France Bans Apple iphone 12 స్మార్ట్‌ఫోన్‌దిగ్గజం యాపిల్‌కు మరో భారీ షాక్ తగిలింది. పరిమితికి మించి స్పెసిఫిక్ అబ్జార్పషన్ రేటు (SAR) విడుదల చేస్తోందంటూ ఐఫోన్ 12వాడకాన్ని ఫ్రాన్స్ బ్యాన్ చేసింది.ఇప్పటికే చైనాలో అధికారులు, ఇతర ఏజెన్సీల ఐఫోన్ల వాడకంపై ఆంక్షల మధ్య తాజా నిషేధం ఐఫోన్ లవర్స్‌కు షాకిచ్చింది. (యాపిల్ మెగా ఈవెంట్‌లో పీవీ సింధు: టీమ్ కుక్‌తో సెల్ఫీ పిక్స్ వైరల్)
థ్రెషోల్డ్ రేడియేషన్ స్థాయిల కంటే ఎక్కువ ఉన్నందున ఐఫెన్ 12 మోడల్‌ను ఫ్రాన్స్‌లో విక్రయించడం మానేయాలని ఫ్రాన్స్ డిజిటల్ ఎకానమీ జూనియర్ మంత్రి ప్రకటించారు. అనుమతించిన విద్యుదయస్కాంత తరంగాల కంటే ఎక్కువగా విడుదల చేస్తుందని రెగ్యులేటరీ ఫ్రాన్స్‌కు చెందిన నేషనల్ ఫ్రీక్వెన్సీ ఏజెన్సీ (ANFR) పేర్కొంది. అధిక స్థాయిలో రేడియేషన్ రిలీజ్ చేస్తున్నఈ ఫోన్ విక్రయాలను వెంటనే నిలిపివేయాలని వెల్లడించింది. (యాపిల్ ఐఫోన్ 15 సిరీస్ : ప్రత్యర్థుల దారుణమైన ట్రోలింగ్ )
ఐఫోన్ 12 సిగ్నల్స్‌లో స్పెసిఫిక్ అబ్జార్పషన్ రేటు అధికంగా ఉందని, ఐఫోన్ 12 చేతుల్లో ఉన్నా, జేబులో ఉన్నా కూడా 5.74 వాట్స్ పవర్ రిలీజ్ అవుతున్నట్లు గుర్తించింది. మూడేళ్ల యాపిల్ స్మార్ట్‌ఫోన్‌తో సహా, 141 ఫోన్‌లను ఏజెన్సీ పరీక్షించింది. మరోవైపు 2020 సెప్టెంబర్‌లో ఐఫోన్ 12నిలాంచ్ చేసింది. ఇప్పటికే పది మిలియన్ల యూనిట్లను విక్రయించింది. అలాగే ఐఫోన్ 15ని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే ఐఫోన్12 అమ్మకాలను నిలిపి వేసింది. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్ నిషేధం అమ్మకాలపై ప్రభావం చూపక పోవచ్చంటున్నారు నిపుణులు. (గోల్డ్ లవర్స్‌కి తీపి కబురు: బంగారం, వెండి ధరలు పతనం)
Comments
Please login to add a commentAdd a comment