శాన్‌ఫ్రాన్సిస్కో : సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ ఆపిల్ ఇటీవల విడుదల చేసిన మాక్‌బుక్ ప్రో డివైస్‌లు పేలుతున్నాయిట. ఈ నేపథ్యంలోనే మాక్‌బుక్ ప్రో యూనిట్లను ఆపిల్ కంపెనీ భారీగా రీకాల్ చేస్తోంది. 15 అంగుళాల మాక్‌బుక్ ప్రో బ్యాటరీ ఓవర్ హీట్ అయ్యి ప్రమాదానికి గురుకావచ్చనే ఆందోళనతో వాటిని రీకాల్ చేస్తోంది. ఈ మేరకు వినియోగదారులకు హెచ్చరికలు జారీ చేసింది. ప్రభావితమైన 15 అంగుళాల మాక్‌బుక్ ప్రో యూనిట్లను ఉపయోగించడం మానేయాలని ఆపిల్ వినియోగదారులను కోరింది. అలాగే వీటి బ్యాటరీని ఉచితంగా రీప్లేస్ చేసుకోవచ్చని గురువారం ఒక ప్రకటనలో తెలిపింది
రెటినా డిస్‌ప్లే ఉన్న 15-అంగుళాల మాక్‌బుక్ ప్రో యూనిట్లు, ప్రధానంగా సెప్టెంబర్ 2015- ఫిబ్రవరి 2017 మధ్య అమ్ముడైనవి ప్రమాదానికి గురయ్యే అవకాశం వుందని హెచ్చరించింది. బ్యాటరీ రీప్లేస్‌మెంట్ వివరాల కోసం ‘ఆపిల్.కామ్/సపోర్ట్ /15-ఇంచ్-మ్యాక్‌బుక్-ప్రో-బ్యాటరీ-రికాల్ ’ సంప్రదించవచ్చని ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment