DGCA regulations
-
సేఫ్టీని ‘గాలి’ కొదిలేసిన ఎయిరిండియా: డీజీసీఏ షాకింగ్ రిపోర్ట్
DGCA finds lapses in Air India టాటా నేతృత్వంలోని ఎయిరిండియాకు భారీ షాక్ తగిలింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) ఎయిరిండియా విమానాల్లో అంతర్గత భద్రతా ఆడిట్లలో లోపాలను కనుగొంది.ఇద్దరు సభ్యుల తనిఖీ బృందం ఈ విషయాన్ని గుర్తించింది. అంతేకాదు ఈ విషయాన్ని పరిశీలిస్తున్నట్లు డీజీసీఏ అధికారులు తెలిపారు. జూలై 25- 26 తేదీల్లో హర్యానాలోని గురుగ్రామ్‌లోని ఎయిరిండియా కార్యాలయ తనిఖీల్లో DRFలో లోపాలను ప్రస్తావించారు. దీనిపై దర్యాప్తు జరుగుతోందని డిజిసిఎ డైరెక్టర్ జనరల్ విక్రమ్ దేవ్ దత్ తెలిపారు.కొనసాగుతున్న విచారణ కారణంగా, తాము వివరాలను వెల్లడించలేమని పేర్కొన్నారు. DGCAకి సమర్పించిన తనిఖీ నివేదిక ప్రకారం, ప్రీ-ఫ్లైట్ మెడికల్ ఎగ్జామినేషన్ (పైలట్లు ఆల్కహాల్ తీసుకున్నారా?లేదా?అనే పరీక్ష)కు సంబంధించి స్పాట్ చెక్‌ను నిర్వహించి నప్పటికీ, అంతర్గత ఆడిటర్ మాండేటరీ చెక్‌లిస్ట్ ప్రకారం వ్యవహరింలేదని, కొన్ని తప్పుడునివేదికలను అందించిందని టీం ఆరోపించింది. అలాగే క్యాబిన్ నిఘా, కార్గో, ర్యాంప్ అండ్ లోడ్ వంటి పలు అంశాల్లో క్రమం తప్పకుండా సేఫ్టీ స్పాట్ చెక్‌లను నిర్వహించాల్సి ఉంది, అయితే 13 సేఫ్టీ పాయింట్ల తనిఖీల్లో మొత్తం 13 కేసుల్లో ఎయిర్‌లైన్ తప్పుడు నివేదికలు సిద్ధం చేసిందని రిపోర్ట్ చేసింది. (లింక్డిన్కు బ్యాడ్ న్యూస్: కొత్త ఫీచర్ ప్రకటించిన మస్క్) అయితే సాధారణ భద్రతా నిబంధనలకు లోబడే తమ విధానాలున్నాయని ఎయిరిండియా ప్రతినిధి స్పందించారు. ఈ విషయాన్ని నిరంతరం అంచనా వేయడానికి, మరింత బలోపేతం చేసుందుకు తాము ఇలా ఆడిట్లలో చురుకుగా పాల్గొంటామని ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే సంబంధిత అధికారి లేవనెత్తిన ఏవైనా విషయాలను ఎయిర్‌లైన్ నేరుగా పరిశీలిస్తుందన్నారు. -
స్పైస్‌జెట్ సంచలనం: పైలట్లకు 20 శాతం జీతం పెంపు!
సాక్షి, ముంబై: కష్టాల్లో ఉన్న విమానయాన సంస్థ స్పైస్‌జెట్ పైలట్ల జీతాల విషయంలో దిగి వచ్చినట్టు కనిపిస్తోంది. బడ్జెట్ క్యారియర్ స్పైస్‌జెట్ అక్టోబర్ నుంచి పైలట్లకు 20శాతం జీతం పెంపును ప్రకటించిందని సీఎన్‌బీసీ గురువారం నివేదించింది. తమ వ్యాపారం మెరుగు పడుతున్న క్రమంలో కెప్టెన్లు , సీనియర్ ఫస్ట్ ఆఫీసర్లకు జీతం దాదాపు 20 శాతం పెరుగుతుందని కెప్టెన్ గుర్చరణ్ అరోరా తెలిపారు. ఖర్చులను తగ్గించుకునే పనిలో భాగంగా తాత్కాలిక చర్యగా జీతాలివ్వకుండానే సెప్టెంబరు 21 నుండి మూడు నెలల పాటు లీవ్ వితౌట్ పే కింద 80 మంది పైలట్లను సెలవుపై ఇంటికి పంపించిన సంగతి తెలిసిందే. స్పైస్‌జెట్ ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్ (ECLGS) చెల్లింపులో మొదటి విడతగా సుమారు రూ. 125 కోట్లను గత వారం అందుకుంది. అయితే తాజా పెంపులో ఈ 80 మంది ఉన్నారా లేదా అనేది స్పష్టత లేదు. అయితే డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు భావిస్తున్నారు మరోవైపు ఏవియేషన్ సేఫ్టీ రెగ్యులేటర్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) స్పైస్‌జెట్‌కు బుధవారం మరో షాక్ ఇచ్చింది. గరిష్టంగా 50 శాతం విమానాలను మాత్రమే నడపాలన్న ఆంక్షలను మరో నెలపాటు పాడిగించింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. వేసవి షెడ్యూల్ ముగిసే వరకు (అక్టోబర్ 29, 2022) ఈ ఆంక్షలు కొనసాగుతాయని తన ఆర్డర్లో పేర్కొంది. విమానాలకు సంబంధించిన వరుస సంఘటనల కారణంగా ఈ ఏడాది జూలై 27న స్పైస్‌జెట్‌కు గరిష్టంగా 50 శాతం విమానాలను మాత్రమే నడపాలని ఆదేశించింది. ఈ గడువు సెప్టెంబరు 30తో ముగియనుంది. కాగా గురువారం నాటి మార్కెట్లోస్పైస్జెట్ షేరు 4 శాతం కుప్పకూలింది. ఈ ఏడాది ఏకంగా 40శాతం నష్టపోయింది. -
ప్రయాణీకుల ప్రాణాలు గాల్లో, విస్తారాకు భారీ జరిమానా
DGCA Fines Vistara, సాక్షి, ముంబై: విమానయాన సంస్థ విస్తారాకు భారీ షాక్ తగిలింది. సరియైన శిక్షణ లేని పైలట్‌కు విమాన ల్యాండింగ్ క్లియరెన్స్ ఇచ్చినందుకుగాను సంస్థకు భారీ జరిమానా విధించింది. రూ. 10 లక్షల పెనాల్టీ విధిస్తూ ఏవియేషన్ రెగ్యులేటరీ డీజీసీఏ ఉత్తర్వులు జారీ చేసింది. సిమ్యులేటర్ శిక్షణ పొందకుండానే ఇండోర్ విమానాశ్రయంలో విస్తారా విమానాన్ని ల్యాండ్ చేశారనేది ఆరోపణ. అయితే ఈ విమానం ఎక్కడ నుండి బయలుదేరింది, ఎప్పుడు జరిగింది అనేది స్పష్టత లేదు. ఇండోర్ విమానాశ్రయంలో సరైన శిక్షణ లేని పైలట్ ప్రయాణీకుల విమానాన్ని ల్యాండింగ్‌కు అనుమతించినందుకు విస్తారాపై రూ. 10 లక్షల జరిమానా విధించినట్లు డీజీసీఏ అధికారులు గురువారం తెలిపారు. విమానంలో పైలట్, సిమ్యులేటర్‌లో అవసరమైన శిక్షణ పొందకుండానే ఇండోర్ విమానాశ్రయంలో విమానాన్ని ల్యాండ్ చేశారని పేర్కొన్నారు. ఇది విమానంలోని ప్రయాణీకుల ప్రాణాలకు ముప్పు తెచ్చే చర్య అంటూ అధికారులు మండిపడ్డారు. ప్రయాణీకులతో కూడిన విమానాన్ని ల్యాండ్ చేయడానికి ముందుగా సిమ్యులేటర్‌లో పైలట్‌కు శిక్షణ ఇవ్వాలి. విమానాన్ని ల్యాండ్ చేయడానికి అనుమతించే ముందు కెప్టెన్ కూడా సిమ్యులేటర్ వద్ద శిక్షణ పొందాల్సి ఉంటుంది. కెప్టెన్, పైలట్ ఇద్దరికీ శిక్షణ లేదనీ, ఇది చాలా తీవ్రమైన విషయమంటూ, నిబంధనలు ఉల్లఘించిన విస్తారాపై ఆగ్రహం వ్యక్తం చేసింది. -
ఇండిగో ఓవర్ యాక్షన్: డీజీసీఏ స్ట్రాంగ్ రియాక్షన్
న్యూఢిల్లీ: విమానంలో ఎక్కకుండా నిరాకరించి దివ్యాంగ బాలుడిని ఘోరంగా అవమానించిన విమానయాన సంస్థ ఇండిగోకు షాక్ తగిలింది. ఈ ఘటనపై విచారణ చేపట్టిన టాప్ రెగ్యులేటర్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, పౌన విమానయాన నిబంధనలను ఉల్లంఘించారని సిబ్బందిపై మండిపడింది. ఈ క్రమంలో ఇండిగోకు 5 లక్షల రూపాయల జరిమానా విధించింది. ప్రత్యేక అవసరాల పిల్లల పట్ల ఇండిగో గ్రౌండ్ స్టాఫ్ అమర్యాదగా ప్రవర్తించారని విచారణలో తేలిందని డీజీసీఏ తాజాగా ప్రకటించింది. అలాగే మరోసారి ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా సంస్థ నిబంధనలను పునఃపరిశీలించాలని కూడా ఆదేశించింది. ఇటీవల (మే 7న) చోటు చేసుకున్న ఈ ఘటనపై విమాయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై దర్యాప్తు చేసి, కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. స్వయంగా తానే పర్యవేక్షిస్తానని కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా దివ్యాంగ కుమారుడితో కలిసి రాంచీ ఎయిర్‌పోర్టుకు వచ్చిన ఒక కుటుంబం పట్ల ఇండిగో సిబ్బంది అనుచితంగా ప్రవర్తించారు. ఆ చిన్నారి వల్ల ఇతర ప్రయాణికులకు ఇబ్బంది అంటూ వారిని అడ్డుకున్నారు. దీనిపై బాలుడి తల్లిదండ్రులు వాదించినా ఫలితం లేక పోయింది. దీంతో వారంతా తమ ప్రయాణాన్ని క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. అయితే ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను వీడియో తీసి మనీషా గుప్తా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. ఈ నేపథ్యంలో ఇండిగో సిబ్బంది తీరుపై నెటిజన్లు తీవ్రంగా మండిపడిన సంగతి తెలిసిందే. -
సంచలనం: పీకలదాకా మద్యం తాగి విమానం నడుపుతున్న పైలెట్లు!
విమానయాన రంగంలో 30కి పైగా వివిధ రకాలైన ఉద్యోగాలుంటాయి.వాటిలో మిగిలిన ఉద్యోగుల విధులు ఎలా ఉన్నా..ఆకాశంలో ఎగిరే విమానాన్ని నియంత్రించే అధికారం పైలెట్లకు మాత్రమే ఉంటుంది. అందుకే ఈ విభాగంలో ఉద్యోగులు ఎంతో నిబద్ధతో పనిచేయాల్సి ఉంటుంది. కానీ ఇటీవల విమానం పైలెట్ల గురించి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) సంస్థ విస్తుపోయే వాస్తవాల్ని బయట పెట్టింది. ఏవియేషన్ రెగ్యూలేటర్ ప్రకారం..విమానంలో ప్రయాణించే ముందు నిర్వహించిన బ్రీత్ ఎనలైజర్ (బీఏ) టెస్టుల్లో విఫలమైన విమాన సిబ్బందిపై డీజీసీఏ ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధ్యతాయుతమైన విధుల్లో ఉంటూ ఉద్యోగులకు తీరు ఇలాగే ఉంటుందా అని ప్రశ్నించింది. ఎందుకంటే ఏవియేషన్ రెగ్యులేటర్ జనవరి 1, 2022 నుండి నాలుగు నెలల కాలంలో 48 మంది సిబ్బందికి బ్రీత్ ఎనలైజర్ టెస్ట్‌లు చేయగా మద్యం సేవించడంతో పాటు ఇతర నిబంధనల్ని ఉల్లంఘించారు. దీంతో విమానయాన సిబ్బందిపై ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ నాలుగు నెలల కాలంలో బ్రీత్ ఎనలైజర్ టెస్ట్‌లో 9మంది పైలెట్లు, 30మంది క్యాబిన్ క్రూ సిబ్బందికి మద్యం సేవించినట్లు గుర్తించారు. వీరిలో ఇద్దరు పైలెట్లు, ఇద్దరు క్యాబిన్ క్రూ సిబ్బంది రెండోసారి మద్యం తాగినట్లు తేలడంతో మూడేళ్లపాటు సస్పెండ్ చేసింది. మిగిలిన 37 మంది సిబ్బందిని తొలిసారి పాజిటివ్ రావడంతో వారిని సైతం 3 నెలల పాటు సస్పెండ్ చేసినట్లు అధికారులు తెలిపారు. కాగా, విమానయాన సంస్థలు కాక్‌పిట్, క్యాబిన్ క్రూ సభ్యులలో 50 శాతం మందిని రోజూ ప్రీ ఫ్లైట్ ఆల్కహాల్ టెస్ట్‌లు చేయించుకోవాలని గత నెలలో డీజీసీఏ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. కరోనా వ్యాప్తికి ముందే సిబ్బంది విమాన ప్రయాణానికి ముందే ఆల్కహాల్ టెస్ట్‌లు చేయించుకోవాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా 2 నెలలు బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ల్ని నిలిపివేశారు. కరోనా తగ్గుముఖం పట్టి, విమానయాన సర్వీసులు ప్రారంభం కావడంతో బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ల్ని మళ్లీ ప్రారంభించారు. తాజాగా నిర్వహించిన ఈ టెస్ట్‌ల్లో విమానయాన సిబ్బంది బాగోతం బట్టబయలైంది. చదవండి👉మద్యం తాగి కాక్‌పిట్‌లో ప్రయాణం -
ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న విమాన ఛార్జీలు
న్యూఢిల్లీ: దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణికులు చెల్లించే ఏవియేషన్ సెక్యూరిటీ ఫీజు(ఎ.ఎస్.ఎఫ్) ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న నేపథ్యంలో విమాన ఛార్జీలు ప్రియం కానున్నాయి. ప్రస్తుతం దేశీయ ప్రయాణికులు చెల్లించే ఎ.ఎస్.ఎఫ్ ఫీజు రూ.160 నుంచి రూ.200కు, అంతర్జాతీయ ప్రయాణీకులు చెల్లించే ఎ.ఎస్.ఎఫ్ ఫీజు 5.2 డాలర్ల నుంచి 12 డాలర్లకు పెరగనుంది. ఈ కొత్త రేట్లు ఏప్రిల్ 1, 2021 నుంచి విమాన టిక్కెట్లపై వర్తిస్తాయి. గత రెండు నెలలుగా జెట్ ఇంధన ధరలు పెరగడంతో విమాన చార్జీలు ఇప్పటికే 30 శాతం పెరిగిన నేపథ్యంలో తాజాగా మరోసారి చార్జీలు పెరగడంతో గగన విహారం భారం కానుంది. ఏవియేషన్ రెగ్యులేటర్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) జారీ చేసిన ఉత్తర్వులలో.. వివిధ వర్గాలలో ఉన్న కొద్దిమంది ప్రయాణీకులకు ఈ రుసుము చెల్లింపు విషయంలో మినహాయింపు ఉంది. వీరిలో 2 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు, దౌత్య పాస్‌పోర్ట్ హోల్డర్లు, వైమానిక సిబ్బంది, ఒకే టికెట్‌పై కనెక్టింగ్ ఫ్లైట్ ప్రయాణీకులకు ఈ ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. దేశీయంగా, ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో గతంలో షెడ్యూల్ చేసిన అంతర్జాతీయ విమానాల నిషేధాన్ని మార్చి 31, 2021 నుంచి 2021 ఏప్రిల్ 30 అర్ధరాత్రి వరకు పొడగించినట్లు గమనించాలి. అయితే, ఇది కార్గో విమానాలకు, డీజీసీఏ ఆమోదించిన వాటికి వర్తించదు. చదవండి: ఎలోన్ మస్క్ టెస్లా విషయంలో కీలక నిర్ణయం! వన్‌ప్లస్ 9 సిరీస్ స్మార్ట్‌ఫోన్ ఉచితంగా పొందండిలా! -
విమానాల్లో ‘యాపిల్ మాక్‌బుక్ ప్రో’ తేవద్దు
న్యూఢిల్లీ: విమాన ప్రయాణం చేసే ప్రయాణికులు యాపిల్ మాక్‌బుక్ ప్రో 15 అంగుళాల మోడల్ ల్యాప్‌టాప్‌ను తీసుకురావద్దని విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ ప్రయాణికులను కోరింది. ఆ మోడల్లోని కొన్ని ల్యాప్‌టాప్‌ల బ్యాటరీలు అధికంగా వేడికి గురవుతున్నాయని, ప్రయాణికుల భద్రత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. ఇదే విషయమే జూన్ 20వ తేదీన యాపిల్ సంస్థ సైతం తమ వెబ్సైట్లో ఈ మోడల్ ల్యాప్‌టాప్‌లకు సంబంధించి ఓ హెచ్చరిక నోటీసును అందుబాటులో ఉంచింది. దీని ప్రకారం సెప్టెంబర్–2015 నుంచి ఫిబ్రవరి 2017 మధ్య కాలంలో విక్రయించిన ల్యాప్‌టాప్‌ల్లో బ్యాటరీ అధిక వేడికి గురవుతుందని పేర్కొంది. అలాగే ఈ ల్యాప్‌టాప్‌ల్లో బ్యాటరీలను ఉచితంగానే మార్పు చేయాలని నిర్ణయించామని యాపిల్ సంస్థ తెలిపింది. బ్యాటరీని మార్పు చేసుకునే వరకు ప్రయాణికులు ఆ మోడల్ ల్యాప్‌టాప్‌లను తీసుకోరావద్దని డీజేసీఏ చీఫ్ అరుణ్ కుమార్ ట్వీట్ చేశారు. -
అశోక్ గజపతి రాజు వార్నింగ్
ముంబై: విమాన టికెట్ రద్దు చేసుకున్న ప్రయాణికులకు పన్ను, సుంకాలను తిరిగి చెల్లించకపోతే కఠిన చర్యలు తప్పవని పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు హెచ్చరించారు. ఎయిర్ ట్రావెల్ నిర్వాహకులు నిబంధనల ప్రకారం ప్రయాణికులకు చెల్లించాల్సినవి ఎందుకు చెల్లించడం లేదని ట్విటర్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా పన్ను, సుంకాలు తిరిగి చెల్లించడంలేదని తనకు ప్రయాణికుల నుంచి అనేక ఫిర్యాదులు వస్తున్నాయని వెల్లడించారు. ఎయిర్ ట్రావెల్ నిర్వాహకులు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇదే పరిస్థితి కొనసాగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గతేడాది నుంచి అమల్లోకి వచ్చిన ‘ప్యాసింజర్ ఫ్రెండ్లీ’ విధానంలో టికెట్ రద్దు చేసుకున్న ప్రయాణికులకు తప్పనిసరిగా పన్ను, సుంకాలు తిరిగి చెల్లించాలి.