయి. రూ.20వేల లోపు బడ్జెట్లో టీవీల విడుదలతో ఈ వాటా మరింత పెరుగుతుందని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ నివేదిక అంచనా వేసింది. సెప్టెంబర్ త్రైమాసికంలో ఆన్లైన్ చానళ్ల ద్వారా విక్రయాలు 35 శాతం పెరిగాయి. అన్ని ఈ కామర్స్ సంస్థలు పండుగల సీజన్లో ఆఫర్లను ఇవ్వడం ఇందుకు దోహదం చేసినట్టు ఈ నివేదిక ప్రస్తావించింది. మొదటి స్థానంలో షావోమీ షావోమీ స్మార్ట్ టీవీ మార్కెట్లో 11 శాతం వాటాతో మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత శామ్ సంగ్ 10 శాతం, ఎల్జీ 9 శాతం వాటాతో ఉన్నాయి. వన్ ప్లస్ వార్షికంగా చూస్తే 89 శాతం వృద్ధితో తన మార్కెట్ వాటాను 8.5 శాతానికి పెంచుకుంది. దేశీ బ్రాండ్ వూ వాటా సెప్టెంబర్ క్వార్టర్లో రెట్టింపైంది. ఎంతో పోటీ ఉన్న స్మార్ట్ టీవీ మార్కెట్లోకి మరిన్ని భారత బ్రాండ్లు ప్రవేశిస్తున్నట్టు ఈ నివేదిక ప్రస్తావించింది. సెప్టెంబర్ క్వార్టర్లో వన్ ప్లస్, వూ, టీసీఎల్ బ్రాండ్లు స్మార్ట్ టీవీ మార్కె ట్లో వేగవంతమైన వృద్ధిని చూపించాయి. -
మెటాకు భారత మార్కెట్ కీలకం
కోల్‌కతా: భారత మార్కెట్ మెటా ప్లాట్‌ఫామ్స్‌కు కీలకమైనదిగా ఉంటోందని కంపెనీ తెలిపింది. గ్రూప్‌లో భాగమైన ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్, వాట్సాప్ ప్లాట్‌ఫామ్‌లలో కొత్త ఫీచర్లను ప్రయోగాత్మకంగా పరీక్షించేందుకు వేదికగా మారిందని పేర్కొంది. అలాగే లక్షల కొద్దీ క్రియేటర్లు, అసంఖ్యాక బ్రాండ్లు తమ సృజనాత్మకను ప్రదర్శించడానికి, ఆడియెన్స్‌కు మరింత చేరువ కావడానికి మెటా ద్వారా మంచి అవకాశాలు లభిస్తున్నాయని ఫేస్బుక్ ఇండియా (మెటా) డైరెక్టర్ మనీష్ చోప్రా తెలిపారు. ‘వివిధ కోణాల్లో మా ప్లాట్‌ఫామ్‌లకు భారత్ చాలా కీలక మార్కెట్. పలు కొత్త ఉత్పత్తులు, ఫీచర్లను పరీక్షించి తెలుసుకునేందుకు ప్రధాన మార్కెట్‌గా ఉంటోంది‘ అని మెటా వార్షిక ’క్రియేటర్ డే’ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన వివరించారు. రెండేళ్ల క్రితం ఆవిష్కరించిన ’రీల్స్’ (పొట్టి ఫార్మాట్ వీడియోలు) భారత్‌లో గణనీయంగా ప్రాచుర్యం పొందాయని చెప్పారు. ఒక అధ్యయన నివేదిక ప్రకారం దాదాపు 20 కోట్ల మంది ప్రజలు రోజుకు 45 నిమిషాల పాటు రీల్స్‌పై వెచ్చిస్తున్నారని, ఇది 60 కోట్లకు చేరుకోగలదని చోప్రా తెలిపారు. టీ20 వరల్డ్ కప్ క్రికెట్ హైలైట్స్‌ను చూపేందుకు ఇటీవలే ఐసీసీతో కూడా భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నట్లు వివరించారు. మెటా ప్లాట్‌ఫ్లామ్స్ ద్వారా నకిలీ ప్రొఫైల్స్, తప్పుడు సమాచారం వ్యాప్తి కాకుండా నిరంతరం చర్యలు తీసుకుంటూనే ఉన్నామని ఆయన వివరించారు. -
కొత్త ప్రోడక్ట్ ను లాంఛనంగా ప్రారంభించిన రాధా TMT
-
మార్కెట్లోకి ఎల్జీ కొత్త ఉత్పత్తుల శ్రేణి
న్యూఢిల్లీ: కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఎల్జీ ఇండియా తాజాగా 2022కి సంబంధించి కొత్త ఉత్పత్తుల శ్రేణిని ఆవిష్కరించింది. రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, మైక్రోవేవ్ ఒవెన్లు, ఏసీలు మొదలైన వాటికి సంబంధించి 270 పైగా మోడల్స్‌ను ప్రవేశపెట్టింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో రూపొందించిన స్మార్ట్ గృహోపకరణాలు వీటిలో ఉన్నాయి. ఏఐ డైరెక్ట్ డ్రైవ్ వాషింగ్ మెషీన్లు, ఇన్‌స్టావ్యూ ఫ్రిజ్‌లు, ప్యూరికేర్ వేరబుల్ ఎయిర్ ప్యూరిఫయర్, విరాట్ ఏసీలు మొదలైనవి వినియోగదారులకు మరింత సౌకర్యవంతంగా ఉంటాయని సంస్థ డైరెక్టర్ (హోమ్ అప్లయెన్స్, ఎయిర్ కండీషనర్స్) హ్యూంగ్ సుబ్జీ తెలిపారు. ఈ ఏడాది 2022లో 30 శాతం వృద్ధి సాధించగలమని అంచనా వేస్తున్నట్లు సంస్థ వర్గాలు తెలిపాయి. పటిష్ట డిమాండ్, కొత్త ప్రొడక్టుల విడుదల నేపథ్యంలో హోమ్ అప్లయెన్సెస్, ఏసీ బిజినెస్ వేగవంత పురోగతిని సాధించే వీలున్నట్లు పేర్కొంది. గతేడాది (2021) ఈ విభాగాలలో 20% వృద్ధిని సాధించినట్లు తెలియజేసింది. దేశీయంగా అమ్మకాలలో 70% వాటా ఈ విభాగానిదేనని ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా వైస్‌ప్రెసిడెంట్ దీపక్ బన్సల్ పేర్కొన్నారు. 2021లో ఈ విభాగం అమ్మకాలు రూ. 15,000 కోట్లుగా నమోదైనట్లు వెల్లడించారు. -
కొత్త ఉత్పత్తులతో దూసుకొచ్చిన ఆపిల్
సాక్షి, న్యూఢిల్లీ: మార్కెట్లోకి స్మార్ట్ఫోన్లు ఎన్ని ఉన్నా ఆపిల్, శాంసంగ్, గూగుల్ ఫోన్లకు ఉన్న హవానే వేరు. ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకుంటున్న ఈ దిగ్గజ కంపెనీలు నువ్వా నేనా అన్నట్టుగా లాంచ్ ఈవెంట్స్‌కు సిద్దమయ్యాయి. పోటీ మార్కెట్లో తమ ఉత్పత్తులతో మార్కెట్లను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వరుసగా లాంచ్ ఈవెంట్లతో స్మార్ట్‌ఫోన్ లవర్స్‌ను ఎట్రాక్ట్ చేస్తున్నాయి. ఈ సమరంలో ఆపిల్ సరికొత్త ఆవిష్కరణలతో ముందు వరుసలో నిలిచింది. ప్రపంచ స్మార్ట్ ఫోన్ మార్కెట్లలో తిరిగి రెండోస్థానాన్ని కైవసం చేసుకున్న ఆపిల్ ఈ ఉత్సాహంలో మరింత దూకుడు మీద ఉంది. ‘అన్ లీష్డ్’ పేరుతో సోమవారం నిర్వహించిన స్పెషల్ ఈవెంట్లో ఆపిల్ మాక్‌బుక్ ప్రో, థర్డ్ జనరేషన్ ఎయిర్‌పాడ్స్, హోమ్‌ప్యాడ్ మినీతో సహా అనేక ఉత్పత్తులను లాంచ్ చేసింది. 3.3 రెట్ల వేగవంతమైన హై ఎండ్ పీసీ ఎం1 మాక్స్ చిప్నుకూడా తీసుకొచ్చింది.సరికొత్త ఫీచర్లతో కొత్త మ్యాక్‌బుక్ ప్రో, ఆపిల్నోట్బుక్ 22, 6 స్పీకర్ సిస్టమ్‌తో 16.2-అంగుళాల మాక్‌బుక్ ప్రో లాంటి పొడక్ట్స్ను తీసుకొచ్చింది. కొత్త మ్యాక్‌బుక్ ప్రో మోడల్స్ అధికారిక ఆపిల్ ఇండియా ఆన్లైన్ స్టోర్‌లో ఈ రోజునుంచే ఆర్డర్ చేయడానికి అందుబాటులో ఉన్నాయి. అక్టోబర్ 26 నుండి స్టోర్లలో లభ్యం. 14 అంగుళాల కొత్త మాక్‌బుక్ ప్రో మోడల్ రూ .1,94,900, విద్యార్థులకు రూ .1,75,410 వద్ద ప్రారంభం.. 16 అంగుళాల మాక్‌బుక్ ప్రో మోడల్ ధర రూ .2,39,900, విద్యార్థులకు రూ .2,15,910. అలాగే మాక్ ఐవోఎస్ మాంటెరీ ఉచిత సాఫ్ట్వేర్ అప్డేట్ అక్టోబర్ 25 సోమవారం నుంచి అందుబాటులో ఉంటుంది. 6 గంటల నాన్‌స్టాప్‌తో కొత్త ఎయిర్‌పాడ్స్‌ను అప్‌డేట్‌చేసింది ఆపిల్. చెవులకు మరింత సౌకర్యవంతంగా ఉండేలా చిన్నగా, గట్టి ప్లాస్టిక్‌తో వైర్లెస్ ఇయర్ బడ్స్‌ను తీసుకొచ్చింది. వాటి ధర దాదాపు రూ. 13,500గా ఉండనున్నాయి. కొత్త రంగుల్లో అంటే యల్లో, ఆరెంజ్, బ్లూ కలర్స్‌లో, సిరి వాయస్ సపోర్ట్‌తో ఆపిల్ హోమ్‌ప్యాడ్ మినీ స్పీకర్స్‌ను కలర్ఫుల్గా లాంచ్ చేసింది. మొత్తం 5 కలర్ ఆప్షన్లు ఇందులో అందుబాటులో ఉంటాయి. ధరలో ఎలాంటి మార్పు చేయలేదు. సుమారు 7500 రూపాయలకే ఇవి అందుబాటులో ఉంటాయి. -
త్రీ డేస్ బ్రాండ్ డేస్
స్టార్స్‌కు సినిమాలతో పాటు బ్రాండ్ అడ్వటైజ్మెంట్లు కీలకం. తరచూ ఏదో ఒక ఉత్పత్తిని ప్రమోట్ చేస్తూ టీవీల్లోనో, హోర్డింగ్స్లోనో కనిపిస్తూనే ఉంటారు. సూపర్ స్టార్స్‌కి అయితే ఈ డీల్స్ చాలా ఎక్కువ. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్ కూడా చాలా ఉత్పత్తులను ప్రమోట్ చేస్తూ ఉంటారు. ఈ లాక్‌డౌన్‌లోనూ కొన్ని కొత్త ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారారామె. అయితే లాక్డౌన్ కారణంగా ఈ యాడ్ల చిత్రీకరణ నిలిచిపోయింది. ఆగిపోయిన యాడ్ షూటింగ్స్ అన్నీ ఆగకుండా పూర్తి చేయాలని ‘త్రీ డేస్ – బ్రాండ్ డేస్’ ప్లాన్ చేశారామె. ఈ వారంలో ఓ మూడు రోజుల పాటు యాడ్ షూటింగ్స్‌కే కేటాయించారట. ఈ మూడు రోజులూ నిర్విరామంగా షూటింగ్స్ చేస్తుంటారట దీపిక. ఈ యాడ్స్ చిత్రీకరణ పూర్తయిన తర్వాత తన తదుపరి సినిమా చిత్రీకరణ కోసం గోవా ప్రయాణమవ్వనున్నారు దీపికా పదుకోన్. -
రెడ్డీస్ నుంచి ఐదేళ్లలో 70 ఔషధాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ వచ్చే ఐదేళ్లలో చైనా, హాంకాంగ్, జపాన్, తైవాన్ వంటి తూర్పు ఆసియా దేశాల్లో 70కి పైగా ఔషధాలను విడుదల చేయాలని లకి‡్ష్యంచింది. ఇప్పటికే ఆయా ఉత్పత్తుల్లో కొన్ని మందుల తయారీని స్థానిక పార్టనర్స్‌కు ఔట్ సోర్సింగ్ కూడా చేసింది. ప్రస్తుతం చైనా మార్కెట్లలో 8–10 ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయని, వాటన్నిటికీ సంబంధించి కుష్నన్ రొట్టం రెడ్డి ఫార్మాసూటికల్స్‌తో (కేఆర్ఆర్పీ) భాగస్వామ్యం ఉందని డాక్టర్ రెడ్డీస్ ప్రతినిధి తెలియజేశారు. షిజోఫ్రినియా, బైపోలార్ వంటి మానసిక పరిస్థితుల చికిత్సలో ఉపయోగించే ఓలాన్జాపైన్ ఔషధాన్ని 2020 నుంచి చైనాలో ప్రారంభిస్తామని చెప్పారాయన. -
మార్కెట్లోకి ‘షావోమీ’ నూతన ఉత్పత్తులు
న్యూఢిల్లీ: చైనాకు చెందిన ఎలక్ట్రానిక్స్ దిగ్గజం షావోమీ తాజాగా భారత మార్కెట్లోకి తన అధునాతన ఉత్పత్తులను ప్రవేశపెట్టింది. మొత్తం నాలుగు నూతన ఉత్పత్తులను మంగళవారం విడుదలచేసింది. ‘ఎంఐ టీవీ 4ఎక్స్’ పేరుతో టీవీ సిరీస్‌ను ప్రవేశపెట్టగా.. వీటిలో 65 అంగుళాల టీవీ భారత్‌లోనే ఇప్పటివరకు అతిపెద్ద టీవీగా రికార్డు తిరగరాసింది. దీని ధర రూ. 64,999 కాగా, కార్టెక్స్ ఏ55 ప్రాసెసర్‌తో ఇది లభ్యమవుతున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఎంఐ టీవీ 4ఎక్స్ 50 అంగుళాల టీవీ ధర రూ.29,999 (అమెజాన్‌లో లభ్యం), 43 అంగుళాల టీవీ ధర రూ. 24,999 (ఫ్లిప్‌కార్ట్‌లో లభ్యం)గా నిర్ణయించింది. ఇక 40 అంగుళాల పూర్తి హెచ్డీ టీవీ ధర రూ. 17,999. అన్ని సైజుల టీవీలు సెపె్టంబర్ 29 నుంచి వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయని వివరించింది. ‘ఎంఐ వాటర్ ప్యూరిఫయర్’ విడుదల ఎఫ్‌డీఏ ఆమోదించిన ముడిపదార్ధాలతో ఉత్పత్తి చేసిన ‘ఎంఐ వాటర్ ప్యూరిఫయర్’ను షావోమీ ప్రవేశపెట్టింది. అత్యంత చిన్న సైజులో ఉండే ఈ ప్యూరిఫయర్‌లో 7–లీటర్ల ట్యాంక్ ఉంది. దీని ధర రూ. 11,999. ‘ఎంఐ బ్యాండ్ 4’ పేరుతో 0.95 అంగుళాల డిస్ప్లే ప్యానెల్ కలిగిన వాచ్‌ను విదుదలచేసింది. ‘ఎంఐ మోషన్ యాక్టివేటెడ్ నైట్ లైట్ 2’ను ఇక్కడి మార్కెట్లోకి తీసుకొచి్చంది.