ఐఫోన్ వినియోగదారులకు గుడ్ న్యూస్. బ్యాటరీ లోపాలు, కొరతతో ఇబ‍్బందులు పడుతున్న కస్టమర్లు ఇకమీదట ఐఫోన్ బ్యాటరీ రీప్లేస్‌మెంట్ తొందరగానే సాధించవచ్చు. అదీ కూడా చాల తక‍్కువ ధరకే. సుమారు 2 వేల రూపాయలు (అన్ని కలుపుకొని) కే లభించనుంది. తాజాగా బ్యాటరీ రీప్లేస్‌మెంట్ ఖరీదు అంతర్జాతీయంగా 29 డాలర్లుగా ఉండగా, మన దేశానికి సంబంధించి దీని ధర పన్నులతో కలిపి దాదాపు 2600రూపాయలకు లభించనుంది.
దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఐఫోన్ కేంద్రాల్లో ఈ తగ్గింపు ధర వర్తించనుంది. సవరించిన రేట్లకు పాత ఐఫోన్ మోడళ్లకు బ్యాటరీ అందుబాటులో ఉన్నట్టు ఢిల్లీ-ఎన్‌సీఆర్, ముంబైలో ఆపిల్ కేంద్రాలు ధృవీకరించాయి. చాలా పాత ఐ ఫోన్లతోపాటు, ఐ ఫోన్ 6, 6ప్లస్, 6ఎస్, ఐఫోన్ 6 ప్లస్, ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్ తదితర మిగిలిన మోడళ్లకు ఈ సౌకర్యం అందుబాటులో ఉంది. ఇప్పటివరకు దీని రూ . 6,500గా ఉండడంతో పాటు...బ్యాటరీ కోసం దీర్ఘకాలం వెయిట్ చేయాల్సి వచ్చేది. అయితే ఆపిల్ అధీకృత సేవా కేంద్రాల దగ్గర సంబంధిత ఐఫోన్ బ్యాటరీ రీప్లేస్‌మెంట్‌కు అర్హత ఉందా , లేదా అనేది చెక్ చేసుకోవాలి.
కాగా ఇటీవల పాత ఐ ఫోన్ బ్యాటరీ లోపం కారణంగా ఐ ఫోన్ స్లో కావడం, లేదా షట్ డౌన్ కావడం వివాదం రేపింది. దీంతో ఐఫోన్ మేకర్ ఆపిల్ గత నెలలో బ్యాటరీ రీప్లేస్ మెంట్ పథకాన్ని ప్రారంభించింది.
Comments
Please login to add a commentAdd a comment