హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికమ్యూనికేషన్స్ పరికరాల తయారీలో ఉన్న ప్రభుత్వ రంగ ఐటీఐ లిమిటెడ్ స్మాష్ బ్రాండ్ పేరుతో ల్యాప్‌టాప్‌లు, మైక్రో పర్సనల్ కంప్యూటర్ల విభాగంలోకి ప్రవేశించినట్టు ప్రకటించింది.
ఇంటెల్ కార్పొరేషన్‌తో కలిసి అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలతో వీటిని తయారు చేస్తున్నట్లు వెల్లడించింది. ఇంటెల్ ఐ3, ఐ5, ఐ7 తదితర ప్రాసెసర్లతో ఉపకరణాలు రూపుదిద్దుకున్నాయని ఐటీఐ పేర్కొంది. ‘స్మాష్ ఉత్పత్తులను ఇప్పటికే మార్కెట్లో ప్రవేశపెట్టాం.
ఏసర్, హెచ్‌పీ, డెల్, లెనొవో వంటి ఎంఎన్‌సీ బ్రాండ్స్‌తో పోటీపడి అనేక ఆర్డర్లు దక్కించుకున్నాం. 12,000 పైచిలుకు పీసీలను కస్టమర్లు వినియోగిస్తున్నారు’ అని సంస్థ సీఎండీ రాజేశ్ రాయ్ తెలిపారు. కాగా, తాజా ప్రకటన నేపథ్యంలో ఐటీఐ షేరు ధర క్రితం ముగింపుతో పోలిస్తే బీఎస్‌ఈలో సోమవారం 20 శాతం ఎగసి రూ.149.40 వద్ద స్థిరపడింది.
Comments
Please login to add a commentAdd a comment