త్రీ డేస్‌ బ్రాండ్‌ డేస్‌ | Deepika Padukone to spend 3 days and complete brand shootings | Sakshi
Sakshi News home page

త్రీ డేస్‌ బ్రాండ్‌ డేస్‌

Published Tue, Sep 8 2020 2:21 AM | Last Updated on Tue, Sep 8 2020 2:21 AM

Deepika Padukone to spend 3 days and complete brand shootings - Sakshi

స్టార్స్‌కు సినిమాలతో పాటు బ్రాండ్‌ అడ్వటైజ్‌మెంట్లు కీలకం. తరచూ ఏదో ఒక ఉత్పత్తిని ప్రమోట్‌ చేస్తూ టీవీల్లోనో, హోర్డింగ్స్‌లోనో కనిపిస్తూనే ఉంటారు. సూపర్‌ స్టార్స్‌కి అయితే ఈ డీల్స్‌ చాలా  ఎక్కువ. బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకోన్‌ కూడా చాలా ఉత్పత్తులను ప్రమోట్‌ చేస్తూ ఉంటారు. ఈ లాక్‌డౌన్‌లోనూ కొన్ని కొత్త ఉత్పత్తులకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారారామె.

  అయితే లాక్‌డౌన్‌ కారణంగా ఈ యాడ్‌ల చిత్రీకరణ నిలిచిపోయింది. ఆగిపోయిన యాడ్‌ షూటింగ్స్‌ అన్నీ ఆగకుండా పూర్తి చేయాలని ‘త్రీ డేస్‌ – బ్రాండ్‌ డేస్‌’ ప్లాన్‌ చేశారామె. ఈ వారంలో ఓ మూడు రోజుల పాటు యాడ్‌ షూటింగ్స్‌కే కేటాయించారట. ఈ మూడు రోజులూ  నిర్విరామంగా షూటింగ్స్‌ చేస్తుంటారట దీపిక. ఈ యాడ్స్‌ చిత్రీకరణ పూర్తయిన తర్వాత తన తదుపరి సినిమా చిత్రీకరణ కోసం గోవా ప్రయాణమవ్వనున్నారు దీపికా పదుకోన్‌.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement