PRO
-
మంత్రుల ప్రచారానికి సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్‌లు
సాక్షి, అమరావతి: ప్రతీ మంత్రిత్వ శాఖకు సంబంధించిన కార్యక్రమాలు, అభివృద్ధి పనులను వివరించడానికి ప్రతీ మంత్రి ఒక పీఆర్వో, ఒక సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్, ఒక సోషల్ మీడియా అసిస్టెంట్‌ను నియమించుకోవడానికి విధివిధానాలు, జీతభత్యాలను ఖరారుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. ఏడాది కాలంపాటు ఔట్సోర్సింగ్ విధానంలో ఏడీ డిజిటల్ కార్పొరేషన్ సంస్థ ద్వారా వీరి నియామకాలు జరగాలని సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి ఎస్. సురేష్‌కుమార్ ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. మంత్రుల పీఆర్వోల జీతం నెలకు రూ.37,000గాను, అదే సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్‌లకు నెలకు రూ.50,000లు, అసిస్టెంట్లకు రూ.30,000 చొప్పున నిర్ణయించారు. రోజువారీ కార్యక్రమాలు పర్యవేక్షించి, పత్రికా ప్రకటనలు విడుదల చేసే పీఆర్వోల కంటే సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టే సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్‌కు అధిక జీతం ఇవ్వడంపై మంత్రుల పేషీల్లో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. అంతేకాదు.. సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ సమాచార సేకరణ కోసం ప్రభుత్వంలోని ఉన్నతాధికారులను కలవడానికి కూడా అనుమతించింది. ఫ్యాక్ట్‌చెక్ పరిశీలన కోసం ఉన్నతాధికారులతో పాటు సీనియర్ జర్నలిస్టులు, ఎడిటోరియల్ స్టాఫ్‌లను సంప్రదించాల్సిందిగా ఆదేశించింది. ఈ విధంగా పీఆర్వోల కంటే సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్‌లకు విస్తృత అధికారాలు కల్పించి సోషల్ మీడియా ప్రచారానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు సర్కారు ఈ నిర్ణయం ద్వారా చాటిచెప్పింది. ఎగ్జిక్యూటివ్‌లు, పీఆర్వోలకు అర్హతలివే..ఇక ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బీఈ/బీటెక్ చేసిన అభ్యర్థులు సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్‌లుగా.. అసిస్టెంట్లుగా నియమించుకోడానికి కనీసం డిగ్రీ విద్యార్హతగా నిర్ణయించింది. అదే పీఆర్వోలు కనీసం డిగ్రీ అర్హత ఉండి జర్నలిజంలో డిప్లమో లేదా పబ్లిక్ రిలేషన్స్‌లో కనీసం ఐదేళ్లు అనుభవం ఉండాలని పేర్కొంది. వీరిని ఔట్‌సోరి్సంగ్ నియామక సంస్థ ఆప్కాస్ ద్వారా ఎంపిక చేస్తారు.కానీ, ఇప్పటికే చాలామంది మంత్రులు పీఆర్వోలను, సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్‌లను మూడు, నాలుగు నెలల క్రితమే నియమించుకున్నారు. జీఓ విడుదల కాకుండానే వీరిని అనధికారికంగా నియమించుకుని ఇప్పుడు వీరిని క్రమబద్ధీకరించుకోనున్నారు. కానీ, ఇలా అనుమతిలేకుండా నియమించుకోవడాన్ని అధికారులు తప్పుపడుతున్నారు. -
500 కుక్కలు.. 100 పిల్లులు
సలుకి, బిచాన్ ఫ్రైజ్, అమెరికన్ బుల్లీ, హెయిరీ డాచ్‌షండ్ వంటి అరుదైన కుక్కలు నగరంలో సందడి చేశాయి. కుక్కలు, పిల్లుల పెట్ లవర్స్ కోసం ఆదివారం నగరంలోని నార్సింగి వేదికగా ఓం కన్వెన్షన్‌లో నిర్వహించిన ‘పెడిగ్రీ ప్రో హైకాన్–24’ శునకాల ప్రపంచాన్ని నరవాసులకు పరిచయం చేసింది. ఈ ప్రదర్శనలో 500కు పైగా కుక్కలు, 100కు పైగా పిల్లులతో పాటు దాదాపు 5 వేల మంది పెట్ లవర్స్ పాల్గొన్నారు. హైదరాబాద్ కెనైన్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన షోలో తెలంగాణ అడిçషనల్æ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మహేష్ భగవత్ తన ఉమే గోల్డెన్ రిట్రీట్తో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఐఏఎస్ ఆఫీసర్ హరి చందన కూడా తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రదర్శనలో పాల్గొన్నారు. కెన్నెల్ క్లబ్ ఆఫ్ ఇండియా ఛాంపియన్షిప్ డాగ్ షో, ఇండియన్ క్యాట్ క్లబ్ క్యాట్ షోలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇందులో టాప్ 10 బ్రీడ్ అవార్డ్లు అందించారు. ఇందులో మైనే కూన్స్ దేశీయ జాతి పొడవైన పిల్లి ధర రూ. 2.5 లక్షలు పైనే. మరో విదేశి జాతి బ్రిటిష్ షార్ట్హైర్స్ ధర రూ.1.2 లక్షల పై మాటే. వీటి ఆహారం, పెంపకం, సంరక్షణ తదితర అంశాకు చెందిన పరిశ్రమల స్టాల్స్ ఇందులో కొలువుదీరాయి. బ్రీడ్స్ నాణ్యత కాపాడాలి.. కుక్కల పెంపకం, సంరక్షణ పై అవగాహన కల్పించడమే లక్ష్యం. ఇందులో భాగంగా 150కి పైగా విభిన్న జాతుల నాణ్యతా ప్రమాణాలను మెరుగుపరచాలి. కరోనా సమయంలో చాలామంది జంతువులను దత్తత తీసుకున్నారు. కానీ కోవిడ్ ముగిసిన తర్వాత చాలా మంది విడిచిపెట్టడం బాధాకరం. – డాక్టర్ ఎం ప్రవీణ్ రావు, కెనైన్ క్లబ్ ప్రెసిడెంట్కుక్కలకూ సప్లిమెంట్లు.. కుక్కల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన సప్లిమెంట్ ‘అబ్సొల్యూట్ పెట్’. భారత్‌లో నూతనంగా ఆవిష్కరించాం. చర్మ సమ్యలు, ఫుడ్‌పాయిజన్ తదితర సమస్యలకు మంచి ఫలితాలను అందిస్తుంది. – జాహ్నవి, అబ్సొల్యూట్ పెట్. -
స్టూడెంట్‌కి పీఆర్వో లైంగిక వేధింపులు.. ఓవెల్ 14 స్కూల్ గుర్తింపు రద్దు
సాక్షి, నెల్లూరు: అభం, శుభం తెలియని చిన్నారి విద్యార్థినిపై ఆ పాఠశాల పీఆర్వో లైంగిక దాడి, వేధింపులకు పాల్పడిన ఘటన నెల్లూరు నగరంలో శనివారం వెలుగు చూసింది. పోలీసులు, బాధితుల సమాచారం మేరకు... అల్లూరు మండలం గోగులపల్లికి చెందిన బ్రహ్మయ్య పొదలకూరురోడ్డు డైకస్‌రోడ్డు విజయలక్ష్మీనగర్‌లోని ఓవెల్ 14 స్కూల్లో పీఆర్వోగా పనిచేస్తున్నాడు. ఆయన అదే పాఠశాలలో నాల్గోతరగతి చదువుతున్న బాలికతో కొంతకాలంగా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఈ విషయం ఇంట్లో చెబితే తల్లిదండ్రులను చంపేస్తామని బెదిరించసాగాడు. కొద్ది రోజులుగా బాలిక స్కూల్‌కు వెళ్లేందుకు భయపడుతోంది. పీఆర్వో వైఖరిపై పాఠశాలలోని ఉపాధ్యాయురాలికి చెప్పినా ఆమె పట్టించుకోలేదు. దీంతో శనివారం పాఠశాలకు వెళ్లిన బాలిక అనారోగ్యంగా ఉందంటూ కొద్ది సేపటికే ఇంటికి తిరిగి వెళ్లిపోయింది. బాలిక ప్రవర్తనలో మార్పును గమనించిన తల్లిదండ్రులు అసలేం జరిగిందని ప్రశ్నించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పీఆర్వో ఏదో ఒక సాకుతో ల్యాబ్‌లోకి తీసుకెళ్లి తనతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఇంట్లో చెబితే చంపేస్తానని బెదిరిస్తున్నాడని తల్లిదండ్రులకు చెప్పి బోరున విలపించింది. దీంతో తల్లిదండ్రులు, బంధువులు పాఠశాల వద్దకు చేరుకుని పీఆర్వో వైఖరిపై స్కూల్ యాజమాన్యాన్ని నిలదీశారు. చదవండి: (మోసపోయానని భావించి.. డెత్‌నోట్‌రాసి ప్రైవేట్ లెక్చరర్ బలవన్మరణం) పీఆర్వో వికృత చర్యలపై పాఠశాల ఉపాధ్యాయురాలికి చెప్పినా నిర్లక్ష్యంగా వ్యవహరించడమేంటంటూ మండి పడ్డారు. దీంతో వారి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. స్కూల్ యాజమాన్యం పీఆర్వోను వెనకేసుకు రావడంతో వారు ఆగ్రహానికి గురై పాఠశాల కిటికీ అద్దాలు పగులగొట్టారు. అక్కడే ఉన్న బ్రహ్మయ్యను చితకబాదారు. ఈ విషయమై స్థానికులు డయల్ 100కు ఫిర్యాదు చేశారు. వేదాయపాళెం ఇన్స్పెక్టర్ కె. నరసింహరావు, ఎస్ఐ శ్రీహరిబాబు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. బ్రహ్మయ్యను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. ఈ ఘటనపై ఎస్పీ సీహెచ్ విజయారావు ఆరా తీశారు. ఎస్పీ ఆదేశాల మేరకు నిందితుడిపై పోక్సో, ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కింద వేదాయపాళెం పోలీసులు కేసు నమోదు చేశారు. నగర డీఎస్పీ డి. శ్రీనివాసరెడ్డి, ఇన్స్పెక్టర్ నరసింహరావు పాఠశాలకు చేరుకుని విచారణ చేపట్టారు. సీసీపుటేజ్‌లను సేకరించారు. ఇదిలా ఉంటే బ్రహ్మయ్యపై గతంలో పలు ఆరోపణలున్నాయి. అయినప్పటికీ అతనిపై పాఠశాల యాజమన్యం ఎలాంటి చర్యలు తీసుకోలేదని తల్లిదండ్రులు ఆరోపించారు. ఎంఈఓ విచారణ ఈ విషయం జిల్లా వ్యాప్తంగా కలకలం రేకెత్తించడంతో డీఈఓ విచారణకు ఆదేశించారు. ఎంఈఓ తిరుపాల్ స్కూల్లో విచారణ చేపట్టారు. ప్రిన్సిపల్‌తో పాటు ఉపాధ్యాయులను విచారించారు. ఈ విషయమై ఎంఈఓను సంప్రదించగా డిప్యూటీ డీఈఓ, తాను విచారణ నిర్వహిస్తున్నామని, విచారణ పూర్తయిన అనంతరం నివేదికను డీఈఓకు అందజేస్తామని తెలిపారు. ఓవెల్ 14 స్కూల్ గుర్తింపు రద్దు బాలికపై పీఆర్వో లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో నిర్ధారణ కావడం, ఓవెల్ 14 స్కూల్ యాజమాన్యం పూర్తి నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించిన నేపథ్యంలో ఆ స్కూల్ గుర్తింపును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ఇన్చార్జి డీఈఓ సుబ్బారావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. తల్లిదండ్రుల కోరిక మేరకు విద్యార్థులను వారికిష్టమైన పాఠశాలలో చేర్చేందుకు విద్యాశాఖ బాధ్యత తీసుకుంటుందని చెప్పారు. -
ఆర్టీసీ పీఆర్ఓగా చంద్రకాంత్
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ప్రజా సంబంధాల అధికారి (పీఆర్ఓ)గా రాజేంద్రనగర్ డిపో మేనేజర్ చంద్రకాంత్ నియమితులయ్యారు. ఇంతకాలం పీఆర్ఓగా పనిచేసిన కిరణ్‌ను వరంగల్ రీజియన్‌కు బదిలీచేశారు. త్వరలో జరిగే మేడారం జాతరకు సంబంధించి బస్సుల నిర్వహణలో ఆయన వరంగల్ రీజినల్ మేనేజర్‌కు సహాయకారిగా ఉండాలని ఎండీ సజ్జనార్ ఆదేశిస్తూ ఆదేశాలు జారీచేశారు. హైదరాబాద్–3 డీఎం శ్రీనాథ్‌ను రాజేంద్రనగర్ డీఎంగా బదిలీచేశారు. -
టాలీవుడ్లో విషాదం: జూ. ఎన్టీఆర్ మేనేజర్, నిర్మాత మృతి
టాలీవుడ్లో విషాదం చోటుచేసుకుంది. యంగ్‌టైగర్ ఎన్టీఆర్ పీఆర్ఓ, ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ ప్రొడ్యూసర్ మహేశ్ కోనేరు గుండెపోటుతో మరణించారు. ఈ రోజు ఉదయం విశాఖపట్నంలోని ఆయన నివాసంలో మహేశ్‌కు ఛాతిలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ మహేశ్ తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. చదవండి: తన రాజీనామా లేఖలో నాగబాబు సంచలన వ్యాఖ్యలు దీంతో ఆయన మృతికి టాలీవుడ్ సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు నివాళులు ఆర్పిస్తున్నారు. కాగా ఎంతోకాలంగా జూ. ఎన్టీఆర్‌కు మహేశ్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. అలాగే పలు సినిమాలకు ఆయన డిస్ట్రిబ్యూటర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. ఆ తర్వాత ఆయన ‘118, మిస్ ఇండియా, తిమ్మరుసు’ వంటి చిత్రాలను నిర్మించి నిర్మాతగా మారారు. Media Personality, Producer Mahesh Koneru passes away due to cardiac arrest today in Vizag. Om Shanthi pic.twitter.com/sxCmJxag13 — BA Raju's Team (@baraju_SuperHit) October 12, 2021 -
మంత్రి వేముల పీఆర్వోపై కేసు
-
భార్యపై మంత్రి వేముల పీఆర్వో దాడి.. కేసు నమోదు, వీడియో వైరల్
మంథని(పెద్దపల్లి జిల్లా): భార్యాభర్తల వివాదంలో వ్యవసాయ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పీఆర్ఓగా చెప్పుకుంటున్న తోట శ్రీకాంత్‌పై మంథని పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. మంథని ఎస్సై చంద్రకుమార్ వివరాల ప్రకారం.. మంథని మండలం గాజులపల్లికి చెందిన కోమలతతో కాల్వశ్రీరాంపూర్ మండలం ఎదులాపూర్‌కు చెందిన శ్రీకాంత్‌తో వివాహమైంది. రెండేళ్లుగా శ్రీకాంత్ కోమలతను కాపురానికి తీసుకెళ్లడం లేదు. ఆదివారం ఎదులాపూర్‌లో పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ జరగాల్సి ఉంది. కోమలత గ్రామ çసర్పంచ్ వద్దకు పిలిపిస్తే శ్రీకాంత్ రాలేదు. భర్తతో కలిసి వెళ్లేందుకు కోమలత సిద్ధంకాగా ఇద్దరిమధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో శ్రీకాంత్ కోమలతపై చేయి చేసుకున్నాడు. కోమలత మంథని పోలీస్ స్టేషన్‌కు చేరుకుని అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని శ్రీకాంత్‌పై ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. ఇవీ చదవండి: అదృష్టం వీరికి పిల్లి రూపంలో వచ్చింది ! పగలంతా పెద్ద మనుషులు, రాత్రి అయితే..? -
రాజుగారి ద్వారానే ఎన్నో విషయాలు నేర్చుకున్నా: చిరు
టాలీవుడ్ పీఆర్వో బీఏ రాజు మృతి పట్ల ప్రముఖుల సంతాపం వెల్లువెత్తుతోంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో అందరివాడిగా పేరున్న ఆయన.. ఇక లేరనే విషయాన్ని చాలామంది నమ్మలేకపోతున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి, బీఏ రాజులోని ప్రత్యేకతను గుర్తు చేసుకుంటూ నివాళి అర్పించాడు. మద్రాస్‌లో ఉన్నప్పుడు ఇండస్ట్రీ విషయాలెన్నో బీఏ రాజు తనతో పంచుకునేవారని, షూటింగ్ స్పాట్‌కి వచ్చి సరదాగా ముచ్చటించేవారని చిరు గుర్తుచేసుకున్నారు. అంతేకాదు ఇండస్ట్రీకి సంబంధించి కొత్త విషయాలెన్నో రాజుగారి ద్వారానే తెలుసుకున్నానని చెప్పారు. సినిమాలకు సంబంధించి కలెక్షన్ల దగ్గరి నుంచి ఎన్ని సెంటర్లు ఆడిందనే విషయాల దాకా ప్రతీ చిన్న కూడా అలవోకగా చెప్పే రాజుగారు.. సినీ ఇండస్ట్రీకి ఒక ఎన్సైక్లోపీడియా లాంటి వారని పొగడ్తలు గుప్పించాడు చిరంజీవి. బీఏ రాజు ఆత్మకు శాంతి కలగాలని కొరుకుంటూ, ఆయన కుటుంబానికి ట్విట్టర్ ద్వారా సానుభూతి తెలియజేశాడు. ఆత్మీయుడ్ని కోల్పోయా: సమంత బీఏరాజు మృతి పట్ల నటి సమంత అక్కినేని భావోద్వేగానికి లోనైంది. తన మొదటి సినిమా నుంచి ఆయన తన వెంటే ఉన్నారని, సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా తనతో ఆత్మీయంగా మాట్లాడేవారని గుర్తు చేసుకుంది. తన సినీ జీవితానికి బీఏ రాజు ఒక ఆశాకిరణంగా ఉన్నారని #RipBaRajuGaru హ్యాష్‌ట్యాగ్‌తో సమంత ట్వీట్ చేసింది. మరోవైపు హీరో ప్రభాస్ తన ఫేస్బుక్లో నివాళి అర్పించాడు. రాజుగారితో తాను పనిచేశానని, ఆయన తన ఇంటి మనిషి అని ప్రభాస్ ఎమోషనల్ అయ్యాడు. పదిహేను వందలకుపైగా సినిమాలకు పనిచేసిన బీఏరాజు మృతి దిగ్భ్రాంతి కలిగించిందని దర్శకుడు రాజమౌళి ట్వీట్ చేశాడు. మరోవైపు మ్యూజిక్ డైరెక్టర్లు దేవీ శ్రీప్రసాద్, థమన్లు కూడా రాజు మృతిపట్ల నివాళి అర్పించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
మహేష్‌బాబు భావోద్వేగం
ప్రముఖ సినీ జర్నలిస్ట్, పీఆర్వో బీఏ రాజు హాఠాన్మరణం యావత్ టాలీవుడ్‌ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. నాలుగున్నర దశాబ్దాలుగా సినీరంగంలో ఉన్న ఆయనతో అనుబంధాన్ని పలువురు సెలబ్రిటీలు గుర్తుచేసుకుంటున్నారు. ముఖ్యంగా సూపర్‌స్టార్ మహేష్‌బాబుతో ఆయన స్పెషల్ బాండింగ్ కొనసాగించారు. ఈ విషయాన్ని గుర్తు చేసుకుని మహేష్‌బాబు సోషల్ మీడియాలో ఎమోషన్ అయ్యాడు. ‘‘బీఏ రాజుగారు చిన్నప్పటి నుంచి ఆయన తెలుసు. ఆయనతో చాలా దగ్గరగా పనిచేశాను. సినీ పరిశ్రమలో ఆయనకొక జెంటిల్‌మ్యాన్. నిబద్ధతతో పనిచేసేవారు. ఆయన మరణాన్నితట్టుకోలేకపోతున్నాను. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను’’ అని ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో మహేష్‌బాబు పోస్ట్ చేశాడు. ఇక బీఏ రాజు మరణవార్త తెలియగానే షాక్‌కి గురయ్యానంటూ జూనియర్ ఎన్జీఆర్ ట్వీట్ చేశాడు. పీఆర్వోగా, జర్నలిస్ట్‌గా ఫిల్మ్ ఇండస్ట్రీకి గొప్పసేవలు ఆయన అందించాడని, రాజుగారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు. దర్శకులు సంపత్ నంది, మెహర్ రమేష్‌లు, యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్, రైటర్ గోపీ మోహన్, దర్శకనిర్మాత మధురా శ్రీధర్ తదితరులు సోషల్ మీడియాలో బీఏ రాజు మృతి పట్ల నివాళులర్పించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) Not able to process the sudden demise of BA Raju garu. I've known him since my childhood. We travelled together for many years and I worked with him very closely. pic.twitter.com/N6gbW8DPxv — Mahesh Babu (@urstrulyMahesh) May 21, 2021 The sudden demise of BA Raju Garu has left me in shock. As one of the most senior film journalists & PRO,he has contributed greatly to the Film Industry. I've known him since my earliest days in TFI. It is a huge loss.Praying for strength to his family. Rest in Peace Raju Garu 🙏🏻 pic.twitter.com/B5lytChlqW — Jr NTR (@tarak9999) May 22, 2021 -
రైళ్లను పెంచుతున్నాం.. ఎంఎంటీఎస్‌పై స్పష్టత రాలేదు
సాక్షి, హైదరాబాద్: రైళ్లను దశలవారీగా పెంచుతున్నామని, కరోన ముందు నడిచే రైళ్లు 70 శాతం ఇప్పటికే నడుస్తున్నాయని దక్షిణమధ్య రైల్వే సీపీఆర్ఓ రాకేష్ తెలిపారు. ఆయన బుధవారం సాక్షి టీవీతో మాట్లాడుతూ.. సుమారు 300 రైళ్లు ఉండేవి అందులో 215 రైళ్లు నడుస్తున్నాయని తెలిపారు. ఇప్పటికే 140 రైళ్లు దక్షిణ మధ్య రైల్వే జోన్ నుంచి నడుస్తున్నాయని పేర్కొన్నారు. ఏప్రిల్ 1నుంచి కొన్ని రైళ్లు పెంచుతున్నామని, ఇవన్నీ సికింద్రాబాద్ జోన్ నుంచి వెళ్తాయని తెలిపారు. పూర్తిగా రైళ్లని రిజర్వేషన్ ఉన్నవారికి మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. ఎక్కడ కూడా సాధారణ ప్రయాణికులు రావడానికి అనుమతి లేదన్నారు. రిజర్వేడ్ రైళ్లు మాత్రమే నడుస్తున్నాయిని, వెయిటింగ్ లిస్ట్ ఉన్నవారిని కూడా అనుమతించడం లేదని పేర్కొన్నారు. ఎంఎంటీఎస్ రైళ్ల పునరుద్ధరనపై ఇంకా స్పష్టత రాలేదన్నారు. కోవిడ్ కేసులు ఇంకా తగ్గని కారణంగా దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. పరిస్థితి బట్టి ఎంఎంటీఎస్ రైళ్ల ప్రకటన ఉంటుంది అనుకుంటున్నామని ఆయన తెలిపారు. చదవండి: పట్టాలెక్కనున్న మరిన్ని స్పెషల్ రైళ్లు -
సీఎం కేసీఆర్ పీఆర్వో విజయ్ రాజీనామా!
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ (పీఆర్వో) గటిక విజయ్‌కుమార్ బుధవారం రాజీనామా చేశారు. సీఎం పీఆర్వో పోస్టుతోపాటు ట్రాన్స్‌కో జనరల్ మేనేజర్ (కార్పొరేట్ కమ్యూనికేషన్స్) పోస్టుకు కూడా ప్రభుత్వం ఆయనతో రాజీనామా చేయించింది. ఈ రాజీనామాలు తక్షణమే ఆమోదం పొందాయి. తెలంగాణ ఏర్పాటైనప్పటి నుంచి సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా వ్యవహరించిన విజయ్‌కుమార్.. అకస్మాత్తుగా రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. తీవ్ర స్థాయిలో ఆరోపణలు రావడంతోనే కేసీఆర్ ఆగ్రహానికి గురైనట్టు ప్రభుత్వ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. వ్యక్తిగత కారణాలతో సీఎం పీఆర్వో పోస్టుకు రాజీనామా చేసినట్టు విజయ్‌కుమార్ బుధవారం ఫేస్బుక్ ద్వారా ప్రకటించారు. గొప్ప స్థాయిలో పనిచేసే అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రులు, ఉన్నతాధికారుల్లో అసంతృప్తితో.. విజయ్‌కుమార్ కేసీఆర్‌తో ఉన్న సాన్నిహిత్యాన్ని అడ్డుగా పెట్టుకుని మంత్రులు, ఉన్నతాధికారులతో ఆధిపత్య ధోరణిలో వ్యవహరించేవారన్న ఆరోపణలున్నాయి. దీనిపై వారు చాలా రోజులుగా అసంతృప్తితో ఉన్నట్టు తెలిసింది. గతంలో వివిధ న్యూస్ చానళ్లలో రిపోర్టర్‌గా పనిచేసిన విజయ్‌కుమార్.. ఔట్ సోర్సింగ్ విధానంలో సీఎం పీఆర్వోగా నియమితుడై.. కొద్దికాలంలోనే కేసీఆర్‌కు దగ్గరయ్యారు. ప్రగతి భవన్లో కీలక వ్యక్తిగా ఎదిగారు. విజయ్‌కుమార్ కోసమే ట్రాన్స్‌కో యాజమాన్యం మూడేళ్ల కింద జనరల్ మేనేజర్ (కార్పొరేట్ కమ్యూనికేషన్స్) పోస్టును సృష్టించి, ఆయనను ఎంపిక చేసింది. ఇలా ప్రాధాన్యత పెరిగిపోవడంతో విజయ్‌కుమార్ పలు వ్యవహారాల్లో కల్పించుకుని ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సిద్దిపేట పోలీసు స్టేషన్ పరిధిలో ఓ మహిళకు సంబంధించిన కుటుంబ తగాదా కేసులో విజయ్‌కుమార్ జోక్యం చేసుకుని, పోలీసులపై ఒత్తిడి తెచ్చారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన ఓ ఇసుక రీచ్‌ను సైతం తన వ్యక్తులకు ఇప్పించుకున్నట్టు ఆరోపణలున్నాయి. వీటికితోడు ప్రగతిభవన్ నుంచి రాజకీయ అంశాలపై కొందరికి లీకులు ఇచ్చేవారన్న ప్రచారం ఉంది. వరంగల్ జిల్లాలో పలు భూవివాదాల్లో జోక్యం చేసుకున్నట్టు ఇంటెలిజెన్స్ నుంచి సీఎంకు నివేదిక అందినట్టు సమాచారం. ఈ ఆరోపణలతోనే రాజీనామా చేయాల్సి వచ్చినట్టు తెలిసింది. దీనిపై ‘సాక్షి’వివరణ కోరగా విజయకుమార్ స్పందించలేదు. చదవండి: నెల రోజులుగా సీఎం కేసీఆర్ బిజీబిజీ -
విమానాల్లో ‘యాపిల్ మాక్‌బుక్ ప్రో’ తేవద్దు
న్యూఢిల్లీ: విమాన ప్రయాణం చేసే ప్రయాణికులు యాపిల్ మాక్‌బుక్ ప్రో 15 అంగుళాల మోడల్ ల్యాప్‌టాప్‌ను తీసుకురావద్దని విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ ప్రయాణికులను కోరింది. ఆ మోడల్లోని కొన్ని ల్యాప్‌టాప్‌ల బ్యాటరీలు అధికంగా వేడికి గురవుతున్నాయని, ప్రయాణికుల భద్రత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. ఇదే విషయమే జూన్ 20వ తేదీన యాపిల్ సంస్థ సైతం తమ వెబ్సైట్లో ఈ మోడల్ ల్యాప్‌టాప్‌లకు సంబంధించి ఓ హెచ్చరిక నోటీసును అందుబాటులో ఉంచింది. దీని ప్రకారం సెప్టెంబర్–2015 నుంచి ఫిబ్రవరి 2017 మధ్య కాలంలో విక్రయించిన ల్యాప్‌టాప్‌ల్లో బ్యాటరీ అధిక వేడికి గురవుతుందని పేర్కొంది. అలాగే ఈ ల్యాప్‌టాప్‌ల్లో బ్యాటరీలను ఉచితంగానే మార్పు చేయాలని నిర్ణయించామని యాపిల్ సంస్థ తెలిపింది. బ్యాటరీని మార్పు చేసుకునే వరకు ప్రయాణికులు ఆ మోడల్ ల్యాప్‌టాప్‌లను తీసుకోరావద్దని డీజేసీఏ చీఫ్ అరుణ్ కుమార్ ట్వీట్ చేశారు. -
పీఆర్ టీం అత్యుత్సాహం.. సారీ చెప్పిన హీరో
చాలా సందర్భాల్లో తమ వ్యక్తిగత సిబ్బంది, పీఆర్ సిబ్బంది చేసే తప్పుల కారణంగా సెలబ్రిటీలకు ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ముఖ్యంగా సినీరంగంలో ఉన్నవారికి ఇలాంటి అనుభవాలు ఎక్కువగా ఉంటాయి. తాజాగా ఓ హీరోకు సంబంధించిన పీఆర్ టీం అత్యుత్సాహం కారణంగా ఏకంగా హీరోనే క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. కోలీవుడ్ యంగ్ హీరో అధర్వ హీరోగా తెరకెక్కిన మూవీ ‘100’. ఈ సినిమా రిలీజ్ సందర్భంగా మీడియా కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక షోలో అధర్వ పీఆర్ టీం చేసిన పనికి అధర్వ స్వయంగా క్షమాపణ కోరాల్సి వచ్చింది. ప్రెస్‌కు వచ్చిన శుభకీర్తన అనే మహిళా రిపోర్టర్‌కు పీఆర్ టీం టికెట్ ఇవ్వలేదు. ప్రత్యేకంగా ప్రెస్ కోసం ఏర్పాటు చేసిన షోలో రిపోర్టర్‌కు టికెట్ ఇవ్వకపోగా మీ టికెట్ మీరే తీసుకోవాలి మేము సహాయం చేయలేం అంటూ సమాధానమిచ్చారు. తనకు ఎదురైన అనుభవాన్ని శుభకీర్తన ట్విటర్లో పోస్ట్ చేశారు. ‘ఇలాంటి వారి నుంచి ప్రొఫెషనలిజం ఆశించవద్దనే.. కొత్త పాఠం నేర్పించారు’ అంటూ పీఆర్ టీంకు చురకలంటించారు. ఈ ట్వీట్‌పై స్పందించిన హీరో అధర్వ, దర్శకుడు సామ్ ఆంటోన్లు శుభకీర్తనను తన టీం తరపున క్షమాపణలు కోరారు. అధర్వ తనను కాంటాక్ట్ చేసిన విషయాన్ని ఆమె తన ట్విటర్ ద్వారా వెల్లడించారు. The Tamil film PR guys think they screen shows for the press by doing us a favour. At the #100TheMovie press show, I was told, 'There's no seat. You've got to find one for yourself. We can't help.' Thanks, @DoneChannel1 for showing me not to expect professionalism. Lesson learnt. — Subhakeerthana (@bhakisundar) 8 May 2019 Sorry mam .. I will make sure will give u tickets when the movie releases .. I apologise on my behalf — sam anton (@samanton21) 9 May 2019 -
శ్రీశైలం పీఆర్వో పై హత్యాయత్నం
-
నేటి నుంచి ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్
-
సింధు వర్సెస్ సైనా
గువాహటి: బ్యాడ్మింటన్ అభిమానులను అలరించడానికి ప్రొ బ్యాడ్మింటన్ లీగ్ సీజన్–3 సిద్ధమైంది. నేటి నుంచి 23 రోజుల పాటు గువాహటి, లక్నో, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్ నగరాల్లో ఈ పోటీలు జరుగుతాయి. స్థానిక కరమ్‌బీర్ నబీన్ చంద్ర బర్డోలాయ్ ఏసీ ఇండోర్ స్టేడియంలో జరిగే టోర్నీ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై స్మాషర్స్ జట్టు అవధ్ వారియర్స్‌తో తలపడనుంది. మహిళల సింగిల్స్ విభాగంలో భాగంగా చెన్నై తరఫున పీవీ సింధు, అవధ్ తరఫున సైనా నెహ్వాల్‌లు తొలి మ్యాచ్‌లో తలపడనున్నారు. ఇటీవలే జాతీయ సీనియర్ చాంపియన్‌షిప్‌లో సింధును ఓడించి సైనా జోరు కనబరిచింది. అయినప్పటికీ ముఖాముఖిలో 2–1తో సింధుదే పైచేయిగా ఉంది. సీజన్–2లో ఆరు జట్లతో జరిగిన పీబీఎల్‌లో ఈసారి మరో రెండు జట్లు జతయ్యాయి. కొత్తగా అహ్మదాబాద్ స్మాష్ మాస్టర్స్, నార్త్ ఈస్ట్రన్ వారియర్స్ జట్లు లీగ్‌లో చేరాయి. వీటితో పాటు ఢిల్లీ ఏసర్స్ జట్టు పేరు మార్చుకొని ఢిల్లీ డాషర్స్ పేరుతో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. పీబీఎల్‌లో తొలిసారిగా మహిళల నం.1 క్రీడాకారిణి తైజు యింగ్ (తైవాన్) అరంగేట్ర జట్టు అహ్మదాబాద్ స్మాషర్స్ తరఫున బరిలోకి దిగనుంది. పురుషుల విభాగంలోనూ వరల్డ్ నం.1 విక్టర్ అక్సెల్సన్ బెంగళూరు బ్లాస్టర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈసారి 10 మంది ఒలింపియన్లు లీగ్‌లో పాల్గొననుండటం విశేషం. టోర్నీ ఫార్మాట్ ప్రకారం ఇరు జట్ల మధ్య రెండు పురుషుల సింగిల్స్, ఒక మహిళల సింగిల్స్, మిక్స్డ్ డబుల్స్, పురుషుల డబుల్స్ విభాగాల్లో ఐదు మ్యాచ్‌లు జరుగుతాయి. ఒక్కో మ్యాచ్ మూడు గేమ్‌ల పాటు జరుగుతుంది. ప్రతీ గేమ్‌కు గరిష్టంగా 15 పాయింట్లు సాధించాల్సి ఉంటుంది. గత సీజన్లో 11 పాయింట్లతో గేమ్‌ను నిర్వహించారు. లీగ్ దశ ముగిశాక పాయింట్లపరంగా టాప్–4 జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. టోర్నీలో కీలకమైన సెమీస్ మ్యాచ్‌లతో పాటు, ఫైనల్ పోరుకు హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. టోర్నీ మొత్తం ప్రైజ్‌మనీ రూ.6 కోట్లు. ట్రోఫీతో 8 జట్ల మార్క్యూ ఆటగాళ్లు -
తెయూ పీఆర్వోగా
తెయూ (డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ ప్రజా సంబంధాల అధికారి (పీఆర్వో)గా మాస్ కమ్యూనికేషన్ విభాగాధిపతి డాక్టర్ కె.రాజారాం మరోసారి నియమితులయ్యారు. ఈ మేరకు రిజిస్ట్రార్ జయప్రకాశ్‌రావు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏడాది పాటు ఈ పదవిలో కొనసాగనున్న రాజారాం.. గతంలోనూ కాశీరాం, అక్బర్ అలీఖాన్ వీసీలుగా ఉన్నప్పుడు పీఆర్వోగా పని చేశారు. మరోసారి పీఆర్వో రాజారాంను అధ్యాపకులు, సిబ్బంది అభినందించారు. -
దీవా జంక్షన్లో మరో ఫ్లాట్‌ఫాం..!
ప్రణాళిక రూపొందించిన ఎమ్మార్వీసీ సాక్షి, ముంబై: దీవా జంక్షన్లో లోకల్ ఫాస్ట్ రైళ్లు నిలిపేందుకు ముంబై రైల్వే వికాస్ కార్పొరేషన్ (ఎమ్మార్వీసీ) నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం దీవా స్టేషన్లో ఒకటో నంబరు ప్లాట్‌ఫాం పక్కన ఉన్న ఖాళీ స్థలంలో మరో ప్లాట్‌ఫాం నిర్మించాలని ప్రణాళిక రూపొందించింది. ఫ్లాట్‌ఫాం నిర్మాణానికి దాదాపు ఏడాది పట్టవచ్చని సెంట్రల్ రైల్వే ప్రజా సంబంధాల అధికారి (పీఆర్వో) నరేంద్ర పాటిల్ తెలిపారు. దీవా జంక్షన్ కావడంతో ఇక్కడ ఫాస్ట్ లోకల్ రైళ్లు ఆపాలని కొంత కాలంగా స్థానికులు, ముంబై శివారు ప్రాంతాల్లో ఉంటున్న కొంకణ్ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. గత నెలలో ఇదే అంశంపై రైలు రోకో కూడా నిర్వహించారు. అది హింసాత్మకంగా మారడంతో ఈ అంశం రైల్వే దృష్టికి వచ్చింది. దీంతో తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నారు. దీవా స్టేషన్ నుంచి పన్వేల్ మీదుగా కొంకణ్, గోవా, మంగళూర్ తదితర (అప్, డౌన్) దూరప్రాంతాల ఎక్స్‌ప్రెస్, మెయిల్, ప్యాసింజర్ రైళ్లు ఇక్కడ ఆగుతాయి. వీటి కోసం పర్లాంగు దూరంలో ప్రత్యేకంగా ప్లాట్‌ఫాంలు ఉన్నాయి. వాటిపై లోకల్ ఫాస్ట్ రైళ్లు ఆపేందుకు వీలుపడదు. కర్జత్, అంబర్నాథ్, ఉల్లాస్‌నగర్, కసరా, టిట్వాల, శహాడ్ తదితర ప్రాంతాల నుంచి దీవాకు వచ్చేవారు కల్యాణ్‌లో రైలు మారాల్సి వస్తోంది. వికలాంగులు, వృద్ధులు, పిల్లలు, లగేజీ ఉన్నవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం ఫ్లాట్‌ఫాం నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదన రూపొందించడంలో అధికారులు మునిగిపోయారు. ఆ మేరకు కొత్తగా నిర్మించే ప్లాట్‌ఫారంపై స్లో అప్, డౌన్ లోకల్ రైళ్లు, ప్రస్తుతం ఉన్న పాత ప్లాట్‌ఫారంపై ఫాస్ట్ అప్, డౌన్ రైళ్లు నిలిపేందుకు మార్గం సుగమం కానుంది. -
తెలంగాణ సర్వే అందుకేనా?!
-
సంస్థ - ప్రజల మధ్య వారధి.. పీఆర్ఓ
అప్‌కమింగ్ కెరీర్: ఒక సంస్థ మార్కెట్లో నిలదొక్కుకొని, నాలుగు కాలాలపాటు తన స్థానాన్ని కాపాడుకోవాలంటే ప్రజల్లో దానికి ఒక గుర్తింపు రావాలి. ఆ గుర్తింపును తెచ్చిపెట్టే ఉద్యోగి ప్రజా సంబంధాల అధికారి(పీఆర్ఓ). అంటే సంస్థ -ప్రజలకు నడుమ వారధి లాంటి వ్యక్తి.. పీఆర్ఓ. సంస్థ కార్యకలాపాలను, పనితీరును, ఉత్పత్తులను, వాటి నాణ్యతను ఎప్పటికప్పుడు వివిధ మార్గాల్లో ప్రజలకు చేరవేసి, సంస్థ మనుగడను కాపాడే నిపుణుడు.. పీఆర్ఓ. ఆధునిక కార్పొరేట్ యుగంలో డిమాండ్ పెరుగుతున్న కెరీర్.. పబ్లిక్ రిలేషన్స్. పీఆర్ఓలకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ప్రస్తుతం ఎన్నో అవకాశాలు ఉన్నాయి. అన్ని కార్పొరేట్ సంస్థలు, ఆసుపత్రులు, హోటళ్లు, ప్రముఖ కంపెనీలు, యాడ్ ఏజెన్సీలు ప్రజా సంబంధాల అధికారులను తప్పనిసరిగా నియమించు కుంటున్నాయి. ప్రభుత్వ సమాచార, పౌర సంబంధాల శాఖలో ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. పీఆర్ఓ.. తాను పనిచేస్తున్న సంస్థ గురించి వార్తాపత్రికలు, టీవీ ఛానళ్లు, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం నిర్వహించాల్సి ఉంటుంది. సంస్థలో జరిగే కార్యక్రమాలు, సదస్సులపై సమాచారాన్ని ప్రెస్నోట్ల రూపంలో ప్రసార మాధ్యమాలకు అందజేయాలి. అవి ప్రజలకు చేరేలా చూడాలి. ప్రెస్మీట్లు కూడా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. పీఆర్ఓలకు మీడియాతో మంచి సంబంధాలు ఉండాలి. పీఆర్‌ఓలో కెరీర్లో రాణించాలంటే మెరుగైన కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. కనీసం మూడు భాషల్లో మంచి పట్టు ఉండాలి. సృజనాత్మకత, సహనం, పట్టుదల అవసరం. ప్రాపంచిక పరిజ్ఞానం పెంపొందించుకోవాలి. ఈ రంగంలో ఒత్తిళ్లు అధికంగా ఉంటాయి. కొన్నిసార్లు సమయంతో నిమిత్తం లేకుండా పగలూరాత్రి పనిచేయాల్సి వస్తుంది. కాబట్టి ఏ సమయంలోనైనా విధులు నిర్వర్తించేందుకు సిద్ధంగా ఉండాలి. అర్హతలు మనదేశంలో పబ్లిక్ రిలేషన్స్‌లో డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇంటర్మీడియెట్ పూర్తయిన తర్వాత ఈ కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు. కొన్ని సంస్థలు జర్నలిజం కోర్సులో ఒక సబ్జెక్టుగా పబ్లిక్ రిలేషన్స్‌ను బోధిస్తున్నాయి. ప్రభుత్వ సమాచార, పౌర సంబంధాల శాఖలో చేరాలంటే డిగ్రీ ఉండడం అవసరం. వేతనాలు కమ్యూనికేషన్స్ ఇండస్ట్రీలో పీఆర్ఓలకు మంచి వేతనాలు అందుతున్నాయి. యాడ్ ఏజెన్సీలో చేరితే ప్రారంభంలో నెలకు రూ.8 వేలు అందుకోవచ్చు. పబ్లిక్ రిలేషన్స్ ఏజెన్సీలో అయితే ప్రారంభంలో రూ.15 వేల వరకు వేతనం లభిస్తుంది. తర్వాత సీనియారిటీని బట్టి వేతనాల్లో పెరుగుదల ఉంటుంది. సొంతంగా పీఆర్ ఏజెన్సీని ఏర్పాటు చేసుకుంటే రూ.లక్షల్లో ఆదాయం సంపాదించుకోవచ్చు. పబ్లిక్ రిలేషన్స్ కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ-హైదరాబాద్ వెబ్సైట్: http://www.braou.ac.in/ ఢిల్లీ కాలేజీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కామర్స్ వెబ్సైట్: http://dcac.du.ac.in/ కమలా నెహ్రూ కాలేజీ వెబ్సైట్: http://www.knc.edu.in/ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్-ఢిల్లీ వెబ్సైట్: http://www.iimc.nic.in/ భారతీయ విద్యా భవన్-ఢిల్లీ వెబ్సైట్: http://www.bvbdelhi.org/ వైఎంసీఏ-న్యూఢిల్లీ వెబ్సైట్: http://www.newdelhiymca.in/ కమ్యూనికేషన్ స్కిల్స్ పెట్టుబడి ‘‘కమ్యూనికేషన్ స్కిల్స్‌తో పీఆర్ఓగా మంచి కెరీర్‌ను సొంతం చేసుకోవచ్చు. అప్పగించిన బాధ్యతలను విజయవంతంగా పూర్తిచేయగలిగే ఓర్పు పీఆర్ఓలకు ఉండాలి. ప్రస్తుతం విద్యాసంస్థలు, మల్టీనేషనల్ కంపెనీలు కస్టమర్ల అభిరుచులను తెలుసుకునేందుకు సర్వేలను నిర్వహించేందుకు పీఆర్ సంస్థలపైనే ఆధారపడ్డాయి. గ్లోబలైజేషన్ నేపథ్యంతో ఉద్యోగ అవకాశాలకు కొదవలేదు. దీనికి జర్నలిజం కోర్సు కూడా పూర్తిచేస్తే అదనపు అర్హత చేకూరినట్లే’’ - ప్రొఫెసర్ బి.బాలస్వామి, జర్నలిజం విభాగ అధిపతి, ఉస్మానియా విశ్వవిద్యాలయం