
సాక్షి, హైదరాబాద్: రైళ్లను దశలవారీగా పెంచుతున్నామని, కరోన ముందు నడిచే రైళ్లు 70 శాతం ఇప్పటికే నడుస్తున్నాయని దక్షిణమధ్య రైల్వే సీపీఆర్‌ఓ రాకేష్ తెలిపారు. ఆయన బుధవారం సాక్షి టీవీతో మాట్లాడుతూ.. సుమారు 300 రైళ్లు ఉండేవి అందులో 215 రైళ్లు నడుస్తున్నాయని తెలిపారు. ఇప్పటికే 140 రైళ్లు దక్షిణ మధ్య రైల్వే జోన్ నుంచి నడుస్తున్నాయని పేర్కొన్నారు. ఏప్రిల్ 1నుంచి కొన్ని రైళ్లు పెంచుతున్నామని, ఇవన్నీ సికింద్రాబాద్ జోన్ నుంచి వెళ్తాయని తెలిపారు. పూర్తిగా రైళ్లని రిజర్వేషన్ ఉన్నవారికి మాత్రమే అనుమతి ఉంటుందన్నారు.
ఎక్కడ కూడా సాధారణ ప్రయాణికులు రావడానికి అనుమతి లేదన్నారు. రిజర్వేడ్ రైళ్లు మాత్రమే నడుస్తున్నాయిని, వెయిటింగ్ లిస్ట్ ఉన్నవారిని కూడా అనుమతించడం లేదని పేర్కొన్నారు. ఎంఎంటీఎస్ రైళ్ల పునరుద్ధరనపై ఇంకా స్పష్టత రాలేదన్నారు. కోవిడ్ కేసులు ఇంకా తగ్గని కారణంగా దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. పరిస్థితి బట్టి ఎంఎంటీఎస్ రైళ్ల ప్రకటన ఉంటుంది అనుకుంటున్నామని ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment