ఈ ఫొటోలో గది మధ్య స్తంభంలా కనిపిస్తున్నది 36 అంగుళాల టవర్ ఫ్యాన్. దీనికి రెక్కలు లేకపోయినా, దీన్ని ఆన్ చేసుకుంటే గదిలో గాలికి లోటుండదు. అమెరికాకు చెందిన బహుళజాతి సంస్థ ‘వెసింక్’కు అనుబంధ సంస్థ అయిన ‘లెవోయిట్’ ఈ స్తంభంలాంటి టవర్ ఫ్యాన్‌ను ఇటీవల విడుదల చేసింది. మిగిలిన ఫ్యాన్ల మాదిరిగానే దీనిలోనూ గాలి వేగాన్ని అదుపు చేసుకునే వెసులుబాటు ఉంది. అయితే, మామూలు ఫ్యాన్ల మాదిరిగా ఇది శబ్దం చేయదు.
(ఇదీ చదవండి: సమయం ఆదా చేసే 'అల్ట్రాస్పీడ్ త్రీడీ ప్రింటర్' - ధర ఎంతంటే?)
తొంభై డిగ్రీల కోసం అటూ ఇటూ తిరుగుతూ గాలిని కోరుకున్న వేగంలో ప్రసరిస్తుంది. అంతేకాదు, ఇందులో ఇంకో విశేషమూ ఉంది. ఇది ‘టెంపరేచర్ రెస్పాన్సివ్ ఫ్యాన్’. అంటే, ఈ ఫ్యాన్ గదిలోని ఉషోగ్రతకు అనుగుణంగా పనిచేస్తుంది. లోపల బాగా వేడిగా ఉంటే, ఇందులోని సెన్సర్లు ఉషోగ్రతను గుర్తించి, నిమిషాల్లోనే గదిని చల్లబరుస్తాయి. ఇది దాదాపుగా ఏసీకి ప్రత్యామ్నాయంగా పనిచేస్తుందని చెబుతున్నారు. దీని ధర 69.99 డాలర్లు (రూ. 5,743) మాత్రమే!
Comments
Please login to add a commentAdd a comment