Battery problem
-
Apple: ఛార్జింగ్ సమస్యను ఎదుర్కొంటున్నారా..! ఐతే ఇది మీకోసమే..!
ఆపిల్ తన వినియోగదారులకు శుభవార్తను అందించింది. ఆపిల్ ఐఫోన్ 12 సిరీస్ మొబైళ్ల కోసం మాగ్‌సేఫ్ బ్యాటరీ ప్యాక్‌ను లాంఛ్ చేసింది. ఐఫోన్ 12 సిరీస్ మొబైల్స్ రిలీజ్ ఐనా ఎనిమిది నెలల తరువాత మాగ్సేఫ్ను అందుబాటులోకి తెచ్చింది. మాగ్సేఫ్తో ఐఫోన్ 12 సిరీస్ ఫోన్లకు మరింత అదనపు బ్యాటరీ పొందవచ్చును. మాగ్‌సేఫ్ రాకతో ఐఫోన్ 12 సిరీస్ ఫోన్లను వాడే వినియోగదారులకు బ్యాటరీ ఛార్జింగ్ సమస్య నుంచి కాస్త ఉపశమనం లభించనుంది. భారత్‌లో మాగ్‌సేఫ్ బ్యాటరీ ప్యాక్‌ను రూ. 10,900 కు ఆపిల్ తన కస్టమర్లకు అందించనుంది. ఈ మాగ్సేఫ్ను ఐఫోన్ 12 సిరీస్‌లోని, ప్రో, ప్రో మ్యాక్స్, మినీ ఫోన్లకు ఉపయోగించవచ్చును. బ్యాటరీ ప్యాక్ 15W ఛార్జింగ్ వరకు ఇవ్వగలదని ఆపిల్ పేర్కొంది. మాగ్‌సేఫ్ అంటే..! సాధారణంగా ఎక్కువగా ఫోన్లను ఉపయోగించే వారు పవర్‌బ్యాంక్‌లను క్యారీ చేస్తూ ఉంటారు. పవర్ బ్యాంక్‌లను క్యారీ చేసేటప్పుడు కచ్చితంగా ఫోన్‌కు సంబంధించిన పవర్ కేబుల్‌ను కూడా వెంట తీసుకెళ్తూ ఉండాలి. కాగా ఆపిల్ తన వినియోగదారులకోసం మాగ్‌సేఫ్ బ్యాటరీ కన్సెప్ట్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ బ్యాటరీ ప్యాక్‌కు ఎలాంటి పవర్ కేబుల్ అవసరం లేదు. మాగ్‌సేఫ్ ప్యాక్‌ను ఐఫోన్‌కు వెనుకభాగంలో ఉంచితే చాలు. వైర్లేస్ ఛార్జింగ్‌ను మొబైళ్లకు అందిస్తోంది. కాగా ప్రస్తుతం ఆపిల్ రిలీజ్ చేసిన మాగ్‌సేఫ్ బ్యాటరీను 1, 460ఎమ్ఏహెచ్గా నిర్థారించినట్లు తెలుస్తోంది. -
ఆపిల్ మాక్‌బుక్ ప్రో బ్యాటరీ పేలుతుంది..!
శాన్ఫ్రాన్సిస్కో : సాఫ్ట్వేర్ దిగ్గజ సంస్థ ఆపిల్ ఇటీవల విడుదల చేసిన మాక్‌బుక్ ప్రో డివైస్‌లు పేలుతున్నాయిట. ఈ నేపథ్యంలోనే మాక్‌బుక్ ప్రో యూనిట్లను ఆపిల్ కంపెనీ భారీగా రీకాల్ చేస్తోంది. 15 అంగుళాల మాక్‌బుక్ ప్రో బ్యాటరీ ఓవర్ హీట్ అయ్యి ప్రమాదానికి గురుకావచ్చనే ఆందోళనతో వాటిని రీకాల్ చేస్తోంది. ఈ మేరకు వినియోగదారులకు హెచ్చరికలు జారీ చేసింది. ప్రభావితమైన 15 అంగుళాల మాక్‌బుక్ ప్రో యూనిట్లను ఉపయోగించడం మానేయాలని ఆపిల్ వినియోగదారులను కోరింది. అలాగే వీటి బ్యాటరీని ఉచితంగా రీప్లేస్ చేసుకోవచ్చని గురువారం ఒక ప్రకటనలో తెలిపింది రెటినా డిస్ప్లే ఉన్న 15-అంగుళాల మాక్‌బుక్ ప్రో యూనిట్లు, ప్రధానంగా సెప్టెంబర్ 2015- ఫిబ్రవరి 2017 మధ్య అమ్ముడైనవి ప్రమాదానికి గురయ్యే అవకాశం వుందని హెచ్చరించింది. బ్యాటరీ రీప్లేస్మెంట్ వివరాల కోసం ‘ఆపిల్.కామ్/సపోర్ట్ /15-ఇంచ్-మ్యాక్‌బుక్-ప్రో-బ్యాటరీ-రికాల్ ’ సంప్రదించవచ్చని ప్రకటించింది. -
ఆపిల్ ఫ్రీగా బ్యాటరీ రిప్లేస్మెంట్
బ్యాటరీ ఫెయిల్యూర్ సమస్యలతో టెక్ దిగ్గజం ఆపిల్ సైతం సతమతమవుతోంది. ఇటీవల ఐఫోన్ ఫోన్ల బ్యాటరీని స్లో చేస్తుందంటూ ఆరోపణలు వెల్లువెత్తగా.. తాజాగా మ్యాక్‌బుక్ ప్రొ డివైజ్‌ల బ్యాటరీల్లో కూడా సమస్యలు వచ్చినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో మ్యాక్‌బుక్ ప్రొల బ్యాటరీలను ఉచితంగా రీప్లేస్ చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ రీప్లేస్‌మెంట్‌ను ఆపిల్ చేపడుతోంది. టచ్ బార్స్ లేని కొన్ని 13 అంగుళాల మ్యాక్‌బుక్ ప్రొల్లో పొరపాటును గుర్తించినట్టు ఆపిల్ తెలిపింది. 2016 అక్టోబర్ నుంచి 2017 అక్టోబర్ మధ్యలో తయారు చేసిన యూనిట్లు బ్యాటరీ సమస్యల బారిన పడ్డాయని ఆపిల్ తన సపోర్టు పేజీలో పేర్కొంది. కానీ ఎన్ని మ్యాక్బుక్లు దీని బారిన పడ్డాయో తెలుపలేదు. కొత్త బ్యాటరీలను వాటిలో రీప్లేస్ చేస్తామని, వాటిని ఉచితంగా అందించనున్నట్టు తెలిపింది. యూజర్లు తమ మ్యాక్‌బుక్ సీరియల్ నెంబర్‌ను సపోర్టు పేజీలో నమోదు చేస్తే, తమ యూనిట్ రీప్లేస్ చేసుకోవాలో లేదో తెలుస్తుంది. ఒకవేళ తమ ల్యాప్‌టాప్‌లు బ్యాటరీ సమస్య బారిన పడినట్టు తెలిస్తే, వెంటనే ఆపిల్ రిఫైర్ సెంటర్, ఆపిల్ రిటైల్ స్టోర్, ఆపిల్ అధికారిక సర్వీసు ప్రొవైడర్‌ను ఆశ్రయించాలని సూచించింది. ఇప్పటికే బ్యాటరీ రీప్లేస్మెంట్ కోసం డబ్బులు కట్టిన వారికి, ఈ నగదును కంపెనీ తిరిగి రీఫండ్ చేయనుంది. అయితే టచ్‌బార్‌తో ఉన్న మ్యాక్‌బుక్ ప్రొలు, 13 అంగుళాల పాత మ్యాక్‌బుక్ ప్రొ మోడల్స్ దీని బారిని పడలేదు. అంతకముందు ఐఫోన్ 6, ఐఫోన్ 6ఎస్, ఐఫోన్ ఎస్ఈ మోడల్స్ బ్యాటరీలను ఆపిల్ స్లో చేసిందని తెలువడంతో, ఆ విషయంపై కంపెనీ క్షమాపణ చెప్పింది. వెంటనే వాటి బ్యాటరీల రిప్లేస్మెంట్లను అత్యంత తక్కువ ధరకు చేపట్టింది. -
ఐఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్
ఐఫోన్ వినియోగదారులకు గుడ్ న్యూస్. బ్యాటరీ లోపాలు, కొరతతో ఇబ్బందులు పడుతున్న కస్టమర్లు ఇకమీదట ఐఫోన్ బ్యాటరీ రీప్లేస్మెంట్ తొందరగానే సాధించవచ్చు. అదీ కూడా చాల తక్కువ ధరకే. సుమారు 2 వేల రూపాయలు (అన్ని కలుపుకొని) కే లభించనుంది. తాజాగా బ్యాటరీ రీప్లేస్మెంట్ ఖరీదు అంతర్జాతీయంగా 29 డాలర్లుగా ఉండగా, మన దేశానికి సంబంధించి దీని ధర పన్నులతో కలిపి దాదాపు 2600రూపాయలకు లభించనుంది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఐఫోన్ కేంద్రాల్లో ఈ తగ్గింపు ధర వర్తించనుంది. సవరించిన రేట్లకు పాత ఐఫోన్ మోడళ్లకు బ్యాటరీ అందుబాటులో ఉన్నట్టు ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబైలో ఆపిల్ కేంద్రాలు ధృవీకరించాయి. చాలా పాత ఐ ఫోన్లతోపాటు, ఐ ఫోన్ 6, 6ప్లస్, 6ఎస్, ఐఫోన్ 6 ప్లస్, ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్ తదితర మిగిలిన మోడళ్లకు ఈ సౌకర్యం అందుబాటులో ఉంది. ఇప్పటివరకు దీని రూ . 6,500గా ఉండడంతో పాటు...బ్యాటరీ కోసం దీర్ఘకాలం వెయిట్ చేయాల్సి వచ్చేది. అయితే ఆపిల్ అధీకృత సేవా కేంద్రాల దగ్గర సంబంధిత ఐఫోన్ బ్యాటరీ రీప్లేస్‌మెంట్‌కు అర్హత ఉందా , లేదా అనేది చెక్ చేసుకోవాలి. కాగా ఇటీవల పాత ఐ ఫోన్ బ్యాటరీ లోపం కారణంగా ఐ ఫోన్ స్లో కావడం, లేదా షట్ డౌన్ కావడం వివాదం రేపింది. దీంతో ఐఫోన్ మేకర్ ఆపిల్ గత నెలలో బ్యాటరీ రీప్లేస్ మెంట్ పథకాన్ని ప్రారంభించింది. -
బ్యాటరీ సమస్య వల్లే బోగీ బుగ్గి!
లోబ్యాటరీ వల్ల షార్ట్ సర్క్యూట్ జరిగి ఉండొచ్చన్న నిపుణులు సాక్షి ప్రతినిధి, అనంతపురం/పుట్టపర్తి అర్బన్, తాండూరు, న్యూస్‌లైన్: విద్యుత్ వైరింగ్‌లో నాసిరకమైన వస్తువులు వినియోగించడం వల్ల నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌లో ఘోర ప్రమాదం జరిగిఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. లోబ్యాటరీ సమస్య తలెత్తడంతో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయిఉండవచ్చని ఏసీ కోచ్‌ల పర్యవేక్షక ఇంజనీర్ అనుమానం వ్యక్తం చేసినట్లు రైల్వే అధికారులు చెబుతున్నారు. బోగీల నిర్వహణను రైల్వే శాఖ కాంట్రాక్టర్లకు అప్పగిస్తోంది. బ్యాటరీలను సమకూర్చడం, ఏసీ బోగీల్లో వైరింగ్ వంటి పనులను కాంట్రాక్టర్లే చేస్తున్నారు. వారు నాసిరకం బ్యాటరీ లను సరఫరా చేస్తున్నారనడానికి తరచూ బ్యాటరీల్లో సమస్యలు తలెత్తుతుండటమే తార్కాణం. ప్రమాదం చోటుచేసుకున్న తర్వాత బీ1 బోగీని తప్పించి.. తక్కిన బోగీల్లోని ప్రయాణికులను అదే రోజున నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌లో రైల్వే అధికారులు తరలించారు. రైలు గుంతకల్లు రైల్వే స్టేషన్‌కు చేరుకోగానే.. ఏసీలు పనిచేయడం లేదని, పొగలు వస్తున్నాయని త్రీటైర్, టూటైర్, ఫస్ట్‌క్లాస్ బోగీల్లో ఉన్న ప్రయాణికులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. బ్యాటరీల్లో చార్జింగ్ అయిపోవడం వల్లే ఏసీలు పనిచేయడం లేదని, అందువల్లే విద్యుత్ షార్ట్ సర్క్యూటై ఏసీల్లో పొగలు వస్తున్నాయని గుర్తించిన ఇంజనీర్లు.. బ్యాటరీలను చార్జింగ్ చేసి రైలును పంపించారు. లోబ్యాటరీ సమస్య వల్లే ప్రమాదం జరిగిందనడానికి ఈ ఘటన బలం చేకూరుస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ ప్రమాదంపై మంగళవారం నుంచి బహిరంగ విచారణ చేపడుతున్నారు. ఊపిరాడకే ఎక్కువ మంది మృతి: బోగీలో దట్టంగా కమ్ముకున్న పొగవల్ల ఊపిరాడక ఎక్కువమంది మరణించినట్లు ఫోరెన్సిక్ నిపుణులు అభిప్రాయపడ్తున్నారు. బోగీని సోమవారం క్షుణ్ణంగా పరిశీ లించి, మృతుల వస్తువులు, శిథిలాలు, బూడిదను సేకరించి భద్రపరిచామని ఏపీ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ డెరైక్టర్ శారదా అవధానం తెలి పారు. బోగీలో పురుగుమందుల అవశేషాలు లభ్యమయ్యాయని, వాటికి మండే గుణం ఉందో లేదో పరీక్షలో తేలుతుందన్నారు. డీఎన్ఏ పరీక్షల తర్వాతే మృతుల ప్రకటన లలిత - బెంగళూరు(61), పద్మిని -బెంగళూరు(61), ఈశ్వర్ నాగ్రే -ఔరంగాబాద్(70), కవితా నాగ్రే -ఔరంగాబాద్(61), శ్రీలత-అనంతపురం (26), డాక్టర్ అస్రా -రాయచూరు(32), మహమ్మద్ రఫీ -రాయచూరు(2), ఇబ్రహీం రహీ -రాయచూరు(31), బల్బీర్ కౌర్ -బెంగళూరు(52), అమన్ ప్రీత్ కౌర్ -బెంగళూరు(24), రాహుల్ -బెంగళూరు(25), శ్రీనివాస్ -అనంతపురం(28).. వీరంతా మృతి చెందారా, లేదా అనే విషయాన్ని డీఎన్ఏ పరీక్షల అనంతరం ప్రకటిస్తామని అధికారులు తెలిపారు. ఏసీ కోచ్‌లో షార్ట్ సర్క్యూట్ విజయవాడ రైల్వే స్టేషన్లో తృటిలో తప్పిన ప్రమాదం విజయవాడ, న్యూస్‌లైన్: నాందేడ్ ఎక్స్‌ప్రెస్ ఘటన మరువకముందే సోమవారం విజయవాడ రైల్వేస్టేషన్లో నిలిచిఉన్న రైలు ఏసీ కోచ్‌లో పొగలు వచ్చాయి. విద్యార్థుల విహారయాత్రకు ఈనెల 24న ముంబైలో బయలుదేరిన రైలును సోమవారం విజయవాడలో మెయింటెనెన్స్ నిమిత్తం నిలిపివేశారు. ఆ రైలు ఏసీ కోచ్‌లో ఒక్కసారిగా పొగ, నిప్పురవ్వలు విరజిమ్మాయి. విద్యార్థులు అదనంగా విద్యుత్ వైర్లను ఏర్పాటు చేయడంతో అవి షార్ట్‌సర్క్యూటై పొగలు వ్యాపించినట్లు రైల్వే ఎలక్ట్రికల్ సిబ్బంది గుర్తించారు. ఆ రైలును రైల్వే యార్డులోకి తరలించి మరమ్మతులు చేపట్టారు.