ఆపిల్ తన వినియోగదారులకు శుభవార్తను అందించింది. ఆపిల్ ఐఫోన్ 12 సిరీస్ మొబైళ్ల కోసం మాగ్‌సేఫ్ బ్యాటరీ ప్యాక్‌ను లాంఛ్ చేసింది. ఐఫోన్ 12 సిరీస్ మొబైల్స్ రిలీజ్ ఐనా ఎనిమిది నెలల తరువాత మాగ్‌సేఫ్‌ను అందుబాటులోకి తెచ్చింది. మాగ్‌సేఫ్‌తో ఐఫోన్ 12 సిరీస్ ఫోన్లకు మరింత అదనపు బ్యాటరీ పొందవచ్చును. మాగ్‌సేఫ్ రాకతో ఐఫోన్ 12 సిరీస్ ఫోన్లను వాడే వినియోగదారులకు బ్యాటరీ ఛార్జింగ్ సమస్య నుంచి కాస్త ఉపశమనం లభించనుంది. భారత్‌లో మాగ్‌సేఫ్ బ్యాటరీ ప్యాక్‌ను రూ. 10,900 కు ఆపిల్ తన కస్టమర్లకు అందించనుంది. ఈ మాగ్‌సేఫ్‌ను ఐఫోన్ 12 సిరీస్‌లోని, ప్రో, ప్రో మ్యాక్స్, మినీ ఫోన్లకు ఉపయోగించవచ్చును. బ్యాటరీ ప్యాక్ 15W ఛార్జింగ్ వరకు ఇవ్వగలదని ఆపిల్ పేర్కొంది.
మాగ్‌సేఫ్ అంటే..!
సాధారణంగా ఎక్కువగా ఫోన్లను ఉపయోగించే వారు పవర్‌బ్యాంక్‌లను క్యారీ చేస్తూ ఉంటారు. పవర్ బ్యాంక్‌లను క్యారీ చేసేటప్పుడు కచ్చితంగా ఫోన్‌కు సంబంధించిన పవర్ కేబుల్‌ను కూడా వెంట తీసుకెళ్తూ ఉండాలి. కాగా ఆపిల్ తన వినియోగదారులకోసం మాగ్‌సేఫ్ బ్యాటరీ కన్సెప్ట్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ బ్యాటరీ ప్యాక్‌కు ఎలాంటి పవర్ కేబుల్ అవసరం లేదు. మాగ్‌సేఫ్ ప్యాక్‌ను ఐఫోన్‌కు వెనుకభాగంలో ఉంచితే చాలు. వైర్‌లేస్ ఛార్జింగ్‌ను మొబైళ్లకు అందిస్తోంది. కాగా ప్రస్తుతం ఆపిల్ రిలీజ్ చేసిన మాగ్‌సేఫ్ బ్యాటరీను 1, 460ఎమ్‌ఏహెచ్‌గా నిర్థారించినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment