భారత్‌లో కొత్త 'మ్యాక్‌బుక్ ప్రో, ఐమ్యాక్' లాంచ్ - ధరలు, వివరాలు | Apple Launches New MacBook Pro Laptops And iMac In India | Sakshi
Sakshi News home page

భారత్‌లో కొత్త 'మ్యాక్‌బుక్ ప్రో, ఐమ్యాక్' లాంచ్ - ధరలు, వివరాలు

Published Tue, Oct 31 2023 2:13 PM | Last Updated on Tue, Oct 31 2023 2:22 PM

Apple Launches New MacBook Pro Laptops And iMac In India - Sakshi

ప్రపంచ మార్కెట్లో యాపిల్ ఉత్పత్తులకు భారీ డిమాండ్ ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని సంస్థ ఎప్పటికప్పుడు వినియోగదారుల కోసం కొత్త ఉత్పత్తులను పరిచయం చేస్తోంది. ఇందులో భాగంగా తాజాగా మ్యాక్‌బుక్  ప్రో, ఐ మ్యాక్ ఆవిష్కరించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

మ్యాక్‌బుక్ ప్రో ఎమ్3 ధరలు
యాపిల్ మ్యాక్‌బుక్ ఎమ్3, ఎమ్3 ప్రో, ఎమ్3 ప్రో మ్యాక్స్ అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. ధరలు సైజ్, ర్యామ్ వంటి వాటిని మీద ఆధారపడి ఉంటాయి.

  • మ్యాక్‌బుక్ ప్రో ఎమ్3 ప్రారంభ ధర రూ. 1,69,900
  • 14 ఇంచెస్ ఎమ్3 ప్రో ప్రారంభ ధర రూ. 1,99,900
  • 16 ఇంచెస్ మ్యాక్‌బుక్ ప్రో ప్రారంభ ధర రూ. 2,49,900

ఈ కొత్త యాపిల్ మ్యాక్‌బుక్ ప్రో కొనుగోలు చేయాలనుకునే వారు యాపిల్ స్టోర్లలో లేదా యాపిల్ స్టోర్ యాప్‌లో ఆర్డర్ చేసుకోవచ్చు. డెలివరీలు నవంబర్ 7 నుంచి ప్రారంభమవుతాయి.

ఐమ్యాక్ ధరలు
యాపిల్ 8-కోర్ GPU కలిగిన iMac ధర రూ.1,34,900. ఇది గ్రీన్, పింక్, బ్లూ, సిల్వర్ కలర్లలో లభిస్తుంది. ఇది 8-కోర్ CPU, 8GB మెమరీ, 256GB SSD, రెండు థండర్‌బోల్ట్ పోర్ట్‌ వంటి ఫీచర్లతో మ్యాజిక్ కీబోర్డ్ అండ్ మ్యాజిక్ మౌస్‌తో వస్తుంది.

ఇదీ చదవండి: 81.5 కోట్ల భారతీయుల ఆధార్ వివరాలు లీక్ - అమ్మడానికి సిద్దమైన హ్యాకర్!

ఐమ్యాక్ కొనుగోలు చేయాలనుకువారు యాపిల్ ఆన్‌లైన్ స్టోర్‌లో ఆర్డర్ చేసుకోవచ్చు. ఇది ప్రపంచ వ్యాప్తంగా 27 దేశాల్లో అందుబాటులో ఉంటుంది. డెలివరీలు నవంబర్ 7 నుంచి ప్రారంభమవుతాయి. ఇవి యాపిల్ స్టోర్లలో కూడా లభిస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement