![massive price cut Apple iPhone12 on Flipkart check details - Sakshi](/styles/webp/s3/article_images/2022/12/16/iphone12.jpg.webp?itok=OUk0lJGG)
సాక్షి,ముంబై: యాపిల్ ఐఫోన్ ఇపుడు అతి తక్కువ ధరలో యాపిల్ లవర్స్‌కు అందుబాటులోకి వచ్చింది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో యాపిల్ ఐఫోన్ 12 రూ. 27,401 భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఐఫోన్12 కంపెనీ అధికారిక ఆన్‌లైన్ స్టోర్‌లో రూ. 59,900గా లిస్ట్‌కాగా, ఫ్లిప్‌కార్ట్‌తో రూ. 3,901 ధర తగ్గింపుతో ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ఈ 55,999కి లిస్ట్ కాగా, అయితే ప్రస్తుత ఆఫర్లతోఈ ఫోన్ రూ. 32,499కి లభిస్తోంది. (జర్నలిస్టులపై బ్యాన్,ట్విటర్ స్పేసెస్‌కు బ్రేక్..బైడెన్‌పై సెటైర్లు)
ఐడీఎఫ్‌సీ ఫస్ట్ క్రెడిట్ కార్డ్ EMI లావాదేవీలపై 10శాతం తక్షణ తగ్గింపుతో ఐఫోన్ 12 ధర దిగి వచ్చింది. యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డు ద్వారా ఐఫోన్ 12 ను కొనుగోలు చేసినట్లయితే, 5 శాతం అదనంగా క్యాష్ బ్యాక్ లభ్యం. దీనికితోడు రూ. 5,000 అంతకంటే ఎక్కువ ఆర్డర్‌లపై రూ. 3,000 వరకు డిస్కౌంట్ లభిస్తోంది ఫ్లిప్‌కార్ట్ ద్వారా. అలాగే పాత స్మార్ట్‌ఫోన్ మార్పిడి ద్వారా ఫ్లిప్‌కార్ట్ రూ. 21,500 వరకు తగ్గింపును అందిస్తోంది. అన్ని బ్యాంక్ ఆఫర్‌లు, ఎక్స్చేంజ్ ఆఫర్ , డిస్కౌంట్స్ తరువాత 28,401 తగ్గింపుతో ఐఫోన్ 12 ను కేవలం రూ. 32,499తో కొనుగోలు చేయవచ్చు.
యాపిల్ ఐఫోన్ 12 స్పెసిఫికేషన్స్
6.1 అంగుళాల ఓఎల్ఈడీ సూపర్ రెటీనా XDR OLED డిస్‌ప్లే
ఏ14 బయోనిక్ చిప్ సెట్
ఐఓఎస్ 14 ఆపరేటింగ్ సిస్టం
64 జీబీ ర్యామ్,, 128 జీబీ స్టోరేజ్
12+12 డ్యుయల్ రియర్ కెమెరా
12 ఎంసీ సెల్ఫీ కెమెరా
2815 ఎంఏహెచ్ బ్యాటరీ
Comments
Please login to add a commentAdd a comment