ఆకట్టుకున్న అతిపెద్ద ‘పెడిగ్రీ ప్రో హైకాన్–24’ షో
సలుకి, బిచాన్ ఫ్రైజ్, అమెరికన్ బుల్లీ, హెయిరీ డాచ్‌షండ్ వంటి అరుదైన కుక్కలు నగరంలో సందడి చేశాయి. కుక్కలు, పిల్లుల పెట్ లవర్స్ కోసం ఆదివారం నగరంలోని నార్సింగి వేదికగా ఓం కన్వెన్షన్‌లో నిర్వహించిన ‘పెడిగ్రీ ప్రో హైకాన్–24’ శునకాల ప్రపంచాన్ని నరవాసులకు పరిచయం చేసింది. ఈ ప్రదర్శనలో 500కు పైగా కుక్కలు, 100కు పైగా పిల్లులతో పాటు దాదాపు 5 వేల మంది పెట్ లవర్స్ పాల్గొన్నారు. హైదరాబాద్ కెనైన్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన షోలో తెలంగాణ అడిçషనల్æ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మహేష్ భగవత్ తన ఉమే గోల్డెన్ రిట్రీట్‌తో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఐఏఎస్ ఆఫీసర్ హరి చందన కూడా తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రదర్శనలో పాల్గొన్నారు.
కెన్నెల్ క్లబ్ ఆఫ్ ఇండియా ఛాంపియన్‌షిప్ డాగ్ షో, ఇండియన్ క్యాట్ క్లబ్ క్యాట్ షోలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇందులో టాప్ 10 బ్రీడ్ అవార్డ్‌లు అందించారు. ఇందులో మైనే కూన్స్ దేశీయ జాతి పొడవైన పిల్లి ధర రూ. 2.5 లక్షలు పైనే. మరో విదేశి జాతి బ్రిటిష్ షార్ట్‌హైర్స్ ధర రూ.1.2 లక్షల పై మాటే. వీటి ఆహారం, పెంపకం, సంరక్షణ తదితర అంశాకు చెందిన పరిశ్రమల స్టాల్స్ ఇందులో కొలువుదీరాయి.
బ్రీడ్స్ నాణ్యత కాపాడాలి..
కుక్కల పెంపకం, సంరక్షణ పై అవగాహన కల్పించడమే లక్ష్యం. ఇందులో భాగంగా 150కి పైగా విభిన్న జాతుల నాణ్యతా ప్రమాణాలను మెరుగుపరచాలి. కరోనా సమయంలో చాలామంది జంతువులను దత్తత తీసుకున్నారు. కానీ కోవిడ్ ముగిసిన తర్వాత చాలా మంది విడిచిపెట్టడం బాధాకరం.
– డాక్టర్ ఎం ప్రవీణ్ రావు, కెనైన్ క్లబ్ ప్రెసిడెంట్
కుక్కలకూ సప్లిమెంట్‌లు..
కుక్కల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన సప్లిమెంట్ ‘అబ్సొల్యూట్ పెట్’. భారత్‌లో నూతనంగా ఆవిష్కరించాం. చర్మ సమ్యలు, ఫుడ్‌పాయిజన్ తదితర సమస్యలకు మంచి ఫలితాలను అందిస్తుంది.
– జాహ్నవి, అబ్సొల్యూట్ పెట్.
Comments
Please login to add a commentAdd a comment