విమానాల్లో ‘యాపిల్‌ మాక్‌బుక్‌ ప్రో’ తేవద్దు | DGCA bans some Apple MacBook Pro from flights in India | Sakshi
Sakshi News home page

విమానాల్లో ‘యాపిల్‌ మాక్‌బుక్‌ ప్రో’ తేవద్దు

Published Tue, Aug 27 2019 3:44 AM | Last Updated on Tue, Aug 27 2019 3:44 AM

DGCA bans some Apple MacBook Pro from flights in India - Sakshi

న్యూఢిల్లీ: విమాన ప్రయాణం చేసే ప్రయాణికులు యాపిల్‌ మాక్‌బుక్‌ ప్రో 15 అంగుళాల మోడల్‌ ల్యాప్‌టాప్‌ను తీసుకురావద్దని విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ ప్రయాణికులను కోరింది. ఆ మోడల్‌లోని కొన్ని ల్యాప్‌టాప్‌ల బ్యాటరీలు అధికంగా వేడికి గురవుతున్నాయని, ప్రయాణికుల భద్రత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. ఇదే విషయమే జూన్‌ 20వ తేదీన యాపిల్‌ సంస్థ సైతం తమ వెబ్‌సైట్‌లో ఈ మోడల్‌ ల్యాప్‌టాప్‌లకు సంబంధించి ఓ హెచ్చరిక నోటీసును అందుబాటులో ఉంచింది. దీని ప్రకారం సెప్టెంబర్‌–2015 నుంచి ఫిబ్రవరి 2017 మధ్య కాలంలో విక్రయించిన ల్యాప్‌టాప్‌ల్లో బ్యాటరీ అధిక వేడికి గురవుతుందని పేర్కొంది. అలాగే ఈ ల్యాప్‌టాప్‌ల్లో బ్యాటరీలను ఉచితంగానే మార్పు చేయాలని నిర్ణయించామని యాపిల్‌ సంస్థ తెలిపింది. బ్యాటరీని మార్పు చేసుకునే వరకు ప్రయాణికులు ఆ మోడల్‌ ల్యాప్‌టాప్‌లను తీసుకోరావద్దని డీజేసీఏ చీఫ్‌ అరుణ్‌ కుమార్‌ ట్వీట్‌ చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement