MacBook Pro
-
భారత్‌లో కొత్త 'మ్యాక్‌బుక్ ప్రో, ఐమ్యాక్' లాంచ్ - ధరలు, వివరాలు
ప్రపంచ మార్కెట్లో యాపిల్ ఉత్పత్తులకు భారీ డిమాండ్ ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని సంస్థ ఎప్పటికప్పుడు వినియోగదారుల కోసం కొత్త ఉత్పత్తులను పరిచయం చేస్తోంది. ఇందులో భాగంగా తాజాగా మ్యాక్‌బుక్ ప్రో, ఐ మ్యాక్ ఆవిష్కరించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. మ్యాక్‌బుక్ ప్రో ఎమ్3 ధరలు యాపిల్ మ్యాక్‌బుక్ ఎమ్3, ఎమ్3 ప్రో, ఎమ్3 ప్రో మ్యాక్స్ అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. ధరలు సైజ్, ర్యామ్ వంటి వాటిని మీద ఆధారపడి ఉంటాయి. మ్యాక్‌బుక్ ప్రో ఎమ్3 ప్రారంభ ధర రూ. 1,69,900 14 ఇంచెస్ ఎమ్3 ప్రో ప్రారంభ ధర రూ. 1,99,900 16 ఇంచెస్ మ్యాక్‌బుక్ ప్రో ప్రారంభ ధర రూ. 2,49,900 ఈ కొత్త యాపిల్ మ్యాక్‌బుక్ ప్రో కొనుగోలు చేయాలనుకునే వారు యాపిల్ స్టోర్లలో లేదా యాపిల్ స్టోర్ యాప్‌లో ఆర్డర్ చేసుకోవచ్చు. డెలివరీలు నవంబర్ 7 నుంచి ప్రారంభమవుతాయి. ఐమ్యాక్ ధరలు యాపిల్ 8-కోర్ GPU కలిగిన iMac ధర రూ.1,34,900. ఇది గ్రీన్, పింక్, బ్లూ, సిల్వర్ కలర్లలో లభిస్తుంది. ఇది 8-కోర్ CPU, 8GB మెమరీ, 256GB SSD, రెండు థండర్‌బోల్ట్ పోర్ట్ వంటి ఫీచర్లతో మ్యాజిక్ కీబోర్డ్ అండ్ మ్యాజిక్ మౌస్తో వస్తుంది. ఇదీ చదవండి: 81.5 కోట్ల భారతీయుల ఆధార్ వివరాలు లీక్ - అమ్మడానికి సిద్దమైన హ్యాకర్! ఐమ్యాక్ కొనుగోలు చేయాలనుకువారు యాపిల్ ఆన్లైన్ స్టోర్‌లో ఆర్డర్ చేసుకోవచ్చు. ఇది ప్రపంచ వ్యాప్తంగా 27 దేశాల్లో అందుబాటులో ఉంటుంది. డెలివరీలు నవంబర్ 7 నుంచి ప్రారంభమవుతాయి. ఇవి యాపిల్ స్టోర్లలో కూడా లభిస్తుంది. -
విమానాల్లో ‘యాపిల్ మాక్‌బుక్ ప్రో’ తేవద్దు
న్యూఢిల్లీ: విమాన ప్రయాణం చేసే ప్రయాణికులు యాపిల్ మాక్‌బుక్ ప్రో 15 అంగుళాల మోడల్ ల్యాప్‌టాప్‌ను తీసుకురావద్దని విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ ప్రయాణికులను కోరింది. ఆ మోడల్లోని కొన్ని ల్యాప్‌టాప్‌ల బ్యాటరీలు అధికంగా వేడికి గురవుతున్నాయని, ప్రయాణికుల భద్రత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. ఇదే విషయమే జూన్ 20వ తేదీన యాపిల్ సంస్థ సైతం తమ వెబ్సైట్లో ఈ మోడల్ ల్యాప్‌టాప్‌లకు సంబంధించి ఓ హెచ్చరిక నోటీసును అందుబాటులో ఉంచింది. దీని ప్రకారం సెప్టెంబర్–2015 నుంచి ఫిబ్రవరి 2017 మధ్య కాలంలో విక్రయించిన ల్యాప్‌టాప్‌ల్లో బ్యాటరీ అధిక వేడికి గురవుతుందని పేర్కొంది. అలాగే ఈ ల్యాప్‌టాప్‌ల్లో బ్యాటరీలను ఉచితంగానే మార్పు చేయాలని నిర్ణయించామని యాపిల్ సంస్థ తెలిపింది. బ్యాటరీని మార్పు చేసుకునే వరకు ప్రయాణికులు ఆ మోడల్ ల్యాప్‌టాప్‌లను తీసుకోరావద్దని డీజేసీఏ చీఫ్ అరుణ్ కుమార్ ట్వీట్ చేశారు. -
ఆపిల్ మాక్‌బుక్ ప్రో బ్యాటరీ పేలుతుంది..!
శాన్ఫ్రాన్సిస్కో : సాఫ్ట్వేర్ దిగ్గజ సంస్థ ఆపిల్ ఇటీవల విడుదల చేసిన మాక్‌బుక్ ప్రో డివైస్‌లు పేలుతున్నాయిట. ఈ నేపథ్యంలోనే మాక్‌బుక్ ప్రో యూనిట్లను ఆపిల్ కంపెనీ భారీగా రీకాల్ చేస్తోంది. 15 అంగుళాల మాక్‌బుక్ ప్రో బ్యాటరీ ఓవర్ హీట్ అయ్యి ప్రమాదానికి గురుకావచ్చనే ఆందోళనతో వాటిని రీకాల్ చేస్తోంది. ఈ మేరకు వినియోగదారులకు హెచ్చరికలు జారీ చేసింది. ప్రభావితమైన 15 అంగుళాల మాక్‌బుక్ ప్రో యూనిట్లను ఉపయోగించడం మానేయాలని ఆపిల్ వినియోగదారులను కోరింది. అలాగే వీటి బ్యాటరీని ఉచితంగా రీప్లేస్ చేసుకోవచ్చని గురువారం ఒక ప్రకటనలో తెలిపింది రెటినా డిస్ప్లే ఉన్న 15-అంగుళాల మాక్‌బుక్ ప్రో యూనిట్లు, ప్రధానంగా సెప్టెంబర్ 2015- ఫిబ్రవరి 2017 మధ్య అమ్ముడైనవి ప్రమాదానికి గురయ్యే అవకాశం వుందని హెచ్చరించింది. బ్యాటరీ రీప్లేస్మెంట్ వివరాల కోసం ‘ఆపిల్.కామ్/సపోర్ట్ /15-ఇంచ్-మ్యాక్‌బుక్-ప్రో-బ్యాటరీ-రికాల్ ’ సంప్రదించవచ్చని ప్రకటించింది. -
ఆపిల్ ఫ్రీగా బ్యాటరీ రిప్లేస్మెంట్
బ్యాటరీ ఫెయిల్యూర్ సమస్యలతో టెక్ దిగ్గజం ఆపిల్ సైతం సతమతమవుతోంది. ఇటీవల ఐఫోన్ ఫోన్ల బ్యాటరీని స్లో చేస్తుందంటూ ఆరోపణలు వెల్లువెత్తగా.. తాజాగా మ్యాక్‌బుక్ ప్రొ డివైజ్‌ల బ్యాటరీల్లో కూడా సమస్యలు వచ్చినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో మ్యాక్‌బుక్ ప్రొల బ్యాటరీలను ఉచితంగా రీప్లేస్ చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ రీప్లేస్‌మెంట్‌ను ఆపిల్ చేపడుతోంది. టచ్ బార్స్ లేని కొన్ని 13 అంగుళాల మ్యాక్‌బుక్ ప్రొల్లో పొరపాటును గుర్తించినట్టు ఆపిల్ తెలిపింది. 2016 అక్టోబర్ నుంచి 2017 అక్టోబర్ మధ్యలో తయారు చేసిన యూనిట్లు బ్యాటరీ సమస్యల బారిన పడ్డాయని ఆపిల్ తన సపోర్టు పేజీలో పేర్కొంది. కానీ ఎన్ని మ్యాక్బుక్లు దీని బారిన పడ్డాయో తెలుపలేదు. కొత్త బ్యాటరీలను వాటిలో రీప్లేస్ చేస్తామని, వాటిని ఉచితంగా అందించనున్నట్టు తెలిపింది. యూజర్లు తమ మ్యాక్‌బుక్ సీరియల్ నెంబర్‌ను సపోర్టు పేజీలో నమోదు చేస్తే, తమ యూనిట్ రీప్లేస్ చేసుకోవాలో లేదో తెలుస్తుంది. ఒకవేళ తమ ల్యాప్‌టాప్‌లు బ్యాటరీ సమస్య బారిన పడినట్టు తెలిస్తే, వెంటనే ఆపిల్ రిఫైర్ సెంటర్, ఆపిల్ రిటైల్ స్టోర్, ఆపిల్ అధికారిక సర్వీసు ప్రొవైడర్‌ను ఆశ్రయించాలని సూచించింది. ఇప్పటికే బ్యాటరీ రీప్లేస్మెంట్ కోసం డబ్బులు కట్టిన వారికి, ఈ నగదును కంపెనీ తిరిగి రీఫండ్ చేయనుంది. అయితే టచ్‌బార్‌తో ఉన్న మ్యాక్‌బుక్ ప్రొలు, 13 అంగుళాల పాత మ్యాక్‌బుక్ ప్రొ మోడల్స్ దీని బారిని పడలేదు. అంతకముందు ఐఫోన్ 6, ఐఫోన్ 6ఎస్, ఐఫోన్ ఎస్ఈ మోడల్స్ బ్యాటరీలను ఆపిల్ స్లో చేసిందని తెలువడంతో, ఆ విషయంపై కంపెనీ క్షమాపణ చెప్పింది. వెంటనే వాటి బ్యాటరీల రిప్లేస్మెంట్లను అత్యంత తక్కువ ధరకు చేపట్టింది. -
ఆపిల్ ఉత్పత్తులపై పేటీఎం భారీ ఆఫర్లు
డిజిటల్ లావాదేవీల్లో ఫుల్ పాపులర్ అయిన పేటీఎం, ఐఫోన్, మ్యాక్ బుక్ మోడల్స్ లాంటి ఆపిల్ ఉత్పత్తులపై భారీ ఆఫర్లు ప్రకటించింది. ది గ్రేట్ ఆపిల్ సేల్ ప్రారంభించింది. ఫిబ్రవరి 14 నుంచి ఫిబ్రవరి 16 వరకు పేటీఎం నిర్వహించే ఈ సేల్ లో మ్యాక్ బుక్ కొనుగోలుచేసిన వారికి రూ.20వేల వరకు క్యాష్ బ్యాక్ ఇవ్వనున్నట్టు తెలిపింది. అయితే వీటిలో ఎంపికచేసిన వాటికే ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్ వర్తించనుంది. ప్రస్తుతం 15 అంగుళాలు కలిగిన ఆపిల్ మ్యాక్ బుక్ రూ.1,50,000కు అందుబాటులో ఉంది. దీనిపై వినియోగదారులు రూ.20వేల వరకు క్యాష్ బ్యాక్ పొందనున్నారు. అంతేకాక మరికొన్ని ఆపిల్ ఉత్పత్తులపై కూడా పేటీఎం ఆఫర్లను అందిస్తోంది. 256జీబీ కలిగిన ఐఫోన్ 7 కొనుగోలు చేసిన వారికి రూ.12వేల క్యాష్ బ్యాక్ అందించనున్నట్టు తెలిపింది. ఈ ఐఫోన్ పేటీఎంలో రూ.92వేలుగా నమోదైంది. క్యాష్ బ్యాక్ మొత్తాన్ని ఉత్పత్తి అందించిన 24 గంటల్లోగా వినియోగదారుల పేటీఎం అకౌంట్లోకి క్రెడిట్ చేయనున్నట్టు పేర్కొంది. అయితే ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్లో ఎలాంటి క్యాష్ ఆన్ డెలివరీ లేదంట. అదేవిధంగా రూ.65వేల ధర కలిగిన 128జీబీ ఐఫోన్ 7 కొనుగోలుచేసిన వారికి, రూ.7500 క్యాష్ బ్యాక్, రూ.46వేలు ధర ఉన్న 32జీబీ ఐఫోన్ 6ఎస్ కొంటే, రూ.6000 క్యాష్ బ్యాక్, రూ.65వేల ధర కలిగిన ఆపిల్ ఐప్యాడ్ ప్రో కొంటే, రూ.9000 క్యాష్ బ్యాక్, ఆపిల్ వాచ్ కొనుగోలు చేసిన వారికి రూ.4500 వరకు క్యాష్ బ్యాక్ అందించనున్నట్టు పేటీఎం పేర్కొంది. -
ఆపిల్ కొత్త మ్యాక్బుక్లు వచ్చేశాయ్!
-
ఆపిల్ కొత్త మ్యాక్బుక్లు వచ్చేశాయ్!
శాన్ ఫ్రాన్సిస్కో: ప్రముఖ సాఫ్ట్వేర్ దిగ్గజం ఆపిల్ ఎప్పటికప్పుడు కొత్త ప్రొడక్టులను మార్కెట్లోకి విడుదలచేస్తూ వినియోగదారులను ఆకర్షిస్తోంది. మ్యాక్ బుక్, ఐ ఫోన్లు తదితర ఉత్పత్తులతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించిన ఆపిల్ తాజాగా కొత్తరకం ల్యాప్ టాప్ లను విడుదల చేసింది. 13,15 ఇంచుల సైజ్ కలిగిన రెటీనా డిస్ప్లే మ్యాక్‌బుక్ మోడల్స్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టింది కుపెర్టినో ఆధారిత అతి తేలికైన, పలుచనిమ్యాక్ బుక్ ప్రో ను లాంచ్ చేసింది. ఇప్పటివరకు అందుబాటులో ఉన్న 12ఇంచుల మ్యాక్‌బుక్ లాగే కొత్త మ్యాక్‌బుక్ లను కొత్తగా డిజైన్ చేసి మూడు వేరియంట్లలో అందిస్తోంది. త్వరలోనే ఇవి వినియోగదారులకు అందుబాటులోకి రానున్నట్టు కంపెనీ వెల్లడించింది. సాధారణ కీబోర్డులకు స్వస్తి చెపుతూ టచ్ బార్ (రెటీనా క్వాలిటీ మల్టీ డచ్ డిస్ ప్లే) అనే కొత్త టెక్నాలజీని ఆవిష్కరించింది. సాధారణ కీ బోర్డు ఉన్న13 అంగుళాల మ్యాక్ బుక్ ప్రో 1,499 డాలర్లకు, హై ఎండ్ మోడల్ 13 అంగుళాల మ్యాక్ బుక్ ప్రో 1,799 డాలర్లకు 15అంగుళాల మ్యాక్ బుక్ ప్రో 2,399డాలర్లు ప్రారంభ ధరలుగా ఆపిల్ వెల్లడించింది. ఈవారంలో జరగనున్న యాపిల్ నోట్ బుక్ 25 వార్షికోత్సవం గుర్తుగా వీటిని పరిచయం చేస్తున్నట్టు యాపిల్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ ఫిలిప్ స్కిల్లర్ తెలిపారు. ఇన్ని సంవత్సరాలుగా వినియోగదారులకు ఎల్లప్పుడూ ఉత్తమమైన, నాణ్యమైన ఉత్పత్తులతో కొత్త ఆవిష్కరణలకు నాంది పలికిన తాము మ్యాక్ బుక్ ప్రో లాంచింగ్ ఒక పెద్ద ముందడుగు అని ప్రకటించారు. 13 అంగుళాల మాక్ బుక్ ప్రో 6 వ తరం క్వాడ్ డ్యూయల్ -కోర్ ప్రాసెసర్లు 2.0 గిగాహెడ్జ్ డ్యూయల్ ఇంటెల్ కోర్ ఐ5 ప్రాసెసర్ 3.1గిగాహెడ్జ్ స్పీడ్, సూపర్ ఫాస్ట్ ఎస్ఎస్డీ టర్బో బూస్ట్ , 5-అంగుళాల డిస్ ప్లే 1.83 కిలోల బరువు 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ 15 అంగుళాల మాక్ బుక్ ప్రో 15.5 మి.మీ, 1.83 కిలోల బరువు గతంకంటే 14 శాతం సన్నగా, 20శాతం వాల్యూమ్ ఎక్కువగా టచ్ బార్ అండ్ టచ్ ఐడీ, టర్బో బూస్ట్ 2.6గిగాహెడ్జ్ క్వాడ్-కోర్ ఇంటెల్ కోర్, ఐ7 ప్రాసెసర్ 3.5గిగాహెడ్జ్ స్పీడ్ 16జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్