Pedigree
-
పెడిగ్రీ ప్రో హైకాన్–24 : బుజ్జి పప్పీలు, బుల్లి కూనలు సూపర్ (ఫోటోలు)
-
500 కుక్కలు.. 100 పిల్లులు
సలుకి, బిచాన్ ఫ్రైజ్, అమెరికన్ బుల్లీ, హెయిరీ డాచ్‌షండ్ వంటి అరుదైన కుక్కలు నగరంలో సందడి చేశాయి. కుక్కలు, పిల్లుల పెట్ లవర్స్ కోసం ఆదివారం నగరంలోని నార్సింగి వేదికగా ఓం కన్వెన్షన్‌లో నిర్వహించిన ‘పెడిగ్రీ ప్రో హైకాన్–24’ శునకాల ప్రపంచాన్ని నరవాసులకు పరిచయం చేసింది. ఈ ప్రదర్శనలో 500కు పైగా కుక్కలు, 100కు పైగా పిల్లులతో పాటు దాదాపు 5 వేల మంది పెట్ లవర్స్ పాల్గొన్నారు. హైదరాబాద్ కెనైన్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన షోలో తెలంగాణ అడిçషనల్æ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మహేష్ భగవత్ తన ఉమే గోల్డెన్ రిట్రీట్తో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఐఏఎస్ ఆఫీసర్ హరి చందన కూడా తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రదర్శనలో పాల్గొన్నారు. కెన్నెల్ క్లబ్ ఆఫ్ ఇండియా ఛాంపియన్షిప్ డాగ్ షో, ఇండియన్ క్యాట్ క్లబ్ క్యాట్ షోలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇందులో టాప్ 10 బ్రీడ్ అవార్డ్లు అందించారు. ఇందులో మైనే కూన్స్ దేశీయ జాతి పొడవైన పిల్లి ధర రూ. 2.5 లక్షలు పైనే. మరో విదేశి జాతి బ్రిటిష్ షార్ట్హైర్స్ ధర రూ.1.2 లక్షల పై మాటే. వీటి ఆహారం, పెంపకం, సంరక్షణ తదితర అంశాకు చెందిన పరిశ్రమల స్టాల్స్ ఇందులో కొలువుదీరాయి. బ్రీడ్స్ నాణ్యత కాపాడాలి.. కుక్కల పెంపకం, సంరక్షణ పై అవగాహన కల్పించడమే లక్ష్యం. ఇందులో భాగంగా 150కి పైగా విభిన్న జాతుల నాణ్యతా ప్రమాణాలను మెరుగుపరచాలి. కరోనా సమయంలో చాలామంది జంతువులను దత్తత తీసుకున్నారు. కానీ కోవిడ్ ముగిసిన తర్వాత చాలా మంది విడిచిపెట్టడం బాధాకరం. – డాక్టర్ ఎం ప్రవీణ్ రావు, కెనైన్ క్లబ్ ప్రెసిడెంట్కుక్కలకూ సప్లిమెంట్లు.. కుక్కల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన సప్లిమెంట్ ‘అబ్సొల్యూట్ పెట్’. భారత్‌లో నూతనంగా ఆవిష్కరించాం. చర్మ సమ్యలు, ఫుడ్‌పాయిజన్ తదితర సమస్యలకు మంచి ఫలితాలను అందిస్తుంది. – జాహ్నవి, అబ్సొల్యూట్ పెట్. -
గుడ్‌న్యూస్! హైదరాబాద్‌కి పెట్ కేర్.. వరంగల్‌కి ఐటీ కంపెనీ..
పెంపుడు జంతువుల ఆహార పదార్థాల తయారీ సంస్థ మార్స్ పెట్‌కేర్ తెలంగాణ ప్రభుత్వంతో కీలక ఒప్పందం చేసుకుంది. ప్రస్తుతం నగరంలో ఆ సంస్థకు ఉన్న ఉత్పత్తి సామర్థ్యం పెంచాలని నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం మీద సంతకం చేసింది. మరోవైపు తెలంగాణ సాంస్కృతిక రాజాధానిలో ఐటీ పరిశ్రమ వేళ్లూనుకుంటోంది. మరో ప్రముఖ కంపెనీ ఇక్కడ సెంటర్ ప్రారంభించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. పిడిగ్రీ తయారీ ఇక్కడే మార్స్ పెట్‌కేర్ సంస్థ హైదరాబాద్ నగరంలో 2008లో కర్మాగారం ఏర్పాటు చేసింది. కుక్కలతో పాటు ఇతర పెంపుడు జంతువులు తినే డ్రై ఆహార పదార్థాలు ఇక్కడ తయారవుతున్నాయి. అయితే గత దశాబ్ధం కాలంగా పెంపుడు జంతువులకు పోషక ఆహారం అందించే విషయంలో ప్రజలకు అవగాహాన పెరిగింది. ఫలితంగా ఈ మార్కెట్ పుంజుకుంది. ముఖ్యంగా కుక్కలకు ఆహారంగా అందించే పిడిగ్రీ ఇప్పుడు అందరికీ సుపరిచితమే అయ్యింది. పిడిగ్రీ బ్రాండు పెట్ ఫుడ్ మన హైదరాబాద్‌లోనే తయారవుతోంది. రూ.500 కోట్ల పెట్టుబడి పెరుగుతున్న మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్‌లోని ఫ్యాక్టరీ కెపాసిటీ పెంచనున్నారు. ఇందు కోసం రూ. 500 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది మార్స్ పెట్‌కేర్ సంస్థ. ఇక్కడ ఫ్యాక్టరీ సామర్థ్యాన్ని 65 కిలోటన్నులకు పెంచడం ద్వారా హైదరాబాద్ నుంచే మన దేశంతో పాటు ఇతర ఏషియా దేశాలకు పెంపుడు జంతువుల ఆహారం సరఫరా కానుంది. విన్ విన్ ఫార్ములా పెట్‌కేర్ సంస్థ తన ఫ్యాక్టరీ సామర్థ్యం పెంచడం వల్ల ఉపాధి అవకాశాలు మెరుగవడంతో పాటు స్థానికంగా పండే తృణ ధాన్యాలకు సరికొత్త మార్కెట్ అందుబాటులోకి వస్తుంది. ముఖ్యంగా నగరం చుట్టు పక్కల జిల్లాలో తృణధాన్యం రైతులకు గిట్టుబాటు అయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు మార్స్ పెట్‌కేర్ సంస్థ పెట్టుబడులను విన్ విన్ ప్రతిపాదనగా మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో అభివర్ణించారు. Another major global brand reposes faith on Telangana, @MarsPetcareUS signed an MoU to invest more than ₹500 Cr to triple their capacity Project will link supply chains to state producers in cereals, fisheries & poultry to create a win-win scenario @pedigree_india pic.twitter.com/RD4ONECzPP — KTR (@KTRTRS) December 16, 2021 వరంగల్‌కి మరో ఐటీ కంపెనీ ఐటీ రంగంలో నిలదొక్కుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తోన్న వరంగల్ నగరం మరో అద్భుత అవకాశం ఒడిసిపట్టుకుంది. ఇప్పటికే ఈ నగరంలో అనేక స్టార్టప్‌లతో పాటు సెయింట్, టెక్ మహీంద్రా వంటి ఐటీ కంపెనీలు తమ క్యాంపస్‌లు ప్రారంభించాయి. తాజాగా వాటి సరసన అమెరికాకు చెందిన జెన్పాక్ట్ సంస్థ చేరింది. వరంగల్‌లో తమ క్యాంపస్‌ను ప్రారంభిస్తామని జెన్‌ప్యాక్ట్ ప్రకటించింది. ఈ మేరకు మంత్రి కేటీఆర్‌ను ఆ సంస్థ సీఈవో త్యాగరాజన్ కలిశారు. Delighted to announce that @Genpact has chosen to set up a tech centre at Warangal My compliments to CEO @tyagarajan and his team on supporting our endeavour to strengthen IT in tier 2 towns After Tech M, Cyient and now with Genpact’s decision, Warangal is set to soar high👍 pic.twitter.com/UUX8nBSVdw — KTR (@KTRTRS) December 16, 2021 నిర్మాణంలో ఇప్పటికే వరంగల్ నగరంలో సెంటర్ నిర్మాణ పనుల్లో మైండ్‌ట్రీతో పాటు మరికొన్ని సంస్థలు ఉన్నాయి. వీటి క్యాంపస్ నిర్మాణ పనులకు గతంలోనే మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఐటీ, వస్త్ర పరిశ్రమల అవసరాలకు తగ్గట్టు వరంగల్ ఎయిర్‌పోర్టు ప్రారంభించేందుకు కూడా తెలంగాణ ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. చదవండి: వాటాలు విక్రయించనున్న ఏఐజీ హాస్పిటల్స్ ప్రమోటర్లు? -
దీంతో కుక్కలూ సెల్ఫీ తీసుకుంటాయి!
సోషల్ మీడియాలో తమ పెంపుడు జంతువుల ఫొటోలు పెట్టడం వంటివి ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది. కొందరైతే వాటి కోసం ప్రత్యేకంగా అకౌంట్లు కూడా సృష్టించేస్తున్నారు. రోజూ యజమానులు తమ శునకాల చిత్రాలను తీయడం, నెట్లో పెట్టడం ఇదో పెద్ద పని.. ఇప్పుడిక బేఫికర్. ఎందుకంటే ఇకపై కుక్కలే తమ ఫొటోలు తీసుకుని.. ఫేస్బుక్ లేదా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తాయి! మీరు వింటున్నది నిజమే.. పెట్ ఫుడ్ బ్రాండ్ 'పెడిగ్రీ' ఇందుకోసం ఓ ప్రత్యేకమైన జాకెట్‌ను తయారుచేసింది. 'ద పోస్టింగ్ టెయిల్' అనే ఈ జాకెట్‌ను మీ కుక్కకు తొడిగితే.. అది ఆనందంతో తోక ఊపినప్పుడల్లా దాని ఫొటో సోషల్ మీడియాలో పోస్ట్ అయిపోతుంది. అలాగని తోక ఊపినప్పుడల్లా ఫొటో తీయదు.. ఆనందంగా తోక ఊపినప్పుడు మాత్రమే ఫొటో తీస్తుంది. ఇందుకోసం కుక్క తోక వద్ద ఓ సెన్సర్ ఉంటుంది. మామూలుగా తోక ఊపడానికి, ఆనందంతో ఊపడానికి మధ్య తేడాను ఇది కనిపెట్టగలదట. అంతేకాదు.. ఇందులో ఉండే జీపీఎస్ ద్వారా మీ శునకం ఏ ప్రాంతానికెళ్తే హ్యాపీగా ఉంటోందన్న విషయాన్ని మీరు తెలుసుకోవచ్చు. శునకాలు తమ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడానికి మాత్రమే కాకుండా.. మీ కుక్క ఎప్పుడు, ఎక్కడ, ఏ ఆహారం తింటున్నప్పుడు హ్యాపీగా ఉంటుందన్న విషయాన్నీ తెలియపరుస్తుంది. త్వరలో ఇది మార్కెట్లోకి రానుంది.