ఆపిల్ కొత్త మ్యాక్‌బుక్లు వచ్చేశాయ్! | Apple unveils thinnest, lightest new MacBook Pro | Sakshi
Sakshi News home page

ఆపిల్ కొత్త మ్యాక్‌బుక్లు వచ్చేశాయ్!

Published Fri, Oct 28 2016 12:38 PM | Last Updated on Mon, Aug 20 2018 2:55 PM

ఆపిల్ కొత్త  మ్యాక్‌బుక్లు వచ్చేశాయ్! - Sakshi

ఆపిల్ కొత్త మ్యాక్‌బుక్లు వచ్చేశాయ్!

 శాన్ ఫ్రాన్సిస్కో: ప్రముఖ సాఫ్ట్‌వేర్ దిగ్గజం ఆపిల్ ఎప్పటికప్పుడు కొత్త ప్రొడక్టులను మార్కెట్లోకి విడుదలచేస్తూ వినియోగదారులను ఆకర్షిస్తోంది. మ్యాక్ బుక్, ఐ ఫోన్లు తదితర ఉత్పత్తులతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించిన ఆపిల్‌ తాజాగా కొత్తరకం ల్యాప్ టాప్ లను విడుదల చేసింది.  13,15 ఇంచుల సైజ్ కలిగిన  రెటీనా డిస్‌ప్లే మ్యాక్‌బుక్ మోడల్స్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టింది కుపెర్టినో ఆధారిత అతి తేలికైన, పలుచనిమ్యాక్ బుక్ ప్రో ను లాంచ్ చేసింది.  ఇప్పటివరకు అందుబాటులో ఉన్న 12ఇంచుల మ్యాక్‌బుక్ లాగే కొత్త మ్యాక్‌బుక్‌ లను కొత్తగా డిజైన్  చేసి మూడు వేరియంట్లలో  అందిస్తోంది. త్వరలోనే ఇవి వినియోగదారులకు అందుబాటులోకి రానున్నట్టు కంపెనీ వెల్లడించింది.  సాధారణ కీబోర్డులకు స్వస్తి చెపుతూ టచ్ బార్ (రెటీనా క్వాలిటీ మల్టీ డచ్ డిస్ ప్లే) అనే కొత్త టెక్నాలజీని  ఆవిష్కరించింది. సాధారణ కీ బోర్డు ఉన్న13 అంగుళాల  మ్యాక్ బుక్  ప్రో 1,499 డాలర్లకు,  హై ఎండ్ మోడల్  13 అంగుళాల  మ్యాక్ బుక్  ప్రో 1,799  డాలర్లకు 15అంగుళాల మ్యాక్ బుక్  ప్రో 2,399డాలర్లు ప్రారంభ ధరలుగా ఆపిల్  వెల్లడించింది.

ఈవారంలో జరగనున్న యాపిల్ నోట్ బుక్  25 వార్షికోత్సవం గుర్తుగా వీటిని  పరిచయం చేస్తున్నట్టు యాపిల్  మార్కెటింగ్  వైస్ ప్రెసిడెంట్ ఫిలిప్ స్కిల్లర్ తెలిపారు.  ఇన్ని సంవత్సరాలుగా వినియోగదారులకు ఎల్లప్పుడూ ఉత్తమమైన, నాణ్యమైన ఉత్పత్తులతో కొత్త ఆవిష్కరణలకు  నాంది పలికిన తాము  మ్యాక్ బుక్ ప్రో లాంచింగ్ ఒక పెద్ద ముందడుగు  అని ప్రకటించారు.

13 అంగుళాల మాక్ బుక్ ప్రో

6 వ తరం క్వాడ్ డ్యూయల్ -కోర్ ప్రాసెసర్లు
2.0 గిగాహెడ్జ్ డ్యూయల్ ఇంటెల్ కోర్ ఐ5 ప్రాసెసర్
3.1గిగాహెడ్జ్ స్పీడ్,
సూపర్ ఫాస్ట్ ఎస్ఎస్డీ  టర్బో బూస్ట్ ,
5-అంగుళాల  డిస్ ప్లే
1.83 కిలోల బరువు
8జీబీ ర్యామ్,   256 జీబీ స్టోరేజ్

15 అంగుళాల మాక్ బుక్ ప్రో
15.5 మి.మీ, 1.83 కిలోల బరువు
గతంకంటే 14 శాతం సన్నగా, 20శాతం వాల్యూమ్ ఎక్కువగా
టచ్ బార్ అండ్ టచ్ ఐడీ, టర్బో బూస్ట్
 2.6గిగాహెడ్జ్ క్వాడ్-కోర్ ఇంటెల్ కోర్, ఐ7 ప్రాసెసర్
3.5గిగాహెడ్జ్  స్పీడ్
16జీబీ ర్యామ్,   256జీబీ స్టోరేజ్
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement