ఆపిల్ ఉత్పత్తులపై పేటీఎం భారీ ఆఫర్లు
ఆపిల్ ఉత్పత్తులపై పేటీఎం భారీ ఆఫర్లు
Published Wed, Feb 15 2017 12:54 PM | Last Updated on Tue, Sep 5 2017 3:48 AM
డిజిటల్ లావాదేవీల్లో ఫుల్ పాపులర్ అయిన పేటీఎం, ఐఫోన్, మ్యాక్ బుక్ మోడల్స్ లాంటి ఆపిల్ ఉత్పత్తులపై భారీ ఆఫర్లు ప్రకటించింది. ది గ్రేట్ ఆపిల్ సేల్ ప్రారంభించింది. ఫిబ్రవరి 14 నుంచి ఫిబ్రవరి 16 వరకు పేటీఎం నిర్వహించే ఈ సేల్ లో మ్యాక్ బుక్ కొనుగోలుచేసిన వారికి రూ.20వేల వరకు క్యాష్ బ్యాక్ ఇవ్వనున్నట్టు తెలిపింది. అయితే వీటిలో ఎంపికచేసిన వాటికే ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్ వర్తించనుంది. ప్రస్తుతం 15 అంగుళాలు కలిగిన ఆపిల్ మ్యాక్ బుక్ రూ.1,50,000కు అందుబాటులో ఉంది. దీనిపై వినియోగదారులు రూ.20వేల వరకు క్యాష్ బ్యాక్ పొందనున్నారు. అంతేకాక మరికొన్ని ఆపిల్ ఉత్పత్తులపై కూడా పేటీఎం ఆఫర్లను అందిస్తోంది.
256జీబీ కలిగిన ఐఫోన్ 7 కొనుగోలు చేసిన వారికి రూ.12వేల క్యాష్ బ్యాక్ అందించనున్నట్టు తెలిపింది. ఈ ఐఫోన్ పేటీఎంలో రూ.92వేలుగా నమోదైంది. క్యాష్ బ్యాక్ మొత్తాన్ని ఉత్పత్తి అందించిన 24 గంటల్లోగా వినియోగదారుల పేటీఎం అకౌంట్లోకి క్రెడిట్ చేయనున్నట్టు పేర్కొంది. అయితే ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్లో ఎలాంటి క్యాష్ ఆన్ డెలివరీ లేదంట. అదేవిధంగా రూ.65వేల ధర కలిగిన 128జీబీ ఐఫోన్ 7 కొనుగోలుచేసిన వారికి, రూ.7500 క్యాష్ బ్యాక్, రూ.46వేలు ధర ఉన్న 32జీబీ ఐఫోన్ 6ఎస్ కొంటే, రూ.6000 క్యాష్ బ్యాక్, రూ.65వేల ధర కలిగిన ఆపిల్ ఐప్యాడ్ ప్రో కొంటే, రూ.9000 క్యాష్ బ్యాక్, ఆపిల్ వాచ్ కొనుగోలు చేసిన వారికి రూ.4500 వరకు క్యాష్ బ్యాక్ అందించనున్నట్టు పేటీఎం పేర్కొంది.
Advertisement
Advertisement